తెలంగాణ ములుగు జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
ములుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1]
ములుగు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, ములుగు స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ములుగు జిల్లా |
మండల కేంద్రం | ములుగు |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 362 km² (139.8 sq mi) |
జనాభా | |
- మొత్తం | 61,741 |
- పురుషులు | 31,197 |
- స్త్రీలు | 30,544 |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 49 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం ములుగు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఈ మండలం రెండు సార్లు జిల్లాలు మారింది.
లోగడ ములుగు గ్రామం/ మండలం, వరంగల్, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు,మండలాల ఏర్పాటులో భాగంగా (ములుగు) మండలాన్ని (1+17) పద్దెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4].
2019 ఫిబ్రవరి 16 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది.మరో 9 మండలాలతో పాటు ములుగు మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[5][6]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 362 చ.కి.మీ. కాగా, జనాభా 61,741. జనాభాలో పురుషులు 31,197 కాగా, స్త్రీల సంఖ్య 30,544. మండలంలో 16,136 గృహాలున్నాయి.[7]
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.