హెచ్. డి. కుమారస్వామి
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
హరదనహళ్ళి దేవెగౌడ కుమారస్వామి (జ. 1959 డిసెంబరు 16)[3] భారతీయ రాజకీయనాయకుడు, కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. అతను భారతదేశ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కుమరుడు. అతను కర్నాటక సినిమా రంగంలో నిర్మాత, పంపిణీదారుడు, ప్రదర్శకుడు.[4] కుమారస్వామి "కుమారన్న" గా సురిచితుడు. [5][6] అతను కర్నాటక రాష్ట్రంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి అధ్యక్షుడు.[7]
హెచ్. డి. కుమారస్వామి | |||
![]() | |||
పదవీ కాలం 23 మే 2018 – 26 జులై 2019 | |||
గవర్నరు | వాజుభాయ్ వాలా | ||
ముందు | బి.ఎస్.యడ్యూరప్ప | ||
నియోజకవర్గం | చన్నపట్న | ||
పదవీ కాలం 3 ఫిబ్రవరి 2006 – 9 అక్టోబరు 2007 | |||
ముందు | ధరమ్ సింగ్ | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
నియోజకవర్గం | రామనగర | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1959-12-16) 1959 డిసెంబరు 16 (వయసు 64) హరదనహళ్ళి, మైసూరు రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
తల్లిదండ్రులు | హెచ్.డి.దేవెగౌడ(తండ్రి) చెన్నమ్మ (తల్లి) | ||
జీవిత భాగస్వామి | అనిత కుమారస్వామి (m. 1986) | ||
బంధువులు | హెచ్.డి.రవన్న (సోదరుడు) ప్రజ్వల్ రేవణ్ణ | ||
సంతానం | నిఖిలా గౌడ షమిక కుమారస్వామి [2] | ||
వృత్తి | రాజకీయనాయకుడు, సినిమా నిర్మాత |
హెచ్.డీ. కుమారస్వామి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చెన్నపట్న శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో మాండ్య లోక్సభ నియోజకవర్గం నుండి జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణే గౌడపై 284620 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచి[8][9], కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టి[10], జూన్ 15న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.[11]