From Wikipedia, the free encyclopedia
జమైకా (ఆంగ్లం : Jamaica), గ్రేటర్ ఆంటిల్లెస్ లోగల ఒక ద్వీప దేశం. ఇది కరీబియన్ సముద్రంలో గలదు. ఉత్తర అమెరికా లోని అమెరికా, కెనడా తరువాత, అధికంగా ఇంగ్లీషు మాట్లాడే దేశాలలో మూడవ దేశం.జమైకా గ్రేటర్ అట్లాంటిస్లో మూడవ అతి పెద్ద ద్వీప దేశం గా ఉంది.ద్వీపవైశాల్యం 10,990 చ.కి.మీ.ఇది క్యూబాకు 145కి.మీ దూరంలో దక్షిణంగా, హిస్పానియోలాకు (ఈదీవిలో హైతి, డొమినికన్ రిపబ్లిక్ దేశాలు ఉన్నాయి)191కి.మీ. పశ్చిమంలో ఉంది.వైశాల్యపరంగా జమైకా కరీబియన్ సముద్రదేశాలలో 4వ స్థానంలో ఉంది.[3] 1494లో క్రిస్టోఫర్ కొలంబస్ రాకకు ముందు జమైకాలో స్థానికజాతికి చెందిన అరవాక్, టియానో ప్రజలు నివసించారు.తరువాత ఈదీవి స్పెయిన్ పాలనలోకి మారింది.అనేకమంది స్థానికజాతి ప్రజలు అంటువ్యాధులు, స్పెయిన్ దిగుమతి చేసుకున్న బానిసలు, కూలీల కారణంగా మరణించారు.ఈదీవి 1655 వరకు " శాంటియాగో " పేరుతో స్పెయిన్ పాలనలో ఉంది. గ్రేట్ బ్రిటన్ ఈదీవిని స్వాధీనం చేసుకున్న తరువాత ఇది జమైకాగా నామాంతరం చెందింది.బ్రిటన్ పాలనలో ఈ దీవి అతిపెద్ద చక్కెర ఎగుమతి ప్రాంతంగా అభివృద్ధి చెందింది. చెరకుతోటల ఆదాయం అధికంగా ఆఫ్రికా నుండి బలవంతంగా రవాణాచేయబడిన బానిసల మీద ఆధారపడి ఉండేది.1838లో బానిసలందరికీ స్వేచ్ఛకల్పించబడింది. స్వేచ్ఛకల్పించబడిన బానిసలు తోటలలో పనిచేయడానికి బదులుగా తమస్వంత వ్యవసాయక్షేత్రాలు ఏర్పరచుకుని పనిచేయడం ప్రారంభించారు. ఆరంభకాలం 1840లో చెరకు తోటలలో పనిచేయడానికి బ్రిటన్ చైనా, భారతదేశం నుండి కూలీలను ఒప్పంద విధానంలో తీసుకు వచ్చింది.1962 ఆగస్టు 6న ఈద్వీపానికి బ్రిటన్ నుండి స్వతంత్రం లభించింది.[4]
జమైకా |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Out of many, one people" |
||||||
జాతీయగీతం రాజగీతం "God Save the Queen" |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Kingston 17°59′N 76°48′W | |||||
అధికార భాషలు | జమైకన్ ఆంగ్లం | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Jamaican Patois | |||||
జాతులు | 91.2% African, 6.2% Multiracial, 2.6% Other or Unknown[1] | |||||
ప్రజానామము | Jamaican | |||||
ప్రభుత్వం | Parliamentary democracy and Constitutional monarchy | |||||
- | Monarch | Elizabeth II | ||||
- | Governor-General | Patrick Allen | ||||
- | Prime Minister | Bruce Golding | ||||
స్వాతంత్ర్యం | ||||||
- | from the United Kingdom | 6 ఆగస్టు 1962 | ||||
- | జలాలు (%) | 1.5 | ||||
జనాభా | ||||||
- | జూలై 2008 అంచనా | 2,804,332 (133వది) | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $20.650 బిలియన్లు[2] (113st) | ||||
- | తలసరి | $7,688[2] (85వది) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $11.266 బిలియన్లు[2] | ||||
- | తలసరి | $4,194[2] | ||||
జినీ? (2000) | 37.9 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.771 (medium) (87వది) | |||||
కరెన్సీ | Jamaican dollar (JMD ) |
|||||
కాలాంశం | (UTC-5) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .jm | |||||
కాలింగ్ కోడ్ | +1 876 |
అమెరికా ఖండాలలోని ఆగ్లోఫోన్ (ఆగ్లం వాడుకగా కలిగిన ప్రపంచం)దేశాలలో 2.9 జనసంఖ్య కలిగి జమైకా మూడవ స్థానంలో ఉంది.మొదటి రెండు స్థానాలలో యునైటెడ్ స్టేట్స్,కెనడా దేశాలు ఉన్నాయి.అలాగే కరీబియన్ దేశాలలో అత్యంత జనసాంధ్రత కలిగిన దేశాలలో జమైకా 4వ స్థానంలో ఉంది.రాజధాని నగరమైన కింగ్స్టన్, జమైకా దేశంలో అత్యంత పెద్ద నగరంగా ఉంది. నగరజనాభా 9,37,700.[5][6] జమైకాలో ఆధిక్యత కలిగిన ప్రజలలో గుర్తించతగిన సంఖ్యలో ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు, యురేపియన్లు, చైనీయులు, భరతీయులు, మిశ్రితజాతులకు చెందిన అల్పసంఖ్యాక ప్రజలు ఉన్నారు.1960 నుండి ఉపాధిశోధనలో ప్రజలు దేశం విడిచిపోతున్న కారణంగా జమైకా విదేశీఉపాధి ప్రజల సంఖ్య అధికంగా ఉంది. జమైకన్లు అధికంగా కెనడా, యునైటెడ్ కింగ్డం, యునైటెడ్ స్టేట్స్కు ఉపాధి కొరకు చేరుకుంటున్నారు.[7] జమైకా కామంవెల్త్ రాజ్యాలలో ఒకటి. రెండవ ఎలిజబెత్ రాణి జమైకాకు చక్రవర్తినిగా, రాజ్యాధికారిణిగా ఉంది.ఆమె నియమించిన ప్రతినిధిగా గవర్నర్ జనరల్ సర్ పాట్రిక్ 2009 నుండి ఇక్కడ కార్యాలయం ఏర్పరచుకుని పనిచేస్తున్నాడు. జమైకాలో పార్లమెంటరీ,రాజ్యాంగపరమైన రాచరిక విధానం అమలులో ఉంది.చట్ట అధికారం ద్విసభ పద్ధతిని అనుసరిస్తుంది. పార్లమెంటులో ఎన్నిక చేయబడిన సభ్యులు, నియమించబడిన రాజప్రతినిధులతో పనిచేస్తుంది.[8][9][10][11]
స్థానికజాతి ప్రజలు,టియానో పేజలు ఈ ప్రాంతాన్ని అరవాకన్ భాషలో జమైకా అని పిలిచేవారు.[12] జమైకా అంటే వృక్షభూమి, జలాశయభూమి అని లేక లాండ్ ఆఫ్ స్ప్రింగ్ అని అర్ధం.[13] జమైకన్లు వారి ద్వీపాన్ని రాయి అని పేర్కొంటారు. జంరాక్, జండౌన్ లా జ అనేది మాట చేర్చబడి ఉంటుందని భావిస్తున్నారు.[14]
దక్షిణ అమెరికాకు చెందిన అరవాక్, టైనొ స్థానిక ప్రజలు ఈ ద్వీపంలో క్రీ.పూ. 4000-క్రీ.పూ. 1000 మద్యకాలంలో ఇక్కడ నివసించారు.[15] 1494లో క్రిస్టోఫర్ కొలంబస్ ఇక్కడకు చేరుకున్న తరువాత 200 కంటే అధికమైన గ్రామాలను " కాసిక్యూలు " (గ్రామాధికారులు)పాలించారు.జమైకా దక్షిణ సముద్రతీరంలో జనసాంధ్రత అధికంగా ఉండేది. ప్రత్యేకంగా ప్రస్తుత ఓల్డ్ హార్బర్ ప్రాంతంలో జనసాంధ్రత మరింత అధికంగా ఉండేది.[15] 1655లో ఆంగ్లేయులు ఈద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో ఇక్కడ టైనో ప్రజలు నివసిస్తూ ఉండేవారు.[15] ది జమైకన్ హెరిటేగ్ ట్రస్ట్ అరవాకన్, టైనో ప్రజల ఉనికిని గుర్తించి నమోదు చేయడానికి ప్రయత్నిస్తుంది. [16]
1494లో క్రిస్టోఫర్ కొలంబస్ ఈద్వీపాన్ని స్పెయిన్ తరఫున స్వాధీనం చేసుకున్నాడు. కొలమబస్ డ్రై హారబర్లో (ప్రస్తుత డిస్కవరీ బే) ప్రవేశించాడని భావిస్తున్నారు. [17]. కొలబస్ మొదటిసారిగా చూసిన ప్రస్తుత సెయింట్ అన్న పారిష్కు కొలంబస్ సెయింట్ గ్లోరియా అని నామకరణం చేసాడు. ఇది అన్న బేకు పశ్చిమంలో 1.5 కి.మీ దూరంలో ఉంది.ద్వీపంలో అన్న బేలో మొదటి స్పానిష్ సెటిల్మెంట్ స్థాపించబడింది.1509లో సెవిల్లా సెటిల్మెంట్ స్థాపించబడింది.ఇది అనారోగ్యకరమైనదని భావించిన కారణంగా ఇది 1524లో విసర్జించబడింది.[18] రాజధాని స్పానిష్ టౌన్‌కు మార్చబడిన తరువాత 1534లో నగరానికి " సెయింట్ జాగో డీ లా వెగా " (ప్రస్తుత సెయింట్ కాథరిన్) అని పిలువబడింది.[19]
