1987 సినిమా From Wikipedia, the free encyclopedia
స్వయంకృషి 1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు సినిమా. శ్రమలోని ఔన్నత్యం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) ఈ సినిమాలో ప్రధానాంశంగా కనిపిస్తుంది. సున్నితమైన పాత్రలో చిరంజీవి నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల, విమర్శకుల మెప్పును పొందింది. కథలో ఇమిడేలాగా ప్రేమ పాటలు, ఫైట్లు కూడా చిత్రానికి మంచి బలాన్ని చేకూర్చాయి.[1] ఈ సినిమాలో నటనకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం లభించగా, విజయశాంతికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. ఈ చిత్రాన్ని 1987 లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు
స్వయంకృషి | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
రచన | కె.విశ్వనాథ్ (కథ, స్క్రీన్ ప్లే), జంధ్యాల (మాటలు) |
నిర్మాత | ఏడిద నాగేశ్వరరావు, ఏడిద రాజా |
తారాగణం | చిరంజీవి, విజయశాంతి |
ఛాయాగ్రహణం | లోక్ సింగ్ |
కూర్పు | జి. జి. కృష్ణారావు |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 3 సెప్టెంబరు 1987 |
సినిమా నిడివి | 164 నిమిషాలు |
భాష | తెలుగు |
చదువురాని సాంబయ్య చెప్పులు కుట్టుకుంటూ చనిపోయిన తన చెల్లెలి కొడుకు చిన్నాని పెంచుతుంటాడు. చిన్నతనంలో తన చెల్లెలితో పాటు తనలాగే అనాథ అయిన శారదను చదివిస్తాడు. ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఆశ పడతాడు కానీ ఆమె భాస్కర్ అనే వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఎప్పటి నుంచో సాంబయ్యను ఇష్టపడుతున్న గంగ సాంబయ్యకి తన మేనల్లుడి మీదున్న ప్రేమతో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని మరీ అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. సాంబయ్య కష్టపడి పైకొచ్చి పెద్ద వ్యాపారవేత్త అవుతాడు. చదువు విలువ తెలిసిన సాంబయ్య గంగను చదువుకోమని బలవంతం చేస్తుంటాడు.
ధనిక జీవితానికి అలవాటు పడిన చిన్నా తనకు చెప్పులు తుడుచుకోవడం, స్కూల్ బ్యాగ్ మోయడం వంటి కాయకష్టపు పనులంటే అసహ్యమని మొరాయిస్తుంటాడు. చిన్నాకు జన్మనిచ్చిన తండ్రి గోవింద్ (చరణ్ రాజ్), శారద భర్త (బెనర్జీ) కలిసి సాంబయ్య ఇంటిలో కలతలు సృష్టించి అతని ఆస్తిని కాజేయడానికి, అతనిపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తారు. చివరికి చిన్నాను కాపాడుకోవడం కోసం ఆస్తి మొత్తాన్ని చిన్నా పేరుమీద వ్రాసి (ప్రత్యర్ధులకు అప్పగించి) సాంబయ్య, గంగ మళ్ళీ చెట్టుకింద చెప్పులు కుట్టుకొనే వృత్తి చేపడతారు. తన తప్పు తెలుసుకొన్న చిన్నా ఆ ఎదురు చెట్టు క్రింద చెప్పులు కుట్టడానికి కూర్చుంటాడు.
ఈ సినిమా సెప్టెంబరు 3, 1987 న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 26 సినిమా హాళ్ళలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రాన్ని 1987 లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.[2]
సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1987 | చిరంజీవి | నంది ఉత్తమ నటులు | గెలుపు |
1987 | విజయశాంతి | దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం | గెలుపు[2] |
ఈ సినిమా ప్రభావంతో ఏలూరులో ఒక ఫుట్‌పాత్‌పై బ్యాగులు, చెప్పులు కుట్టే కార్మికుడు తన దుకాణానికి "స్వయంకృషి" అని పేరు పెట్టుకొన్నాడు.
అన్ని పాటల రచయిత సింగిరెడ్డి నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది రమేష్ నాయుడు.
క్రమసంఖ్య | పేరు | గానం | నిడివి |
---|---|---|---|
1. | "సిన్ని సిన్ని కోరికలడగ" | ఎస్.జానకి | |
2. | "పారాహుషార్" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | |
3. | "సిగ్గూ పూబంతి" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ | |
4. | "హలో హలో డార్లింగ్" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.