![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a0/Flag_of_Somalia.svg/langte-640px-Flag_of_Somalia.svg.png&w=640&q=50)
సొమాలియా
From Wikipedia, the free encyclopedia
సోమాలియా;[4][5][6] (సోమాలియా భాష : సూమాలియా) ; (అరబ్బీ الصومال ; అస్-సూమాల్), ఆధికారిక నామం "సోమాలియా గణతంత్రం" (అల్ జమ్హూరియా అస్-సూమాల్ - جمهورية الصومال ). [7] ఇది ఆఫ్రికా ఖండంలో ఈశాన్య దిశలో(హార్ను ఆఫ్ ఆఫ్రికా) ఉంది. దీనికి వాయవ్యసరిహద్దులో జిబౌటి, నైరుతిసరిహద్దులో కెన్యా, ఉత్తరసరిహద్దులో "అడెను అఖాతము", యెమన్, తూర్పుసరిహద్దులో గుయార్డఫీ కాలువ - సొమాలీ సముద్రం, పశ్చిమసరిహద్దులో ఇథియోపియాలు ఉన్నాయి. ఆఫ్రికా ప్రధానభూభాగంలో సొమాలి పొడవైన సముద్రతీరం కలిగి ఉంది. ఈ దేశంలో దీర్ఘకాలిక అంతర్యుద్ధం వలన అభివృద్ధి క్షీణించినది. తద్వారా ఈ దేశపు కరెన్సీ విలువ తీవ్రంగా పతనమైంది. ఒక్క కప్పు కొనడానికి ఒక కేజీ కరెన్సీ కట్టలు పోసుకొని పోవాల్సివస్తుంది.ఈ దేశంలోని ఉత్తర ప్రాంతము స్వాతంత్రం ప్రకటించుకొని సోమాలిల్యాండ్ అనే దేశంగా ఏర్పడింది. కానీ ఈ దేశాన్ని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం ఇంకా గుర్తించలేదు. ఈ దేశం కి హిందూ మహాసముద్రం తో తీరరేఖ ఉండడంతో ఈ దేశ ప్రజలు ఉపాధి లేక అటుగా వెళ్ళే పడవలపై దొంగతనాలు చేసే వాళ్ళు దాంతో ఈ దేశం పై దొంగల దేశం అనే ముద్ర పడింది. ప్రస్తుతం అగ్ర దేశాల సహాయంతో కొంతమేరకు అంతర్యుద్ధాన్ని నిలువరించగలుగుతుంది. [8] సొమాలీలో అధికంగా పీఠభూములు, మైదానాలు, పర్వతప్రాంతాలు ఉన్నాయి.[9] సంవత్సరం అంతా వేడి వాతావరణం నెలకొని ఉంటుంది. క్రమానుగత పవనాలు, క్రమానురహిత వర్షాలు ఉంటాయి..[10]ఈ దేశపు ఇటాలియన్ సోమాలీలాండ్ ఇటలీ నుండి జూలై 1 1960 లోను, అదే సంవత్సరం, బ్రిటిష్ సొమాలీలాండ్ తో కలుపబడి, జూన్ 26 1960 న స్వాతంత్ర్యం పొందినది.[11]
[జమ్హూరియాద్దా సూమాలియా] Error: {{Lang}}: text has italic markup (help) సోమాలియ గణతంత్రం |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
జాతీయగీతం [Soomaaliyeey Toosoow] Error: {{Lang}}: text has italic markup (help) సోమాలియా, వేక్ అప్ |
||||||
![]() |
||||||
రాజధాని | మొగదిషు 2°02′N 45°21′E | |||||
అతి పెద్ద నగరం | మొగదిషు | |||||
అధికార భాషలు | సోమాలి, అరబిక్ [1] | |||||
ప్రజానామము | సోమాలి | |||||
ప్రభుత్వం | సంకీర్ణ ప్రభుత్వం | |||||
- | అధ్యక్షుడు | షేక్ షరిఫ్ షేక్ అహ్మద్ | ||||
- | ప్రధాన మంత్రి | ఒమర్ అబ్దిరషిద్ అలి షర్ మర్కె | ||||
స్వాతంత్ర్యం | బ్రిటన్, ఇటలీ నుండి | |||||
- | తేది | 26 జూన్, 1 జూలై, 1960 | ||||
- | జలాలు (%) | 1.6 | ||||
జనాభా | ||||||
- | 2008 అంచనా | 9,558,666[2] (85 వది) | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $5.575 billion (153rd) | ||||
- | తలసరి | $600 (222nd) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2009) | N/A (low) (Not Ranked) | |||||
కరెన్సీ | సోమాలి షిల్లింగ్ (SOS ) |
|||||
కాలాంశం | EAT (UTC+3) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | en:.so (currently not operating) | |||||
కాలింగ్ కోడ్ | +252 | |||||
1 | The World Factbook[2] | |||||
2 | BBC News[3] | |||||
3 | Transitional Federal Charter of the Somali Republic |
సోమాలియా జనాభా సుమారు 14.3 మిలియన్లు అంచనా వేయబడింది.[12] సాంస్కృతికంగా ఇది ఆఫ్రికాలో అత్యంత ఏకజాతీయ దేశంగా వర్ణించబడింది.[13][14] ప్రజలలో 85% సోమాలీ ప్రజలు ఉన్నారు.[9] వీరు చారిత్రాత్మకంగా దేశంలోని ఉత్తర భాగంలో నివసిస్తూ ఉన్నారు. అల్పసంఖ్యాక వర్గాలు అధికంగా దక్షిణ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.[15]సోమాలీ, అరబిక్ అధికారిక భాషలుగా ఉన్నాయి.[9] దేశంలో ముస్లింలు అధికంగా ఉన్నారు. [16] వీరిలో సున్ని ముస్లిములు అధికంగా ఉంటారు.[17]
ప్రాచీన కాలంలో సోమాలియా ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది.[18][19] ఇది పూర్వపు పురాతన పుంటు ప్రజల అత్యంత ప్రభావవంతమైన ప్రదేశాలలో ఒకటి.[20][21][22] మధ్యయుగ కాలంలో శక్తివంతమైన సోమాలి సామ్రాజ్యాలు అనేకం ప్రాంతీయ వాణిజ్యాన్ని ఆధారం చేసుకున్నాయి; అజురను సామ్రాజ్యం, అడాలు సుల్తానేటు, వార్సాంగి సుల్తానేటు, సుల్తానేటు ఆఫ్ ది గెలీడిలతో సహా. సోమాలియాకు ఈ పేరు ఇటాలీ అన్వేషకుడు లుయిగి రోబెచీ బ్ర్రిచెట్టీ (1855-1926) చేత పెట్టబడింది.[23]
19 వ శతాబ్దం చివరలో బ్రిటిషు, ఇటాలీ సామ్రాజ్యాలు బ్రిటిషు సోమాలియాండు, ఇటలీ సోమాలిలాండు కాలనీలను స్థాపించాయి.
