బొలీవియా
From Wikipedia, the free encyclopedia
బొలీవియా (ఆంగ్లం : బొలీవియా),[4][5] అధికారికనామం బొలీవియా గణతంత్రం, ఒక భూపరివేష్టిత దేశం. బొలీవియా దక్షిణ అమెరికా మధ్యప్రాంతంలో ఉన్న దేశం. దీని ఉత్తర, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, దక్షిణసరిహద్దులో అర్జెంటీనా, పరాగ్వే, పశ్చిమసరిహద్దులో చిలీ, పెరూ దేశాలు ఉన్నాయి. దేశభూభాగంలో మూడింట ఒక భాగం " ఆండెస్ పర్వతాలు విస్తరించి " ఉన్నాయి.
República de Bolivia Bulibya Republika Wuliwya Suyu (and 34 other official names) బొలీవియా గణతంత్రం |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "¡La unión es la fuerza!" మూస:Langicon "Unity is strength!" |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని | Sucre (constitutional, judicial) 19°2′S 65°15′W La Paz (administrative) 16°29′S 68°8′W | |||||
అతి పెద్ద నగరం | Santa Cruz de la Sierra 17°48′S 63°10′W |
|||||
అధికార భాషలు | స్పానిష్ భాష and 36 native languages[1] | |||||
జాతులు | 30% Quechua, 30% Mestizo, 25% Aymara, 15% White[2] | |||||
ప్రజానామము | Bolivian | |||||
ప్రభుత్వం | రిపబ్లిక్ | |||||
- | President | en:Evo Morales | ||||
- | Vice President | Álvaro García | ||||
Independence | ||||||
- | from స్పెయిన్ | ఆగస్టు 6 1825 | ||||
- | జలాలు (%) | 1.29 | ||||
జనాభా | ||||||
- | జూలై 2007 అంచనా | 9,119,152 (84వది) | ||||
- | జన గణన | 8,857,870 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $40.140 బిలియన్లు[3] (101st) | ||||
- | తలసరి | $4,084[3] (125వది) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $13.292 billion[3] (108వది) | ||||
- | తలసరి | $1,352[3] (121st) | ||||
జినీ? (2002) | 60.1 (high) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.695 (medium) (117th) | |||||
కరెన్సీ | Boliviano (BOB ) |
|||||
కాలాంశం | (UTC-4) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .bo | |||||
కాలింగ్ కోడ్ | +591 |
బొలీవియా తూర్పు ప్రాంతంలో ఎక్కువగా చదునైన ప్రాంతంలో అతిపెద్ద నగరం, ప్రధాన ఆర్థిక, ఫైనాంషియల్ కేంద్రం " శాంటా క్రుజ్ డి లా సియెర్రా " " లానాస్ ఓరియంటెస్ " (ఉష్ణమండల లోతట్టులు) ఉంది. " ఆఫ్రో-యురేషియా " వెలుపల ఉన్న రెండు భూపరివేష్టిత దేశాలలో బొలివియా ఒకటి.రెండవ దేశం పరాగ్వే. ఉన్నాయి. అమెరికా ఖండాలలో భౌగోళికంగా అతిపెద్ద భూభంధిత దేశం బొలీవియా. ఆర్థిక, సైనికపరంగా బొలీవియా చిన్న దేశం. [6] బొలీవియాలో స్పానిష్ వలసరాజ్య స్థాపనకు ముందు బొలీవియాలోని ఆండియన్ ప్రాంతం " ఇంకా సామ్రాజ్యం "లో భాగంగా ఉంది. ఉత్తర, తూర్పు లోతట్టు ప్రాంతాలలో స్వతంత్ర తెగలకు చెందిన ప్రజలు నివసించారు. 16 వ శతాబ్దంలో " కస్కో " , " అసున్షియోన్ " నుండి వచ్చిన స్పానిష్ విజేతలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్పానిష్ వలసరాజ్యం కాలంలో బొలీవియా " రాయల్ ఆడియెన్సియా ఆఫ్ చార్కాస్ " నిర్వహణలో ఉంది. బొలీవియాలో అపారంగా లభించిన వెండి విక్రయాలతో స్పెయిన్ తనసామ్రాజ్యాన్ని నిర్మించింది.
దేశ జనాభా 11 మిలియన్లగా అంచనా వేయబడింది. వీరిలో అమెరిన్డియన్స్, మేస్టిజోలు, యూరోపియన్స్, ఆసియన్లు, ఆఫ్రికన్లు ఉన్నారు. స్పానిష్ వలసవాదం నుండి ఉద్భవించిన జాతి వేర్పాటు, సాంఘిక విభజన ఆధునిక యుగం వరకు కొనసాగింది. స్పానిష్ అధికారిక, ప్రధానమైన భాషగా ఉన్నప్పటికీ 36 స్థానిక బొలీవియా భాషలు కూడా అధికారిక హోదా కలిగివున్నాయి. వీటిలో సాధారణంగా గురాని మాండలికాలు ఐమరా భాష , క్యుచూన్ భాషలు (క్వెచువా)మాట్లాడేవారు ఉన్నారు.
ఆధునిక బొలీవియా ఐక్యరాజ్యసమితి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్),అలీన దేశాల ఉద్యమం, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ (ఓఎఎస్),అమెజాన్ సహకార ఒప్పందం సంస్థ (ఎ.సి.టి.ఒ), బ్యాంక్ ఆఫ్ ది సౌత్, ఎ.ఎల్.బి.ఎ. యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్ (యుఎస్ఎన్) చార్టర్ సభ్యదేశంగా ఉంది. బొలీవియా రాజ్యాంగ వ్యవస్థ బొలివియాను తొమ్మిది రాజ్యాంగ విభాగాలుగా విభజించించింది. భౌగోళికంగా బొలీవియా పశ్చిమభూభాగంలో అండీస్ పర్వత శిఖరాలు, తూర్పు లోలాండ్స్ వరకు అమెజాన్ ముఖద్వారం విస్తరించి ఉంది.బొలీవియా దక్షిణ అమెరికాలో అత్యంత పేద దేశంగా ఉంది. [7] బొలీవియా అభివృద్ధి చెందుతున్న దేశంగా మధ్యమ మనవాభివృద్ధి, పేదరికం 53% కలిగి ఉంది. [8] ఆర్ధికరంగంలో వ్యవసాయం, వన్యసంపద, మత్స్యపరిశ్రమ, గనులు, తయారీ పరిశ్రమ (వస్త్రాలు, దుస్తులు, రిఫైడ్ మెటల్స్), రిఫైండ్ పెట్రోలియం ప్రధానపాత్ర వహిస్తున్నాయి.