మధ్య అమెరికా దేశం From Wikipedia, the free encyclopedia
" నికరాగ్వా " (/ˌnɪkəˈrɑːɡwəˌ -ˈræ-ˌ -ɡjuə/ ( listen); Spanish: [nikaˈɾaɣwa]), అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ నికరాగ్వా " (మూస:Audio-es), మద్య అమెరికా ఇస్థంస్లో అతిపెద్ద దేశంగా గుర్తించబడుతుంది. దేశ ఉత్తర సరిహద్దులో హండూరాస్, తూర్పు సరిహద్దులో కరీబియన్ సముద్రం, దక్షిణ సరిహద్దులో కోస్టారికా, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. నికరాగ్వా రాజధాని నగరం మానాగువా దేశంలో అతిపెద్ద నగరంగా, మద్య అమెరికా నగరాలలో మూడవ పెద్ద నగరంగా గుర్తించబడుతుంది. వివిధ సంప్రదాయాలకు చెందిన 6 మిలియన్ల ప్రజలలో స్థానికజాతి ప్రజలు, యురేపియన్లు, ఆఫ్రికన్లు, ఆసియన్లు ఉన్నారు. స్పానిష్ ప్రధాన భాషగా ఉంది. మస్కిటో కోస్ట్ (ది ఈస్టర్న్ కోస్ట్) ఉన్న స్థానికజాతి ప్రజలకు వారి స్వంత భాషలు వాడుకలో ఉన్నాయి.16వ శతాబ్దంలో ఈ ప్రాంతం స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా మారింది. 1821లో నికరాగ్వాకు స్పెయిన్ నుండి స్వతంత్రం లభించింది. స్వతంత్రం లభించినప్పటి నుండి నికరాగ్వాలో రాజకీయ అశాంతి కొనసాగింది. నియంతృత్వ పాలన, ఆర్థిక సంక్షోభం 1960 -1970 మద్య నికరాగ్వా విప్లవానికి దారితీసాయి. నికరాగ్వా ఒక రిప్రెజెంటేటివ్ రిపబ్లిక్. మిశ్రిత సాంకృతి వైవిధ్యమైన సాహిత్యం అభివృద్ధి చెందడానికి కారణమైంది. రూబెన్ డరియో, పాబ్లో అంటానియో, ఎర్నెస్టో కార్డెనల్ మొదలైన నికరాగ్వా రచయితలు నికరాగ్వా సాహిత్యంలో ప్రధానపాత్ర వహించారు.[9] జీవవైవిధ్యం, వెచ్చని ఉష్ణమండల వాతావరణం, చైతన్యవంతమైన అగ్నిపర్వతాలు నికరాగ్వాను ఆకర్షణీయమైన పర్యాటకగమ్యంగా మారుస్తూ ఉన్నాయి.[10][11]
Republic of Nicaragua República de Nicaragua (Spanish) | |
---|---|
గీతం: [Salve a ti, Nicaragua] Error: {{Native name}}: text has italic markup (help) (Spanish) Hail to Thee, Nicaragua | |
రాజధాని | Managua 12°9′N 86°16′W |
అధికార భాషలు | Spanish |
గుర్తించిన ప్రాంతీయ భాషలు |
|
జాతులు (2011[2]) |
|
పిలుచువిధం | Nicaraguan |
ప్రభుత్వం | Unitary presidential constitutional republic |
• President | Daniel Ortega (FSLN) |
• Vice President | Rosario Murillo |
• Foreign Minister | Denis Moncada[3] |
శాసనవ్యవస్థ | National Assembly |
Independence from Spain, Mexico and the Federal Republic of Central America | |
• Declared | 15 September 1821 |
• Recognized | 25 July 1850 |
• from the First Mexican Empire | 1 July 1823 |
• from the Federal Republic of Central America | 31 May 1838 |
• Revolution | 19 July 1979 |
• Current constitution | 9 January 1987[4] |
విస్తీర్ణం | |
• మొత్తం | 130,375 కి.మీ2 (50,338 చ. మై.) (97th) |
• నీరు (%) | 7.14 |
జనాభా | |
• 2012 census | 6,167,237[5] |
• జనసాంద్రత | 51/చ.కి. (132.1/చ.మై.) (155th) |
GDP (PPP) | 2017 estimate |
• Total | $35.835 billion[6] |
• Per capita | $5,755[6] |
GDP (nominal) | 2017 estimate |
• Total | $13.748 billion[6] |
• Per capita | $2,207[6] |
జినీ (2009) | 45.7[7] medium |
హెచ్‌డిఐ (2015) | 0.645[8] medium · 125th |
ద్రవ్యం | Córdoba (NIO) |
కాల విభాగం | UTC−6 (CST) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +505 |
ISO 3166 code | NI |
Internet TLD | .ni |
నికరాగ్వా పేరుకు వెనుక రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 1522లో ఆగ్నేయ నికరాగ్వాలో ప్రవేశించిన స్పానిష్ దాడికి నాయకత్వం వహించిన " గిల్ గాంజలెజ్ డావిలా " ప్రోత్సాహం అందుకున్న శక్తివంతమైన స్థానికజాతి నాయకుడు నికరావ్ పేరు ఈప్రాంతానికి అన్వయించబడిందని ఒక కథనం వివరిస్తుంది. మరొక కథనం నికరావ్, అక్వా పదాల మిశ్రితపదమే నికరాగ్వా అని వివరిస్తుంది. అక్వా అంటే స్పానిష్ భాషలో నీరు అని అర్ధం. దేశంలో రెండి బృహత్తరమైన సరసులు, ఇతర జలాశయాలు ఉన్నందున దీనికీ పేరు వచ్చిందని భావిస్తున్నారు. 2002లో కాసిక్యూ అసలు పేరు మాకుయిల్మిక్యుయిజ్త్లి అని దానికి నాహుయతి భాషలో " ఐదు మరణాలు " అర్ధం అని నిర్ణయించారు.[12][13][14][15] రెండవ కథనం అనుసరించి నహుయతి పదాలు " నిక్ - అనాహుయాక్ " అంటే అనాహుయాక్ ఇక్కడకు చేరింది అని అర్ధం. నహుయతి భాషలో అనాహుయాక్ అంటే నీరు అని అర్ధం. నిక్ అనాహుయాక్ అంటే ఇక్కడకు నీరు చేరింది లేక ఇది నీటితో ఆవృత్తమైన ప్రాంతం అని అర్ధం.[16][17]
ప్రస్తుతం నికరాగ్వా ప్రాంతంలో క్రీ.పూ. 12,000లో మొదటగా పాలియో- అమెరికన్లు నివసించారు.[18] తరువాత కొలంబియా కాలానికి ముందు నికరాగ్వా మద్యప్రాంతంలో స్థానికజాతి ప్రజలు నివసించారు.[19]: 33 మెసొమెరికా, ఆండియన్ సాంస్కృతిక పాలనలో ఇస్త్మొ - కొలంబియన్ ప్రాంతంలో నికరగ్వా మద్యప్రాంతంలోని కరీబియన్ సముద్రతీరంలో మాక్రో- చిబ్చాన్ భాషల సంప్రదాయ ప్రజలు నివసించారు.[19]: 20 మద్య అమెరికాలో సమైక్యమైన ఈప్రజలు క్రమంగా ప్రస్తుత కొలంబియా ఉత్తర భూభాగానికి తరలివెళ్ళారు.[20] వారు ఆరంభకాలంలో వేట, ఆటవీ వస్తువుల సేకరణ, చేపలవేట మీద ఆధారపడి జీవిస్తూ " స్లాష్ అండ్ బర్న్ " విధానంలో వ్యవసాయం చేసారు.[19]: 33 [21][22]: 65 15వ శతాబ్దం చివరినాటికి పశ్చిమ నికరాగ్వా ప్రాంతంలో వైవిధ్యమైన స్థానికజాతులకు చెందిన ప్రజలు నివసించారు. వీరు మెసోమెరికన్ నాగరికతలైన అజ్తక్, మాయా నాగరికతకు సంబంధించిన ప్రజలు. వారికి మెసొమెరికన్ భాషలు వాడుకలో ఉన్నాయి.[23] 800లో మాంగ్యూ భాషా సంప్రదాయానికి చెందిన చొరొటెగాస్ ప్రజలు ప్రస్తుత మెక్సికన్ రాష్ట్రం చియాపాస్ నుండి నికరాగ్వాకు వలసవచ్చారు.[16][22]: 26–33 నహుయాస్ శాఖకు చెందిన పిపిల్ ప్రజలు కూడా 1200లో చియాపాస్ నుండి నికరాగ్వాకు వచ్చి చేరారు. వీరికి పిపిల్ భాష (నహుయా భాషా కుటుంబం) వాడుకభాషగా ఉండేది. అంతకు ముందు పిల్పిల్ నికరావ్ ప్రజలు టాల్టెక్ నాగరికతతో సంబంధం కలిగి ఉన్నారు.[22]: 26–33 [24][25][26] చొరొటెగాస్, పిల్పిల్ - నికరావ్ ప్రజలిద్దరూ ప్రస్తుత మెక్సికన్ చొలులా లోయలో నివసిస్తూ క్రమంగా దక్షిణంగా కదిలి వెళ్ళారు.[22]: 26–33 అదనంగా 14వ శతాబ్దంలో అజ్తక్ ప్రజలచేత స్థాపించబడిన వ్యాపారసంబంధిత కాలనీలు నికరాగ్వాలోఉన్నాయి.[22]: 26–33
1502లో క్రిస్టోఫర్ కొలంబస్ తన 4వ సాహసయాత్రలో మొదటి యురేపియన్గా నికరాగ్వా ప్రాంతానికి చేరుకున్నాడు. తరువాత ఆయన ఆగ్నేయంగా పయనించి పనామా లోని ఇస్త్మస్ చేరుకున్నాడు.[19]: 193 [22]: 92 కొలంబస్ నికరగ్వా అట్లాంటిక్ తీరంలో ఉన్న మస్కిటో తీరాన్ని కనుగొన్నాడు. [27] అయినప్పటికీ అక్కడ ఆయన ఎటువంటి స్థానికజాతి ప్రజలను చూడలేదు. 20 సంవత్సరాల తరువాత స్పెయిన్ యాత్రికులు నికరాగ్వా నైరుతీ ప్రాంతానికి చేరుకున్నారు.1520 జనవరిలో పనామా చేరుకున్న " గిల్ గొంజలెజ్ డావిలా " మొదటిసారిగా నికరాగ్వా ప్రాంతాల మీద దాడిచేసి స్వాధీనం చేసుకున్నాడు.[28] తరువాత 1522లో గిల్ గొంజలెజ్ డావిలా ప్రస్తుత నికరాగ్వా రివాస్ డెపార్టుమెంటు ప్రాంతానికి చేరుకున్నాడు. [19]: 35 [22]: 92 అక్కడ ఆయన మాకుయిల్మిక్విత్లి నాయకత్వంలో నివసిస్తున్న నహుయా స్థానికజాతి ప్రజలను కలుసుకున్నాడు. వీరిని కొన్నిమార్లు పొరపాటుగా నికరావ్, నికరాగ్వా ప్రజలుగా పేర్కొంటూ ఉంటారు. ఆసమయంలో స్థానికప్రజలకు " క్యుయాయుహ్కాపొల్కా " రాజధానిగా ఉంది.[15][29][30] గొంజలెజ్ డావిలా తనతో స్పానిష్ నృపబడిన ఇద్దరు అనువాదకులను తీసుకుని వెళ్ళిన కారణంగా ఆయనకు మాకుయిల్మిక్విత్లి ప్రజలతో సంభాషించడానికి అనుకూలంగా మారింది.[14] సారవంతమైన పశ్చిమ లోయలలో అణ్వేసించి బంగారం సేకరించిన తరువాత [15][19]: 35 [22]: 55 గొంజలెజ్ డావిలా, ఆయన డిరియాంజెన్ నాయకత్వంలోని చొరొటెగా స్థానికప్రజల మనుషులు దాడికి గురై అక్కడి నుండి తరిమివేయబడ్డాడు.[15][31] స్పానియర్డులు స్థానిక ప్రజలను క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నించారు.మాకుయిల్మిక్విత్లి ప్రజలు బాప్టిస్టుగా మారారు.[15][22]: 86 అయినప్పటికీ డిరియాండెన్ స్పెయిన్ వారి పట్ల శతృత్వం వహించాడు.1524లో మొదటి స్పెయిన్ సెటిల్మెంటు స్థాపించబడింది.[28] అదే సంవత్సరం " ఫ్రాంసిస్కో హెర్నాడెజ్ డీ కొర్డొబా (నికరాగ్వా స్థాపకుడు)నికరాగ్వా లోని రెండు ప్రధాన నగరాలను స్థాపించాడు. వాటిలో మొదటి నగరం గ్రనడాను నికరాగ్వా సరోవర తీరంలో నిర్మించాడు. తరువాత లియోన్ నగరం మనగుయా సరోవరతీరంలో స్థాపించబడింది.[19]: 35, 193 [22]: 92 తరువాత కార్డోబా నగరాలకు రక్షణవలయాలను నిర్మించి ఇతర దాడులను ఎదుర్కొన్నాడు.[22]: 92 తరువాత కార్డోబా తన అధికారి పెడ్రో అరియాస్ డావిలాను ధిక్కరించిన కారణానికి బహిరంగ శిరచ్ఛేదానికి గురైయ్యాడు. [19]: 35 కార్డోబా సమాధి , అవశేషాలు 2000లో లియోన్ వియేజోలో కనుగొనబడ్డాయి.[32] స్థానికజాతి ప్రజలు , స్పానియన్ల మద్య కొనసాగిన కలహాల ఫలితంగా స్థానికజాతిప్రజలు వారి సంస్కృతి ధ్వశం చేయబడింది. రెండు వర్గాల మద్య " వార్ ఆఫ్ ది కేప్టంస్ " పేరిట వరుస యుద్ధాలు జరిగాయి.[33] పెడ్రో అరియాస్ [19]: 35 పనామా మీద నియంత్రణ కోల్పోయిన తరువాత నికరాగ్వా చేరుకుని లియోనులో తన పునాదులు నిర్మించుకున్నాడు.[34] 1527లో లియోన్ కాలనీ రాజధానిగా మారింది.[22]: 93 [34] అడ్రాయిట్ దౌత్యపరమైన ప్రయత్నాలతో అరియాస్ డావిలా కాలనీ మొదటి గవర్నరుగా నియమించబడ్డాడు. [32] మహిళారహితంగా [22]: 123 స్పానిష్ విజేతలు నహుయా , చొరొటెగా భార్యలను వారి భాగస్వాములతో స్వాధీనం చేసుకున్నారు. స్థానిక మాకుయిల్మిక్విత్లి , యురేపియన్ సంతతికి చెందిన ప్రజలు మెస్టిజోలుగా గుర్తించబడ్డారు.వారు నికరాగ్వా అధికసంఖ్యాక ప్రజలుగా ఆధిఖ్యత కలిగి ఉన్నారు.[23] స్పెయిన్ వారి నిర్లక్ష్యం కారణంగా అనేకమంది స్థానిక ప్రజలు వ్యాధులబారిన పడి మరణించారు.[28] అదనంగా పెద్దసంఖ్యలో స్థానిక ప్రజలను పట్టిబంధించి 1526-1540 మద్యకాలంలో పనామా , పెరూ దేశాలకు బానిసలుగా విక్రయించబడ్డారు.[19]: 193 [22]: 104–105 1610 లో మొమొటోంబొ అగ్నిపర్వతం బద్దలై లియోన్ నగరాన్ని ధ్వంశం చేసింది.[35] నగరం తరువాత పునర్నిర్మించబడింది.[34][35] అది ప్రస్తుతం లియోని వెజో అని పిలువబడుతుంది.అమెరికన్ రివల్యూషనరీ యుద్ధకాలంలో బ్రిటన్ , స్పెయిన్ దేశాలకు మద్య అమెరికా ప్రధానాంశంగా మారింది.1779 లో " బాటిల్ ఆఫ్ శాన్ ఫెర్నాండో డీ ఒమా " యుద్ధానికి , శాన్ జాన్ ఎక్స్‌పెడిషన్ (1780) నేవీ అడ్మైరల్ " హొరాషియో నెల్సన్ " నాయకత్వం వహించాడు.తరువాత వ్యాధుల కారణంగా ఈఈప్రాంతం విసర్జించబడింది.
