కొలంబియా
From Wikipedia, the free encyclopedia
Francis, John Michael (2007). Invading Colombia: Spanish accounts of the Gonzalo Jiménez de Quesada expedition of conquest Vol. 1. Penn State Press. ISBN 9780271029368. కొలంబియా (/kəˈlʌmbiə/ kə-LUM-biə or /kəˈlɒmbiə/ kə-LOM-biə; Spanish: [koˈlombja] ( listen)), (ఆంగ్లం Colombia), అధికారిక నామం, రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా, (మూస:Audio-es),[Note 1] దక్షిణ అమెరికా లోని వాయువ్యభాగాన గల ఒక దేశం. దీని తూర్పున వెనుజులా,[1] బ్రెజిల్;[2] దక్షిణాన ఈక్వెడార్, పెరూ;[3] ఉత్తరాన కరీబియన్ సముద్రం; దీని వాయవ్యంలో పనామా;, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి.[4] దేశసముద్రతీర సరిహద్దులను కోస్టారీకా,నికరాగ్వా,హోండురాస్,జమైకా,హైతి, డోమినికన్ ఋఇపబ్లిక్లతో పంచుకుంటుంది.[5] కొలంబియా రిపబ్లిక్లో 32 శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కొలంబియాలో ఉన్న 30 శాఖలలో ముందుగా స్థానికజాతి ప్రజలు నివసించారు. వీరిలో అభివృద్ధి చెందిన నాగరికత కలిగిన ప్రజలలో మూయిస్కా, క్యుయింబయా, టైరొనా ప్రజలు ప్రాధాన్యత వహించారు.
1499లో కొలంబియా భూమి మీద స్పెయిన్ ప్రజలు పాదం మోపారు. 16వ శతాబ్దం సగంలో స్పెయిన్ కొలంబియా మీద విజయం సాధించి " న్యూ కింగ్డం ఆఫ్ గ్రనాడా " పేరుతో వలసరాజ్యం స్థాపించారు.కొత్త రాజ్యానికి " సనాటే డీ బొగొటా " రాజధానిగా ఉంది. 1819లో స్పెయిన్ నుండి కొలబియాకు స్వతంత్రం లభించింది.అయినప్పటికీ 1830లో మాత్రమే " గ్రాన్ కొలంబియా ఫెడరేషన్ " రద్దు చేయబడింది.ప్రస్తుత కొలంబియా, పనామా కలిసి " రిపబ్లిక్ ఆఫ్ న్యూ గ్రనాడా "గా రూపొందింది. కొత్త దేశం " గ్రానడైన్ కాంఫిడరేషన్ " (1858) పేరుతో ప్రయోగపూర్వకంగా ఫెడరలిజం , " యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలంబియా " (1863) ప్రవేశపెట్టింది.చివరిగా 1836లో " రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా " ప్రకటించబడింది.1903లో కొలంబియా నుండి పనామా విభజించబడింది. 1960 నుండి కొలంబియాలో ఆరంభమైన " సైనిక ఘర్షణ " 1990 నాటికి ఉచ్ఛస్థాయికి చేరుకుని 2005 నాటికి సద్దుమణిగింది.[6]
సంప్రదాయంగా , భాషాపరంగా వైవిధ్యం కొనసాగుతున్న ప్రపంచదేశాలలో కొలబియా ఒకటి. గొప్ప సాస్కృతిక వైభవం కలిగిన దేశాలలో కొలంబియా ఒకటి.నగరప్రాంతాలు అధికంగా ఆండెన్ పర్వతప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.
కొలంబియన్ భూభాగంలో అమెజాన్ వర్షారణ్యాలు, ఉష్ణమండల పచ్చిక మైదానాలు , కరీబియన్ ప్రాంతం , పసిఫిక్ సముద్రతీరం ఉన్నాయి. ప్రపంచంలోని 17 అత్యధిక వైవిధ్యమైన , అత్యంత జీవవైవిధ్య సాంద్రత కలిగిన కొలంబియా ఒకటి.[7] కొలంబియా లాటిన్ అమెరికాలో 4వ ఆర్థికశక్తిగా అభివృద్ధి చెందింది.[8] అభివృద్ధి చెందుతున్న 6 మార్కెట్లలో (సి.ఐ.వి.ఇ.టి.ఎస్.), ఐక్యరాజ్యసమితి, డబల్యూ.టి.ఒ., ది ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, ది పసిఫిక్ అలయంస్ , ఇతర అంతర్జాతీయ ఆర్గనైజేషన్లలో కొలంబియా భాగస్వామ్యం వహిస్తుంది.[9] స్థిరమైన , క్రమంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికశక్తి కలిగిన దేశాలలో కొలంబియా ఒకటి. [10][11]