లోధా కమిటీ

From Wikipedia, the free encyclopedia

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ బెట్టింగు కుంభకోణంలో గురునాథ్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రాలకు విధించదగ్గ శిక్షల పరిమాణాన్ని అంచనా వేయడానికీ, అందులో సుందర్ రామన్ పాత్రను విశ్లేషించడానికీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును (బిసిసిఐ) మెరుగుపరచే చర్యలను విశ్లేషించడానికీ, సిఫార్సులు చేయడానికీ భారత సుప్రీంకోర్టు 2015 జనవరి 23 న లోధా కమిటీని నియమించింది.[1] [2] [3] ఈ కమిటీ 2015 జూలై 14 న తన నివేదికను సమర్పించింది.[4]

చరిత్ర

2013 ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంపై విచారణ అనంతరం జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సమర్పించిన నివేదిక ఫలితంగా లోధా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆర్‌ఎం లోధా అధ్యక్షత వహించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ని మెరుగుపరచే చర్యలను విశ్లేషించడం, సిఫార్సు చేయడం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) బెట్టింగ్ కుంభకోణంలో గురునాథ్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రాల శిక్ష పరిమాణాన్ని అంచనా వేయడం, సుందర్ రామన్ పాత్రను విశ్లేషించడంలోధా కమిటీ ఉద్దేశాలు. బిసిసిఐలో CFO, CEO నియామక పరిస్థితులు, ఆఫీస్ బేరర్ల వయస్సు, ఐపిఎల్ మ్యాచ్‌ల సమయంలో ప్రకటనలు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) అధికారి నియామకం వంటి వివిధ మార్పులను నివేదిక సూచించింది. కమిటీ తన నివేదికను 2015 జూలై 14 న సమర్పించింది [5] [6]

సంక్షిప్తంగా, లోధా కమిటీ ఈ క్రింది సిఫార్సులు చేసింది: [7]

  1. పదవీ విరమణ వయస్సు 70 సంవత్సరాలుగా నిర్ణయించాలి. (ఎ) నేరారోపణలు ఉన్న, (బి) మానసిక స్థిరత్వం లేని, (సి) దివాలా తీసిన (డి) ఏదైనా ఇతర అథ్లెటిక్ అసోసియేషన్‌లో పదవిని కలిగి ఉన్న నిర్వాహకులను తీసివేయాలి. అధికారులందరి పదవీకాలం రెండు వరుసగా పర్యాయాలకు నిర్ణయించాలి.
  2. బిసిసిఐ తన లావాదేవీలలో మరింత పారదర్శకంగా ఉండటానికి "ఒక రాష్ట్రం ఒక ఓటు" విధానం ఉండాలి
  3. బీసీసీఐ అధ్యక్షుడికి రెండేళ్ల కంటే ఎక్కువ పదవీకాలం ఉండకూడదు.
  4. ఐపిఎల్ కోసం స్వతంత్ర, సార్వభౌమ పాలక మండలి ఉండాలి
  5. బీసీసీఐ అధికారులు ఎలాంటి బెట్టింగ్‌లో పాలుపంచుకోకుండా చూసేందుకు, వారు తమ ఆస్తులను పాలక మండలికి వెల్లడించాలి.

లోధా కమిటీ సిఫార్సులు బీసీసీఐ అధికార గణాన్ని, దానికి సంబంధించిన సంఘాలనూ కుదిపేసింది. ఈ సిఫారసులపై బీసీసీఐ, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తుది తీర్పును జస్టిస్ ఇబ్రహీం కలీఫుల్లా, భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 2016 జూలై 18 న వెలువరించింది. తుది తీర్పులో లోధా కమిటీ సిఫార్సులను సమర్థిస్తూ బీసీసీఐలో పెద్దయెత్తున మార్పులకు మార్గం సుగమం చేసింది.[6]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.