కరీబియన్ ప్రాంతంలోని అతిపురాతన బ్రిటిష్ చర్చి స్పానిష్ టౌన్లో ఉంది.[19] 1655లో అడ్మైరల్ సర్ విలియం, జనరల్ రాబర్ట్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం సెయింట్ అన్న్ లోని కోటను స్వీధీనం చేసుకుని స్పెయిన్ వారిని బలవంతంగా వెలుపలకు పంపారు.[20] మాంటిగో బే, పారిష్ రాజధాని సెయింట్ జేంస్ పేర్లు స్పానిష్ పేరైన " మాంటికా బహియా " (బే ఆఫ్ లార్డ్) నుండి గ్రహించబడ్డాయి. ఇక్కడ అధికసంఖ్యలో పందులు ఉండేవి.[21]
ఆగ్లేయులు ఆఫ్రికన్ బానిసలను శ్రామికులుగా ఈద్వీపానికి తీసుకురావడం కొనసాగించారు.1660లో జమైకాలో 4,500 శ్వేతజాతీయులు, 1,500 నల్లజాతీయులు ఉన్నారు.[23] 1670 నాటికి ఆంగ్లేయులు అత్యధికసంఖ్యలో బానిసలను దిగుమతి చేసుకుని చెరకు తోటలను అభివృద్ధి చేసారు. జనసంఖ్యలో నల్లజాతీయుల సంఖ్య అధికం అయింది.[24] జమైకా ఆరంభకాల ప్రజలలో ఐరిష్ ప్రజలు అధికంగా ఉన్నారు. 17వ శతాబ్దం నాటికి ద్వీపంలో నివసిస్తున్న శ్వేతజాతీయులలో ఐరిష్ ప్రజలు మొత్తం ప్రజలలో మూడింట రెండు భాగాలు ఉన్నారు.వీరు ఇంగ్లీష్ ప్రజలకంటే రెండింతలు ఉన్నారు.1655లో క్రోంవెల్ సైన్యం వీరిని ఒప్పంద కూలీలుగా, సైనికులుగా తీసుకువచ్చారు.ఐర్లాండులో " వార్స్ ఆఫ్ ది త్రీ కిండంస్ " యుద్ధంలో వీరు యుద్ధఖైదీలుగా చేయబడి ఇక్కడకు తీసుకురాబడ్డారు.[25] 18వ శతాబ్దంలో కూడా ఈద్వీపానికి ఐరిష్ ప్రజల వలసలు కొనసాగాయి.[26]
1492లో స్పెయిన్ నుండి బలవంతంగా పోర్చుగీసుకు పంపబడిన యూదులు బలవంతంగా క్రైస్తవానికి మార్చబడ్డారు.కొంతమంది స్పెయిన్, పోర్చుగీస్ శరణార్ధులు నెథర్లాండ్, ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడి నుండి జమైకా చేరుకున్నారు. మిగిలిన వారు న్యూవరల్డ్కు చెందిన ఐబరియన్ కాలనైజేషన్లో భాగంగా ఉన్నారు. వీరిని కాథలిక్కుగా మార్చారు. స్పానిష్ కాలనీలలో కాథలిక్కులకు మాత్రమే ప్రవేశం ఉండేది. 1660 నాటికి న్యూ వరల్డ్‌కు చెందిన యూదులకు జమైకా ఆశ్రితదేశంగా మారింది. స్పెయిన్, పోర్చుగల్ నుండి బహిష్కరించబడిన యూదులను జమైకా ఆకర్షించింది.క్రిస్టోఫర్ కొలంబస్ కుమారుడు ద్వీపాంలో స్థిరపడిన తరువాత 1510లో మొదటిసారిగా యూదులు జమైకా చేరుకున్నారు.వీరు అధికంగా వ్యాపారుగా జీవితం సాగించారు.యూదులు బలవంతంగా రహస్యజీవితం సాగించారు. వారిని వారు పోర్చుగీసు ప్రజలుగా పేర్కొన్నారు. బ్రిటిష్ ఈద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత యూదులు స్పెయిన్ నుండి రక్షణ లభించిందని ఆనందపడ్డారు.ఇది పైరేట్లకు అవకాశంగా మారింది.[27] 1655లో ఆంగ్లేయులు ఈద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత స్పానిష్ కాలనీ ప్రజలు బానిసలను విడుదలచేసి ద్వీపం నుండి పారిపోయారు. [20] బానిసలు పర్వతప్రాంతాలకు పారిపోయి మరూన్ ప్రజలతో కలిసిపోయారు.[28]
శతాబ్ధాల బానిసత్వం తరువాత మరూన్ ప్రజలు జైమాకాలోని లోతట్టు ప్రంతాలలోని పర్వతప్రాంతాలలో స్వేచ్ఛాయుతమైన కమ్యూనిటీలను స్థాపించుకున్నారు. అక్కడ వారు కొన్ని తరాలకాలం స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను రక్షించుకున్నారు. 18వ శతాబ్దంలో జమైకన్ మరూన్లు బ్రిటిష్ సైన్యంతో పోరాడారు. 1738-1739 సంవత్సరాలలో జరిగిన ఒప్పందాల ఆధారంగా ఆంగ్లేయులు వారితో పోరాటం నిలిపి బదులుగా వారి సెటిల్మెంట్లను, కాలనీలను వదిలి పోయారు. వారు అవసర సమయాలలో సైనికసేవలు అందించారు.[28] కొన్ని కమ్యూనిటీలు విడగొట్టబడ్డాయి. బ్రిటిష్ మరూన్ మరూన్ ప్రజలను నోవాస్కోటియాకు తరలించారు. తరువాత సియేరా లెయోన్కు తరలించారు.
200 సంవత్సరాల బ్రిటిష్ పాలన తరువాత జమైకా ప్రంపంచంలో చక్కెర ఎగుమతిచేస్తున్న ప్రాంతాలలో ప్రధానమైనదిగా మారింది. 1820-1824లో బానిసల మీద ఆధారపడిన చెరకుతోటల నుండి వార్షికంగా 77,000 టన్నుల చెరకు ఉత్పత్తి చేయబడింది. 1807లో అంతర్జాతీయంగా బానిస వ్యాపారం నిషేధించబడిన తరువాత [29] తరువాత బ్రిటిష్ ఒప్పంద కూలీలను తీసుకువచ్చింది. బానిసలను నిషేధించిన తరువాత 1845 లో భారతదేశం నుండి, 1854 నుండి చైనా నుండి కూలీలు చెరకు తోటలలో పనిచేయడానికి తీసుకుని రాబడ్డారు.[30] స్వేచ్ఛపొందిన వారు తోటలలో పనిచేయడం నిలిపారు. చైనీయులు, భారతీయులు జమైకాలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. [31][32]
19వ శతాబ్దం ఆరంభంలో జమైకా తోటల నిర్వహణ బానిసల శ్రమశక్తి మీద ఆధారపడి ఉంది. నల్లజాతీయులు శ్వేతజాతీయులను సంఖ్యాపరంగా (నల్లజాతీయులు, శ్వేతజాతీయుల నిష్పత్తి 20:1) అధిగమించారు. యు.కె.బానిసల దిగుమతిని నిషేధించినప్పటికీ కొంతమంది స్పెయిన్ కాలనీల నుండి బానిసలను అక్రమరవాణా చేసుకోవడం, నేరుగా అక్రమరవాణా చేసుకున్నారు.బ్రిటిష్ ప్రభుత్వం ఒక వైపు బానిసవిధానం రద్దుచేస్తూనే మరొకవైపు బానిసలస్థితిగతులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించింది.వారు వ్యవసాయక్షేత్రాలలో కొరడాలను ఉపయోగించడం, మహిళలకు ముద్రవేయడం నిషేధించింది. ప్రభుత్వం తోటల యజమానులను బానిసల మతవిధానాలను అనుమతించాలని, వారికి వారానికి ఒక రోజు శలవు ఇవ్వాలని, వారి ఉత్పత్తులు విక్రయించడానికి అనుమతించాలని, ఆదివారం మార్కెట్లను నిషేధించి వారు చర్చికి రావడానికి అనుమతించాలని కోరింది.[ఆధారం చూపాలి]
జమైకా అసెంబ్లీ కొత్తచట్టాలను రూపొందించడం పట్ల అనాశక్తి ప్రదర్శిస్తూ వాటిని అడ్డగించింది. సభ్యులు ద్వీపం అంతర్గత వ్యవహారాలు, బానిసల విషయంలో పార్లమెంటు జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేక్ంచింది.బానిసల యజమానులు తిరుగుబాటు తలెత్తగలదని ఆందోళన చెందారు.ద్వీపంలో ఎదురైన తిరుగుబాటును అధిగమిస్తూ 1833 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం బానిసవిధానంపై నిషేధం విధించింది.1834లో మొత్తం జమైకా జనసంఖ్య 3,71,070 ఉండగా వీరిలో 15,000 శ్వేతజాతీయులు, 5,000 మంది నల్లజాతీయులు, 40,000 మంది ఇతరజాతీయులు 3,11,070 బానిసలు ఉన్నారు.[23]
19వశతాబ్దంలో బ్రిటిష్ జమైకాలో బొటానికల్ గార్డెంస్ స్థాపించింది. 1862లో వరదలో మునిగిన బాత్ బొటానికల్ గార్డెన్ (1779) స్థానంలో కాస్ట్లెటన్ బొటానికల్ గార్డెన్ అభివృద్ధి చేయబడింది.బాత్ బొటానికల్ గార్డెన్ బ్రెడ్ ఫ్రూట్ తోటను అభివృద్ధి చేసిన ప్రదేశం. బ్రెడ్ ఫ్రూటును కేప్టన్ విలియం బ్లిఘ్ పసిఫిక్ నుండి జమైకాకు తీసుకువచ్చాడు. ద్వీపవాసుల ఆహారంలో ఇది ప్రధాన ఆహారంగా మారింది. అదనంగా 1868లో సింకోనా ప్లాంటేషన్ స్థాపించబడింది, 1874లో హోప్ బొటానికల్ గార్డెన్ స్థాపించబడింది. 1872లో ద్వీపం రాజధానిగా కింగ్స్టన్ రూపొందించబడింది.