1821 లో " యాక్ట్ ఆఫ్ ఇండిపెండెంస్ ఆఫ్ సెంట్రల్ అమెరికా " చట్టంతో " ది కెప్టెంసీ జనరల్ ఆఫ్ గౌతమాలా " రద్దుచేయబడింది. తరువాత నికరాగ్వా " ఫస్ట్ మెక్సికన్ ఎంపైర్ " లో భాగంగా మారింది. 1823 లో " ఫస్ట్ మెక్సికన్ ఎంపైర్ " సాంరాజ్యం త్రోసివేయబడింది. తరువాత నికరాగ్వా " యునైటెడ్ ప్రొవింస్ ఆఫ్ సెంట్రల్ అమెరికా " విలీనం చేయబడింది. అది తరువాత దానికి " ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ సెంట్రల్ అమెరికా " పేరు మార్చబడింది. చివరిగా 1838 లో నికరాగ్వా స్వతంత్ర రిపబ్లిక్ అయింది. [36] స్వతంత్రం తరువాత ఆరంభసంవత్సరాలలో లియోన్ కేద్రంగా ఉన్న కాంస్టిట్యూషనల్ లిబరల్ పార్టీ , గ్రనడా కేంద్రంగా ఉన్న కంసర్వేటివ్ పార్టీ మద్య నెలకొన్న శతృత్వం 1840 - 1850 మద్య అంతర్యుద్ధానికి దారితీసింది. రెండు నగరాల మద్య శతృత్వం సద్దుమణగడానికి 1852లో మనగువా రాజధానిగా చేయబడింది.[37][38] " కలిఫోర్నియా గోల్డ్ రష్ " సమయంలో తూర్పు యునైటెడ్ స్టేట్స్ నుండి సముద్రమార్గంలో కలిఫోర్నియా చేరడానికి నికరాగ్వా ప్రయాణీకుల కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ మార్గం శాన్ జుయాన్ నది , నికరాగ్వా సరోవరం మీదుగా ఏర్పాటు చేయబడింది.[19]: 81 కంసర్వేటర్లతో పోరాడడానికి 1885లో లిబరల్స్ యునైటెడ్ స్టేట్స్ సాహసయాత్రికునికుడు సైనికాధికారి విలియం వాకర్‌కు ఆహ్వానం పంపారు. 1856 లో ఫార్సియల్ ఎన్నికల తరువాత విలియం వాకర్ తనకుతానుగా నికరాగ్వా అధ్యక్షునిగా ప్రకటించుకున్నాడు.1857 లో కోస్టారీకా, హండూరాస్ , ఇతర మద్య అమెరికా దేశాలు సమైఖ్యమై విలియం వాకర్‌ను పదవి నుండి తొలగించారు.[39][40][41] తరువాత 3 దశాబ్ధాల కాలం నికరాగ్వాలో కంసర్వేటివ్ పాలన కొనసాగింది. 1655 వరకు బ్రిటిష్ ప్రొటెక్టరేట్‌గా ఉన్న మస్కిటో కోస్ట్ 1859లో హండూరాస్ ఆధ్వర్యంలోకి మారింది.1860లో మస్కిటో కోస్ట్ నికరాగ్వాకు మార్పిడి చేయబడింది. 1894 వరకు మస్కిటో కోస్ట్ స్వయంప్రతిపత్తి అధికారం కలిగి ఉంది.నికరాగ్వా అధ్యక్షుడు " జోస్ శాంటోస్ జెలయా " (1893 - 1909) మస్కిటో కోస్ట్ నికరాగ్వాలో విలీనం జరపడానికి సంప్రదింపులు జరిపాడు. అధ్యక్షుని గౌరవార్ధం మస్కిటో కోస్ట్‌కు జెలయా డిపార్టుమెంటు పేరు మార్చబడింది.19వ శతాబ్ధం అంతటా యునైటెడ్ స్టేట్స్ , కొన్ని యురేపియన్ దేశాలు నికరాగ్వాలో అంటార్కిటిక్ , పసిఫిక్ సముద్రాలను కలుపుతూ నికరాగ్వా కాలువ కట్టాలని ఆలోచనలు జరిపారు.[42]
1909 లో అధ్యక్షుడు జెలయాకు వ్యతిరేకంగా కంసర్వేటివ్ నాయకత్వంలో తలెత్తిన తిరుగుబాటు దళాలకు యు.ఎస్. మద్దతు ఇచ్చింది.అధ్యక్షుడు జెలయా ఆదేశానుసారం 500 మంది తిరుగుబాటుదారులను మరణశిక్షకు గురిచేసిన తరువాత 1909 నవంబర్ 18న యు.ఎస్. యుద్ధనౌకలు నికరాగ్వా చేరాయి. తరువాత అదే సంవత్సరం జెలయా రాజీనామా చేసాడు.1912 ఆగస్టు నికరాగ్వా అధ్యక్షుడు " అడాల్ఫో డియాజ్ " వార్ సైరెటరీ జనరల్ " లూయిస్ మెనా " సైనిక తిరుగుబాటు చేస్తాడన్న భయంతో రాజీనామా చేయమని కోరాడు. మెనా లూయిస్ తన సోదరునితో (మనాగ్వా పోలీస్ ప్రధానాధికారి) మనాగ్వాకు పారిపోయి సైనిక తిరుగుబాటు ఆరంభించాడు. యు.ఎస్. లెగేషన్ అధ్యక్షుడు డియాజ్‌ను అమెరికన్ పౌరులకు , సంపదకు సైనిక తిరుగుబాటు సమయంలో రక్షణ కల్పించమని కోరింది.అధ్యక్షుడు తాను చేయలేనని యునైటెడ్ స్టేట్స్ యుద్ధంలో జోక్యం చేసుకోవాలని కోరాడు. [43] 1912 - 1933 మద్య కాలంలో యునైటెడ్ స్టేట్స్ నికరాగ్వాను స్వాధీనం చేసుకుంది.[19]: 111, 197 [44] 1914లో " బ్రయాన్ - చమొరొ ట్రీటీ " మీద సంతకం చేయబడింది. నికరాగ్వా యు.ఎస్. నియంత్రణకు మారింది. నికరాగ్వాలో కాలువ నిర్మాణానికి ప్రతిపాదన చేయబడింది.[45] యు.ఎస్. యుద్ధనౌకలు నికరాగ్వా నుండి తొలగించబడిన తరువాత లిబరల్స్ , కంసర్వేటివ్ల మద్య నికరాగ్వా అంతర్యుద్ధం (1926 - 27) ఆరంభమైంది. ఫలితంగా యు.ఎస్. యుద్ధనౌకలు తిరిగి నికరాగ్వా చేరుకున్నాయి.[46]
1927 నుండి 1933 వరకు తిరుగుబాటు జనరల్ " అగస్టో సీజర్ శాండినో " నాయకత్వంలో కంసర్వేటివ్ పాలనకు వ్యతిరేకంగా అలాగే యు.ఎస్. యుద్ధనౌకలకు వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం సాగింది.[47] 1933 లో అమెరికన్లు నికరాగ్వాను వదిలి వెళ్ళగానే వారు నేషనల్ గార్డును ఏర్పాటు చేసుకున్నారు.[48] సమైఖ్య సైనిక , పోలిస్ బలగాలకు అమెరికా శిక్షణ , ఉపకరణాను అందించి సహకరించి దళాలను యు.ఎస్.కు విశ్వాసంగా ఉండేలా రూపొందించింది.
