ఐర్లాండ్ క్రికెట్ జట్టు
From Wikipedia, the free encyclopedia
ఐర్లాండ్ పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో ఐర్లాండ్ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఐర్లాండ్ క్రికెట్ ఐర్లాండ్ బ్రాండ్ క్రింద పనిచేస్తున్న ఐరిష్ క్రికెట్ యూనియన్, ఐర్లాండ్‌లో క్రీడల గవర్నింగ్ బాడీ. వారు అంతర్జాతీయ జట్టును నిర్వహిస్తారు.
దస్త్రం:Ireland cricket team logo.png | |||||||||||||
అసోసియేషన్ | క్రికెట్ ఐర్లాండ్ | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||
టెస్టు కెప్టెన్ | ఆండ్రూ బాల్బిర్నీ | ||||||||||||
ఒన్ డే కెప్టెన్ | Paul Stirling (Interim) | ||||||||||||
Tట్వంటీ I కెప్టెన్ | పాల్ స్టిర్లింగ్ (తాత్కాలిక) | ||||||||||||
కోచ్ | హైన్రిక్ మాలన్ | ||||||||||||
చరిత్ర | |||||||||||||
టెస్టు హోదా పొందినది | 2017 | ||||||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | |||||||||||||
ICC హోదా | అసోసియేట్ సభ్యుడు (1993) పూర్తి సభ్యుడు (2017) | ||||||||||||
ICC ప్రాంతం | యూరపియన్ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||||
| |||||||||||||
టెస్టులు | |||||||||||||
మొదటి టెస్టు | v. పాకిస్తాన్ ది విలేజ్, మాలాహైడ్; 2018 మే 11-15 | ||||||||||||
చివరి టెస్టు | v. ఇంగ్లాండు లార్డ్స్, లండన్; 2023 జూన్ 1-3 | ||||||||||||
| |||||||||||||
వన్డేలు | |||||||||||||
తొలి వన్డే | v. ఇంగ్లాండు స్టోర్‌మౌంట్, బెల్ఫాస్ట్; 2006 జూన్ 13 | ||||||||||||
చివరి వన్డే | v. ఇంగ్లాండు కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్; 2023 సెప్టెంబరు 26 | ||||||||||||
| |||||||||||||
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 3 (first in 2007) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | సూపర్ 8 (2007) | ||||||||||||
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 7 (first in 1994 ఐసిసి ట్రోఫీ) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2009 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్) | ||||||||||||
ట్వంటీ20లు | |||||||||||||
తొలి టి20ఐ | v. స్కాట్లాండ్ స్టోర్‌మౌంట్, బెల్ఫాస్ట్; 2008 ఆగస్టు 2 | ||||||||||||
చివరి టి20ఐ | v. భారతదేశం ది విలేజ్, మాలాహైడ్; 2023 ఆగస్టు 20 | ||||||||||||
| |||||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 7 (first in 2009 ఐసిసి ప్రపంచ ట్వంటీ20) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | సూపర్ 8 (2009 ఐసిసి ప్రపంచ ట్వంటీ20) | ||||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 5[lower-alpha 1] (first in 2008 ఐసిసి ప్రపంచ ట్వంటీ20 క్వాలిఫయరు) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్లు (2008 ఐసిసి ప్రపంచ ట్వంటీ20 క్వాలిఫయరు, 2012 ఐసిసి ప్రపంచ ట్వంటీ20 క్వాలిఫయరు, 2013 ఐసిసి ప్రపంచ ట్వంటీ20 క్వాలిఫయరు) | ||||||||||||
| |||||||||||||
As of 2023 సెప్టెంబరు 26 |
ఐర్లాండ్ అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ప్రధాన రూపాలు టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ (వన్డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌లలో ఆడుతుంది. వారు 2017 జూన్ 22న ఆఫ్ఘనిస్తాన్‌తో పాటుగా టెస్టు హోదాను పొంది, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) 11వ పూర్తి సభ్యులు, యూరప్ నుండి రెండవ పూర్తి సభ్యులూ అయ్యారు. [10] [11] [12] [13]
ఐర్లాండ్‌కు ఆధునిక క్రికెట్, 19వ శతాబ్దంలో పరిచయమైంది. అయితే ఈ క్రీడ ఐర్లాండ్‌లో కనుగొనబడిన మునుపటి గేలిక్ గేమ్‌ల నుండి అభివృద్ధి చెంది ఉండవచ్చు. [14] [15] [16] [17] ఐర్లాండ్ జట్టు ఆడిన మొదటి మ్యాచ్, 1855 లో జరిగింది. ఐర్లాండ్ 19వ శతాబ్దం చివరలో కెనడా, యునైటెడ్ స్టేట్స్లో పర్యటించింది. అప్పుడప్పుడు టూరింగ్ జట్లతో మ్యాచ్‌లను నిర్వహించేది. స్కాట్లాండ్ జాతీయ క్రికెట్ జట్టుతో ఐర్లాండ్ అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ పోటీ జరుగుతుంది. 1888లో జట్లు ఒకదానితో ఒకటి ఆడినప్పుడు ఇది మొదలైంది.[18] ఐర్లాండ్ తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్, 1902లో జరిగింది.