1945లో హొరేస్ హియర్నే ప్రధాన న్యాయమూర్తి, కీపర్ ఆఫ్ ది రికార్డ్స్ ఇన్ జమైకా అయ్యాడు. 1945-1951 మద్య ఆయన కింగ్‌స్టన్‌లో సుప్రీం కోర్టుకు నాయకత్వం వహించాడు.కెన్యా స్వాతంత్ర్యం పొందాక కెన్యా ప్రభుత్వం హొరేస్ హియర్నెను తమ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన తరువాత హొరేస్ హియర్నే కెన్యాకు తన మకాము మార్చాడు.
క్రమంగా జమైకా యునైటెడ్ కింగ్డం నుండి స్వతంత్రం పొందింది. 1958లో జమైకా " ఫెడరేషన్ ఆఫ్ వెస్టిండీస్ "లో ఒక ప్రొవింస్ అయింది. 1962లో జమైకా పూర్తి స్వాతంత్ర్యం సాధించి ఫెడరేషన్‌ను వదిలివేసింది.
కంసర్వేటివ్, జమైకా లేబర్ పార్టీల పాలనలో స్వతంత్రం పొందిన తరువాత వార్షికంగా 6% ఆర్థికాభివృద్ధి సాధించింది. ప్రభుత్వాలకు అలెగ్జాండర్ బస్టామంటె, డోనాల్డ్ సంగ్స్టర్, హగ్ షీరర్ వంటి ప్రధానమంత్రులు నాయకత్వం వహించారు. అభివృద్ధి బాక్సిట్, పర్యాటకం రంగాలలో పెద్ద ఎత్తున పెట్టడానికి సహకరించింది.
మొదటి దశాబ్ధి ఆర్థికాభివృద్ధి పలువురు ఆఫ్రో- అమెరికన్ల ఆర్థిక అసమానతలకు దారితీసింది. ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు నగరప్రాంతాల బీదవారికి చేరలేదన్న అభిప్రాయం బలపడింది.[ఆధారం చూపాలి] 1970లో అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థికమాధ్యం జమైకా ఆర్థికరంగం మీద కూడా ప్రభావం చూపింది. 1972లో ప్రభుత్వం విద్య, ఆరోగ్యరంగాలలో సాంఘికంగా సమానత్వం కలిగించడానికి ప్రయత్నాలు ఆరంభించింది. అయినప్పటికీ వారి నాయకత్వంలో ఆర్థికరంగం బాధించబడింది. 1980 నాటికి జమైకా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ 1972 కంటే 25% పతనం అయింది. విదేశీ, స్వదేశీ ఋణాలు అధికమౌతున్న కారణంగా, లోటు బడ్జెట్ అధికరించింది. ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్, ఇతరుల ఆధికసాయంతో పనిచేస్తున్న " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " సహాయం కోరింది. ఆర్థికసంక్షోభం 1980 మద్య కాలం వరకూ కొనసాగింది.ఫలితంగా మొదటి, మూడవ అతిపెద్ద కంపెనీలైన అల్పార్ట్, అల్కొయా మూతపడ్డాయి. రెండవ స్థానంలో ఉన్న అల్కాన్ సంస్థ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. రేనాల్డ్ జమైకా మైంస్ లిమిటెడ్, జమైకన్ ఇండస్ట్రీని వదిలింది.ఆర్ధికరంగంలో ప్రాముఖ్యత కలిగిన పర్యాటకరంగం క్షీణించింది.
జమైకా స్వతంత్రాన్ని ఆనందించినప్పటికీ 21వ శతాబ్దంలో స్వతంత్రం తరువాత ఎదురైన సమస్యలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. 2011లో నిర్వహించిన సర్వే 60% జమైకన్లు జమైకా తిరిగి బ్రిటిష్ టెర్రిటరీలో భాగంగా ఉంటే బాగుటుందని భావిస్తున్నారని తెలియజేసింది. దేశం ఎదుర్కొంటున్న సాంఘిక, పాలనా పరమైన సమస్యలే ఇందుకు ప్రధానకారణంగా ఉంది.[33][34]
వైశాల్యపరంగా జమైకా కరీబియన్ సముద్రంలో 3వ స్థానంలో ఉంది.[35] ఇది 17 నుండి 19 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో, 76 నుండి 79 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.ద్వీపాన్ని పర్వతభూభాగం (బ్లూ మౌంటెంస్) ఆధిక్యత చేస్తుంది. సముద్రతీరాలలో సన్నని మైదానాలు ఉన్నాయి.[36] రెండే ప్రధాన నగరాలున్న జమైకా దక్షిణ సముద్రతీరంలో కింగ్స్టన్ (రాజధాని నగరం) ప్రముఖ వాణిజ్యకేంద్రంగా ఉంది. రెండవది జమైకా ఉత్తరభూభాగంలో ఉన్న మంటెగో బే కరీబియన్ మహాసముద్రంలో ప్రముఖ పర్యాటకకేంద్రంగా ఉంది.అదనంగా పోర్ట్ మోర్, స్పెయిన్ టౌన్, మండేవిల్లె,, రిసార్ట్ పట్టణం ఆర్చో రియోస్, పోర్ట్ అంటానియో, నెగ్రిల్ పట్టణాలు ఉన్నాయి.[37] కింగ్స్టన్ నౌకాశ్రయం ప్రంపంచంలోని సహజనౌకాశ్రయాలలో 7వ స్థానంలో ఉంది.[38] 1872 లో ఇది రాజధాని నగరంగా చేయడానికి రూపొందించబడింది. పర్యాటక ఆకర్షణలలో సెయింట్ అన్న్లో ఉన్న డన్ నదీ జలపాతాలు, సెయింట్ ఎలిజబెత్‌లో ఉన్న వై.ఎస్. జలపాతాలు,పోర్ట్‌లాండ్‌లో ఉన్న బ్లూ లాగూన్ (సజీవంగా ఉన్న అగ్నిపర్వతం) ప్రధానంగా ఉన్నాయి. పోర్ట్ రాయల్ 1692లో సంభవించిన భూకంపానికి సాక్ష్యంగా ఉంది.[39][40][41][42]
హాట్, హ్యూమిడ్గా ఉండే జమైకా వాతావరణం ఉష్ణమండల వాతావరణంగా వర్గీకరించబడింది.[43] దక్షిణ తీరంలో ఉన్న లిగుయనియా మైదానం, పెడ్రొ మైదానం రెయిన్ షాడో కారణంగా వర్షాభావం కారణంగా పొడిగా ఉంటుంది. [44] జమైకా హరికేన్ బెల్టులో భాగంగా ఉన్న కారణంగా తరచుగా తుఫానులు సంభవిస్తుంటాయి.[45]
చార్లే తుఫాన్ (1951), గిల్బర్ట్ తుఫాన్ (1988)లో ద్విపాన్ని నేరుగా బాధించాయి. ఇవి బృహత్తర నష్టానికి, పలు మరణాలకు కారణంగా ఉన్నాయి. 2000లో ఇవాన్ తుఫాను 2007లో డీన్ తుఫాన్, గుస్టవ్ తుఫాన్ ద్వీపాన్ని తీవ్రంగా నష్టపరిచాయి.జమైకా జలభాగం, సముద్రతీర ప్రాంతాలు, డ్రై అండ్ వెట్ లైం స్టోన్ ఫారెస్ట్, నదీతీరప్రాంత వన్యప్రాంతాలు, చిత్తడి భూములు, గుహలు, నదులు, సముద్రపు గడ్డి, పగడపు దిబ్బలుతో కూడిన వైవిధ్యమైన భౌగోళిక స్థితులను కలిగి ఉంటుంది.అధికారులు సుసంపన్నమైన పర్యావరణను గుర్తించి కొన్ని సారవంతమైన వ్యవసాయభూభాగాలను కూడా సంరక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది.సంరక్షితప్రాంతాలలో కాక్‌పిట్ కంట్రీ, హెల్షైర్ హిల్స్, లిచ్‌ఫీల్డ్ ఫారెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి. 1992లో 15చ.కి.మీ. వైశాల్యంలో జమైకా మొదటి మారిన్ పార్క్ మాంటెగొ బేలో స్థాపించబడింది. 1999 లో పోర్ట్లాండ్ బైట్ సంరక్షిత ప్రాంతం రూపొందించబడింది.[46] తరువాత సంవత్సరం 300చ.మీ వైశాల్యంలో " బ్లూ అండ్ జాన్ క్రో మౌంటెంస్ నేషనల్ పార్క్ " రూపొందించబడిన వన్యప్రాంతాలు వేలాది వృక్షజాతులు, ఫెరన్, అరుదైన జంతువులకు ఆశ్రయం ఇస్తుంది.
