![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f7/Rohit_Sharma_November_2016_%2528cropped%2529.jpg/640px-Rohit_Sharma_November_2016_%2528cropped%2529.jpg&w=640&q=50)
క్రికెట్ ప్రపంచ కప్ సెంచరీల జాబితా
From Wikipedia, the free encyclopedia
India's Rohit Sharma (top) and Sachin Tendulkar (bottom) have the most centuries (six) in World Cup matches. Rohit Sharma also holds the record for most centuries in a single World Cup tournament having scored 5 centuries in the 2019 Cricket World Cup.క్రికెట్లో, ఒక ఆటగాడు ఒకే ఇన్నింగ్స్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే సెంచరీ పూర్తి చేసినట్లు చెబుతారు. [1] క్రికెట్ ప్రపంచ కప్ అనేది వన్ డే ఇంటర్నేషనల్ రూపంలో అంతర్జాతీయ ఛాంపియన్షిప్. దీన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తుంది.[2] నాలుగు సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. [2] [3] 2019 టోర్నమెంట్ నాటికి, 15 వేర్వేరు జట్లకు చెందిన 117 మంది ఆటగాళ్లు మొత్తం 196 సెంచరీలు సాధించారు. [4] శాశ్వత వన్డే హోదా ఉన్న అన్ని జట్ల ఆటగాళ్లు సెంచరీలు చేశారు. [lower-alpha 1] అదనంగా, తాత్కాలిక వన్డే హోదా కలిగిన ఐదు జట్లకు చెందిన ఆటగాళ్లు కూడా సెంచరీలు సాధించారు. [lower-alpha 2] భారతీయులు అత్యధిక శతకాలు (32) సాధించగా, ఆస్ట్రేలియాలో అత్యధిక సంఖ్యలో ఆటగాళ్ళు (15) ఈ ఘనత సాధించారు. [4]
1975 ప్రపంచకప్‌లో భారత్‌పై 137 పరుగులు చేయడం ద్వారా ఇంగ్లండ్‌కు చెందిన డెన్నిస్ అమిస్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి సెంచరీ సాధించాడు. [6] అదే రోజు న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ టర్నర్ తూర్పు ఆఫ్రికాపై 171 నాటౌట్ చేశాడు. 1983లో జింబాబ్వేపై భారత క్రికెటర్ కపిల్ దేవ్ 175 నాటౌట్ స్కోర్ చేసే వరకు ఇది తదుపరి రెండు ఎడిషన్లలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. ఆ తర్వాత, 1987 లో వివ్ రిచర్డ్స్ (181), 1996 లో గ్యారీ కిర్‌స్టన్ (188 నాటౌట్), క్రిస్ గేల్ (215), 2015 లో మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్) వరుసగా ఈ రికార్డును బద్దలు కొట్టారు. భారతదేశానికి చెందిన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ అత్యధిక సెంచరీలతో (చెరి ఆరు) అగ్రస్థానాన ఉండగా, [7] ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర ఒక్కొక్కటి ఐదుతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తిలకరత్నే దిల్షాన్, సౌరవ్ గంగూలీ, మహేల జయవర్ధనే, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, మార్క్ వాలు తలా నాలుగు శతకాలతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. [7]
2019 టోర్నమెంట్లో రోహిత్ శర్మ చేసిన ఐదు సెంచరీలు ఒకే టోర్నమెంట్లో ఒక ఆటగాడు చేసిన అత్యధిక సంఖ్య. 2015 టోర్నమెంటులో సంగక్కర నాలుగు సెంచరీలు సాధించగా, [lower-alpha 3] నలుగురు ఆటగాళ్లు – వా (1996), గంగూలీ (2003), మాథ్యూ హేడెన్ (2007), వార్నర్ (2019) – ఒకే టోర్నమెంటులో మూడు సెంచరీలు సాధించారు. ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ ఫాస్టెస్ట్ సెంచరీ (50 బంతుల్లో) రికార్డు సృష్టించాడు. [lower-alpha 4] 1992 లో, జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ – ప్రపంచ కప్‌లో తన వన్డే రంగప్రవేశం చేస్తూ – సెంచరీ చేశాడు. [lower-alpha 5] [12] 2015 టోర్నమెంట్లో 38 సెంచరీలు నమోదయ్యాయి. 1979 పోటీలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే ఉన్నాయి.
2015 నాటికి, అన్ని ఫైనల్స్‌లో కలిపి ఆరు సెంచరీలు నమోదయ్యాయి; [13] అందులో ఐదు విజేత జట్టులో వారు చేసినవి.[14] 2007 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై ఆడమ్ గిల్‌క్రిస్ట్ 149 పరుగులు చేయడం ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా మిగిలిపోయింది; [15] అతని 72 బంతుల్లో సెంచరీ కూడా ఫైనల్లో అత్యంత వేగవంతమైనది. [15]