బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) భారతదేశంలో క్రికెట్ కోసం స్థాపించబడిన పాలకమండలి. [13] 1928 డిసెంబర్‌లో తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్టర్ చేయబడి ఈ సొసైటీ బోర్డు ఏర్పడింది. ఇది రాష్ట్ర క్రికెట్ సంఘాల కన్సార్టియం. రాష్ట్ర సంఘాలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి, వారు బిసిసిఐ చీఫ్‌ను ఎన్నుకుంటారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఉంది . గ్రాంట్ గోవన్ దాని మొదటి అధ్యక్షుడు, ఆంథోనీ డి మెల్లో దాని మొదటి కార్యదర్శి. [14]

త్వరిత వాస్తవాలు ఆటలు, పరిధి ...
Board of Control for Cricket in India
Thumb
వాన్కడ్లో ఉన్న బిసిసిఐ ప్రధాన స్టేడియం
ఆటలుCricket
పరిధిIndia
సభ్యత్వం41
పొట్టి పేరుBCCI
స్థాపనDecember 1928; 95 సంవత్సరాల క్రితం (December 1928)[1]
అనుబంధంInternational Cricket Council
అనుబంధ తేదీ31 May 1926 (31 May 1926)[2]
ప్రాంతీయ అనుబంధంAsian Cricket Council
అనుబంధ తేదీ19 September 1983
మైదానంCricket centre, Mumbai[3]
స్థానంChurchgate, Mumbai, Maharashtra, India[3][4]
అధ్యక్షుడుRoger Binny[5]
సీఈఓHemang Amin[6]
ఉపాధ్యక్షుడు(లు)Rajeev Shukla[5]
కార్యదర్శిJay Shah[5]
పురుషుల కోచ్Rahul Dravid
మహిళా కోచ్Vacant [7]
ఇతర కీలక సిబ్బందిAjit Agarkar (chief national selector)[5]
Ashish Shelar (treasurer)[5]
Devajit Saikia (joint-secretary)[5]
Abey Kuruvilla (general manager)[8]
Vineet Saran (Ethics officer)
Dr Abhijit Salvi (head, Anti-doping unit)[9] Shabir Hussein (head, anti-corruption unit)[10]
Arun Dhumal (chairman, IPL)[5]
నిర్వహణ ఆదాయం₹4542 Cr (2021-22)[11]
స్పాన్సర్Dream11, Adidas, Mastercard, Hyundai, Ambuja Cements[12]
Official website
India
మూసివేయి

దేశీయ క్రికెట్

ఈ కింది దేశీయ క్రికెట్ పోటీలను బిసిసిఐ నిర్వహిస్తుంది:

పురుషుల దేశీయ క్రికెట్

మహిళల దేశీయ క్రికెట్

  • సీనియర్ మహిళల ఛాలెంజర్ ట్రోఫీ
  • సీనియర్ మహిళల వన్ డే లీగ్
  • సీనియర్ మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీ
  • సీనియర్ మహిళల టీ20 లీగ్
  • మహిళల టి 20 ఛాలెంజ్ (మహిళల ఐపిల్ )

మొత్తం వార్షిక ఆదాయం

2019-2020 ఆర్థిక సంవత్సరంలో, బిసిసిఐ మొత్తం వార్షిక ఆదాయం 3730 కోట్ల రూపాయలు (US $ 535 మిలియన్లు), ఇందులో ఐపిఎల్ నుండి 2500 కోట్ల రూపాయలు (US $ 345 మిలియన్లు) కాగ, ఇతర దేశాల తో ద్వైపాక్షిక క్రికెట్ నుండి 950 కోట్లు (US $ 139 మిలియన్లు), ఐసిసి ఆదాయం నుండి భారత దేశానికి 380 కోట్లు ( US $ 51 మిలియన్లు సంవత్సరానికి లేదా 8 సంవత్సరాలకు మొత్తం US $ 405 మిలియన్లు). [15]

ఐసిసి ఆదాయ వాటా

2020 లో, ప్రస్తుత ఎనిమిదేళ్ల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం (ఎఫ్‌టిపి) ప్రకారం, ఐసిసి నుండి మొత్తం 405 మిలియన్ డాలర్లు భారతదేశం అందుకుంటుంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, న్యూజిలాండ్ క్రికెట్, శ్రీలంక క్రికెట్, క్రికెట్ వెస్టిండీస్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతి ఒక్కరు US $ 128 మిలియన్లు అందుకుంటున్నాయి. [16]

మీడియా హక్కులు

2018 నుండి 2022 వరకు ఐపిఎల్‌ గ్లోబల్ మీడియా హక్కులను స్టార్ ఇండియాకు, 16,347.5 కోట్లకు (US $ 2.3 బిలియన్) ప్రదానం చేసారు. [17]

2010 లో, రాబోయే 5 సంవత్సరాలలో 25 తటస్థ వేదిక వన్డే మ్యాచ్‌లకు మీడియా హక్కుల ను జీ టెలిఫిలింస్‌కు 219.16 మిలియన్లకు ఇవ్వబడ్డాయి. [18]

స్పాన్సర్షిప్ హక్కులు

2016 నుండి 2020 వరకు, 5 సంవత్సరాల అధికారిక కిట్ స్పాన్సర్‌షిప్ హక్కులను నైక్‌ సంస్థకు 370 కోట్ల రూపాయల తో(US $ 52 మిలియన్లు) ప్రదానం చేశారు.[19] 2019 లో, బైజు 1,079 కోట్ల (US $ 150 మిలియన్) వ్యయంతో నాలుగు సంవత్సరాల కాలానికి అధికారిక భారత క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా మారింది.[20] బిసిసిఐ ఈ స్పాన్సర్‌షిప్ ఒప్పందం ప్రకారం ప్రతి హోమ్ మ్యాచ్‌కు 60 కోట్ల రూపాయల (US $ 8 మిలియన్ కంటే తక్కువ) ఆదాయం పొందుతుంది.[21]

ఆగస్టు 18న డ్రీమ్11 ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను 222 కోట్ల రూపాయలకు గెలుచుకుంది.[22]

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.