ఉష్ణమండల ఉష్ణోగ్రతగా వర్గీకరించబడిన జమైకాలో వైవిధ్యమైన వృక్షాలు, జంతువులు ఉన్నాయి.గత కొన్ని శతాబ్ధాలలో జమైకా వృక్షజాతులలో మార్పులు సంభవించాయి. 1494లో స్పానిషుల ప్రవేశం వ్యవసాయక్షేత్రాలుగా మార్చబడిన కొంతభూమి మినహా మిగిలిన భూభాగమంతా అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. విదేశీ సెటిలర్లు భవన నిర్మాణం, నౌకానిర్మాణాల కొరకు టింబర్ ట్రీలను కొట్టివేసారు. ఫలితంగా మైదానాలు, సవన్నాలు, పర్వతసానువులు వృక్షరహితం అయ్యాయి. వ్యవసాయం కొరకు మరింత అరణ్యప్రాంతం చదును చేయబడింది. చెరకు,అరటి, నిమ్మజాతి చెట్లు సరికొత్తగా ద్వీపంలో ప్రవేశపెట్టబడ్డాయి. వర్షపాతం అధికంగా ఉన్న ప్రాంతాలలో వెదురు, ఫెరన్, ఎబోనీ, మహాగొనీ, రోస్వుడ్ మొదలైన వృక్షజాతులు ఉన్నాయి.దక్షిణ, నైరుతీ సముద్రతీర ప్రాంతాలలో కాక్టస్, ఎడారి మొక్కలు కనిపిస్తుంటాయి.పశ్చిమ, నైరుతీ ప్రాంతాలలో పెద్ద పశ్చిక మైదానాలు అక్కడక్కడా నిలిచిఉన్న చెట్లతో విస్తరించి ఉన్నాయి.జమైకన్ జంతుజాలంలో కరీబియన్ ప్రాంతజంతుజాలంతో ప్రపంచంలో మరెక్కడా కనిపించని మరికొన్ని అంతరించిపోతున్న జంతువులు ఉన్నాయి. ఇతర మహాసముద్ర ద్వీపాలలో మాదిరి గబ్బిలం వంటి క్షీరదాలు అధికంగా ఉన్నాయి.గబ్బిలాల జాతి కాకుండా ఇతర క్షీరదాలలో జమైకన్ హుటియా (కోనీ) ప్రధానమైనవి. కొత్తగా ప్రవేశపెట్టిన అడవిపందులు, చిన్న ఆసియా మంగూస్ కూడా సాధారణంగా కనిపిస్తుంటాయి.జమైకాలో 50 జాతుల సరీసృపాలు ఉన్నాయి. [47] అమెరికన్ క్రొకొడైల్ బ్లాక్ రివర్‌లో మాత్రమే కనిపిస్తుంటుంది. అనోల్, ఇగుయానా, పాములు వంటి సరీసృపాలు, జమైకన్ బొయా (ద్వీపాలలో అతిపెద్ద పాము) మొదలైనవి కాక్‌పిట్ ప్రాంతంలో సహజంగా కనిపిస్తుంటాయి. జమైకా స్థానిక 8 పాము జాతులు విషరహితమైనవి.[48] జమైకా స్థానిక జంతువులలో " జమైకన్ స్లైడర్ " అనబడే మంచినీటి తాబేలు ఒకటి. ఇది జమైకాలో, కేట్ ఐలాండ్, బహామా ద్వీపాలలో మాత్రమే కనిపిస్తుంది.అదనంగా అనేక కప్పజాతులు (ప్రత్యేకంగా ట్రీ ఫ్రాగ్స్) ఈద్వీపంలో సహజంగా కనిపిస్తుంటాయి.పక్షిజాతులు విస్తారంగా ఉంటాయి.స్థానిక ఉభయచరాలు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి.జమైకన్ టుడీ, డాక్టర్ బర్డ్ (జాతీయ పక్షి)విస్రారంగా పలు ఇతర పక్షులతో కనిపిస్తుంటాయి. జమైకన్ జలాలలో గుర్తించతగినన్ని ఉప్పునీటి చేపలు, మంచినీటి చేపలు కనిపిస్తుంటాయి.[49] ఉప్పు నీటి చేపలలో కింగ్ ఫిష్, జాక్, మాకెరెల్, వైటింగ్, బొనిటొ, ట్యూనా ప్రధానమైనవి.అప్పుడప్పుడూ మంచినీటిలో ప్రవేశించే చేపలలో స్నూక్, జ్యూఫిష్, మాంగ్రోవ్ స్నేపర్, ముల్లెట్ ప్రధానమైనవి. మంచినీటి చేపలలో లైవ్బియరర్, కిల్లిఫిష్, మంచినీటి గొబీలు, ది మౌంటెన్ ముల్లెట్, అమెరికన్ ఏల్ టిలపియా మొదలైన చేపలు అక్వాకల్చర్ కొరకు ఆఫ్రికా నుండి తీసుకుని రాబడ్డాయి. ఇవి సాధారణంగా కనిపిస్తుంటాయి.
ఇంజెక్ట్స్ జాతికి చెందిన కీటకాలు విస్తారంగా ఉంటాయి. వీటిలో ప్రపంచపు అతిపెద్ద సెంటిపెడె, అమెజానియన్ సెంటిపెడే, హొమెరస్ స్వాలోటియల్, ది వెస్టర్న్ హెమిస్ఫెరే లార్జెట్ సీతాకోక చిలుక ప్రధానమైనవి.
జమైకా దేశీయసంస్థలు, ప్రైవేట్ సంస్థలు సమానంగా భాగస్వామ్యం వహించే మిశ్రితమైన ఆర్థికవ్యవస్థను కలిగి ఉంది. జమైకా ఆర్థికరంగంలో వ్యవసాయం, గనులు, తయారీరంగం, పర్యాటకం, ఫైనాంషియల్,ఇంసూరెంస్ రంగాలు ఆధిక్యతను కలిగి ఉన్నాయి. పర్యాటకం, గనుల నుండి విదేశీమారకం అత్యధికంగా లభిస్తుంది. జమైకా ఆర్థిక వ్యవస్థలో సంగం సేవారంగసంబంధితమై ఉంది, జమైకా ఆదాయంలో సంగం పర్యాటకం వంటి సేవారంగాల నుండి లభిస్తుంది. జమైకాను వార్షికంగా దాదాపు 1.3 మిలియన్ల విదేశీ పర్యాటకులు సంసర్శిస్తున్నారని అంచనా.[50]
వైవిధ్యమైన ఫైనాషియల్ సంస్థల మద్దతుతో జమైకా 1980 నుండి నిర్మాణాత్మకమైన ఆర్థికసంస్కరణలు ఆరంభించింది. ప్రభుత్వం స్వేచ్ఛాయుతమైన ఆర్థికరంగానికి ఆహ్వానం పలికింది. ఎక్స్చేంజ్ నియంత్రణలను తొలగించడం, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్, పన్నుల మినహాయింపు వంటి చర్యలతో జమైకన్ కరెంసీ కేమబద్ధీకరణ చేయబడింది.విదేశీప్రత్యక్ష పెట్టుబడుల మీద నిబంధనలు సడలించింది.సంస్కరణల తరువాత పెద్దమొత్తంలో ప్రైవేటు పెట్టుబడులు అధికరించాయి. 1991లో జమైకా ద్రవ్యోల్భణం తగ్గించడానికి మైక్రో ఆర్థికక్రమబద్ధీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది.1991లో 80.2% ఉన్న ద్రవ్యోల్భణం 1998 నాటికి 7.9%నికి చేరుకుంది. 1997-1998లో 7.2% ఉన్న ద్రవ్యోల్భణం 1998-1999 నాటికి 6.2% నికి చేరుకుంది.జమైకా ప్రభుత్వం ద్రవ్యోల్భణం తగ్గించడానికి దృఢంగా నిర్ణయించుకుంది.
క్రమంగా సాగిన ఆర్థికాభివృద్ధి తరువాత 1985 నుండి 1995 మద్య జమైకా జి.డి.పి. 1.8% క్షీణించింది. 1996 నుండి 1997 మద్య జి.డి.పి. 2.4% క్షీణించింది. 1996 నుండి 1997 మద్య జి.డి.పి. క్షీణత ఫైనాంషియల్ రంగంలో గుర్తించతగిన సమస్యలకు దారితీసింది. 1997 లో ద్వీపం సంభవించిన తీవ్రమైన కరువు (70 సంవత్సరాల కాలం తరువాత సంభవించిన అతి తీవ్రమైన కరువు)వ్యవసాయౌత్పత్తులను పతనావస్థకు తీసుకువచ్చింది. 1997లో నామినల్ జి.డి.పి దాదాపు 6,198.9 మిలియన్ల అమెరికన్లు ఉంటుంది.
1997 లో దిగుమతులు కొంత అధికమైనప్పటికీ అధిక మొత్తంలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చిన కారణంగా విదేశీమారకం స్థిరంగా ఉంది. సమీపకాలంలో జమైకన్ ఆర్థికరంగం కోలుకున్నది. వ్యవసాయ ఉత్పత్తి 15.1% అభివృద్ధికి ప్రధానపాత్ర వహించింది. బాక్సిట్, అల్యూమినియా ఉత్పత్తి 5.5% అభివృద్ధి చెందింది. [51]
జమైకా బాక్సిట్ ఉత్పత్తిలో ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది.మొదటి నాలుగు స్థానాలలో ఆస్ట్రేలియా,చైనా,బ్రెజిల్, గయానా ఉన్నాయి.పెద్ద మొత్తంలో విదేశీమారకం తీసుకువస్తున్న పర్యాటకరంగం చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది. 1997 కంటే 1998 నాటికి పర్యాటకరంగం 8.5% అభివృద్ధి చెందింది. జమైకా వ్యవసాయరంగం నుండి చెరకు, అరటి, కాఫీ, రం, యాం ఎగుమతి చేయబడుతుంది.
