స్పెయిన్
From Wikipedia, the free encyclopedia
స్పెయిన్ (స్పానిష్ : España "ఎస్పఞ") లేదా స్పెయిన్ సామ్రాజ్యం (అధికార నామం రెయినో దే ఎస్పఞ) ఐరోపా ఖండపు నైరుతి భాగంలో ఉన్న ఒక దేశము. దీని భూభాగం అట్లాంటిక్ సముద్రం లోనూ, ఆఫ్రికా ఖండపు ఉత్తర భాగంలో కూడా విస్తరించి ఉంది. ఈ దేశపు ఖండాంతర ఐరోపా భూభాగం ఐబీరియన్ ద్వీపకల్పంలో ఉంది. దాని ద్వీప భూభాగంలో మధ్యధరా సముద్రంలోని బలేరిక్ దీవులు, అట్లాంటిక్ మహాసముద్రంలోని కానరీ దీవులు, 29వ సమాంతరానికి దక్షిణంగా, అల్బోరాన్ సముద్రంలో అనేక చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఈ దేశపు ప్రధాన భూభాగానికి దక్షిణంగా జిబ్రాల్టర్ జలసంధి, దక్షిణం, తూర్పుగా మధ్యధరా సముద్రం, ఉత్తరంగా ఫ్రాంసు, అండోరా, బే ఆఫ్ బిస్కే, పడమరగా పోర్చుగల్, అట్లాంటిక్ మహా సముద్రం ఉన్నాయి.
Reino de España రెయినో దే ఎస్పాన్యా స్పానిష్ రాజ్యము |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం ప్లస్ అల్ట్రా (Latin) "Further Beyond" |
||||||
జాతీయగీతం |
||||||
Location of స్పెయిన్ (dark green) – on the European continent (light green & dark grey) |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | మాడ్రిడ్ 40°26′N 3°42′W | |||||
అధికార భాషలు | స్పానిష్ భాష2, | |||||
ప్రజానామము | స్పానిష్ ప్రజలు, స్పేనియర్డ్ | |||||
ప్రభుత్వం | పార్లమెంటరీ ప్రజాస్వామ్యము , రాజ్యాంగ రాచరికము | |||||
- | చక్రవర్తి | మొదటి హువాన్ కార్లోస్ (స్పెయిన్) | ||||
- | అధ్యక్షుడు the Government |
Pedro Sánchez |
||||
అవతరణ | 15వ శతాబ్దము | |||||
- | వంశానుగత సమైక్యత | 1516 | ||||
- | ఏకీకరణ | 1469 | ||||
- | de facto | 1716 | ||||
- | de jure | 1812 | ||||
Accession to the European Union |
జనవరి 1, 1986 | |||||
- | జలాలు (%) | 1.04 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 45,200,737[1] (28వది) | ||||
జీడీపీ (PPP) | 2006[2] అంచనా | |||||
- | మొత్తం | $1.261 ట్రిలియన్ (11వది) | ||||
- | తలసరి | $27,950 (2005) (27వది) | ||||
జీడీపీ (nominal) | 2006[3] అంచనా | |||||
- | మొత్తం | $1.224 ట్రిలియన్ (9వది) | ||||
- | తలసరి | $27,767 (2006) (26వది) | ||||
జినీ? (2000) | 34.7 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) | 0.949 (high) (13వది) | |||||
కరెన్సీ | యూరో (€) ³ (EUR ) |
|||||
కాలాంశం | CET4 (UTC+1) | |||||
- | వేసవి (DST) | CEST (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .es5 | |||||
కాలింగ్ కోడ్ | +34 | |||||
1 | ఇదే రాచ గీతముగా కూడా ఉన్నది. | |||||
2 | కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రదేశాలలో, "అరనీస్" ("ఆక్సిటాన్ భాష"), "బస్క్ భాష", "కాటలాన్ భాష/వలెన్షియన్", "గలీషియన్ భాష" భాషలు సహ అధికారిక భాషలుగా ఉన్నవి. | |||||
3 | 1999కి పూర్వము (చట్టబద్ధంగా 2002కి ముందు) : "స్పానిష్ పెసెటా". | |||||
4 | WET (UTC, వేసవిలో UTC+1) కాలమండలాన్ని పాటించే 'కానరీ దీవులు' మినహాయించి. | |||||
5 | ఇతర ఐరోపా సమాఖ్య సభ్యదేశాలతో కలిసి పంచుకుంటున్న .eu డొమైన్‌ను కూడా ఉపయోగిస్తారు. |
5,05,990 చ.కి.మీ (1,95,360 చ.మై) విస్తీర్ణంతో దక్షిణ ఐరోపాలో స్పెయిన్ అతి పెద్ద దేశం. పశ్చిమ ఐరోపా, ఐరోపా సమాఖ్యలో రెండవ అతిపెద్ద దేశం. ఐరోపా ఖండంలోని నాల్గవ అతిపెద్ద దేశంగా ఉంది. జనాభాలో ఐరోపా ఐరోపాలో ఐదవ అతిపెద్ద, ఐరోపా సమాఖ్యలో ఐదో స్థానంలో ఉంది. స్పెయిన్ రాజధాని, అతిపెద్ద నగరం మాడ్రిడ్. బార్సిలోనా, వాలెన్సియా, సెవిల్లె, బిల్బావు, మాలాగా వంటి ఇతర ప్రధాన పట్టణ ప్రాంతాలు ఉన్నాయి.