[24][25] అంతర్గత వ్యవహారాలలో మొహమ్మద్ అబ్దుల్లా హాసను దర్విషు తిరుగుబాటుతో బ్రిటీషును నాలుగు సార్లు తిప్పికొట్టాడు.
[26] సోమాలియాండు పోరాటంలో (1920) లొంగిపోకముందు తీరానికి తిరోగమనం చేయించాడు.[27] పాలక మజెర్రిను సుల్తానేటు, హొబ్యో సుల్తానేటుకు వ్యతిరేకంగా పోరాటం విజయవంతంగా నిర్వహించిన తరువాత ఈ ప్రాంతం ఈశాన్య, మధ్య, దక్షిణ ప్రాంతాల మీద పూర్తి నియంత్రణ లభించింది.[25] 1960 లో రెండు ప్రాంతాలు ఒక పౌర ప్రభుత్వానికి స్వతంత్ర సొమాలియా రిపబ్లికును ఏర్పరచటానికి విలీనం అయ్యాయి.[28]
1969 లో సుప్రీం రివల్యూషనరీ కౌన్సిలు అధికారాన్ని స్వాధీనం చేసుకుని " సొమాలీ డెమొక్రటికు రిపబ్లికు " ను స్థాపించింది. 1991 లో సోమాలియా పౌర యుద్ధం ప్రారంభమైన తరువాత ఇది పతనం అయింది. ఈ కాలంలో చాలా ప్రాంతాలు సంప్రదాయ, మతపరమైన చట్టాలకు తిరిగి వచ్చాయి. 2000 ల ప్రారంభంలో తాత్కాలిక సమాఖ్య పాలనా యంత్రాంగం ఏర్పడింది. 2000 లో ట్రాన్స్మిషినలు నేషనలు గవర్నమెంటు (టి.ఎన్.జి) స్థాపించబడింది. దాని తరువాత 2004 లో ట్రాన్స్మిషను ఫెడరలు గవర్నమెంటు (టి.ఎఫ్.జి) ఏర్పడింది. తరువాత సైనిక ప్రభుత్వం పునఃస్థాపించబడింది.[9][9][29]2006 లో టి.ఎఫ్.జి. కొత్తగా ఏర్పడిన ఇస్లామికు కోర్ట్సు యూనియను (ఐ.సి.యు) దేశం దక్షిణ వివాదాంతర మండలాల అధికారాన్ని నియంత్రించింది. తరువాత ఐ.సి.యు. అల్-షాబాబు వంటి మరింత తీవ్రమైన సమూహాలుగా చీలిపోయింది. ఇది ఈ ప్రాంతం నియంత్రణ కోసం టి.ఎఫ్.జి. దాని ఆఫ్రికన్ యూనియను మిషను టొ సోమాలియా మిత్ర పక్షాలతో పోరాడారు.[9]
2012 మధ్య నాటికి తిరుగుబాటుదారులు తాము స్వాధీనం చేసుకున్న భూభాగంలోని చాలా ప్రదేశాలను కోల్పోయారు. మరింత శాశ్వత ప్రజాస్వామ్య సంస్థల కోసం ఒక శోధన ప్రారంభమైంది.[30] 2012 ఆగస్టులో ఒక కొత్త తాత్కాలిక రాజ్యాంగం ఆమోదించబడింది,[31][32] ఇది ఒక సమాఖ్యగా సోమాలియాను సంస్కరించింది.[33] అదే నెలలో సోమాలియా ఫెడరలు ప్రభుత్వం ఏర్పడింది.[34] మొగడిషులో పునర్నిర్మాణ కాలం ప్రారంభమైంది.[30][35] సోమాలియా ఒక అనధికారిక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది; ప్రధానంగా పశువుల ఆధారంగా, సోమాలీ విదేశీ ఉపాధిదారుల వేతనాలు - టెలీకమ్యూనికేషంసు నుండి చెల్లింపులు.[9][36] ఇది ఐక్యరాజ్యసమితి, అరబు లీగు, ఆఫ్రికన్ యూనియన్, నాన్- అలైండు మూవ్మెంటు, ఆర్గనైజేషను ఆఫ్ ఇస్లామికు కోపరేషనులలో సభ్యదేశంగా ఉంది.