జమైకాలో వైవిధ్యమైన పారిశ్రామిక, వాణిజ్య విధానాలను కలిగి ఉంది. అవియేషన్ పరిశ్రమ క్రమానుసారమైన సాధారణ విమానాల రాకపోకల వ్యవహారాలు (ప్రధానమైన మరమ్మత్తు మినహా) నిర్వహిస్తుంది.జమైకాలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, లైట్ తయారీ, మెటల్ ఫాబ్రికేషన్, మెటల్ రూఫింగ్, గృహాలంకార వస్తువుల తయారీ మొదలైన పరిశ్రమలు గణనీయంగా అభివృద్ధిచెందాయి. ఆహారం, ఆల్కహాల్ తయారీ, గాజుసామానుల తయారీ, డేటా ప్రొసెసింగ్, ప్రింటింగ్, పబ్లిషింగ్, బీమా సంస్థలు, సంగీతం, రికార్డింగ్, ఉన్నత విద్య నగరప్రాంతాలలో అభివృద్ధి చెందాయి. జమైకన్ నిర్మాణరంగం వృత్తిపరమైన సాంకేతిక నాణ్యత, అత్యుత్తమ మార్గదర్శకాలతో స్వయంసమృద్ధింగా కొనసాగుతుంది.[52] 2006లో జమైకా దృఢమైన ఆర్థికాభివృద్ధి సాధించింది. 2006 ద్రవ్యోల్భణం 6%, నిరుద్యోగం 8.9% నికి చేరింది. నామినల్ జి.డి.పి 2.9% అభివృద్ధి చెందింది.[53] ద్వీపం రవాణాసౌకర్యాలు, యుటిలిటీ ఇంఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందిన కారణంగా పర్యాటకం, గనులపరిశ్రమ, సేవారంగం అభివృద్ధిలో (3%) భాగస్వామ్యం వహిస్తున్నాయి.
2007 నుండి 2009 అంతర్జాతీయంగా సంభవించిన ఆర్థికసంక్షోభం జమైకా ఆర్థికరంగం మీద గణీనియమైన ప్రభావం చూపింది. 2010 జనవరి 14న ప్రభుత్వం ఋణాలను నిర్వహించడానికి " ది జమైకా డెబ్ట్ ఎక్స్చేంజ్ " ఏర్పాటు చేసింది. ది జమైకా డెబ్ట్ ఎక్స్చేంజ్ విజయవంతంగా ముగిసింది. [54] 2014 ఏప్రిల్‌లో జమైకా ప్రభుత్వం, చైనాలు ఆర్థికవ్యవహారాల ఒప్పందం మీద సంతకం చేసాయి.[55] ఈప్రణాళిక ముగిసిన తరువాత జమైకన్లకు ఆర్థికరంగంలో బహుళజాతి కంపినీలలో ఉపాధి అవకాశం లభించింది.[56]
2011లో సమీపకాల గణాంకాల ఆధారంగా జైకన్లు అత్యధికసంఖ్యలో నల్లజాతి వారుగా గుర్తించబడ్డారు.[57]
జమైకన్ నల్లజాతి ప్రజలలో చాలామంది ఆఫ్రికన్ లేక పాక్షింకంగా ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు (పశ్చిమ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వారు) ఉన్నారు. [58] అలాగే యురేపియన్లు ఉన్నారు,[59] ఆసియా [60] పలు ఆంగ్లోఫోన్ కరీబియన్ దేశాలలోలాగా మిశ్రితవర్ణ ఆఫ్రికన్లు తమను నల్లజాతి వారుగా పేర్కొంటారు. [ఆధారం చూపాలి]ఆసియన్లు సంఖ్యాపరంగా ద్వితీయస్థానంలో ఉన్నారు. వీరిలో ఇండో- జమైకన్, చైనీస్ జమైకన్లు ఉన్నారు.[57] వీరు 1838లో బానిసత్వం నిర్మూలించబడిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం చేత ఒప్పంద విధానంలో ద్వీపానికి తీసుకురాబడిన కూలీల సంతతికి చెందినవారు.
సమీపకాలంలో వలసలు అధికం అయ్యాయి. ప్రధానంగా చైనా, హైతీ, క్యూబా, కొలంబియా, లాటిన్ అమెరికన్ దేశాలకు అధికంగా వలసపోతుంటారు. జమైకాలో 20,000 లాటిన్ అమెరికన్లు నివసిస్తున్నారు.[ఆధారం చూపాలి] 7,000 అమెరికన్లు నివసిస్తున్నారు. [ఆధారం చూపాలి] అలాగే ఫస్ట్ జనరేషన్ అమెరికన్లు, బ్రిటిష్ ప్రజలు, కరీబియన్లు జమైకన్ పౌరులు నివసిస్తున్నారు. [61] జమైకలో 78.3% సబ్- షరాన్ ఆఫ్రికన్లు, 16% శ్వేతజాతి జమైకన్లు (యురేపియన్లు), 5.7% తూర్పు ఆసియన్లు ఉన్నారని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.[62]
జమైకన్లు రెండుభాషల ప్రజలుగా భావించబడుతుంటారు. ప్రజలలో రెండు భాషలు వాడుకలో ఉన్నాయి.[63] దేశంలో జమైకన్ ఇంగ్లీష్ అధికార భాషగా ఉంది. ఇది ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో, న్యాయవ్యవస్థలలో, మాధ్యమం, విద్యవిధానంలో వాడుకలో ఉంది. [64] ప్రధానంగా ఇంగ్లీష్ ఆధారిత క్రియోల్ (జమైకన్ పటోయిస్ లేక పాత్వా) వాడుకలో ఉంది. 2007 జమైకన్ లాగ్యుయేజ్ యూనిట్ సర్వే 17.1% జె.ఎస్.ఇ. ఒకే భాష వాడుకలో ఉన్న ప్రజలు, 36.5% పతాయిస్ ఒకే భాష వాడుకలో ఉన్న ప్రజలు, 46.4% ద్విభాషలు వాడుకగా ఉన్న ప్రజలు ఉన్నారని తెలియజేస్తుంది.ఆరంభకాల సర్వే 90% ద్విభాషా వాడుకరులు ఉన్నారని తెలియజేస్తుంది.[65] జమైకన్ విద్యావిధానంలో సమీపకాలంలో పటాయిస్ బోధనా భాషగా ప్రవేశపెట్టబడింది.[66] కొంత మంది జమైకన్లు " జమైకన్ సైన్ లాంగ్యుయేజ్ ", అమెరికన్ సైన్ లాంగ్యుయేజ్ " లేక స్థానికమైన " జమైకన్ కంట్రీ సైన్ లాంగ్యుయేజ్ "కొంచ్రి లాంగ్యుయేజ్ " భాషలు మాట్లాడుతుంటారు.[ఆధారం చూపాలి] జె.ఎస్.ఎల్, ఎ.ఎస్.ఎల్. వైవిధ్యమైన కారణాలతో రెండింటి స్థానంలో కొంచ్రి సైన్ భాష వాడుకగా మారింది.[ఆధారం చూపాలి]
పలు జమైకన్లు ఇతరదేశాలకు వలసపోతుంటారు. ప్రత్యేకంగా యునైటెడ్ కింగ్డం, యునైటెడ్ స్టేట్స్, చైనాలకు వలసలు కొనసాగుతుంటాయి.యునైడ్ స్టేట్స్కు వార్షికంగా 20,000 మంది జమైకన్లకు పర్మినెంట్ రెసిడెంస్ హోదా కల్పిస్తుంది.[67] విదేశాలలో నివసిస్తున్న జమైకన్లు " జమైకన్ డయాస్పోరా " అంటారు. కొంతమంది జమైకన్లు క్యూబాకు వలస పోతుంటారు.[68] జమైకన్ డయాస్పోరా ప్యూర్టో రికా, గయానా, బహామాస్ దేశాల డయాస్పోరాకు సమానంగా ఉంటుంది.2004 అంచనాల ఆధారంగా 2.5 మిలియన్ల జమైకన్లు విదేశాలలో నివసిస్తున్నారని భావిస్తున్నారు.[69] యునైటెడ్ కింగ్డంలో 8,00,000 జమైకన్లు నివసిస్తున్నారని అంచనా. జమైకన్లు అధికంగా 1950-1960 మద్య కాలంలో దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నసమయంలో యునైటెడ్ కింగ్డంకు వలస పోయారు.జమైకన్ ప్రజలునధికంగా పెద్ద నగరాలలో నివసిస్తుంటారు.[70] యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న జమైకన్లు అధికంగా న్యూయార్క్, బఫెల్లో,మయామి, అట్లాంటా, చికాగో,ఒర్లాండో, ఫ్లోరిడా,టంపా, ఫ్లోరిడా,వాషింగ్టన్, డి.సి., ఫిలడెల్ఫియా,కనెక్టికట్,ప్రావిడెంస్, లాస్ ఏంజలెస్ నగరాలలో నివసిస్తున్నారు. కెనడాలో జమైకన్లు అధికంగా టొరంటో స్వల్పంగా హామిల్టన్, ఒంటారియో, మాంట్రియల్,విన్నిపెగ్, వాంకోవర్ అటావా నగరాలలో నివసిస్తున్నారు.
