![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/45/Mitchell_Starc_fielding_2021_%2528cropped%2529.jpg/640px-Mitchell_Starc_fielding_2021_%2528cropped%2529.jpg&w=640&q=50)
మిచెల్ స్టార్క్
From Wikipedia, the free encyclopedia
మిచెల్ ఆరోన్ స్టార్క్ (జననం 1990 జనవరి 30) ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటరు. అతను ఆస్ట్రేలియన్ జాతీయ జట్టు దేశీయ క్రికెట్లో న్యూ సౌత్ వేల్స్ జట్టుకూ ఆడుతున్నాడు. ఎడమచేతి ఫాస్టు బౌలరు, దిగువ వరుసలో ఆడే ఎడమచేతి వాటం బ్యాటరు. స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ప్రధాన ఫార్మాట్లలోనూ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను ఆల్ టైమ్ అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. 2015 లో వన్డే క్రికెట్లో అత్యధిక రేటింగు పొందిన బౌలరతను.
![]() 2021 లో స్టార్క్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మిచెల్, ఆరన్ స్టార్క్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1990-01-30) 1990 జనవరి 30 (వయసు 34) బాల్ఖాం హిల్స్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.97[1] మీ. (6 అ. 6 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Alyssa Healy (wife)[2] Brandon Starc (brother) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 425) | 2011 డిసెంబరు 1 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూలై 28 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 185) | 2010 అక్టోబరు 20 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 మార్చి 22 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 56 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 59) | 2012 సెప్టెంబరు 7 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 అక్టోబరు 31 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 56 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008/09–present | న్యూ సౌత్ వేల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2014/15 | Sydney Sixers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | యార్క్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 జూలై 3 |
2010 లో స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. కానీ అతని కెరీర్ ప్రారంభంలో నిరంతర గాయాల కారణంగా ఆటంకం ఏర్పడింది. అతను 2015 క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియన్ జట్టులో ప్రముఖ సభ్యుడిగా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్లన్నిటి లోనూ స్థిరమైన ప్రదర్శనల ఫలితంగా అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. వన్డే క్రికెట్ చరిత్రలో స్టార్క్, అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలరు. ఆ మైలురాయిని చేరుకోవడానికి 102 మ్యాచ్‌లు తీసుకున్నాడు. స్టార్క్ 2021 ICC T20 ప్రపంచ కప్, 2023 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు కూడా.
స్టార్క్ 160.4 కిమీ/గం వేగంతో బౌలింగ్ చేసినందుకు (టెస్టు మ్యాచ్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైనది), రివర్స్ స్వింగ్ వేసినందుకూ ప్రసిద్ధి చెందాడు. 2022 డిసెంబరు నాటికి, అతను టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన 7వ బౌలరు.[3]