1933 లో యు.ఎస్. యుద్ధనౌకలు నికరాగ్వా నుండి వైదొలగిన తరువాత శాండినో , కొత్తగా ఎన్నుకొనబడిన అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ " జుయాన్ బౌటిస్టా " చేసుకున్న ఒప్పందం అనుసరించి శాండినో గొరిల్లా యుద్ధం నిలిపి బదులుగా వ్యవసాయ కాలనీకి అవసరమైన భూమి , ఒక సంవత్సర కాలం వరకు 100 మంది ఆయుధ బలగాలను అందుకున్నాడు.[49] అయినప్పటికీ శాండినొ , నేషనల్ గార్డ్ డైరెక్టర్ " అనస్టాసియో సొమొజా గార్సియా " మద్య శతృత్వం అధికరించిన కారణంగా , శాండినొ ఆయుధ తిరుగుబాటు చేయగలడన్న భయం కారణంగా సొమొజా గార్సియా శాండినోకు మరణశిక్ష వేయాలని నిశ్చయించుకున్నాడు.[48][50][51] 1934 ఫిబ్రవరి 21న శాంతి ఒప్పందం మీద సంతకం చేయాలని సకాసా శాండినొను మనాగ్వాలోని అధ్యక్షభవనానికి ఆహ్వానించాడు. అధ్యక్షభవనం వదిలి వెళ్ళిన తరువాత శాండినొ కారును నేషనల్ గార్డ్ సైనికులు నిలిపి ఆయనను కిడ్నాప్ చేసారు. తరువాత ఆరోజురాత్రి నేషనల్ గార్డ్ సైనికులు శాండినోను కాల్చివేసారు. తరువా శాండినో వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తున్న పురుషులు, స్త్రీలు , పిల్లలు కూడా మరణశిక్షకు గురైయ్యారు.[52]
నికరాగ్వా పలు సైనిక నిరంకుశపాలన అనుభవించింది. వీటిలో సొమొజా రాజవంశ పాలన దీర్ఘకాలం కొనసాగింది. 20వ శతాబ్ధంలో 43సంవత్సరాల కాలం సొమొజా రాజవంశ పాలన సాగింది.[53] యు.ఎస్. నౌకాదళం నికరాగ్వా నుండి వైగొలగే క్రమంలో నేషనల్ గార్డును రూపొందించే సమయంలో సొమొజా కుటుంబం అధికారంలోకి వచ్చింది.[54] సొమొజా గార్సియా తమదారికి అడ్డునిలిచిన నేషనల్ గార్డ్ అధికారులను తొలగించి సకాసాను తొలగించి 1937 జనవరి 1న మోసపూరితమైన ఎన్నికల ద్వారా అధ్యక్షపీఠం స్వాదీనం చేసుకున్నారు.[48] రెండవ ప్రపంచయుద్ధం సమయంలో 1941 డిసెంబర్ 8న నికరాగ్వా జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించింది.[55] యుద్ధానికి నికరాగ్వా నుండి సైనికులు పంపబడనప్పటికీ సొమొజా నికరాగ్వా జర్మనుల ఆస్తులను బలవంతంగా దోచుకున్నాడు.[56] 1945లో ఐఖ్యరాజ్యసమితి నిబంధనలను అంగీకరించిన దేశాలలో నికరాగ్వా ప్రధమ స్థానంలో ఉంది. [57]
1956 సెప్టెంబర్ 21న సొమొజా గార్సియాను 27సంవత్సరాల లిబరల్ నికరాగ్వా కవి " రిగొబెర్టో లోపెజ్ పెరెజ్ " కాల్చివేసాడు.తరువాత కాంగ్రెస్ అధ్యక్షుని పెద్దకుమారుడు లూయిస్ సొమొజా డెబేలెను అధ్యక్షునిగా నియమించింది. తరువాత ఆయన అధికారికంగా దేశాధ్యక్షపదవిని స్వీకరించాడు.[48] కొందరు ఆయనను ఆధునిక భావాలున్న వ్యక్తిగా గుర్తించినప్పటికీ కొన్ని సంవత్సరాలు మాత్రమే పదవీ బాధ్యత వహించి గుండెపోటొతో మరణించాడు. ఆయన తరువాత వారసుడు " రెనే స్చిక్ గుతియారెజ్ " అధ్యక్షుడయ్యాడు. ఆయనను నికరాగ్వా ప్రజలు సొమొజా బొమ్మ అధ్యక్షునిగా మాత్రమే భావించారు.[58]1967 లో సొమొజా గార్షియా చిన్న కుమారుడు " అనస్టాసియో సొమొజా డెబేలే "(సాధారణంగా సొమొజా అని పిలువబడ్డాడు) అధ్యక్షుడయ్యాడు.1972లో నికరాగ్వా భూకంపం సంభవించింది. భూకంపంలో 90% మనాగ్వా నగరం ధ్వంశం అయింది. బృహత్తరమైన నష్టం సంభవించింది. [59] మనాగ్వాను పునర్నిర్మించడానికి బదులుగా సొమొజా నివారణ నిధిని దుర్వినియోగం చేసాడు. నివారణ నిధిని దుర్వినియోగం చేయడం పిట్స్ బర్గ్ సముద్రపు దొంగలకు ప్రేరణ కలిగించి రొబెర్టో క్లెమెంటో వ్యక్తిగతంగా మనాగ్వాకు విమానంలో పయనించిన సమయంలో విమానప్రమాదంలో మరణించాడు.[60] ఆర్ధికశాఖ కూడా సొమొజా సహాయాన్ని నిరాకరించింది. ఆయన కే వంటి గుత్తాధిపత్య పరిశ్రమలను దేశపునర్నిర్మాణం కొరకు ఆహ్వానించాడు. [61] 1950 - 1970 మద్య కాలంలో సొమొజా కుటుంబం , ప్రభావవంతమైన సంస్థలు ఆర్ధికాభివృద్ధి ఫలాలలో అత్యధికభాగం స్వంతం చేసుకున్నారు. 1979లో శాండినిస్టాస్ సొమొజాను పదవీచ్యుతుని చేసిన తరువాత సొమొజా కుటుంబ ఆస్తులు 500 - 1.5 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా గణించబడ్డాయి. [62]
1961లో కార్లోస్ ఫొనెస్కా శాండినొ , ఇద్దరు పోరాటవీరుల (వారిలో ఒకరు హత్యకు గురైన కాసిమిరొ సొటెలొ అని భావిస్తున్నారు) చరిత్రను పరిశీలించి " శాండినిస్టా లిబరేషన్ ఫ్రంటు " ను స్థాపించాడు.[48] 1972 భూకంపం , సొమూజా లంచగొండితనం కారణంగా శాండిస్టా ఫ్రంటులోకి సర్వం కోల్పోయిన యువత వరదలా వచ్చిచేరేలా చేసింది.[63] 1974 డిసెంబర్లో ఎఫ్.ఎస్.ఎల్.ఎన్. బృందం యు.ఎస్. దౌత్యాధికారిని " టర్నర్ షెల్టన్ " ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు.[64] 1978 జనవరి 10న నేషనల్ న్యూస్ పేపర్ " లా ప్రెంసా " సంపాదకుడు " పెడ్రొ జొయాక్విన్ చమొరొ కార్డెనా ", సొమొజా ప్రత్యర్థి ఆర్డెంటు హత్యకు గురైయ్యారు. [65] [65] 1979 జూలైలో శాండినిస్టులు బలవంతంగా అధికారం స్వాధీనం చేసుకుని సొమొజాను పదవీచ్యుతుని చేసారు. తరువాత నికరాగ్వా లోని మద్యతరగతి, సంపన్న భూస్వాములు, వృత్తిపని వారిలో చాలామంది యునైటెడ్ స్టేట్స్లో స్థిరపడ్డారు.[66][67][68] కార్టర్ అడ్మినిస్ట్రేషన్ కొత్త ప్రభుత్వంతో పని చేయాలని నిర్ణయించుకుంది.[69] సొమొజా దేశంనుండి పారిపోయి పరగ్వే చేరుకుని 1980 సెప్టెంబరులో హత్యకు గురైయ్యాడు. ఆయన హత్యకు అర్జెంటీనా రెవల్యూషనరీ వర్కర్స్ పార్టీకి సంబంధం ఉన్నట్లు భావించబడింది.[70] 1980లో కార్టర్ ప్రభుత్వం అందించిన 60 మిలియన్ల అమెరికన్ డాలర్ల సహాయం నిలిపివేయబడింది. ఎల్ సల్వేడర్ తిరుగుబాటుదారులకు నికరాగ్వా నుండి నౌకలలో సహాయం అందిన సాక్ష్యం లభించినందున సహాయం నిలిపివేయబడింది.[71]
ఫలితంగా శాండినిస్టాస్, వివిధ రెబల్ గ్రూపులు (కాంట్రాస్) కొత్తప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా ఏర్పడ్డారు. కాంట్రాస్ తిరుగుబాటుదారులకు రీగన్ అడ్మింస్ట్రేషన్ ఆధీనంలోని సెంట్రల్ ఇంటెలిజెంస్ ఏజెంసీ నిధి, ఆయుధాలు, శిక్షణ ఇవ్వడానికి అనుకూలంగా స్పందించింది.[72] కాంట్రా తిరుగుబాటుదారులు దేశం వెలుపల నుండి హండూరాస్ ఉత్తరభూభాగం, కోస్టారీకా దక్షిణభూభాగం నుండి కార్యకలాపాలు సాగించారు.[72]
తిరుగుబాటుదారుల చర్యలు వినర్శలకు గురైయ్యాయి. వీరికి సహకరించిన రీగన్ ప్రభుత్వం కూడా విమర్శించబడింది. హింసాత్మకచర్యలు, మానవహక్కుల ఉల్లంఘన వంటి తిరుగుబాటుదారుల చర్యలు విమర్శకు లోనయ్యాయి.తిరుగుబాటు దారులు ఆరోగ్యకేంద్రాలు, పాఠశాలలు, సహకార కేంద్రాలు పడగొట్టారు.[73] కాంట్రా ఆధిక్యత కలిగిన ప్రాంతాలలో హింసాత్మకచర్యలు, హత్యలు, మానభంగాలు అధికం అయ్యాయి.[74] యునైటెడ్ స్టేట్స్ కూడా పోరాటం ఆరంభించింది. నికరాగ్వా లోని కొరింటో నౌకాశ్రయంలో అండర్ వాటర్ మైంస్ సాయంతో షిప్పింగ్‌ను అడ్డగించింది.[75] ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ చర్యలు చట్టవిరుద్ధమైనవని గర్హించింది.[76] యు.ఎస్. శాండినిస్టాస్ మీద ఆర్థిక వత్తిడి తీసుకురావాలని కోరింది. రీగన్ ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యాపార నిరోధం విధించింది.[77] శాండినిస్టాస్ కూడా మానవహక్కుల ఉల్లఘన జరిగిందని ఆరోపించింది.[78][79] 1984 నికరాగ్వా ఎన్నికలలో శాండినిస్టాస్ పార్లమెంటరీ, అధ్యక్షస్థానం మీద విజయం సాధించారు.వారి నాయకుడు ఆర్టెగా డానియల్ అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు.[80][81] రీగన్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నికలను విమర్శించింది. మూడు వామపక్ష పార్టీలు కలిసి " కోర్డినాడొరా డెమొక్రటిక నికరాగ్వానీస్ " పార్టీ తరఫున ప్రతిపాదించిన " ఆర్ట్రో క్రజ్ " ఎన్నికలలో పాల్గొనలేదు.[82] మార్టిన్ క్రీలే ఎన్నికలలో రిగ్గింగ్ జరింగిందని అభిప్రాయపడ్డాడు.[83][84][85] 1983లో యు.ఎస్. కాంగ్రెస్ కాంట్రాస్‌కు నిధిసహాయం అందించడం మీద నిషేధం విధించింది. రీగన్ అడ్మినిస్ట్రేషన్ చట్టవిరుద్ధంగా రహస్యంగా ఇరాన్‌కు ఆయుధాలను విక్రయించి వారిద్వారా కాంట్రాస్‌కు ఆయుధాలు అందించే ఏర్పాటు చేసింది. ఈ కారణంగా రీగన్ అడ్మినిస్ట్రేటుకు చెందిన పలువురు అధికారులు దోషులుగా నిర్ధారించబడ్డారు. [86] 1984లో నికరాగ్వా - యునైటెడ్ స్టేట్స్ కేసు విచారణలో అంతర్జాతీయ కోర్టు (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్) నికరాగ్వాలో సంభవించిన మొత్తం కష్టనష్టాలకు యునైటెడ్ నేషంస్ బాధ్యత వహించాలని పేర్కొన్నది.[87] కాంట్రాస్ - శాండినిస్టాస్ యుద్ధంలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
1990 నికరాగ్వా జనరల్ ఎన్నికలలో యాంటీ శాండినిస్టా పార్టీలు వయోలెటా చమొరొ నాయకత్వంలో శాండినిస్టులు ఓటమికి గురైయ్యారు.జయిస్తామని భావించిన శాండినిస్టులకు ఓటమి గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల తరువాత చమొరొ మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమించబడింది.[88] 1996 నికరాగ్వా ఎన్నికలలో డానియల్ ఆర్టెగా, శాండినిస్టులు ఓటమికి గురైయ్యారు. కాంసిస్ట్యూషనల్ లిబరల్ పార్టీకి చెందిన అర్నాల్డో అలెమన్ విజయం సాధించాడు.
2001 నికరాగ్వా ఎన్నికలలో విజయం సాధించిన ఎంరిక్యూ బొలానొస్ అధ్యక్షపదవిని అధిష్ఠించాడు. 2003లో అపహరణ, మనీ లాండరింగ్, లంచగొండితనం నేరారోపణలతో ఖైదు చేయబడి 20సంవత్సరాల జైలు శిక్షకు గురైయ్యాడు.[89] శాండినిస్టులు, పార్లమెంటు సభ్యులు ఒకటై అధ్యక్షుడు, మంత్రిమండలి పదవుల నుండి తొలగాలని పదవులకు రాజీనామా చేయాలని నిర్భంధించారు.[90] అయినప్పటికీ తిరుగుబాటు క్రమంగా అణిచివేతకు గురైంది. అమెరికన్ అధ్యక్షుడు బొలానోస్ వ్యతిరేక చర్యలకు మద్దతు ఇవ్వలేదు. యు.ఎస్., ఒ.ఎ.ఎస్,, యురేపియన్ యూనియన్ కూడా ఈ చర్యలను వ్యతిరేకించింది.[91] 2006 ఎన్నికలకు ముందుగా నికరాగ్వా నేషనల్ అసెంబ్లీ గర్భస్రావాలపై అదనపు నిబంధనలను జారీ చేస్తూ చట్టం అమలుచేసింది.[92] గర్భస్రావాలను మినహాయింపు లేకుండా చట్టవిరుద్ధం చేసిన ఐదు దేశాలలో నికరాగ్వా ఒకటి.[93] 2006 నవంబరు 5న లెజిస్లేషన్, అధ్యక్షేన్నికలు నిర్వహించబడ్డాయి.37.99% ఓట్లతో ఆర్టెగా తిరిగి పదవిని అధిష్ఠించాడు.[94] 2011 నికరాగ్వా జనరల్ ఎన్నికలలో తిరిగి ఆర్టెగా 62.46% ఓట్లతో అపూర్వ విజయం సాధించాడు. 2014 ఎన్నికలలో నేషనల్ అసెంబ్లీ రాజ్యాంగసవరణలకు అంగీకారం తెలియజేస్తూ ఆర్టెగాకు మూడవమారు పదవీ బాధ్యత వహించడానికి ఆమోదించింది.[95]
నికరాగ్వా మొత్తం భూవైశాల్యం 1,30,967 చ.కి.మీ. భౌగోళికంగా నికరాగ్వా మూడుప్రాంతాలుగా విభజించబడి ఉంది: పసిఫిక్ దిగువభూములు (స్పానిష్ కాలనిస్టుల సెటిల్మెంటులోని సారవంతమైన లోయలు),అమెరిస్క్యూ పర్వతాలు (నార్త్ సెంట్రల్ హైలాండ్స్), ది మస్కిటో కోస్ట్ (అట్లాంటిక్ దిగువభూములు). అట్లాంటిక్ సముద్రతీరంలో ఉన్న దిగువ మైదానం కొన్ని ప్రాంతాలలో 97 కి.మీ వెడల్పు ఉంటాయి.
నికరాగ్వా పసిఫిక్ ప్రాంతంలో మద్య అమెరికాలోని రెండు మంచినీటి సరసులు (మనగ్వా సరసు, నకరాగ్వా సరసు) ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ ఫాంసెకాలోని రిఫ్ట్ లోయలో మద్య ఎగువభూలలో ఉన్న అగ్నిపర్వతాల విస్పోటం కారణంగా వెలువడిన ధూళితో సారవంతమైన దిగువ మైదానాలు ఉన్నాయి. నికరాగ్వా విస్తారమైన జీవవైవిధ్యం, అసమానమైన పర్యావరణం మెసిమెరికా జీవవైద్య కేంద్రంగా ముఖ్యత్వం తీసుకువచ్చింది.నికరాగ్వా మద్య అమెరికా ఆజ్ఞిపర్వత ఆర్క్‌లో భాగంగా ఉంది.
