భక్త పోతన (1943 సినిమా)
From Wikipedia, the free encyclopedia
ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవితం ఇతివృత్తంగా వెలువడిన సినిమా ఇది. చిత్తూరు నాగయ్య నటజీవితంలో ఒక కలికితురాయిగా ఈ సినిమాను చెప్పుకోవచ్చును. పోతన వ్యక్తిత్వంలో భాగమైన భక్తి, వినయం, పాండిత్యం - అన్నింటినీ నాగయ్య చక్కగా చూపించారు. ఇదే సినిమా మళ్లీ 1966లో వచ్చినప్పుడు అందులో నాగయ్య వేదవ్యాసునిగా నటించాడు.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, కథ ...
భక్త పోతన (1943 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.రెడ్డి (కదిరి వెంకటరెడ్డి) |
---|---|
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, డి.హేమలతాదేవి, నాళం వనజ, టంగుటూరి సూర్యకుమారి, బెజవాడ రాజారత్నం, వల్లభజోస్యుల శివరాం, జంధ్యాల గౌరీనాథశాస్త్రి, కె.మాలతి, సామ్రాజ్యం |
సంగీతం | చిత్తూరు నాగయ్య |
నేపథ్య గానం | మాలతి, చిత్తూరు నాగయ్య, నాళం వనజ, సముద్రాల రాఘవాచార్య, బెజవాడ రాజారత్నం, వల్లభజోస్యుల శివరాం |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | కె.రామనాథ్ |
కళ | ఎ. కె. శేఖర్ |
నిర్మాణ సంస్థ | నారాయణ స్వామి మూలా, బి.ఎన్.రెడ్డి |
భాష | తెలుగు |
మూసివేయి