సుమారు 42,000 సంవత్సరాల క్రితం ఆధునిక మానవులు మొట్టమొదట ఐబెర్రి ద్వీపకల్పానికి వచ్చారు. ప్రాచీన ఫోనిషియన్ గ్రీకు, కార్తగినియన్ నివాసాలతో పాటు ఐబెరియన్ సంస్కృతులు ద్వీపకల్పంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఇది సుమారు క్రీ.పూ 200 ప్రాంతంలో రోమన్ పరిపాలన కిందకు వచ్చింది. దీని తరువాత ఈ ప్రాంతం స్పెయిన్ (ఒక) లేదా స్పేనియా అనే పూర్వీకుల పేరు ఆధారంగా హిస్పానియ అని పిలువబడింది.[4] పశ్చిమ రోమన్ సామ్రాజ్యం ముగింపులో సెంట్రల్ ఐరోపా నుండి వలసవచ్చిన జర్మనీ గిరిజన సమాఖ్యలు ఐబీరియన్ ద్వీపకల్పాన్ని ఆక్రమించాయి, సుయెవ్స్, అలన్స్, వాండల్తో సహా పశ్చిమ ప్రావిన్సుల్లో స్వతంత్ర ప్రాంతాల్లో తమను తాము స్థాపించుకున్నాయి. చివరికి విసిగోత్స్ ద్వీపకల్పంలోని అన్ని మిగిలిన స్వతంత్ర భూభాగాలను బలవంతంగా సమీకరించి టోలెడో సామ్రాజ్యంతో సహా బైజాంటైన్ ప్రావిన్సులను రాజకీయంగా, మతపరంగా, చట్టపరంగా అన్ని పూర్వపు రోమన్ రాజ్యాలు, వారసుల రాజ్యాలు హిస్పానియాలను స్వాధీనం చేసుకున్నారు.
మూర్లు విసిగోతిక్ సామ్రాజ్యం ఉత్తరప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడ కొద్దికాలం తర్వాత రికాక్కిస్టా అనే ప్రక్రియ ప్రారంభమైంది.[5] ఎనిమిది శతాబ్దాల పొడవున పునర్నిర్వహణ పూర్తి చేసిన తరువాత కాథలిక్ మోనార్క్‌ల ఆధ్వర్యంలో 15 వ శతాబ్దంలో స్పెయిన్ ఒక ఏకీకృత దేశంగా అవతరించింది. ఆధునిక కాలం ప్రారంవ్గ చరిత్రలో మొదటి ప్రపంచ సామ్రాజ్యంలో ఒకటిగా స్పెయిన్ సామ్రాజ్యం నిలిచింది. ఇది విస్తారమైన సాంస్కృతిక, భాషా వారసత్వంగా 500 మిలియన్ల మంది హిస్పానోఫోంక్లకు పైగా కలిగి ఉంది. స్పానిష్ భాష ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మాట్లాడే స్థానిక భాషగా ఉంది. మొదటి భాష చైనీస్.
స్పెయిన్ లౌకిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాచరిక రాజ్యాంగాన్ని కలిగి ఉంది.[6] 6 వ ఫెలిప్ రాజు దేశాధిపతిగా ఉన్నాడు. ఇది నామమాత్ర జి.డి.పి. ప్రపంచ పంతొమ్మిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో, కొనుగోలు శక్తి సమానతతో పదహారవ అతిపెద్దదిగా ఇది ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉంది.[7] ఇది ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, యూరోజోన్, కౌన్సిల్ ఆఫ్ ఐరోపా, ఐబెర్రా-అమెరికన్ స్టేట్స్ సంస్థ (ఒ.ఇ.ఐ), మధ్యధరా సమాఖ్య, నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఒలిల్సిల్డి), ఒ.ఎస్.సి.ఇ, స్కెంజెన్ ప్రాంతం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు. ఏడాదికోసారి జరిగే జి20 శిఖరాగ్ర సమావేశాల్లో స్పెయిన్ కు శాశ్వత ఆహ్వానం ఉంది.