నికరాగ్వా పశ్చిమంలో ఉన్న దిగువభూములలో వెడల్పైన, సారవంతమైన వ్యవసాయ మైదానాలు ఉన్నాయి. కార్డిలెరా లాస్ మరిబియోస్ పర్వతశ్రేణి లోని (గ్రనడాకు స్వల్పగా వెలుపల ఉన్న మాంబకొ, లెయాన్ సమీపంలోని మామొటొంబొలతో కూడినది) అగ్నిపర్వత విస్పోటాల కారణంగా ఈమైదానం రూపురేఖలలో మార్పులు సంభవిస్తూ ఉంటుంది. దిగువభూములు " గల్ఫ్ ఆఫ్ ఫాంసెకా " నుండి నికరాగ్వా పసిఫిక్ సరిహద్దు (కోస్టారికా దక్షిణంగా ఉన్న నికరాగ్వా సరసుతో చేర్చి) వరకు విస్తరించి ఉన్నాయి. నికరాగ్వా సరసు మద్య అమెరికాలో అతిపెద్ద సరసుగానూ, ప్రపంచంలో 20వ స్థానంలోనూ ఉంది.[96] ఈ సరసు మంచినీటి షార్కులకు (బుల్ షార్క్ లేక నికరాగ్వా షార్క్) నిలయంగా ఉంది.[97] పసిఫిక్ దిగువభూముల ప్రాంతంలో జనసాధ్రత అధికంగా ఉంది. దేశంలోని జనసంఖ్యలో సగం ఈప్రాంతంలో ఉంది.
పశ్చిమ నికరాగ్వాలో ఉన్న 40 అగ్నిపర్వతాలలో ఇప్పటికీ చాలా సజీవంగా ఉన్నాయి. కొన్ని సమయాలలో అగ్నిపర్వత విస్పోటాలు సెటిల్మెంట్లను ధ్వంసంచేసినప్పటికీ పరిసరప్రాంతాలను అవి సారవంతం చేస్తున్నాయి. అగ్నిపర్వత విస్పోటాల కారణంగా భౌగోళికంగా జరుగుతున్న మార్పులు భూకంపాలు సంభవించడానికి కారణమౌతున్నాయి. పసిఫిక్ జోన్లో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. భూకంపాలు రాజధాని నగరం మనాగ్వా నగరాన్ని పలుమార్లు ధ్వంసం చేసాయి.[98]
2000 మీ ఎత్తైన " టియేరా కాలియెంటే " అని పిలువబడుతున్న పసిఫిక్ జోన్ ఉష్ణమండల స్పానిష్ అమెరికాలో " హాట్ లాండ్ "గా భావించబడుతుంది. ఇక్కడ సంవత్సరమంతా స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఉష్ణోగ్రత 85-90 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది. నవంబరు నుండి ఏప్రిల్ వరకు ఉండే డ్రై సీజన్ తరువాత మే మాసంలో ఆరంభమై అక్టోబరు మాసం వరకు కొనసాగే వర్షాలు పసిఫిక్ దిగువభూములకు 40-60 మి.మీ వర్షపాతం ఇస్తుంది. సారవంతమైన మట్టి, అనుకూలమైన వాతావరణం ఒకటిగా కలిసి పశ్చిమ నికరాగ్వాను దేశ ఆర్థిక, ప్రజాసాంధ్రత కేంద్రంగా మార్చాయి. పసిఫిక్ తీరం, నికారాగ్వా సరసు వాయవ్యభాగం సరిహద్దు పొడవు 15కి.మీ.19వ శతాబ్దంలో ఈసరసు, జుయాన్ నది మద్య అమెరికాలోని ఇస్త్మస్ కాలువలో అతి పెద్ద భాగంగా ప్రతిపాదించబడింది. కెనాల్ ప్రతిపాదనలు 20వ, 21వ శతాబ్దంలో పునరుద్ధరించబడ్డాయి. [98][99] దాదాపు ఒక శతాబ్దం తరువాత పనామా కాలువ తెరవబడింది.[100][101][102][103] పసిఫిక్ దిగువభూభాగంలోని సముద్రతీరాలు, రిసార్టులు స్పానిష్ నికరాగ్వా నిర్మాణకళకు, కళాఖండాలకు నిలయంగా ఉన్నాయి. లెయాన్, గ్రనడా నగరాలలో కాలనీ నిర్మాణకళ ప్రతిబింభిస్తుంది. 1524లో స్థాపించబడిన గ్రనడా నగరం అమెరికా ఖండాలలో పురాతన నగరంగా గుర్తించబడుతుంది. [104]
ఉత్తర నికరాగ్వా కాఫీ తోటలు, పశువుల పెంపకం, పాలు, కూరగాయలు, వుడ్, బంగారం, పూలు ఉత్పత్తికి ప్రధానకేంద్రంగా మార్చబడింది. ఇక్కడ ఉన్న విస్తారమైన అరణ్యాలు, నదులు, భౌగోళికం పర్యావరణ పర్యటనలకు అనుకూలంగా ఉన్నాయి.
ఉత్తర భూభాగంలో నికరాగ్వా, కరీబియన్ మద్య ఉన్న ఉత్తర మద్య ఎగువ భూములలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రజలు అతితక్కువగా నివసిస్తున్నారు.2000-5000 మీ ఎత్తులో ఉన్న దేశంలోని టియేరా టెంప్లేడా (టెంపరేట్ లాండ్) భూభాగంలో 75-80 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈప్రాంతంలో పసిఫిక్ దిగువ భూములకంటే అధికంగా వెట్టర్ రెయినీ సీజన్ నెలకొని ఉంటుంది. ఇక్కడ నిటారైన కొండచరియలలో ఎరోషన్ పెద్ద సమస్యగా మారింది.ఇది రగ్డ్ టెర్రియన్, పూర్ సాయిల్స్,లో పాపులేషన్ డెంసిటీ ఉన్న ప్రాంతంగా వర్గీకరించబడి ఉంది. అయినప్పటికీ వాయవ్య లోయలు సారవంతంగా ఉండి ప్రజావాసాలకు అనుకూలంగా ఉన్నాయి. [98] పసిఫిక్ దిగువభూములకంటే ఈప్రాంతం చల్లగా ఉంటుంది. ఎత్తైన కొండచరియలలో కాఫీ తోటలు పెంచబడుతూ ఈప్రాంతం దేశంలోని వ్యవసాయంలో 4వ భాగానికి భాగస్వామ్యం వహిస్తుంది.ఈప్రాంతంలో ఉన్న మేఘారణ్యాలలో విస్తారంగా ఓక్, పైన్, మూస్, ఫెరన్, లతలు ఉన్నాయి. మద్యప్రాంతంలో రెస్ప్లెండెంట్ క్యుట్జల్, లెసర్ గోల్డ్ ఫించ్, హమ్మింగ్ బర్డ్, ఎమరాల్డ్ టౌకానెట్ మొదలైన పక్షిజాతులు ఉన్నాయి.
స్వప్లజనాభా నివసిస్తున్న అతిపెద్ద వర్షారణ్యప్రాంతానికి పలునదుల నుండి వ్యవసాయజలాలు లభిస్తున్నాయి. ఈప్రాంతంలో దేశంలో 57% భూభాగం, దేశంలోని ఖనిజవనరులలో అధికభాగం ఉన్నాయి. అధికంగా దురుపయోగం చేయబడినప్పటికీ ఈప్రాంతంలో ఇప్పటికీ ప్రకృతివైవిధ్యం నిలిచి ఉంది. ఈఈప్రాంతంలో ప్రవహిస్తున్న రియో కొకో నది మద్య అమెరికాలో అతి పెద్దనదిగా గుర్తించబడుతుంది.ఇది హండూరాస్ మద్య సరిగద్దును ఏర్పరుస్తూ ఉంది. కరీబియన్ సముద్రతీరం ఒకేతీరుగా ఉండే పసిఫిక్ సముద్రతీరంకంటే వంకరటింకరగా ఉంటుంది.మడుగులు, డెల్టాలు దీనిని మరింత వంకరటికరగా చేస్తున్నాయి. [ఆధారం చూపాలి] అట్లాంటిక్ దిగువభూభాగంలో నికరాగ్వాలోని " బొసవాస్ బయోస్ఫేర్ రిజర్వ్ " ఉంది. ఇదులో కొంతభాగం " సియున " పురపాలకంలో ఉంది.ఇది 18,00,000 ఎకరాల వైశాల్యం ఉన్న " లా మొస్కిటియా " ప్రాంతాన్ని సంరక్షిస్తూ ఉంది.ఇది దేశభూభాగంలో 7% ఉంది.[105] సియున, రొసిటా, బొనాంజాలు మైనింగ్ ట్రైయాంగిల్ అంటారు. ఇది కరీబియన్ దిగువభూభాగంలో ఉంది. బొనాంజా ట్రైయాంగిల్‌లో ఇప్పటికీ హెచ్.ఇ,ఎం.సి.ఒ. కంపెనీకి స్వంతమైన బంగారుగని ఉంది. సియున, రొసిటాలో యాక్టివ్ గనులు లేవు. అయినప్పటికీ ఈప్రాంతంలో బంగారంకొరకు త్రవ్వకాలు ఇప్పటికీ సాధారణంగా ఉన్నాయి. [ఆధారం చూపాలి] నికరాగ్వా ఉష్ణమండల తూర్పు సముద్రతీరం దేశంలోని మిగిలిన ప్రాంతంకంటే వ్యత్యాసంగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణమండల వాతావరణం (అధిక ఉష్ణోగ్రత, అధిక హ్యూమిడిటీ) నెలకొని ఉంటుంది. ఈప్రాంతంలో ఉన్న బ్లూఫీల్డ్ నగరంలో అధికార స్పానిష్ భాషతో కలిసి ఇంగ్లీష్ కూడా అధికంగా వాడుకలో ఉంది. ఇక్కడ ప్రజలు మిగిలిన కరీబియన్ నగరాలలోని ప్రజలలా ఉంటారు. [106] ఈప్రాంతంలో డేగ, టర్కీ బర్డ్, టౌకాన్, పరకీత్, మాకా మొదలైన పక్షులు ఉన్నాయి. ఈప్రాంతంలో కోతులు, యాంటీటర్, వైట్ - టెయిల్డ్ డీర్, టాపిర్ మొదలైన వైవిధ్యమైన జంతువులు ఉన్నారు.[ఆధారం చూపాలి]
నికరాగ్వా సుసంపన్నమైన వృక్షజాలానికి, జంతుజాలానికి నిలయంగా ఉంది.నికరాగ్వా రెండు అమెరికా ఖండాలకు మద్యలో ఉన్న కారణంగా బృహత్తర జీవవైద్యానికి అనుకూలంగా ఉంది. వాతావరణం, స్వల్పంగా ఉన్న అల్టిట్యూడ్ వ్యత్యాసాలు దేశంలో 248 జాతుల ఉభయచరాలు, సరీసృపాలకు, 183 జాతుల క్షీరదాలు, 705 పక్షిజాతులు, 640 చేపజాతులు, 5,796 వృక్షజాతులకు అనుకూలత కలిగిస్తున్నాయి.
దేశం తూర్పు ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. రియో శాన్ జుయాన్ డిపార్ట్మెంటు, స్వయంప్రతిపత్తి కలిగిన ఉత్తర, దక్షిణ కరీబియన్ ప్రాంతాలలో వర్షారణ్యాలు ఉన్నాయి. దక్షిణ భూభాగంలో " ఇండో మైజ్ బయోలాజికల్ రిజర్వ్ ", ఉత్తర భూభాగంలో ఉన్న బొసవాస్ బయోస్ఫేర్ రిజర్వ్ అత్యంతశ్రద్ధగా సంరక్షించబడుతూ ఉంది. 2.4 మిలియన్ ఎకరాలలో ఉన్న నికరాగ్వా అరణ్యాలు మద్య అమెరికా ఊపిరితిత్తులుగా భావించబడుతున్నాయి. అమెరికా ఖండాలలో వైశాల్యపరంగా ఈ అరణ్యాలు ద్వితీయస్థానంలో ఉన్నాయి.
