అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా పాత విశాఖపట్నం జిల్లా లోని భాగాలతో 2022లో కొత్తగా ఏర్పరచిన జిల్లా. జిల్లా కేంద్రం అనకాపల్లి. ఈ జిల్లాలోని బొజ్జన్నకొండ ప్రముఖ బౌద్ధ పర్యాటక ఆకర్షణ.
అనకాపల్లి జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 17.69°N 83.00°E | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా కేంద్రం | అనకాపల్లి |
పరిపాలనా విభాగాలు |
|
విస్తీర్ణం | |
• Total | 4,292 కి.మీ2 (1,657 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 17,27,000 |
• జనసాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
భాషలు | |
• ఆధికార | తెలుగు |
Time zone | UTC+05:30 (IST) |
ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత గజపతులు, కాకతీయులు, కుతుబ్ షాహి రాజులు పాలించారు. సుమారు 1450 ప్రాంతంలో ఆర్కాటు నవాబు అధీనంలో ఉండేది. బొజ్జన్నకొండపై లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం శాతవాహనులు, విష్ణుకుండిన, గజపతి, విజయనగర రాజులు, గోల్కొండ సామంత రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. జిల్లా ముఖ్యపట్టణమైన అనకాపల్లికి అనియాంకపల్లి, అనేకఫల్లె, విజయపురి, వెనియాపాలి, కనకపురి, బెల్లంపట్నం, అనేక పేర్లు ఉన్నాయి. ఇది పవిత్ర శారదా నది ప్రక్కన ఉంది. .అనకాపల్లిలోని బెల్లం మార్కెట్లో జాతిపిత గాంధీజీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బెల్లం మార్కెట్‌కి గాంధీ మార్కెట్ అని పేరు పెట్టాలని రైతులు గాంధీని కోరారు.అతను అభ్యర్థనను అంగీకరించాడు, మీరు ఏదైనా చెడు పనులు చేయకుంటే, నా పేరును ఉంచడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.గాంధీ N.G రంగ, CPI యొక్క జయ ప్రకాష్ నారాయణ్ వంటి నాయకులుసందర్శించిన తర్వాత, 1 సంవత్సరం తర్వాత జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ కూడా అనకాపల్లిలో ప్రసంగాలు చేశారు[2].భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో బి.ఆర్.అంబేద్కర్ అనకాపల్లిని సందర్శించారు.[3]
2022 ఏప్రిల్ 4న పాత విశాఖపట్నం జిల్లా భాగంతో అనకాపల్లి జిల్లాను కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు.[1]
అనకాపల్లి జిల్లా శారదా నది తీరాన ఉంది. ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలు విస్తరించిన భాగంలో ఉంది.జిల్లాకు ఉత్తరాన అల్లూరి సీతారామరాజు, తూర్పున విశాఖపట్నం, విజయనగరం, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలున్నాయి.
జిల్లా విస్తీర్ణం 4,292 చ.కి.మీ.[1] ఈ శారదా నది మాడుగుల కొండలలో జన్మించింది, ఇది చోడవరం, అనకాపల్లి, యలమంచిలిలో ప్రవహిస్తుంది.ఈ నది నూకాలమ్మ ఆలయానికి ఎదురుగా ప్రవహించేది, తరువాత గవరపాలెం ప్రజలు నదిని పొలాలకు మళ్లించారు. ఈ రోజు వరకు, నూకాలమ్మ ఆలయానికి కొన్ని మీటర్ల దిగువన నది బేసిన్ ఇసుక కనుగొనబడింది.[2]
జనగణన వివరాలు:
జిల్లా పరిధిలో జనాభా మొత్తం 17.270 లక్షలు మంది ఉన్నారు.[1]
జిల్లాలో అనకాపల్లి రెవెన్యూ, నర్సీపట్నం రెవెన్యూ డివిజను అనే రెండు డివిజన్లున్నాయి. ఈ రెవెన్యూ డివిజన్లను 24 మండలాలుగా విభజించారు.[1][4]
జిల్లా కేంద్రం అనకాపల్లి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. జిల్లాలో ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీలు, బౌలువాడ, చోడవరం, నక్కపల్లె, పాయకరావుపేట జనగణన పట్టణాలున్నాయి.
అనకాపల్లి జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.