ఐర్లాండ్, 1993లో ఐసిసి యొక్క అసోసియేట్ సభ్యత్వానికి ఎన్నికైంది, అయితే 2007 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించే క్రమంలో, 2006లో వారి మొదటి పూర్తి వన్డేని ఇంగ్లాండ్‌తో ఆడింది. ఆ ఏడు ఐర్లాండ్, ప్రపంచ కప్‌కు తొలిసారి అర్హత సాధించింది. ఆ టోర్నమెంట్లో, జింబాబ్వేపై డ్రాతో సహా ఫుల్ మెంబర్స్‌పై ఆకట్టుకునే ఫలితాలు - పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లపై విజయాలు సాధించింది. అప్పటి నుండి వారు, 189 వన్డేలు ఆడి, ఫలితంగా 75 విజయాలు, 98 ఓటములు సాధించారు. 13 ఫలితాలు తేలలేదు, 3 టై అయ్యాయి. [19] 2009లో ఆటగాళ్ల కోసం ఒప్పందాలు ప్రవేశపెట్టారు. ఇది ప్రొఫెషనల్ టీమ్‌గా మారడానికి గుర్తు.
టి20ల్లో మరిన్ని విజయాలు సాధించడం వల్ల ఐర్లాండ్ జట్టు 2009, 2010, 2012, 2014, 2016, 2021 [lower-alpha 2] ప్రపంచ ట్వంటీ20 పోటీలకు కూడా అర్హత సాధించింది. 2022 ఫిబ్రవరి 22న జరిగిన క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ఒమన్‌పై విజయం సాధించడంతో ఐర్లాండ్ 2022 నాటి T20 ప్రపంచ కప్‌లో కూడా తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది [20] [21]
టెస్టు హోదాను పొందే ముందు ఐర్లాండ్, ఐసిసి ఇంటర్కాంటినెంటల్ కప్‌లో ఫస్ట్-క్లాస్ అంతర్జాతీయ క్రికెట్‌ను కూడా ఆడింది. వారు 2005, 2013 మధ్య నాలుగు సార్లు గెలిచారు. ఫస్ట్-క్లాస్ ఐసిసి ఇంటర్కాంటినెంటల్ కప్ పోటీలో వారు సాధించిన విజయాలు, 2011 (ఇంగ్లండ్‌పై), 2015 (వెస్టిండీస్, జింబాబ్వేపై) ప్రపంచ కప్‌లలో మరింత ఉన్నత స్థాయి విజయాల కారణంగా, వారు "ప్రముఖ అసోసియేట్" [22] గా గుర్తింపు పొందారు. [23] 2020 నాటికి పూర్తి సభ్యునిగా ఉండాలనే తమ ఉద్దేశాన్ని తెలియజేశారు. ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లకు టెస్టు మ్యాచ్‌లలో పాల్గొనేందుకు వీలు కల్పించే పూర్తి సభ్య హోదాను ఇవ్వాలని 2017 జూన్‌లో ఐసిసి ఏకగ్రీవంగా నిర్ణయించడంతో ఈ ఉద్దేశం నెరవేరింది. [24]