![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/27/Flag_of_Paraguay.svg/langte-640px-Flag_of_Paraguay.svg.png&w=640&q=50)
పరాగ్వే
దక్షిణ అమెరికా లోని దేశం / From Wikipedia, the free encyclopedia
పరాగ్వే అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే " అంటారు.ఇది మద్య దక్షిణ అమెరికాలోని ఒక భూపరివేష్టిత దేశం. దేశ దక్షిణ, నైరుతీ సరిహద్దులో అర్జెంటీనా, తూర్పు, ఈశాన్య సరిహద్దులో బ్రెజిల్, వాయవ్య సరిహద్దులో బొలీవియా దేశాలు ఉన్నాయి. పరాగ్వే దేశం పరాగ్వే నదికి ఇరువైపులా విస్తరించి ఉంది.దేశం మద్య ఉత్తర, దక్షిణాలుగా పరాగ్వే నది ప్రవహిస్తుంది. దక్షిణ అమెరికా మద్యలో ఉన్న పరాగ్వే " కొరజాన్ డీ సుడామెరికా " (దక్షిణ అమెరికా హృదయం) అని అభివర్ణించబడుతుంది.[6] ఆఫ్రో - యురేషియాకు వెలుపల ఉన్న రెండు భూబంధిత దేశాలలో పరాగ్వే ఒకటి (రెండ దేశం బొలీవియా) అలాగే అతి చిన్నదేశంగా ప్రత్యేకత కలిగి ఉంది.[7] అమెరికా ఖండాలలో ఉన్న భూబంధితదేశం కూడా ఇది ఒక్కటే.
Republic of Paraguay
| |
---|---|
Coat of armsమూస:Tsp[nb 2]
| |
నినాదం: "Paz y justicia" (Spanish) "Peace and justice" | |
గీతం: Paraguayos, República o Muerte (Spanish) Paraguayans, Republic or Death | |
![]() | |
రాజధాని and largest city | Asunción 25°16′S 57°40′W |
అధికార భాషలు |
|
జాతులు (2016[1]) |
|
పిలుచువిధం | Paraguayan |
ప్రభుత్వం | Unitary presidential constitutional republic |
• President | Horacio Cartes |
• Vice President | Juan Afara |
శాసనవ్యవస్థ | Congress |
• ఎగువ సభ | Senate |
• దిగువ సభ | Chamber of Deputies |
Independence from Spain | |
• Declared | 14 May 1811 |
• Recognized | 25 November 1842 |
విస్తీర్ణం | |
• మొత్తం | 406,752 కి.మీ2 (157,048 చ. మై.) (59th) |
• నీరు (%) | 2.3 |
జనాభా | |
• 2016 estimate | 6,725,308[2] (104th) |
• జనసాంద్రత | 17.2/చ.కి. (44.5/చ.మై.) (204th) |
GDP (PPP) | 2017 estimate |
• Total | $68.005 billion[3] (100th) |
• Per capita | $9,779[3] (107th) |
GDP (nominal) | 2017 estimate |
• Total | $28.743 billion[3] (99th) |
• Per capita | $4,133[3] (109th) |
జినీ (2014) | ![]() high |
హెచ్డిఐ (2015) | ![]() medium · 110th |
ద్రవ్యం | Guaraní (PYG) |
కాల విభాగం | UTC–4 (PYT) |
• Summer (DST) | UTC–3 (PYST) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +595 |
ISO 3166 code | PY |
Internet TLD | .py |
|
16 వ శతాబ్దంలో స్పానిష్ సామ్రాజ్యం ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకొనేందుకు కనీసం ఒక సహస్రాబ్దికి పూర్వం నుండి పరాగ్వేలో స్థానికజాతులకు చెందిన గ్వారని ప్రజలు నివసించారు. స్పానిష్ సెటిలర్లు, సొసైటీ అఫ్ జీసస్ మిషన్లు ఈ ప్రాంతానికి క్రిస్టియానిటీ, స్పానిష్ సంస్కృతిని పరిచయం చేశారు. పరాగ్వే కొన్ని పట్టణకేంద్రాలు, సెటిలర్లతో స్పానిష్ సామ్రాజ్యం కాలనీగా ఉంది. 1811 లో స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన పరాగ్వేలో నిరంకుశ పాలకుల పాలనలో ఐసోలేషనిస్ట్, ప్రొటెస్టెరిస్ట్ విధానాలు అమలు చేశారు.అతి భయంకరమైన పరాగ్వేయన్ యుద్ధం (1864-1870) తరువాత పరాగ్వే జనసంఖ్యలో 60%-70% ప్రజలను, 1,40,000 చ.కి.మీ భూభాగాన్ని (దేశంలో నాలుగవ భాగం) యుద్ధం, అంటువ్యాధుల కారణంగా పోగొట్టుకుంది.యుద్ధంలో పరాగ్వే భూభాగాలను అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలు స్వాధీనం చేసుకున్నాయి.
20 వ శతాబ్దంలో పరాగ్వేలో వారసత్వ ప్రభుత్వాల పాలన కొనసాగింది.1954 నుండి 1989 వరకు అల్ఫ్రెడో స్ట్రోస్నేర్ నాయకత్వంలో సైనిక నియంతృత్వ పాలన కొనసాగింది. ఇది దక్షిణ అమెరికాలో దీర్ఘకాలం కొనసాగిన సైనిక పాలనగా ప్రత్యేకత సంతరించుకుంది.ఒక సంవత్సరం తర్వాత, పరాగ్వే అర్జెంటీనా, బ్రెజిల్, ఉరుగ్వే లలో చేరి " మెర్కోసూర్ " పేరుతో ప్రాంతీయ ఆర్థిక సహకార సంస్థను స్థాపించింది.
పరాగ్వే జనసంఖ సుమారు ఒక మిలియన్ ఉంటుంది. వీరిలో చాలామంది దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.పరాగ్వే జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు ప్రజలు రాజధాని, అతిపెద్ద నగరం అసున్సియోన్ నగర మెట్రోపాలిటన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. పలు లాటిన్ అమెరికన్ దేశాలకు విరుద్ధంగా పరాగ్వే దేశీయభాష, సంస్కృతి గురని దేశంలో అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయి. పరాగ్వేలో నిర్వహించిన జనాభా గణనలన్నింటిలో మేస్టిజోలు ప్రధాన నివాసితులుగా ఉన్నారు.శతాబ్ధాల కాలం వివిధజాతుల సహజీవనం కారణంగా జాతయంతర వివాహలు మెస్టిజోల సంఖ్య అధికరించడానికి ప్రధానకారణంగా ఉంది. స్పానిష్ భాషతో పాటుగా గ్యురానీ భాష కూడా అధికారిక భాషగా గుర్తింపు పొందింది. ఇవి కాక మరొక రెండు భాషలను దేశమంతటా మాట్లాడుతుంటారు.