జమైకా 1962లో స్వతంత్రం పొందాక 1,00,000 ప్రజలకు 3.9 హత్యలు జరిగాయి. ఇది ప్రపంచంలో అతి తక్కువ. 2009 నాటికి 1,00,000 మంది ప్రజలకు 62 హత్యలు జరిగాయి. ప్రంపంచంలో ఇది అత్యధికం.[71] ఐక్యరాజ్యసమితి అంచనాల ఆధారంగా ప్రపంచంలో హత్యల శాతం అధికంగా ఉన్న దేశాలలో జమైకా ప్రథమస్థానంలో ఉందని భావిస్తున్నారు. [72][73] జమైకాలోని కింగ్స్టన్ వంటి నగరాలలో నేరం, హింసాత్మకచర్యలు అధికంగా చోటుచేసుకున్నాయి.[74] [75][76][77] సమీపకాలంలో జమైకాలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2009లో దేశంలో 1,682 హత్యలు నమోదయ్యాయి. 2010లో 1,428 హత్యలు నమోదయ్యాయి. 2011 నుండి హత్యల సంఖ్య మరింత తగ్గింది.[78] 2012లో ది మినిస్టరీ అఫ్ నేషనల్ సెక్యూరిటీ 30 హత్యలు జరిగినట్లు తెలియజేసింది. [79]
చిన్నదేశమైన జమైకా బలమైన సంస్కృతి అంతర్జాతీయ గుర్తింపును పొందింది.సంగీతబాణీలలో రెగె, స్కా, మైంటో, రాక్స్టీడీ, డబ్, సమీపకాలంలో డాంషాల్, రాగ్గా ప్రధానమైనవి.ఇవి అన్ని ఈద్వీపంలో ప్రాముఖ్యత సంతరించుకున్న " అర్బన్ రికార్డింగ్ ఇండస్ట్రీ " నుండి రూపొందించబడ్డాయి. రెగ్గీ, స్కా నుండి అభివృద్ధి చేయబడిన పంక్ రాక్ బాణీ రూపొందించడంలో జమైకా ప్రధానపాత్ర వహించింది.రెగ్గీ సంగీతబాణి అమెరికన్ హిప్ - హాప్ సంగీతం మీద ప్రభావం చూపింది.సంగీతకారులు " ది నొటోరియస్ బి.ఐ.జి. , హీవీ డి జమైకన్ సంతతికి చెందిన వారు. అంతర్జాతీయంగా గుర్తించబడిన బాబ్‌మార్లే కూడా జమైకాకు చెందిన వాడే.
క్యూబాలో జన్మించి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన సాగీతకాలులలో మిల్లీ స్మాల్, లీ "స్క్రాచ్" పెర్రీ, గ్రెగొరీ ఐజాక్స్, హాఫ్ పింట్, ప్రోటేజె, పీటర్ టోష్, బన్నీ వైలర్, బిగ్ యూత్, జిమ్మీ క్లిఫ్, డెన్నిస్ బ్రౌన్, డెస్మొండ్ డెక్కర్, బేర్స్ హమ్మండ్, బీనీ మ్యాన్, శాగ్గీ, గ్రేస్ జోన్స్, షాబ్బా రాంక్స్, సూపర్ క్యాట్, బుజు బాటన్, సీన్ పాల్, ఐ వేన్, బౌంటీ కిల్లర్ ప్రధాన్యత కలిగి ఉన్నారు.జమైకా నుండి వచ్చిన బ్యాండ్స్‌లో బ్లాక్ ఉహుర్, థర్డ్ వరల్డ్ బ్యాండ్, ఇన్నర్ సర్కిల్ (రెగే బ్యాండ్), చాలిస్ రెగే బ్యాండ్, కల్చర్ (బ్యాండ్), ఫాబ్ ఫైవ్, మోర్గాన్ హెరిటేజ్ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. లండన్ జమైకన్ డయాస్పొరా ద్వారా జంగిల్ కళా ప్రక్రియ రూపొందించబడింది.న్యూయార్క్ నగరంలో రూపొందించబడిన " హిప్- హాప్ " సంగీతానికి నగరంలో నివసిస్తున్న జమైకన్ సముదాయ సభ్యులు మూలకర్తలుగా ఉన్నారు.
జమైకాలో నివసించిన జేంస్ బాండ్ నవలా రచయిత " ఇయాన్ ఫ్లెమింగ్ " తరచుగా ఈ ద్వీపాన్ని తన నవలా నేపథ్యానికి ఎంచుకున్నాడు.ఆయన వ్రాసిన " లివ్ అండ్ లెట్ డై ", డాక్టర్ నొ, ఫర్ యువర్ ఐ ఓన్లీ (చిన్న కథ), ది మాన్ విత్ గోల్డెన్ గన్, ఆక్టోపసీ అండ్ ది లివింగ్ డిలైట్స్ రచనలకు నేపథ్యం జమైకా నుండి ఎన్నిక చేయబడింది. అదనంగా కాసినో రాయలే నవలకు ముఖపత్రం జైకా ఆధారితంగా చిత్రించబడింది.డాక్టర్ నొ చలన చిత్రం చిత్రీకరణ జమైకాలో జరిగింది.
జర్నలిస్ట్, రచయిత హెచ్.జి. డీ లిస్సర్ (1878-1944) తన స్వదేశాన్ని తాను వ్రాసిన పలు నవలలకు నేపథ్యంగా స్వీకరించాడు.జమైకాలోని ఫిల్మౌత్ ప్రాంతంలో జన్మించిన డీ లిస్సర్ ఆరంభకాలంలో " జమైకా టైంస్ " రిపోర్టర్‌గా పనిచేసాడు. 1920లో మాగజిన్ " ప్లాంటర్స్ పంచ్ " ప్రారంభించాడు.ఆయన వ్రాసిన నవల " ది వైట్ వైట్ విచ్ ఆఫ్ రోస్ హాల్ " అత్యధికంగా గుర్తింపు పొందిన నవలలో ఒకటిగా ప్రత్యేకత సంతరించుకుంది. ఆయన " జమైకన్ ప్రెస్ అసోసియేషన్ " గౌరవాధ్యక్షుడుగా ప్రతిపాదించబడ్డాడు. ఆయన తన వృత్తి జీవితమంతా జమైకన్ చక్కెర పరిశ్రమ అభివృద్ధి కొరకు పనిచేసాడు. నవలా రచయిత మర్లాన్ జేంస్ (1970) వ్రాసిన జాన్ క్రో'స్ డెవిల్ (2005), ది బుక్ ఆఫ్ నైట్ వుమన్ (2009), ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్ (2014) లో ప్రచురించబడ్డాయి. ఆయన 2015లో " మాన్ బుకర్ ప్రైజ్ " అందుకున్నాడు.
చలనచిత్ర నటుడు " ఎర్రొల్ ఫ్లైన్ " తన మూడవ భార్య " పాట్రిస్ వైమోర్ "తో 1950లో పోర్ట్ అంటానియోలో నివసించాడు. ఆయన ఈప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందడానికి సహకరించాడు. ఆయన పర్యటనలో భాగంగా నదిమీద వెదురు తెప్పల ప్రయాణానికి ప్రాబల్యత తీసుకుని వచ్చాడు.[80] జమైకా చలనచిత్ర రంగచరిత్ర 1960 లో ఆరంభం అయింది.1970లో జమైకన్ యువత అందించిన సంగీతప్రధానమైన క్రైం చిత్రంలో జిమ్మీ క్లిఫ్ మానసికంగా విరక్తిచెందిన రెగ్గీ సంగీతకారుడుగా నటించాడు. టాం క్రూసీ నటించిన అమెరికన్ చలన చిత్రం కాక్టెయిల్ (1988) జమైకాను అందంగా చిత్రీకరించిన చిత్రంగా ప్రశంసించబడుతుంది.మరొక జమైకన్ ఆధారిత ప్రముఖచిత్రం 1993 డిస్నీ కామెడీ చిత్రం " కూల్ రన్నింగ్స్ " ఒకటి.ఇది వాస్తవ సంఘటన ఆధారంగా చిత్రీకరించిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకుంది.
జమైకాలో ఆహారాలలో " జమైకన్ జెర్క్ స్పైస్ " అత్యధికంగా ప్రజాదరణ కలిగి ఉంది.రెడ్ స్ట్రైప్ బీర్, జమైకన్ బ్లూ మౌంటెన్ కాఫీ సంస్థలు జమైకాలో ఆరంభించబడ్డాయి.
(From the Jamaica Information Service)[81]
జమైకా జనజీవితంలో క్రీడలు ప్రధానభాగంగా ఉన్నాయి. ద్వీపంలోని అథ్లెట్లు చూపుతున్న ప్రతిభాపాటవాలు ఇంత చిన్న దేశం నుండి ఎదురుచూతున్న దానికంటే అత్యధికంగా ఉన్నాయి.[82] జమైకాలో ప్రధాన ఆదరణ కలిగిన క్రీడ క్రికెట్. అంతర్జాతీయ క్రీడారంగంలో " జమైకన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథెట్లు " విశేష ప్రతిభ చూపుతున్నారు. [82][83]
జమైకా ప్రంపంచలో అత్యంత ప్రఖ్యాతి కలిగిన క్రికెటర్లైన జార్జి హెడ్లీ, కోర్ట్నీ వాల్ష్ , మైకేల్ హోల్డింగ్ వంటి క్రీడాకారులను తయారు చేసింది.[84] జమైకా 2007 క్రికెట్ వరల్డ్ కప్ క్రీడల వేదికలలో ఒక వేదికగా ఉంది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో పాల్గొంటున్న క్రికెట్ టీంలలో వెస్ట్ ఇండీస్ ఒకటి. " ఇంటర్నేషనల్ క్రికెట్ కౌంసిల్ " లో పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్న 10 క్రికెట్ టీం లలో వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం ఒకటి.[85] " ది జమైకన్ నేషనల్ క్రికెట్ టీం " ప్రాంతీయంగా పోటీచేస్తూ అలాగే వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీంలో భాగస్వామ్యం చేస్తూ అతర్జాతీయ క్రికెట్ క్రీడలలో పాల్గొంటున్నారు.[86][87] జమైకాలో గుర్తింపుకలిగిన బ్యాట్స్‌మన్ " క్రిస్ గేలే " ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ టీం తరఫున క్రీడలలో పాల్గొంటున్నాడు. జమైకాకు స్వతంత్రం లభించినప్పటి నుండి స్థిరంగా ప్రపంచస్థాయిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను అందిస్తూ ఉంది.[82] జమైకాలో అతి చిన్నవయసు నుండి అథ్లెట్ శిక్షణ అందించబడుతుంది. జమైకాలో హైస్కూల్ స్థాయి నుండి అథ్లెట్లకు కఠిన శిక్షణ అందిస్తూ అంతర్జాతీయ ప్రతిభ చూపగలిగిన క్రీడాకారులను అందిస్తుంది. వీరు వి.ఎం.బి.ఎస్. గరల్స్, బాయ్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్ పాల్గొంటున్నారు అలాగే పెన్ ర్యాలీస్ వంటి సమావేశాలలో పాల్గొంటున్నారు.జమైకాలో ఆరంభకాల అథ్లెట్లకు, జాతీయ స్థాయి అథ్లెట్లకు ప్రెస్ కరేజ్ ఉండకపోవడం సాధారణం. క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడలలో ప్రతిభ చూపిన తరువాత మాత్రమే ప్రెస్ కవరేజ్ ఉంటుంది.