నికరాగ్వాలో 78 సంరక్షితప్రాంతాలు (22,000 చ.కి.మీ) ఉన్నాయి. ఇది దేశభూభాగంలో 17% ఉంటుంది. ఇందులో వన్యమృగ సంక్షణాలయాలు, నేచుర్ రిజర్వులు కూడా ఉన్నాయి. ఈప్రాంతంలో 1,400 జంతుజాతులు. నికరాగ్వాలోని 12,000 వృక్షజాతులు బయలాజికల్‌గా వర్గీకరించబడ్డాయి. 5,000 వృక్షజాతులు వర్గీకరించబడలేదు. [107] నికరాగ్వా సరసు, శాన్ జుయాన్ నదిలో మంచినీటిలో అధికంగా నివసించే బుల్ షార్క్ కనుగొనబడింది. దీనిని తరచుగా నికరాగ్వా షార్క్ అంటారు. [108] నికరాగ్వా సమీపకాలం నుండి మంచినీటి చేపలు, షార్క్, సాఫిష్ వేటను నిషేధించింది. ఈ జంతువుల సంఖ్య క్షీణించడమే నిషేధం విధించడానికి ప్రధాన కారణంగా ఉంది.[109]
" ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మిండ్ కంట్రిబ్యూషంస్ "లో ప్రవేశించని కూన్ని దేశాలలో నికరాగ్వా ఒకటి. [110][111]
దక్షిణ అమెరికా ఖండాలలోని పేదదేశాలలో నికరాగ్వా ఒకటి.[112][113][114] 2008 లో డొమస్టిక్ ప్రొడక్ట్ జి.డి.పి. $17.37 బిలియన్ల యు.ఎస్.డి.[4] ఇందులో 17% జి.డి.పికి వ్యవసాయం భాగస్వామ్యం వహిస్తుంది. మద్య అమెరికాలో ఇది అత్యధికం.[115] చెల్లింపులద్వారా 15% జి.డి.పి. (విదేశాలలో నివసిస్తున్న నికరాగ్వా ప్రజలు స్వదేశానికి పంపుతున్న మొత్తం $ 1 బిలియన్ యు.ఎస్.డి) లభిస్తుంది.[116] 2011 లో ఆర్థికాభివృద్ధి శాతం4%.[4] " యునైటెడ్ నేషంస్ డేవెలెప్మెంటు ప్రోగ్రాం " 48% నికరాగ్వా ప్రజలు దారిద్యరేఖకు దిగువన జీవిస్తున్నారని తెలియజేస్తుంది.[117] 79.9% ప్రజలు ఒకరోజుకు $2 కంటే తక్కువ వ్యయంతో జీవిస్తున్నారు.[118] యు.ఎన్. గణాంకాలు నికరాగ్వా ఇండిజెనియస్ ప్రజలు (మొత్తం జనసంఖ్యలో 5% ఉన్నారు) ఒకరోజుకు $ 1 యు.ఎస్.డి. కంటే తక్కువ వ్యయంతో జీవిస్తున్నారు. [119] వరల్డ్ బ్యాంక్ గణాంకాలు వ్యాపారం స్థాపించడానికి అనువైన దేశాలలో నికరాగ్వా 123వ స్థానంలో ఉందని తెలియజేస్తున్నాయి.[120] నికరాగ్వా ఆర్థికం 62.7% స్వేచ్ఛాయుతమైనదని భావిస్తున్నారు. [121] " ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడం " ఉన్న దేశాలలో నికరాగ్వా అంతర్జాతీయంగా 61వ స్థానంలో ఉందని , అమెరికా ఖండాలలోని 29 దేశాలలో నికరాగ్వా 14వ స్థానంలో ఉందని భావిస్తున్నారు.2007 మార్చి నికరాగ్వా ప్రభుత్వం పోలెండు నుండి తీసుకున్న 36.6 మిలియన్ల ఋణాన్ని (1980) తిరిగి చెల్లించింది.[122] 1988 నుండి 2006 మద్య ద్రవ్యోల్భణం 9.45% తగ్గుముఖం పట్టింది. విదేశీఋణం సగం చెల్లించబడింది. [123]
నికరాగ్వా ప్రాథమికంగా వ్యవసాయదేశం. వ్యవసాయం దేశ ఎగుమతులలో 60% భాగస్వామ్యం వహిస్తుంది. మొత్తం విలువ $300 మిలియన్ల యు.ఎస్.డి.[124] కాఫీ పంటలో మూడింట రెండువంతులు మద్య ఎగువభూభాగంలోని ఉత్తరప్రాంతంలోని ఎస్టెల్ పట్టణం తూర్పు , ఉత్తరభాగంలోపండించబడుతుంది. [98] అత్యధికంగా పురుగు మందులను వాడడం కారణంగా భూమికోత (సాయిల్ ఎరొషన్) , కాలుష్యం కాటన్ డిస్ట్రిక్ట్‌లో తీవ్రసమస్యలను తీసుకువచ్చాయి. 1985 నుండి పంటలు క్షీణించడం మొదలైంది.[98] ప్రస్తుతం నికరాగ్వా అరటి వాయవ్యభూభాగంలో " పోర్ట్ ఆఫ్ కొరింటొ " సమీపంలో అధికంగా పండించబడుతుంది. [98] ట్రాపికల్ (ఉష్ణమండల) ప్రాంతాలలో కసావా దుంప (ఉర్లగడ్డల వంటి పంట) ప్రధాన ఆహారంగా ఉంది. కసావా టాపియోకా పుడ్డింగ్‌లో ప్రధాన పదార్ధం ఉపయోగించబడుతుంది.[98] నికరాగ్వా , వెనుజులా దేశాల మద్య బలమైన సంబంధాల కారణంగా నికరాగ్వా వ్యవసాయరంగానికి ప్రయోజనకారంగా ఉంది. వెనుజులా నికరాగ్వా నుండి $ 200 మిలియన్ల వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ ఉందని అంచనా.[125] 1990 లో ఆర్థికరంగాన్ని వ్యవసాయం నుండి మరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ఆరంభించింది. వాణిజ్యపంటలలో వేరుశనగ, నువ్వులు, మెలాంస్ (పుచ్చకాయ) , ఎర్రగడ్డలు ప్రాధాన్యత వహిస్తున్నాయి.[98]
కరీబియన్ సముద్రతీరంలోని బ్లూఫీల్డ్స్, ప్యూర్టో కాబేజాస్ , లాగునా డీ పెర్లాస్ నుండి చేపల బోట్లు రొయ్యలు, లాబ్‌స్టర్ ప్రొసెసింగ్ ప్లాంట్లకు చేరుకుంటున్నాయి.[98] అత్యధిక దురుపయోగం కారణంగా క్షీణిస్తున్న తాబేళ్ళ సంఖ్యను అభివృద్ధి చేయడానికి కరీబియన్ సముద్రతీరంలో " టర్టిల్ ఫిషరీ " ఏర్పాటు చేయబడింది. [98] నికరాగ్వాలో గనులత్రవ్వకం ప్రధాన పరిశ్రమగా ఉంది.[126] మైనింగ్ ద్వారా లభించే ఆదాయం నికరాగ్వా జి.డి.పి.లో 1% భాగస్వామ్యం వహిస్తుంది. పర్యావరణ కాలుష్యం వర్షారణ్యాల ధ్వంసం కారణంగా వంటచెరకు మీద నిబంధనలు కఠినతరం చేయబడ్డాయి.అయినా ఈ అడ్డంకులను అధిగమిస్తూ వంటచెరకు కొరకు అడవి నరికి వేతకు గురౌతూ ఉంది. ఒక హార్డ్‌వుడ్ చెట్టు వేలాది డాలర్లకు విక్రయించబడడమే ఇందుకు కారణం.[98] 1880లో యు.ఎస్.మద్దతిచ్చిన కాంట్రాస్ , ప్రభుత్వ శాండినిస్టాస్ మద్య సాగిన యుద్ధసమయంలో దేశమౌలిక నిర్మాణాలలో అధికశాతం పడగొట్టడం , ధ్వంసం చేయబడంజరిగింది.[127]
దేశంలో అవసరమైనంతాగా రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఉదాహరణగా ఒక వ్యక్తి రహదారి మార్గంలో మనాగ్వా నుండి కరీబియన్ సముద్రతీరం వరకు ప్రయాణించలేడు. రహదారి మార్గం " ఎల్ రామా " పట్టణం వద్ద ముగుస్తుంది. ప్రయాణీకులు మారి రియో ఎస్కాండిడో నదీబోటుల ద్వారా 5 గంటలు ప్రయాణించి కరీబియన్ సముద్రతీరం చేరుకోవాలి.[98] మద్య ఎగువభూభాగంలో ఉన్న టుమా నదిమీద నిర్మించబడిన " ది సెంట్రొయామెరికా పవర్ ప్లాంటు " విస్తరించబడింది. దేశంలోని పరిశ్రమలకు విద్యుత్తు సరఫరాచేయడానికి ఇతర జలవిద్యుత్తు కేద్రాలు స్థాపించబడ్డాయి.[98] పనామా కాలువకు సప్లిమెంటుగా సరికొత్తగా సీలెవల్ కాలువ నిర్మించడానికి అనువైన ప్రాంతంగా నికరాగ్వా భావించబడింది.[98] నికరాగ్వా సముద్రయానం అమెరికా, ప్రపంచంలో అతి తాక్కువగా భావిస్తున్నారు. [128][129][130][131] దేశ జి.డి.పి.లో చెల్లిపులు 15% భాగస్వామ్యం వహిస్తున్నాయి.[4] 21వ శతాబ్దం మొదటి దశాబ్ధంలో ఆసియన్, చైనా పోటీ కారణంగా మాక్విలా రంగంలో అభివృద్ధి తగ్గుముఖం పట్టింది.[98]
నికారాగ్వా ప్రజల సంపద భూమియాజమాన్యం మీద ఆధారపడి ఉంది. ఆహారధాన్యాలు, కాఫీ, పత్తి, గొడ్డుమాసం, చక్కెర పంటలద్వారా ప్రజలకు పుష్కలమైన ఆదాయం లభిస్తుంది.పైతరగకి చెందిన ప్రజలందరూ, మద్యతరగతి ప్రజలలో నాలుగవభాగం ప్రజలు భూమికి యాజమాన్యం వహిస్తున్నారు. 1985లో ప్రభుత్వాధ్యయనం 68.4% వారి కనీసావసరాలను తీర్చుకోలేని బీదరికాన్ని అనుభవిస్తున్నారని వర్గీకరించింది. నివాసగృహం, శానిటరీ సర్వీసులు (నీటి సరఫరా, మురుగునీటి వసతి, చెత్తను తొలగించడం) విద్య, ఉపాధి సౌకర్యాలు ప్రజలందరికీ తగినంతగా అందుబాటులో లేవు. ఈ అధ్యనాల విశ్వసనీయత సందేహాస్పదంగా ఉంది. నివాసగృహాల నిర్మాణంలో నాణ్యతలేని వస్తువులు, వదిలివేసిన వస్తువులతో మురికి నేలతో నిర్మించబడుతున్న నివాసగృహాలలో ఒక గదిలో సరసరిగా 4 నివసిస్తుంటారు.
గ్రామీణ శ్రామికవర్గం వ్యవసాయకూలీ (కాఫీ, పత్తి తోటలు) మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొంతమందికి మాత్రమే శాశ్వత ఉపాధి లభిస్తుంది.చాలా మంది ప్రజలు పంటసమయంలో వ్యవసాయక్షేత్రాలలో పనిచేస్తూ మిగిలిన సమయాలలో ఇతర పనులకు వెళ్ళే వలస కూలీలుగా పనిచేస్తుంటారు. చిరువ్యవసాయదారులు కుటుంబ ఆదాయానికి సరిపడినంత భూమి లేదు.వారు కూడా పంటసమయంలో కూలీలతో చేరి పనిచేస్తుంటారు. భుస్వాములు సరిపడినంత భూమియాజమాన్యం వహిస్తూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నారు. వారు వారి అవసరాలకు మించి పండించి మిగిలిన దానిని జాతీయ, అంర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తుంటారు.
నగరప్రాంత దిగువతరగతి ప్రజలు అనధికార ఆర్థికరంగానికి చెందినవారుగా వర్గీకరించబడ్డారు. అనధికార ఆర్థికవర్గానికి చెందినవారు కుటీరపశ్రమలను నెలకొల్పి సంప్రదాయక సాంకేతను ఉపయోగించడం, చట్టబద్ధంగా కార్మికులను నియమించుకుని పన్ను చెల్లించడం చేస్తుంటారు. అనధికార ఆర్థికరంగంలో స్వయంఉపాధి, జీతరహితంగా పనిచేసే కుటుంబ సభ్యులు పనిచేస్తుంటారు. అదనంగా వీటిలో బీదప్రజలు స్వల్ప వేతనానికి పనిచేస్తుంటారు.నికరాగ్వా అనధికార వర్గంలో తగరసామానులు చేసేవారు, పరుపులు తయారుచేసేవారు, కుట్టుపనివారు, బేకర్లు, షూ తయారీదార్లు, వడ్రంగి పనివారు ఉన్నారు; బట్టలు ఉతకడం, ఇస్త్రీచేయడం, వీధులలో ఆహారం తయారు చేసి విక్రయించేవారు, వేలాది వీధివ్యాపారులు, చిన్నవ్యాపార యజమానులు (తరచుగా వారి గృహాలలో వ్యాపారం ఆరంభిస్తుంటారు), మార్కెట్ స్టాల్ ఆపరేటర్లు మొదలైన పనులను జీవనోపాధిగా ఎంచుకుంటారు. కొంతమంది ఒంటరిగా పనిచేస్తుంటారు. మరికొందరు వర్క్‌షాపులు /ఫ్యాక్టరీలు నిర్వహిస్తుంటారు. దేశపారిశ్రామిక ఉత్పత్తులలో వీరి భాగస్వామ్యం అధికంగా ఉంది. అనధికార రంగాలలో పనిచేవారి సంపాదన తక్కువగా ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఒకరి సంపాదన మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. [132]
అధికమైన లాటిన్ అమెరికా దేశాలమాదిరిగా నికరాగ్వాలో కూడా పైతరగతి ప్రజలు తక్కువగా ఉన్నారు. దాదాపు 2% మాత్రమే ఉన్న పైతరగతి ప్రజలు చాలా సంపన్నులై రాజకీయ, ఆర్థికంగా ప్రభావం కలిగి ఉన్నారు.నికరాగ్వా ప్రస్తుతం " బొలివారియన్ అలయంస్ ఫర్ ది అమెరికాస్ " (ఎ.ఎల్.బి.ఎ) సభ్యత్వం కలిగి ఉంది.ఎ.ఎల్.బి.ఎ. సభ్యదేశాల కొత్త కరెంసీ మార్చాలని ప్రతిపాదించింది. సభ్యదేశాలు తమ పాత కరెంసీ స్థానంలో సుక్రే కరెంసీ ఉపయోగించాలని ప్రతిపాదన అభిప్రాయపడింది. నికరాగ్వాలో వాడుకలో ఉన్న కార్డొబా స్థానంలో సుక్రే వాడుకలోకి తీసుకురావాలి. ఈవిధానం ప్రస్తుతం వెనుజులా, ఈక్వెడార్, బిలివియా, హండూరాస్, క్యూబా, సెయింట్ వెనిస్, గ్రెనడైంస్, డోమనికా, ఆంటిగ్వా, బెర్బుడాలో అమలులో ఉంది.[133] నికరాగ్వా పసిఫిక్ మహాసముద్రం నుండి కరీబియన్ సముద్రం వరకు కాలువ నిర్మించాలని ఆలోచిస్తుంది. అది నికరాగ్వాకు ఆర్థిక స్వతంత్రం కల్పిస్తుందని అధ్యక్షుడు " డానియల్ ఆర్టెగా " అభిప్రాయం వెలువరించాడు.[134] 2014 లో కాలువ నిర్మించడానికి ప్రణాళిక రూపొందించబడింది. [135]
2006 నాటికి నికరాగ్వాలో పర్యాటకం రెండవ అతిపెద్ద పరిశ్రమగా మారింది.[136] వార్షికంగా 10%-15% అభివృద్ధితో 7 సంవత్సరాలలో 70% అభివృద్ధి.[137] అభివృద్ధి కారణంగా 10 సంవత్సరాల కాలంలో నికరాగ్వా ఆదాయం 300% అభివృద్ధి చెందింది. [138] పర్యాటకరంగం అభివృద్ధి వ్యవసాయరంగం, కమర్షియల్, నిర్మాణరంగం, ఫైనాంస్ పరిశ్రమలను దెబ్బతీసాయి. అధ్యక్షుడు " డానియల్ ఆర్టెగా " దేశం అంతటా పర్యాటకరంగం అభివృద్ధి చేసి దేశంలోని పేదరికంతో పోరాడాలని పిలుపు ఇచ్చాడు.[139] 2010 లో 1 మిలియన్ పర్యాటకులు నికరాగ్వాను సందర్శించారు. ఫలితంగా నికరాగ్వా పర్యాటకరంగం దేశఆర్ధికరంగాన్ని గణనీయంగా అభివృద్ధి చెందింది. [140]
ప్రతి సంవత్సరం 60,000 యు.ఎస్.పర్యాటకులు (వ్యాపారులు, పర్యాటకులు) నికరాగ్వాను సందర్శిస్తున్నారు.[141] నికరాగ్వా పర్యాటక రంగ మంత్రిత్వ శాఖ అందించిన ఆధారాలను అనుసరించి 5,300 నికరాగ్వాలో నివసిస్తున్న యు.ఎస్.ప్రజలు ఉన్నారు. యు.ఎస్., మద్య అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా నుండి అత్యధికంగా నికరాగ్వాను సందర్శించడానికి పర్యాటకులు వస్తుంటారని తెలుస్తుంది.[142] కాలనీ నగరాలు లియాన్, గ్రనాడా పర్యాటకులు సందర్శించతగినదిగా భావిస్తున్నారు. మసయా, రివాస్, సరోవరాలు శాన్ జుయాన్ డెల్ సుర్, ఎల్ ఓషనల్, ది ఫోర్టెస్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కంసెప్షన్, ఒమెటెపే ద్వీపం, మాంబచొ అగ్నిపర్వతం, కాన్ ద్వీపం పర్యాటక ఆకర్షణలలో ప్రధానమైనవి.అదనంగా ఎకోపర్యాటకం, రిక్రియేషనల్ ఫిషింగ్, సర్ఫింగ్ ఇతర ప్రధాన నికరాగ్వా పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. నికరాగ్వా బీచులు, అందమైన మార్గాలు, నగరాల నిర్మాణకళా వైభవం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని " టి.వి. నొటొసియాస్ " పేర్కొన్నది.[137] 2007 నుండి 2009 మద్య పర్యాటకం కారణంగా నికరాగ్వాకు విదేశీపెట్టుబడులు వచ్చి చేరాయి.[143]
నికరాగ్వాలో అనేక మడుగులూ, చెరువులు ఉన్న కారణంగా దీనిని " లాండ్ ఆఫ్ లేక్స్ అండ్ వాల్కనోస్ " వర్ణిస్తుంటారు. దేశం పసిగి తీరం వెంట ఉత్తరం నుండి దక్షిణం వరకు అగ్నిపర్వతమాలిక విస్తరించి ఉంది.ప్రస్తుతం నికరాగ్వాలోని 7-50 అగ్నిపర్వతాలు చైతన్యవంతంగా ఉన్నాయి.ఈఅగ్నిపర్వతాలుఅనేకమంది పర్యాటకులకు హాకింగ్, క్లైంబింగ్ (పర్వతారోహణ), కేంపింగ్, క్రేటర్ సరసులో ఈత వంటి క్రీడావినోదం అందిస్తున్నాయి.
