![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f2/Flag_of_Costa_Rica.svg/langte-640px-Flag_of_Costa_Rica.svg.png&w=640&q=50)
కోస్టారీకా
From Wikipedia, the free encyclopedia
కోస్టారీకా (ఆంగ్లం : Costa Rica) (/ˌkɒstə ˈriːkə/ ( listen); Spanish: [ˈkosta ˈrika]; literally meaning "Rich Coast"), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ కోస్టారీకా, (స్పానిష్: [República de Costa Rica] Error: {{Lang}}: text has italic markup (help)), ఇదొక మధ్య అమెరికా లేదా లాటిన్ అమెరికా దేశం. దీని ఉత్తరసరిహద్దులో నికరాగ్వా, తూర్పు, ఆగ్నేయసరిహద్దులో పనామా, పశ్చిమసరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం, తూర్పు సరిహద్దులో కరీబియన్ సముద్రం, కొకోస్ ద్వీపం దక్షిణంలో ఈక్వెడార్ ఉన్నాయి. సేన్ జోసే దీని రాజధాని.[2] దేశజనసంఖ్య 4.5మిలియన్లు. వీరిలో 4వ వంతు ప్రజలు రాజధాని నగరం, దేశంలోని అతిపెద్ద నగరమైన శాంజోస్ మహానగరప్రాంతాలలో నివసిస్తున్నారు.
16వ శతాబ్దంలో స్పెయిన్ ఈప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని పాలించడానికి పూర్వం ఈ ప్రాంతంలో స్థానికజాతులకు చెందిన ప్రజలు అక్కడక్కడా నివసిస్తూ ఉండేవారు.
స్వతంత్రం లభించడానికి ముందు ఈప్రాంతం స్వల్పకాలం ఉన్న " ఫస్ట్ మెక్సికన్ ఎంపైర్ "లో భాగంగా ఉంది. యినైటెడ్ ప్రొవింసెస్ ఆఫ్ సెంట్రల్ అమెరికా సభ్యత్వం పొందిన తరువాత 1847లో కోస్టారికా సార్వభౌమ రాజ్యంగా ప్రకటించబడింది.అప్పటి నుండి అత్యంత స్థిరమైన, సమృద్ధమైన , అభివృద్ధిపధంలో నడుస్తున్న లాటిన్ అమెరికన్ దేశాలలో కోస్టారికా నిలిచి ఉంది.కోస్టారికా అంతర్యుద్ధం తరువాత 1949లో కోస్టారికా సైన్యాన్ని శాశ్వతంగా రద్దుచేసి సైన్యరహితదేశాలలో ఒకటిగా మారింది.[3][4][5] కోస్టారికా " ఆర్గనజేషన్ ఇంటర్నేషనీ డీ లా ఫ్రాంకోఫోనీ " పర్యవేక్షణ సంభ్యత్వదేశంగా ఉంది. కోస్టారికా " హ్యూమన్ డెవెలెప్మెంటు ఇండెక్స్ "లో 69వ స్థానంలో ఉంది.[6] కోస్టారికా " యునైటెడ్ నేషంస్ డెవెలెప్మెంటు ప్రోగ్రాం " పర్యవేక్షణలో ఉంది. ఒకే ఆదాయ స్థాయిలో ఉన్న దేశాలన్నింటిలో మానవాభివృద్ధి కొరకు వ్యయం చేస్తున్న దేశాలలో కోస్టారికా అత్యున్నత స్థానంలో ఉంది.[7] అతివేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టారికా ఆర్థికరంగం గతంలో వ్యవసాయ ఆదాయం మీద మాత్రమే ఆధారపడి ఉన్నా ఆర్థికరంగం ప్రస్తుతం ఫైనాంస్, ఔషధాల తయారీ , ఎకోపర్యాటకం మీద కేంద్రీకృతమై ఉంది.కోస్టారికా [8] 2016 ఎంవిరాన్మెంటు పర్ఫార్మెంస్ ఇండెక్స్ ఆధారంగా పర్యావరణ పరిరక్షణలో కోస్టారికా ప్రపంచంలో 42వ స్థానంలో ఉంది.
[9] న్యూ ఎకనమిక్స్ ఫౌండేషంస్ (ఎన్.ఇ.ఎఫ్), హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో కోస్టారికా బెస్ట్ పర్ఫార్మింగ్ దేశంగా గుర్తించబడుతూ ఉంది.[10][11] 2009లో ఎన్.ఇ.ఎఫ్ కోస్టారికాను పచ్చని దేశం (గ్రీనెస్ట్ కంట్రీ) గా పేర్కొన్నది.[12] 2021 నాటికి కోస్టారికా " కార్బన్ న్యూట్రల్ కంట్రీగా " ఉండాలని అధికారికంగా ప్రణాళిక రూపొందించింది.[13][14][15] 2012 లో
వినోదం కొరకు సాంగించే వేటను నిషేధించి ఇలా నిషేధం విధించిన మొదటి అమెరికన్ దేశంగా కోస్టారికా మారింది.[16][17]
రిపబ్లికా డె కోస్టారికా కోస్టా రీకా గణతంత్రం |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
జాతీయగీతం |
||||||
![]() |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | San José 9°55′N 84°4′W | |||||
అధికార భాషలు | స్పానిష్ | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Mekatelyu | |||||
జాతులు | 94% European and en:Mestizo 3.0% West African 1.0% en:Amerindian 1.0% Chinese 1.0% Other |
|||||
ప్రజానామము | Costa Rican | |||||
ప్రభుత్వం | en:Constitutional democracy (Presidential en:republic) |
|||||
- | President | en:Carlos Alvarado (PLN) | ||||
- | en:Vice President | unoccupied | ||||
en:Independence | from Spain (via Guatemala) | |||||
- | Declared | September 14, 1821 | ||||
- | Recognized by Spain | May 10, 1850 | ||||
- | from the UPCA | 1838 | ||||
- | జలాలు (%) | 0.7 | ||||
జనాభా | ||||||
- | July 2009 అంచనా | 4,253,877 (119th) | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $48.741 billion[1] | ||||
- | తలసరి | $10,752[1] | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $29.828 billion[1] | ||||
- | తలసరి | $6,580[1] | ||||
జినీ? (2001) | 49.9 (high) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) | ![]() |
|||||
కరెన్సీ | en:Costa Rican colón (CRC ) |
|||||
కాలాంశం | (UTC-6) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | en:.cr | |||||
కాలింగ్ కోడ్ | +en:+506 |