గత ఆరు దశాబ్ధాలుగా జమైకా డజన్ల కొద్దీ స్ప్రింటర్లను ఉత్పత్తి చేసింది. వీరు ఒలింపిక్ క్రీడలు, వరల్డ్ చాంపియన్ యుసెయిన్ బోల్ట్ క్రీడలలో పాల్గొని 100మీ పురుషుల పోటీలో, 200మీ పురుషుల పోటీలలో ప్రపంచ రికార్డ్ స్థాపించారు.ఇతర గుర్తింపు పొందిన స్ప్రింటర్లలో ఆర్థర్ వింట్ (మొదటి ఒలింపిక్ బంగారుపతం సాధించిన క్రీడాకారుడు), డోనాల్డ్ క్వార్రీ, ఎలెయిన్ థాంప్సన్ (100మీ, 200మీ ఒలింపిక్ చాంపియన్, 200మీ ప్రపంచ రికార్డ్ స్థాపించిన క్రీడాకారుడు), రాయ్ అంథొనీ బ్రిడ్జ్ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యుడు), మెర్లెంస్ ఒట్టె, డెల్లొరీన్ ఎన్నిస్ - లండన్, షెల్లీ - అన్న్ ఫ్రాసర్ (ఒలింపిక్ క్రీడాకారుడు, 100 మీ పోటీలో రెండు మార్లు చాంపియన్‌షిప్ సాధించిన క్రీడాకారుడు)ఉన్నారు. కెర్రాన్ స్టీఈవర్ట్, అలీన్ బెయిలీ, జూలియట్ కథ్బర్ట్ (మూడు మార్లు ఒలింపిక్ పతకం సాధించిన క్రీడాకారిణి, వెరోనికా కేంప్బెల్- బ్రౌన్, షెరోన్ సింప్సన్, బ్రిగిట్టి ఫాస్టర్- హిల్టన్, యోహాన్ ద్లేక్, హెర్బ్ మెకెన్లె, జార్జ్ రోడెన్ (ఒలింపిక్ బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు)డియాన్ హెమ్మింగ్స్ (ఒలింపిక్స్ బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు)అసజా పౌవెల్ (100మీ ప్రపంచ రికార్డు స్థాపించిన క్రీడాకారుడు, 100మీ ఒలింపిక్ ఫైనలిస్ట్, 2008లో బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు.
జమైకా ట్రివోర్ బెర్బిక్, మైక్ మెకల్లం వంటి ప్రంపంచ స్థాయి అమెచ్యూర్, ప్రొఫెషనల్ బాక్సర్లను అందించింది.మొదటితరం జమైకన్ అథ్లెట్లు అనర్జాతీయంగా గణీయమైన ప్రతిభను ప్రదర్శించడం కొనసాగిస్తున్నారు. బ్రిటిష్‌లోని మొదటి 10స్థానాలలో లాయ్డ్ హనీఘన్, క్రిస్ యుబ్యాంక్, అడ్లీ హరిసన్, డేవిడ్ హే, లెనాక్స్ లూయిస్, ఫ్రాంక్ బ్రూనొ మొదలైన బాక్సర్లు జమైకాలో పుట్టిన వారు లేక జమైకన్ తల్లితండ్రులకు పుట్టిన వారై ఉన్నారు.
అసోసియేషన్ ఫుట్‌బాల్, హార్స్ - రేసింగ్ (గుర్రం పందాలు) జమైకాలో ఆదరణక్రీడలుగా ఉన్నాయి. " ది జమైకా నేషనల్ ఫుట్‌బాల్ టీం " 1998 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ పోటీలో పాల్గొనడానికి అర్హత సాధించింది." ది జమైకన్ నేషనల్ బేస్‌బాల్ టీం " గతంలో వరుసగా వింటర్ ఒలింపిక్ క్రీడలలో గుర్తింపు పొందిన పలు టీంలతో పోటీచేసింది. చెస్, బాస్కెట్‌బాల్ జమైకా అంతటా ఆడబడుతూ ఉంది. ఈక్రీడలకు జమైకా చెస్ ఫెడరేషన్, ది జమైకా బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ మద్దతు ఇస్తున్నాయి. నెట్‌బాల్ ద్వీపంలో చాలా ఆదరణ కలిగిన క్రీడలలో ఒకటిగా ఉంది. ది జమైకా నేషనల్ నెట్‌బాల్ టీం (ది సంషైన్ గరల్స్) స్థిరంగా ప్రపంచ అతున్నత 5 టీంలలో ఒకటిగా గుర్తించబడుతూ ఉంది.[88] జమైకన్ " ది జమైకా నేషనల్ ర్గ్బీ లీగ్ టీం " క్రీడాకారులు యు.కె. ప్రొఫెషనల్, సెమీ ప్రొఫెషన్ల్ క్రీడలలో పాల్గొంటున్నారు.[89] జమైకా లోని విశ్వవిద్యాలయాలు, హై స్కూల్ యాజమాన్యం రగ్బీ క్రీడలకు ప్రోత్సాహం అందిస్తూ అభివృద్ధి చేస్తున్నాయి.[90][91] జమైకాలో రగ్బీ పోటీలలో " జె.ఆర్.ఎల్.ఎ. చాంపియన్ షిప్ " పోటీలు ప్రధానమైనవి.[92] జమైకాలోని " ది హరికెన్ రగ్బీ టీం " (ప్రొఫెషనల్ టీం) యు.ఎస్.ఎ. రగ్బీ క్రీడలలో పాల్గొంటుంటున్నది. 2011లో ఇ.ఎస్.పి.ఎన్. ఆధారంగా అత్యధికంగా వేతనం అందుకుంటున్న జమైకన్ ప్రొఫెషనల్ క్రీడాకారులలో " జస్టిన్ మాస్టర్సన్ " ఒకరు. [93]
బానిసత్వం నిర్మూలించబడిన తరువాత జమైకాలో సాధారణ ప్రజలకోసం సరికొత్త విద్యావిధానం ప్రవేశపెట్టబడింది.బానిసత్వ నిర్మూలనకు ముందు ద్వీపంలో ప్రాంతీయవాసులకు కొన్ని పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. చాలామంది నాణ్యమైన విద్య కొరకు తమ పిల్లలను ఇంగ్లాండ్‌కు తీసుకుని వచ్చారు. బానిసత్వ నిర్మూలన తరువాత " ది వెస్ట్ ఇండియన్ కమీషన్ " ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయడానికి నిధిని మంజూరు చేసింది. వీటిలో చాలా పాఠశాలలను చర్చీలు స్థాపించాయి.[94]
ఆధునిక జమైకన్ పాఠశాలల వివరణ:-
అదనంగా జమైకాలో పలు కమ్యూనిటీ, టీచర్ ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి.
జమైకాలో ప్రాథమిక విద్య ఉచితంగా అందించబడుతుంది. పైచదువులు చదువుకోవడానికి తగినంత ధనం లేని వారికి " హ్యూమన్ ఎప్లాయ్మెంట్ అండ్ రిసౌర్స్ ట్రైనింగ్ - నేషనల్ ట్రైనింగ్ " ప్రోగ్రాం ద్వారా ధనసహాయం అందించబడుతుంది. [95] ఇది దేశంలోని పనిచేసే వయసున్న పౌరులందరికీ సహాయం అందిస్తుంది. [96] అలాగే యూనివర్శిటీలు స్కాలర్షిప్పులు అందిస్తాయి.ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులకు స్పానిష్ బోధించబడుతుంది.జమైకాలోని విద్యావంతులలో 40%-45% వరకు స్పానిష్ తెలిసినవారు ఉన్నారు.
జమైకా రవాణారంగంలో రహదారులు, రైల్వే, అవియేషన్ భాగంగా ఉన్నాయి. ద్వీపాంతర్గత రవాణాకు రహదారులు వెన్నెముకగా ఉన్నాయి.
జమైకన్ రహదారుల మొత్తం పొడవు 21,000కి.మీ.ఇందులో 15,000 పొడవైన రహదారులు పేవ్మెంట్ చేయబడి ఉన్నాయి.[1] 1990 నుండి జమైకా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో సహకారపద్ధతిలో భాస్వామ్యం వహిస్తూ యుద్ధప్రతిపాదికన ఇఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ప్రణాళికను చేపట్టింది.ఫ్రీవేస్ నిర్మాణం కూడా ఈప్రణాళికలో భాగంగా ఉన్నాయి.ఈప్రణాళికలో భాగంగా 33 కి.మీ పొడవైన ఫ్రీ వే నిర్మాణం పూర్తి అయింది.