" అపోలో లాగూన్ నేచురల్ రిజర్వ్ " 23,000 సంవత్సరాలకు ముందు భూమికోత కారణంగా ఏర్పడింది. అగ్నిపర్వత క్రేటర్ క్రమంగా నీటితో నిండి 7 కి.మీ. వెడల్పైన క్రేటర్ సరసు ఏర్పడింది. సరసు చుట్టూ పురాతన క్రేటర్ గోడ ఉంది.[144] మడుగు చుట్టూ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో పలు కేయాక్స్ ఉన్నాయి. మడుగులో పలు వాటర్ స్పోర్ట్స్ ఆడాడానికి తగిన సౌకర్యాలు లభిస్తున్నాయి.[145] లియాన్‌లో ఉన్న సెర్రో నికరావ్ అగ్నిపర్వత ప్రాంతంలో శాండ్ స్కీయింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అధికంగా సందర్శించబడుతున్న అగ్నిపర్వతాలలో మసయా అగ్నిపర్వతం, మొమొటొంబొ, మాంబచొ, కొసిగుయిన, ఒమెటెపే కాంసెప్షన్ ప్రధానమైనవి.
పర్యావరణ, సాంఘిక ప్రయోజనాల కొరకు ఎకోపర్యాటకం ప్రోత్సహించబడుతుంది. ఇది ప్రాంతీయ సంస్కృతి, విల్డర్నెస్, అడ్వెంచర్ లకు ప్రాధాన్యత ఇస్తుంది. వార్షిక క్రమంగా నికరాగ్వా ఎకోపర్యాటకం అభివృద్ధి చెందుతూ ఉంది.[146] అనేక పర్యాటక పర్యటనలు, ఖచ్ఛితమైన అడ్వెంచర్ అందిస్తామని నికరాగ్వా పర్యాటకరంగం సగర్వంగా చెప్తుంది. నికరాగ్వాలో మూడు ఎకోపర్యాటకం ప్రాంతాలు (పసిఫిక్, సెంట్రల్, అట్లాంటిక్), అగ్నిపర్వతాలు, ఉష్ణమండల వర్షారణ్యాలు, వ్యవసాయభూములు ఉన్నాయి.[147] ఒమెటెపే ద్వీపంలో పలు ఎకో - లాడ్జీలు, పర్యావరణ ప్రధాన్యత కలిగిన పర్యాటక గమ్యాలు ఉన్నాయి.[148] నికారాగ్వా సరసులో మద్యభాగంలో ఉన్న ఈద్వీపాన్ని ఒకగంట బోటుప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. అక్కడ విదేశీయాన్యంలో " ట్రాపికల్ పెర్మాకల్చర్ లాడ్జి,Finca El Zopilote Archived 2008-07-05 at the Wayback Machine, ఇతర ప్రాంతీయ ప్రజల యాజమాన్యంలో ఉన్న ప్రైవేటు లాడ్జిలి చిన్నవైనా చక్కగా నిర్వహించబడుతున్న లాడ్జీలు ఉన్నాయి. Finca Samaria.
సి.ఐ.ఎ. (2016) ఆధారంగా నికరాగ్వా జనసంఖ్య 59,66,798. వీరిలో 69% మెస్టిజోలు, 17% శ్వేతజాతీయులు, 5% స్థానికజాతి ప్రజలు, 9% బ్లాక్, ఇతరజాతీయులు ఉన్నారు.[4] వలసలలో గణనీయంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా గణాకాలలో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రజలలో 58% నగరప్రాంతాలలో నివసిస్తున్నారు. as of 2013[update].[149] రాజధాని మనాగ్వా నగరం అతిపెద్ద నగరం.2010 గణాంకాల ఆధారంగా నగరంలో 2.2 మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. మహానగర ప్రాంతంలో 2.5 మిలియన్ల కంటే అధికంగా నివసిస్తున్నారు. 2005 గణాంకాల ఆధారంగా పసిఫిక్ సెంట్రల్ ప్రాంతంలో 5 మిలియన్ ప్రజలు నివసిస్తున్నారు, కరీబియన్ తీరప్రాంతంలో 7,00,000 కంటే అధికంగా నివసిస్తున్నారు.[150] దేశంలో విదేశాల నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడుతున్న ప్రజలసంఖ్య అధికరిస్తూ ఉంది.[151] వీరిలో చాలామంది వ్యాపారం కొరకు, పెట్టుబడులు, ప్రంపంచం అంతటి నుండి వస్తున్న విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. యు.ఎస్., కెనడా, తైవాన్,యురేపియన్ దేశాల ప్రజలు ఇక్కడ స్థిరపడుతుంటారు.వీరిలో చాలామంది మనాగ్వా, శాన్ జుయాన్ డెల్ సుర్ ప్రాంతాలలో స్థిరపడుతున్నారు.అలాగే అనేకమంది నికరాగ్వా ప్రజలు కోస్టారీకా, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్, కెనడా, ఇతర మద్య అమెరికా దేశాలలో నివసిస్తున్నారు.[152] నికరాగ్వా జనసఖ్యాభివృద్ధి శాతం 1.5% ఉంది.as of 2013[update].[153]
నికరాగ్వా ప్రజలలో మెస్టిజోలు 69%, యురేపియన్లు 17% (వీరిలో స్పానిష్ ప్రజలు అధికంగా ఉన్నారు. తరువాత స్థానాలలో జర్మన్,ఇటాలియన్, ఇంగ్లీష్, టర్కిష్, డానిష్, ఫ్రెంచి సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు), 9% నల్లజాతి ప్రజలు ఉన్నారు.వీరు అధికంగా కరీబియన్ సముద్రతీరంలో ఉన్నారు. ఆంగ్లం మాట్లాడే క్రియోల్ నల్లజాతీయులు నౌకవిధ్వంసం కారణంగా ఇక్కడకు చేరారు.వీరిని స్కాటిష్ వలసప్రజలు బానిసలుగా వారితో తీసుకువచ్చిన కారణంగా వీరు స్కాటిష్ పేర్లను కలిగి ఉన్నారు. వీరు కేంప్బెల్, గార్డెన్, డౌంస్, హాడ్జెసన్ వంటి పేర్లను కలిగి ఉన్నారు.[154] తరువాత కొద్ది సంఖ్యలో గరిఫ్యునా ప్రజలు ఉన్నారు. వీరు పశ్చిమ ఆఫ్రికన్, కరీబ్, అరవాక్ ప్రజల మిశ్రిత సంతతికి చెందిన వారు. 1980లో ప్రభుత్వం విభజించిన జెలయా డిపార్టుమెంటులో వీరిలో సగం మంది నివసిస్తున్నారు. ప్రభుత్వం గరిఫ్యునా, ఇండిజెనియస్ ప్రజల కొరకు రెండు స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలను మంజూరు చేసింది. మిగిలిన 5% నికరాగ్వా ప్రజలు స్థానిక అమెరికన్లు. వీరు దేశంలోని ఇండిజెనియస్గా భావించబడుతున్నారు. నికరాగ్వా కొలంబియన్ పూర్వ జనసంఖ్యలో పలు ఇండిజెనియస్ సమూహాలు ఉన్నాయి. పశ్చిమ భూభాగంలో నహుయా (పిపిల్ - నికరావ్) ప్రజలు చొరెటెగా, సబ్టియాబస్ (మరిబియాస్ లేక క్సియు) ప్రజలతో కలిసి నివసిస్తున్నారు. మద్యప్రాంతం, కరీబియన్ సముద్రతీరంలో మైక్రొ - చిబ్చన్ మాట్లాడే ఇండిజెనియస్ ప్రజలు నివసిస్తున్నారు. పురాతకాలంలో వీరు దక్షిణ అమెరికాకు వలస వెళ్ళడం, దక్షిణ అమెరికా (ప్రధానంగా ప్రస్తుత కొలంబియా, వెనుజులా) నుండి వలస రావడం జరిగింది. వీరిలో కకయోపెరా (మటగల్పాస్),మిస్కిటో, రమాస్మయాంగాస్, ఉల్వాస్ (సుమోస్) ప్రజలు అంతర్భాగంగా ఉన్నారు.[19]: 20 19వ శతాబ్దంలో గణనీయంగా ఇండిజెనియస్ ప్రజలు నివసించారు. తరువాత వీరు మెస్టిజోలలో విలీనం అయ్యారు.
