సంగారెడ్డి
From Wikipedia, the free encyclopedia
సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం.ఇది మంజీరా నది ఒడ్డున ఉంది.[2] అందమైన మంజీరా నది, సింగూరు డ్యాం జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ రాణి. ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ, హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 65కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది. ఇక్కడ సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది.
త్వరిత వాస్తవాలు Sangareddy Sangareddipet, Country ...
Sangareddy
Sangareddipet | |
---|---|
City | |
![]() Collectorate building of Sangareddy | |
Coordinates: 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917 | |
Country | ![]() |
State | Telangana |
District | Sangareddy |
Metro | Hyderabad Metropolitan Region |
City | Hyderabad |
Municipal Established | 1954 (70 సంవత్సరాల క్రితం) (1954) |
Named for | Sanga |
Government | |
• Type | Municipal Council |
• Body | Sangareddy Municipal Corporation |
• MLA | Jagga Reddy |
విస్తీర్ణం | |
• City | 13.70 కి.మీ2 (5.29 చ. మై) |
Elevation | 496 మీ (1,627 అ.) |
జనాభా (2011)[1] | |
• City | 72,344 |
• Rank | 21st in Telangana |
• జనసాంద్రత | 5,300/కి.మీ2 (14,000/చ. మై.) |
• Metro | 3,25,000 |
Languages | |
• Official | Telugu, Urdu |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 502 001 |
Telephone code | code-08455 |
Vehicle registration | TS 15 |
మూసివేయి
ఇక్కడకి దగ్గరలో వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరాలయం, శ్రీ రామ మందిరం, గణపతి దేవాలయం, సాయిబాబా దేవాలయం ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ వేడుకలు అత్యంత శోభయమానంగా జరుగుతాయి ముఖ్యంగా వైకుంఠఏకాదశి.