జమైకాలో ఒకప్పుడు రైలుమార్గాలకు ఉన్న ప్రధాన్యత ఇప్పుడు లేదు.ప్రధాన రవాణాకొరకు రైలు మార్గాల స్థానంలో ప్రధాన్యత రహదారులకు మార్చబడింది. 272కి.మీ పొడవైన రైలుమార్గం ఉన్న జమైకాలో 57కి.మీ పొడవైన రైలుమార్గం మాత్రమే ఉపయోగంలో ఉంది. ప్రస్తుతం రైలుమార్గాలు బాక్సైట్ రవాణాకు ఉపయోగించబడుతుంది.[1] 2011 ఏప్రిల్ 13న మే పెన్ నుండి స్పానిష్ టౌన్ మద్య పరిమితమైన పాసింజర్ సేవలను తిరిగి ప్రారంభించారు.
జమైకాలో ఎయిర్పోర్ట్ టెర్మినల్, పొడవైన రన్‌వే, మూడు ఆధునిక సౌకర్యాలు కలిగిన అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. పెద్ద జెట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ ట్రావెల్ కొరకు ఉపయోగించే నేవిగేషనల్ ఎక్విప్మెంట్ అవసరం ఉంది.జమైకాలోని కింగ్స్టన్ నగరంలో " నార్మన్ మాన్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్,బాస్కోడెల్లో " ఇయాన్ ఫ్లెమింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " , రిసార్ట్ సిటీ ఆఫ్ మాంటెగొలో ద్వీపంలో అతి పెద్దది , అతి రద్దీ అయినది అయిన " సర్ డోనాల్డ్ సంగ్స్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " ఉన్నాయి.మాన్లే , సంగ్స్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లలో నేషనల్ ఎయిర్‌లైన్, ఎయిర్ జమైకాలు ఉన్నాయి. అదనంగా జమైకాలో లోకల్ కమ్యూటర్ ఎయిర్ పోర్ట్‌లు టిన్సన్ పెన్ ఎయిరొడోం(కింగ్సృఅన్), పోర్ట్ ఆంటోనియో , నెగ్రిల్ ఇక్కడ అంతర్జాతీయ విమానాలు మాత్రమే సేవలందిస్తాయి. పలు ఇతర స్మాల్, రూరల్ సెంటర్లు చక్కెర , బాక్సైట్ రంగాలకు చెందిన ప్రైవేట్ రంగానికి సేవలందిస్తున్నాయి.
జమైకా కరీబియన్ సముద్రంలో పానామా కెనాల్ షిప్పిం లైన్లో ఉండడం , ఉత్తర అమెరికా అతి పెద్ద మార్కెట్లకు , అభివృద్ధి చెందుతున్న లాటిన్ అమెరికా దేశాల మార్కెట్లకు సమీపంలో ఉండడం కారణంగా జమైకా అత్యధికంగా కంటెయినర్ రాకపోకలను అందుకుంటున్నది.ప్రస్తుతం ఉన్న రద్దీని , భవిస్యత్తులో జరుగనున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచి సమీపకాలంలో కింగ్‌స్టన్‌లో ఉన్న కంటైనర్ టెర్మినల్‌ను బృహత్తర విస్తరణ చేయడానికి చర్యలు తీసుకొనబడ్డాయి. [97] మాంటెగో బేలోని మాంటెగొ ఫ్రీ పోర్ట్ నుండి కూడా వైవిద్యమైన కార్గో రవాణా నిర్వహించబడుతుంది. ఇక్కడ నుండి ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేయబడుతున్నాయి.
జమైకాలో అదనంగా పోర్ట్ ఎస్క్వివెల్ (సెయింట్ కాథరిన్), రాకీ పాయింట్ (క్లారెండన్), పోర్ట్ కైసర్(సెయింట్ ఎలిజబెత్), పోర్ట్ రోడెస్ (డిస్కవరీ బే), రేనాల్డ్ పియర్ (ఒచో రియోస్) , బౌండ్బ్రోక్ పోర్ట్ (పోర్ట్ అంటానియో)లలో చిన్న చిన్న నౌకాశ్రయాలు ఉన్నాయి.నౌకలరాకపోకలకు సహాయంగా జమైకా 9 లైట్ హౌసులను నిర్మించింది.
జమైకా విద్యుత్తు ఉత్పత్తి కొరకు పెట్రోలియం దిగుమతి చేసుకుంటున్నది.[1] ఆయిల్ కొరకు పలు పరిశోధనలు జరిగినప్పటికీ ప్రయోజనకరమైన ఫలితాలు లభించలేదు.[98] జమైకాకు అవసరమైన ఆయిల్ , డీసెల్ను మెక్సికో , వెనుజులా నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఓల్డ్ హార్బర్లో ఉన్న జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.ది హంట్స్ బే పవర్ స్టేషన్, ది బొక్యూ పవర్ స్టేషన్, ది రాక్‌ఫోర్ట్ పవర్ స్టేషన్ , వైట్ రివర్, రియో బ్యూనొ, మొరాంట్ నది, బ్లాక్ రివర్(మగ్గోటీ) , రోరింగ్ నది జలాల ఆధారంగా పలు చిన్న హైడ్రాలిక్ ప్లాంట్స్ నిర్వహించబడుతున్నాయి.[99] పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ జమైకాకు స్వంతమైన ఒక విండ్ ఫాం ఉంది. ఇది మాంచెస్టర్‌లోని విగ్టన్లో స్థాపించబడింది.[100] జమైకా 1980 నుండి 20కి.వాట్ల సామర్ధ్యం కలిగిన " స్లోపోక్-2 న్యూక్లియర్ రియాక్టర్ " ను విజయవంతంగా నిర్వహిస్తుంది.అయినప్పటికీ ప్రస్తుతం న్యూక్లియర్ ప్లాంటును విస్తరించే ప్రణాళికలు చేపట్టలేదు.[101] జమైకా విద్యుత్తు ఉపయోగానికి దినసరి దాదాపు 80,000 బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటున్నది.[98] రహదారి రవాణా కొరకు 20% ఫ్యూయల్ ఉపయోగించబడుతుండగా బాక్సైట్ పరిశ్రమలకు, విద్యుత్తు ఉత్పత్తి , అవియేషన్ కొరకు మిగిలిన ఫ్యూయల్ ఉపయోగించబడుతుంది.30,000 బ్యారెల్స్ క్రూడ్ దిగుమతులు వివిధ మోటర్ వాహనాలకు అందించబడుతుంది , అస్ఫల్ కింగ్స్టన్లోని పెట్రోలియం రిఫైనరీకి తరలించబడుతుంది.[102] జమైకా విస్తారంగా డ్రింకింగ్ ఆల్కహాల్ (5% నీటిని ఉపయోగిస్తుంది) తయారుచేస్తుంది. ఇది అధికంగా మద్యం తాయారీకి ఉపయోగపడుతుంది. [103]
నీటి సరఫరా , మురుగునీటి నిర్వహణలో నీటివనరుల అభివృద్ధి భాగంగా ఉంది. మురుగునీటి సౌకర్యాలు 80% పూర్తిచేయబడ్డాయి. ఇది గ్రామీణ పేదలను అధికంగా బాధిస్తుంది. ప్రధానంగా గుడిసెలలో అనారోగ్యపరిస్థితులలో నీటికారణంగా వ్యాపించగల వ్యాధుల ప్రమాదం అధికంగా కలిగిన ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజను అధికంగా బాధిస్తుంది. 1990-2004 మద్య నీటి సరఫరా , మురుగునీటి వసతులను అధికం చేయడానికి దాతల నుండి లభిస్తున్న ధనసాహాయంతో అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ 1% నీటిసరఫరా , 5% మురుగునీటి నిర్వహణా మాత్రమే అభివృద్ధి చెందాయి.నీటి సరఫరా , మురుగునీటి నిర్వహణ బాద్యతలను " మినిస్టరీ ఆఫ్ వాటర్ అండ్ హౌసింగ్ " వహిస్తుంది. ప్రధానంగా నేషనల్ వాటర్ కమీషన్ నీటిసరఫరా అందిస్తుంది.
జమైకా పూర్తిగా " డిజిటల్ టెలిఫోన్ కమ్యూనికేషన్ సిస్టం " కలిగి ఉంది. ద్వీపంలో 95% మొబైల్ ఫోంస్ ఉన్నాయి.[104] జమైకాలో ఫ్లో జమైకా (లైం, మొబైల్ అండ్ కేబుల్ అండ్ వైర్లెస్ జమైకా , డిజిటల్ జమైకా సంస్థలు మిలియన్ల సంఖ్యలో నెట్వర్క్ కనెక్షన్లు , విస్తరణ సేవలు అందిస్తున్నాయి. 2001లో " ది న్యూయస్ట్ ఆపరేటర్ డిజీసెల్ " సంస్థకు అనుమతి మంజూరు చేయబడింది.[105] రెండు ఆపరేటర్లు ద్వీపమంతటా సమాచారసేవలు అందిస్తున్నాయి.[106] కొత్తగా ప్రవేశించిన " కొలంబస్ కమ్యూనికేషంస్ " కొత్తగా " సబ్ మెరీన్ " కేబుల్ ద్వారా జమైకాను యునైటెడ్ స్టేట్స్తో అనుసంధానం చేస్తుంది. న్యూ కేబుల్ సేవలను అభివృద్ధి చేసి జమైకాను మిగిలిన ప్రపంచంతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తుంది.[107] ఫ్లో జమైకాలో ఒక మిలియన్ వాడుకరులు ఉన్నారు.[108] మొదటి స్థానంలో ఉన్న డిజిసెల్ సంస్థకు 2 మిలియన్ల వాడుకరులు ఉన్నారు.2010లో డిజిసెల్ బ్రాండ్ బ్యాండ్ సేవలు ఆరంభించింది.[109]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.