నికరాగ్వా స్పానిష్ భాషమీద స్థానిక భాషల ప్రభావం అధికంగా ఉంది.[155] స్పానిష్ భాష దేశవ్యాప్తంగా వాడుకలో ఉన్నప్పటికీ పట్టణాలు, డిపార్టుమెంటు వారీగా యాసలతో అత్యధికవ్యత్యాసం కనబడుతుంది.[156] కరీబియన్ సముద్రతీరంలోని ఇండిజెనియస్ ప్రజలకు ఇంగ్లీష్ ఆధారిత క్రియోల్, స్పానిష్ వాడుక భాషలుగా ఉన్నాయి. మిస్కిటో ప్రజలకు మిస్కిటో ప్రథమభాషగా వాడుకలో ఉంది. మరికొంత మంది స్థానిక ప్రజలకు, ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలకు స్థానికభాషలు ద్వితీయ, తృతీయ లేక చతుర్ధ భాషలుగా అత్యంత సాధారణంగా వాడుకలో ఉన్నాయి. ఇండిజెనియస్ భాషలైన మిసుమల్పన్ భాషలు మయంగా, ఉల్వా ప్రజలకు అదేపేర్లతో వాడుకభాషలుగా ఉన్నాయి. చాలామంది మిస్కిటో, మయాంగా, ఉల్వా ప్రజలు మిస్కిటో కోస్ట్ క్రియోల్ మాట్లాడు తున్నారు. అలాగే వారిలో చాలామంది స్పానిష్ కూడా అధికంగా మాట్లాడుతుంటారు. 2,000 మంది రమాస్ ప్రజలు చిబ్చన్, రమా, సరళంగా మాట్లాడుతుంటారు. రమాస్ ప్రజలందరూ రమా కే క్రియోల్, అత్యధిక సంఖ్యలో రమాస్ ప్రజలు స్పానిష్ మాట్లాడుతుంటారు.[157] ఇండిజెనియస్ సంతతికి చెందిన గరిఫ్యునా ప్రజలు, ఆఫ్రో సంతతికి చెందిన ప్రజలు (20వ శతాబ్దం ఆరంభంలో హండూరాస్ నుండి నికరాగ్వాకు వచ్చిన ప్రజలు) తిరిగి అరవాకన్, గరిఫ్యునా భాషలను వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిలో అత్యధిక ప్రజలకు మిస్కిటో కోస్ట్ క్రియోల్ వారి మొదటి భాషాగా స్పానిష్ ద్వితీయ భాషగా ఉంది. బ్రిటిష్ కాలనీ కాలంలో బానిసలుగా మస్కిటో సముద్రతీరానికి తీసుకురాబడిన ఆఫ్రికసంతతికి చెందిన క్రియోల్ ప్రజలు, యురేపియన్, చైనీస్, అరబ్, బ్రిటిష్ వెస్టిండియన్ వలస ప్రజలకు మస్కిటో కోస్ట్ క్రియోల్ ప్రథమభాషగా స్పానిష్ ద్వితీయ భాషగా ఉంది.[158]
నికరాగ్వా సంస్కృతిలో మతం ప్రధానపాత్ర వహిస్తుంది. 1939 నుండి రాజ్యాంగం మతస్వేచ్ఛ, ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది. ప్రభుత్వం, రాజ్యాంగం మతసహనాన్ని ప్రోత్సహిస్తుంది. [159] నికరాగ్వాలో అధికార మతం లేదు. దేశప్రధాన కార్యాలలో తమ అధికారం స్థాపించడానికి కాథలిక్ బిషప్పులు ఎదురుచూసారు. దేశవ్యవహారాల గురించి బిషప్పులు వెలువరించిన అభిప్రాయాలకు ప్రజలు ముఖ్యత్వం ఇచ్చారు. రాజకీయ సక్షోభం సంభవించిన సమయాలలో, పార్టీల మద్య విభేదాలు తలెత్తిన సమయాలలో చిక్కులను పరిష్కరించడానికి మతాభికారులను పిలిపించసాగారు.1979లో శాండినిస్టులు అధికారానికి వచ్చిన తరువాత " లిబరేషన్ థియాలజీ "ని ఆచరిస్తున్న ప్రీస్ట్ " మైగ్యుయేల్ డి,ఎస్కొటొ బ్రొక్మెన్ " విదేశాంగ మంత్రిగా పనిచేసాడు. నికరాగ్వాలో సంప్రదాయంగా రోమన్ కాథలిజం ఆధిక్యతలో ఉంది.16వ శతాబ్దంలో స్పానిష్ విజయంతో రోమన్ కాథలిజం నికరాగ్వాలో ప్రవేశించింది. రోమన్ కాథలిక్కుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.1990 నుండి ఎవాంజెలికల్, ప్రొటెస్టెంట్ , " ది చర్చి ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ " వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయి. నికరాగ్వాలోని కరీబియన్ సముద్రతీరంలోని మస్కిటో కోస్టు కాలనీలో బీచ్‌లో (ఇవి మూడు శతాబ్ధాల కాలం బ్రిటిష్ ఆధిక్యతలో ఉన్నాయి) ఆంగ్లికనిజం , మొరవియన్ సమూహాలు ఉన్నాయి. బ్రిటిష్ , జర్మనీ ఆంగ్లికన్ , మొరవియన్ రూపాలలో ఈప్రాంతంలో ప్రొటెస్టెంటిజం ప్రవేశపెట్టాయి. 19వ శతాబ్దంలో మిగిన నికరాగ్వా అంతటా విస్తరింపజేసాయి.[159] నికరాగ్వాలో " ది చర్చి ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ " మిషనరీ రెండు మిషనరీ విభాగాలతో 95,768 సభ్యులతో (మొత్తం జనసఖ్యలో 1.54%) మతపరమైన సేవలందిస్తుంది.[160].అధికసంఖ్యలో వచ్చి చేరిన వలసప్రజలతో బుద్ధిజం క్రమంగా దేశంలో అభివృద్ధి చెందుతూ ఉంది.[161]
నికరాగ్వాకు వలసప్రజలు పెద్ద ఎత్తున ఎప్పుడూ రాలేదు. నికరాగ్వాకు లాటిన్ అమెరికా -, ఇతర ప్రంపంచ దేశాల నుండి వలసగా వచ్చి చేరిన మొత్తం ప్రజలు మొత్తం జనసంఖ్యలో 1.2% ఉంది. గత 10 సంవత్సరాలలో ఈ సంఖ్య 0.06% అభివృద్ధి చెందింది. [150] 19వ శతాబ్దంలో నికరాగ్వాకు పరిమితమైన ఐరోపా వలసలు ఆరంభం అయ్యాయి. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం నుండి ప్రజలు నికరాగ్వాకు వచ్చిచేరారు.వీరు సెంట్రల్, పసిఫిక్ ప్రాంతాలలో స్థిరపడ్డారు. మిడిల్ ఈస్ట్ - నికరాగ్వన్, సిరియన్లు, ఆర్మేనియన్లు, యూదులు, లెబనీయులు నికరాగ్వాలో నివసిస్తున్నారు. వీరి సంఖ్య 3,000 ఉంటుంది. అలాగే హాన్ చైనీస్, తైవానీయులు, జాపనీస్ మొదలైన తూర్పాసియా ప్రజలు కూడా ఉన్నారు.నికరాగ్వా చైనీయుల సంఖ్య దాదాపు 12,000 ఉంటుంది. [162] The Chinese arrived in the late 19th century but were unsubstantiated until the 1920s.
అంతర్యుద్ధం కారణంగా అత్యధికంగా నికరాగ్వా ప్రజలు దేశాంతరాలకు వెళ్ళి నివసించడం ఆరంభించారు. 1990, 21వ శతాబ్దం మొదటి దశాబ్ధంలో నిరుద్యోగం, పేదరికం కారణంగా చాలామంది ప్రజలు దేశం విడిచి వెళ్ళారు. నికరాగ్వా డయాస్పొరా (విదేశీనివాసిత ప్రజలు) యునైటెడ్ స్టేట్స్, కోస్టారికా దేశాలకు వలస పోయారు. ప్రస్తుతం నికరాగ్వా మొత్తం ప్రజలలో ప్రతి 6 మందిలో ఒకరు ఈరెండు దేశాలలో నివసిస్తున్నారు.[163] నికరాగ్వా డ్యాస్పొరా ప్రజాసమూహాలు అధికంగా పశ్చిమ ఐరోపాలో నివసిస్తున్నారు. చిన్న సమూహాలుగా ఫ్రెంచి, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నార్వే, స్వీడన్, యునైటెడ్ కింగ్డం దేశాలలో నివసిస్తున్నారు. స్వల్ప సమూహాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో నివసిస్తున్నారు. మరి కొన్ని సమూహాలు కెనడా,బ్రెజిల్,అర్జెంటీనా మొదలైన దేశాలలో కూడా నివసిస్తున్నారు. మరి కొన్ని సమూహాలు ఆసియా, జపాన్ లలో నివసిస్తున్నారు.దేశంలో నెలకొన్న తీవ్రమైన పేదరికం కారణంగా పొరుగున ఉన్న ఎల్ సల్వేడార్ (యు.ఎస్.డాలర్ కరెంసీగా ఉన్న దేశం) లో పనిచేస్తూ జీవిస్తున్నారు.[164][165]
గత కొన్ని దశాబ్ధాలలో నికరాగ్వా ఆరోగ్యరీత్యా అభివృద్ధి చెందినప్పటికీ జసంఖ్యాభివృద్ధి కారణంగా ఇప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నది [166] నికరాగ్వా ప్రభుత్వం పౌరులకు ఉచిత ఆరోగ్యరక్షణ సౌకర్యాలు కలిగించడానికి ప్రయత్నిస్తుంది.[167] ప్రస్తుత ఆరోగ్యసంరక్షణ విధానంలో ఉన్న పరిమితులు, సరఫరాలలో అసమానతలు, మద్య, అట్లాంటిక్ ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యరక్షణలో వ్యక్తిగతశ్రద్ధ తీసుకోవడంలో లోపం వంటి సమస్యలు ప్రజల ఆరోగ్యరక్షణకు ఆటకంగా ఉన్నాయి.[166] ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వికేంద్రీకరణ విధానాన్ని స్వీకరించింది. ఇది ప్రజలకు వ్యాధినిరోధం, ప్రాథమిక ఆరోగ్యరక్షణ సౌకర్యాలను అందించడానికి సహకరిస్తుంది.[168] నికరాగ్వా ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత ఆరోగ్యరక్షణ సౌకర్యం కల్పిస్తుంది.[167]
నికరాగ్వా వయోజన అక్షరాస్యత 78%.[169] నికరాగ్వాలో ప్రాథమిక విద్య ఉచితంగా అందించబడుతుంది. ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు అధికంగా మతసంస్థలు నిర్వహిస్తున్నాయి. [170] 1979 గణాంకాల ఆధారంగా లాటిన్ అమెరికా దేశాలలో విద్యావిధానం బలహీనంగా ఉన్న దేశాలలో నికరాగ్వా ఒకటిగా భావిస్తున్నారు.[171] 1980లో అధికారం స్వీకరించిన శాండినిస్టా ప్రభుత్వం సెకండరీ స్కూలు విద్యార్థులను, విశ్వవిద్యాలయ విద్యార్థులను, ఉపాధ్యాయులను వాలంటీర్లుగా ఉపయోగించి విస్తారమైన విద్యాభివృద్ధి పధకాలను విజయమంతగా ప్రవేశపెట్టింది. నూతన విద్యావిధానం కారణంగా 5 మాసాల కాలంలో నిరక్ష్యరాశ్యత 50.3% నుండి 12.9% నికి చేరుకుంది. [172] పెద్ద ఎత్తున సాగిన అక్షరాస్యత, ఆరోగ్యసంరక్షణ, విద్యాభివృద్ధి, శిశురక్షణ, యూనియన్లు, భూసంస్కరణలు కార్యక్రమాలలో ఇది ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం సాధించింది.[173][174] శాండినిస్టాస్ వామపక్ష భావజాలాన్ని విద్యాంశాలలో (సిలబస్)చేర్చారు. అయినప్పటికి ఇవి 1990 లో తొలగించబడ్డాయి.[98] 1980 సెప్టెంబరులో నికరాగ్వా విద్యాభివృద్ధి కార్యక్రమాన్ని గుర్తిస్తూ యునెస్కొ " నడెఝ్డా క్రుప్స్క్యా " (దీనికి సోవియట్ యూనియన్ నిధిసహకారం అందిస్తుంది) పురస్కారం బహూకరించింది.[175] ఉన్నతవిద్యా సంస్థలలో అధికం మనాగ్వాలో ఉన్నాయి.[176] నికరాగ్వా ఉన్నతవిద్యావిధానంలో 48 విశ్వవిద్యాలయాలు, 113 కళాశాలలు, ఎలెక్ట్రానిక్స్, కంప్యూటర్స్, కంప్యూటర్ సైన్సు, అగ్రొఫారెస్టరీ మొదలైన టెక్నికల్ ఇంస్టిట్యూట్స్, నిర్మాణం, వాణిజ్య సంబంధిత విద్యాసేవలు అంతర్భాగంగా ఉన్నాయి.[177] 2005 లో 4,00,000 (7%) నికరాగ్వాప్రజలు అకాడమిక్ డిగ్రీ అందుకున్నారు.[178] నికరాగ్వాలో పలు ప్రత్యేక విద్యాసంస్థలు ఉన్నాయి. విద్యాభివృద్ధి మీద తీసుకునే శ్రద్ధ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తుంది.[98]
నికరాగ్వా సంస్కృతిలో జానపద సంస్కృతి, సంగీతం మతసంప్రదాయాలు ఉన్నాయి. నికరాగ్వా సంస్కృతిని యురేపియన్ సంస్కృతి తీవ్రంగా ప్రభావితం చేసింది.దీనికి స్థానిక అమెరికన్ వాయిద్యాలు, ఆహారవిధానాలు చేర్చబడ్డాయి. నికరాగ్వా సంస్కృతి వైవిధ్యంగా ప్రాంతాలవారిగా పరిశీలించబడుతుంది. పసిఫిక్ సముద్రతీరంలో శక్తివంతమైన జానపదసాహిత్యం,సంగీతం, సంప్రదాయం యురేపియన్ సంస్కృతితో తీవ్రంగా ప్రభావితమై ఉంది.నికరాగ్వా సంస్కృతి స్పెయిన్ కాలనీ ప్రాంతంగా ఉంది కనుక స్పానిష్ మాట్లాడుతున్న ఇతర లాటిన్ అమెరికాదేశాలను పోలి ఉంది.పసిఫిక్ సముద్రతీరంలో నివసిస్తున్న స్థానికజాతులకు చెందిన ప్రజల సంస్కృతి అధికంగా మెస్టిజో సంస్కృతిని పోలి ఉంది.
నికరాగ్వాలోని కరీబియన్ సముద్రతీరప్రాంతం ఒకప్పుడు బ్రిటిస్గ్ ప్రొటెక్టరేట్ ప్రాంతంగా ఉంది. స్పానిష్, స్థానిక భాషలతో కలిసి ఇంగ్లీష్ భాష కూడా నివాసాలలో సరళంగా మాట్లాడబడుతుంది. ఇక్కడ సంస్కృతి కరీబియన్ సంస్కృతిని (బ్రిటిష్ పాలితదేశాలైన జమైకా,బ్రెజిల్ కేమన్ ద్వీపాలు) పోలి ఉంది. పసిఫిక్ సముద్రతీర ప్రజలలా కాకుండా కరీబియన్ సముద్రతీర ప్రజలు తమ ప్రత్యేకతను కాపాడుకుంటూ ఇప్పటికీ తమ స్థానికభాషలను మాట్లాడుతూ ఉన్నారు.
