![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/Wankhede_ICC_WCF.jpg/640px-Wankhede_ICC_WCF.jpg&w=640&q=50)
వాంఖెడే స్టేడియం
From Wikipedia, the free encyclopedia
వాంఖెడే స్టేడియం ముంబైలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.[2] ఇది ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్సిఏ) యాజమాన్యంలో ఉంది. ఐపియెల్ లోని ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది హోమ్ గ్రౌండ్. ఎమ్సిఏ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ల ప్రధాన కార్యాలయాలు ఈ స్టేడియం లోనే ఉన్నాయి.
![]() 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో వాంఖెడే స్టేడియం | |
![]() | |
Address | నేతాజీ సుభాస్ చంద్ర బోస్ రోడ్డు, చర్చ్‌గేట్, దక్షిణ ముంబై |
---|---|
Location | చర్చ్‌గేట్, ముంబై, మహారాష్ట్ర |
Owner | ముంబై క్రికెట్ అసోసియేషన్ |
Operator | ముంబై క్రికెట్ అసోసియేషన్ |
Seating type | స్టేడియం సీటింగు |
Capacity | 32,000 (2011–ఇప్పటి వరకు)[1] 39,000 (1974–2010)[1] |
Surface | పచ్చిక |
Construction | |
Architect | శశి ప్రభు అండ్ ఎసోసియేట్స్ (1974), శశి ప్రభు అండ్ ఎసోసియేట్స్, పి.కె. దాస్ అండ్ ఎసోసియేట్స్ (2017) |
మైదాన సమాచారం | |
స్థాపితం | 1974 |
వాడుతున్నవారు | ముంబై క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్ భారత క్రికెట్ జట్టు |
ఎండ్ల పేర్లు | |
టాటా ఎండ్ ![]() గర్వారే పెవిలియన్ ఎండ్ | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి టెస్టు | 1975 జనవరి 23-29:![]() ![]() |
చివరి టెస్టు | 2021 డిసెంబరు 3–7:![]() ![]() |
మొదటి ODI | 1987 జనవరి 17:![]() ![]() |
చివరి ODI | 2023మార్చి 17:![]() ![]() |
మొదటి T20I | 2012 డిసెంబరు 22:![]() ![]() |
చివరి T20I | 2023 జనవరి 3:![]() ![]() |
ఏకైక మహిళా టెస్టు | 1984 ఫిబ్రవరి 10–13:![]() ![]() |
మొదటి WODI | 1997 డిసెంబరు 23:![]() ![]() |
చివరి WODI | 2019 ఫిబ్రవరి 28:![]() ![]() |
ఏకైక WT20I | 2016 మార్చి 31:![]() ![]() |
2023 మార్చి 17 నాటికి Source: Cricinfo | |
ఈ స్టేడియం చర్చ్‌గేట్ ప్రాంతంలో మెరైన్ డ్రైవ్‌కు సమీపంలో ఉంది. హిందూ జింఖానా, పార్సీ జింఖానా, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI)తో సహా అనేక పాత క్రికెట్ క్లబ్‌లు స్టేడియం సమీపంలో ఉన్నాయి.
ఈ స్టేడియంలో గతంలో అనేక హై-ప్రొఫైల్ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. ముఖ్యంగా 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్. ఇక్కడే భారత్ శ్రీలంకను ఓడించి, సొంత గడ్డపై క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న మొదటి దేశంగా అవతరించింది. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్ జరిగింది కూడా ఈ స్టేడియం లోనే.