నికరాగ్వా సంగీతం మిశ్రితస్థానికసంగీతం, స్పానిష్ సంగీతాలతో ప్రభావితమై ఉంది. సంగీతవాయిద్యాలలో మరింబా, మద్య అమెరికా సంగీత వాయిద్యాలు ఉపయోగించపడుతున్నాయి. మరింబా వాయిద్యాన్ని వాయిద్యకారుడు కూర్చుని వాయిద్యాన్ని తన మోకాలిమీద పెట్టుకుని వాయిస్తుంటాడు. ఆయనను ఇత్తడి ఫిడిల్, గిటార్, గిటారిల్లా వాయిద్యకారులు అనుసరిస్తుంటారు. ఈ కచేరీ సాంఘిక ఉత్సవాలలో నేపథ్య సంగీతంలా ప్రదర్శించబడుతుంది.
మరింబా వాయిద్యం వెదురు లేక లోహపు పైపుల మీద హార్డ్‌వుడ్ ప్లేటు ఉంచి వేరు వేరు సైజులతో తయారుచేయబడుతుంది. దీనిని వాయించడానికి 3-4 హమ్మర్లు ఉపయోగిస్తారు. కరీబియన్ సముద్రతీరం నృత్యసంగీతం పాలో డీ మాయో నృత్యరీతికి ప్రసిద్ధిచెందింది. ఇది దేశవ్యాప్తంగా ప్రజాదరణ కలిగి ఉంది. ఇది అధికంగా మే మాసంలో నిర్వహించబడే " పాలో డీ మాయో ఫెస్టివల్ " సమయంలో ప్రదర్శించబడుతుంది. గరిఫ్యునా కమ్యూనిటీ (ఆఫ్రో- స్థానిక అమెరికన్) ప్రబలమైన పుంటా సంగీతానికి ప్రసిద్ధిచెంది ఉన్నారు.
నికరాగ్వా సంగీతప్రపంచం అంతర్జాతీయ సంగీతంతో ప్రభావితమై ఉంది. బచటా, మెరెంగ్యూ, సల్సా, కుంబియా సంగీతరూపాలు మనాగ్వా, లియాన్, గ్రనడా సాంస్కృతిక కేంద్రాలలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. గుస్టోవ్ లేటన్ నికరాగ్వా కళాకారులు ఒమెటెపే ద్వీపం, మానాగ్వాలలో కుంబియా నృత్యానికి గుర్తింపు తీసుకుని వచ్చారు. సల్సా నృత్యం మనాగ్వా నైట్ క్లబ్బులలో అత్యధికమైన ప్రాబల్యత సంతరించుకుంది. వివిధ్యంగా ప్రభావితమైన సల్సా నృత్యం ప్రాంతాలవారిగా వ్యత్యాసపడుతూ ఉంది. న్యూ యార్క్ శైలి, క్యూబన్ శైలి (సల్సా కాసినొ) దేశవ్యాప్తంగా ప్రాబల్యత సంతరించుకున్నాయి.
నికరాగ్వాలో నృత్యం ప్రాంతాలవారిగా మారుతూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో హిప్స్, టర్న్స్ కదలికలకు బలంగా దృష్టి కేంద్రీకరించబడుతుంది. నగరాలలోని నృత్యరీతులలో నాజూకైన అడుగులు, టర్న్స్ మీద అధికంగా దృష్టి కేంద్రీకరించబడుతుంది. డోమినికన్ రిపబ్లిక్ నృత్యరీతులు, యునైటెడ్ స్టేట్స్ నృత్యరీతులు దేశవ్యాప్తంగా కనిపిస్తుంటాయి. నికరాగ్వాలో బచ్టా నృత్యం ప్రాబల్యత సంతరించుకుంది.మైమి, లాస్ ఏంజెలెస్, న్యూ యార్క్ ప్రాంతాలలో నివసిస్తున్న నికరాగ్వా ప్రజలు బచటా నృత్యాన్ని నికరాగ్వాలో ప్రవేశపెట్టారు. సమీపకాలంలో టాంగో నృత్యం కూడా సాంస్కృతిక నగరాలు, బాల్ రూం వేదికలలో ప్రదర్శించబడుతుంది.
కొలబియ సాహిత్యం కొలంబియన్ పూర్వమే ఆరంభం అయింది. కొలంబియన్ పూర్వ నికరాగ్వా సాహిత్యంలో పౌరాణిక విశ్వాసాలు, ఆదిమజాతులకు చెందిన మౌఖిక సాహిత్యంతో రూపొందించబడింది. వీటిలో కొన్ని కథనాలు నికరాగ్వాలో ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. మిగిలిన లాటిన్ అమెరికన్ దేశాలలో మాదిరి నికరాగ్వాలో కూడా స్పానిష్ విజయం సాస్కృతిని, సాహిత్యాన్ని ప్రభావితం చేసింది.స్పానిష్ మాట్లాడే ప్రపంచంలో నికరాగ్వా సాహిత్యం, కవిత్వం ప్రధాన వనరుగా ఉన్నాయి. నికరాగ్వా సాహిత్యకారుడు " రూబెన్ డరియొ " రచనలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. 19వ శతాబ్దం చివరికి ఆయన " ఫాదర్ ఆఫ్ మోడరనైజేషన్ " అని పిలువబడ్డాడు. [180] ఇతర సాహిత్యకారులలో కార్లోస్ అటానియో కౌడ్రా, అల్బెర్టో కౌడ్రా మెజియా, మనొలో కౌడ్రా, అర్గ్యుల్లొ, ఒర్నాల్డొ, కౌడ్రా డోనింగ్, అల్ఫ్రెడొ అలెగ్రియా రొసలెస్,, సెర్గియో రమిరెజ్ మెర్కాడో, ఎర్నెస్టో కార్డెనల్, జియోకాండా బెల్లి, క్లరిబెల్ అలెగ్రియా, జోస్ కొరొనెల్ ఉర్టెచొ ప్రాధాన్యత వహిస్తున్నారు.
కొలంబియన్ తరువాత " ఎల్ గ్యుగ్యుంసె " నాటకం మొదటి సాహిత్యప్రక్రియగా గుర్తించబడుతుంది. ఇది అజ్తెక్ నహుయత్, స్పానిష్ భాషలలో రచించబడింది. ఇది లాటిన్ అమెరికా అత్యంత ప్రాముఖ్యత కలిగిన భావవ్యక్తీకరణ, నికరాగ్వా జానపదసాహిత్యానికి ప్రతీకగా భావిస్తున్నారు. స్పానిష్ కాలనైజేషన్ను వ్యతిరేకిస్తూ సంగీతం, నృత్యం, వచన సమ్మిశ్రితంగా రచింపబడింది.[180] 16వ శతాబ్దంలో ఇండిజెనియస్ మొదటి సాహిత్యప్రక్రియగా నాటకం రచించబడింది.2005లో యునెస్కో దీనిని " పాట్రిమొనీ ఆఫ్ హ్యూమనిటీ "గా గుర్తించింది.[181] శతాబ్ధాల కాలం ప్రదర్శించబడిన తరువాత ఇది 1942లో పుస్తకంగా ప్రచురితం అయింది. [182]
నికరాగ్వా ఆహారసంస్కృతి స్పానిష్ ఆహారం , కొలంబియన్ పూర్వ ఆహారవిధీనాలతో సమ్మిశ్రితమై ఉంది.[183] సంప్రదాయ ఆహారాలు పసిఫిక్ , కరీబియన్ సముద్రతీరాలలో మారుపడుతూ ఉంటాయి. పసిఫిక్ తీరప్రాంతాలలో పండ్లు , మొక్కజొన్న ప్రధాన ఆహారాలుగా ఉన్నాయి. కరీబియన్ సముద్రతీర ఆహారాలలో సీఫుడ్ , కొబ్బరి అధికంగా ఉపయోగించబడుతున్నాయి.
ఇతర లాటిన్ అమెరికా దేశాలలో మాదిరిగా నికరాగ్వాలో మొక్కజొన్న ప్రధాన ఆహారంగా ఉంది. మొక్కజొన్న పలు ఆహారాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మొక్కజొన్నతో నకాటమల్ , ఇండియో వియేజొ మొదలైన ఆహారాలు తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. పినోలిలో , చిచా మొదలైన పానీయాలు తయారు చేయడానికి కూడా మొక్కజొన్న ఉపయోగించబడుతుంది.మొక్కజొన్న అన్నం , బీంస్ వంటి ఆహారాలను తరచుగా స్వీకరిస్తుంటారు.
నికరాగ్వా జాతీయ వంటకం గాలో పింటో తెల్లబియ్యం , ఎర్ర బీంస్తో విడిగా ఉడకబెట్టి ఒకటిగా ఫ్రై చేసి తయారు చేయబడుతూ ఉంది. ఈ అహారాన్ని పలు భేదాలతో తయారు చేయబడుతుంది. కరీబియన్ సముద్రతీరాలలో దీనికి కొబ్బరి పాలు లేక తురుము చేర్చి తయారు చేయబడుతుంది. నికరాగ్వా ప్రజలలో చాలామంది గల్లోపింటోతో వారి రోజును ప్రారంభిస్తారు. గల్లోపింటో సాధారణంగా కార్నె అసడాతో (సలాడ్), ఫ్రైడ్ చీజ్, వండిన అరటిపండ్లు (ప్లాంటియన్లు) లేక మడురోస్లతో చేర్చి వడ్డించబడుతుంది.
నికరాగ్వా ప్రజలలో చాలామంది తమ ఆహారాలలో జొకొటే, మామిడి, బొప్పాయి, చింతపండు, పిపియన్, అరటి, అవాకాడో, కసావా (యుక) , మూలికలు సిలాంట్రొ, ఒరెగానొ , బిక్సా ఒరెల్లనా (అచియొటె) మొదలైన ఇండిజెనియస్ పండ్లను చేర్చుకుంటున్నారు.[183] నికరాగ్వా ప్రజలు గునియా పందులను ఆహారంగా తీసుకుంటున్నారు.[184] గునియా పందులను " కుయ్ " అంటారు. టపిర్స్, ఇగుయాంస్, తాబేలు గ్రుడ్లు, ఆర్మడిల్లోస్ , బొయాలా (పెద్ద పాము) లను ఆహారంగా తీసుకుంటారు. ఈ వన్యజంతువుల సంఖ్య క్షీణిస్తున్న కారణంగా ఈజంతువులను ఆహారంగా తీసుకునే అలవాటును మాంపించడానికి ప్రయత్నిస్తున్నారు.[183]
నికరాగ్వా రేడియో , టి.వి. వార్తలకు ప్రధాన వనరుగా ఉంది. నికరాగ్వాలో 100 రేడియో స్టేషన్లు , పలు టి.వి. నెట్వర్కులు ఉన్నాయి. పలు నగరప్రాంతాలలో కేబుల్ టి.వి అందుబాటులో ఉంది.[185] నికరాగ్వా ప్రింటు మీడియా విభిన్నంగా విభజించబడుతుంది. మాద్యమం ప్రభుత్వానికి అనుకూలంగా , వ్యతిరేకంగా వార్తాప్రచురణలను అందిస్తుంది. ప్రచురణలలో లా ప్రెంసా (మనాగ్వా), ఎల్ న్యువొ డియారియొ, కాంఫిడెంషియా, హాయ్ , మెర్క్యురియొ ప్రధాన్యత వహిస్తున్నాయి. ఆన్ లైన్ వార్తా పబ్లికేషన్లలో కాంఫిడెంషియల్ , ది నికరాగ్వా డిస్పాచ్ ప్రధాన్యత వహిస్తున్నాయి.
నికరాగ్వాలో బేస్ బాల్ చాలా జనాదరణ కలిగి ఉంది. నికరాగ్వా ఇప్పటికీ అమెరికన్ సంప్రదాయ శైలి బేస్ బాల్ క్రీడను ఆదరిస్తుంది.నికరాగ్వాలో బేస్ బాల్ 19వ శతాబ్దంలో పరిచయం చేయబడింది. 1888లో బ్లూఫీల్డుకు చెందిన కరీబియన్ కోస్ట్ లోకల్స్ బేస్ బాల్ ఎలా ఆడాలో నేర్పించారు.[186] 1891 వరకు పసిఫిక్ సముద్రతీరంలో బేస్ బాల్‌కు ఆదరణ లభించలేదు.అధికంగా కాలేజి విద్యార్థులతో కూడిన బృందం " లా సొసియెడాడ్ డీ రెక్రెయొ " (సిసైటీ ఆఫ్ రిక్రియేషన్) పలు బేస్ బాల్ క్రీడలలో పాల్గొన్నది.[186] నికారాగ్వాలో అత్యధిక ప్రజాదరణ పొందిన క్రీడలలో బాక్సింగ్ ద్వితీయ స్థానంలో ఉంది. [187] నికార్గ్వాలో " అలెక్సిస్ అర్గ్యుయెల్లో, రికార్డో మాయొర్గా వంటి వరల్డ్ చాంపియన్లు అలాగే రోమన్ గాంజెలెజ్ (బాక్సర్) బాక్సర్లుగా గుర్తింపు పొందారు. సమీపకాలంలో " అసోసియేషన్ ఫుట్ బాల్ " క్రీడకు ఆదరణ పొందుతూ ఉంది. " డెనిస్ మార్టినెజ్ నేషనల్ స్టేడియం " ఫుట్ బాల్, బేస్ బాల్ క్రీడలు నిర్వహించడానికి సహకారం అందిస్తుంది. 2011లో మొదటిసారిగా మనాగ్వాలో ఫుట్ బాల్ కొరకు మాత్రమే స్టేడియం నిర్మించబడింది.[188]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.