నటి, మోడల్ From Wikipedia, the free encyclopedia
మాళవిక నాయర్, ప్రముఖ దక్షిణ భారత నటి. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఈ మూడు భాషల్లోని చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక, 2012లో మలయాళంలో బ్లాక్ బటర్ ఫ్లై సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. కుకో (2014) సినిమాలో అంధురాలిగా ఆమె నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం (2015) సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.[1]
మాళవిక ఢిల్లీలో జన్మించింది. ఆరో తరగతి దాకా అక్కడే చదువుకుంది.[2] తండ్రి శశినాయర్ ఇంటీరియర్ డిజైనర్. తల్లి శశి నాయర్. తండ్రి ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం కేరళకు మారిపోయారు. కొచ్చిలోని వ్యత్తిలా లో టి పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది.[3] ఆ తరువాత తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయిన ఆమె ఆక్కడ డిఎవి పాఠశాలలో చదువు కొనసాగించింది.[4] హైదరాబాదులో సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.
పద్నాలుగేళ్ళ వయసులో కుకూ అనే తమిళ చిత్రంలో అంధురాలిగా నటించింది. అది ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగులో ఆమె మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం.
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2012 | ఉస్తాద్ హోటల్ | హూరీ | మలయాళం | [5] | |
కర్మయోధ | దియా | మలయాళం | మాలవ్యగా కీర్తించారు | [6] | |
పుతియా తీరంగల్ | మినికుట్టి | మలయాళం | మాళవిక సాయిగా కీర్తించారు | [7] | |
2013 | బ్లాక్ బటర్ఫ్లై | రీనా | మలయాళం | [8] | |
2014 | పకిడా | కని | మలయాళం | [9] | |
కోకిల | సుధంతిరకోడి | తమిళం | [10] | ||
2015 | ఎవడే సుబ్రహ్మణ్యం | ఆనంది | తెలుగు | [11] | |
2016 | కల్యాణ వైభోగమే | దివ్య | తెలుగు | [12] | |
2018 | మహానటి | అలమేలు జెమినీ గణేశన్ | తెలుగు | [13] | |
విజేత | చైత్ర | తెలుగు | [14] | ||
టాక్సీవాలా | సిసిర భరద్వాజ్ | తెలుగు | [13] | ||
2019 | నిను వీడని నీడను నేనే | సైకాలజీ విద్యార్థి | తెలుగు | అతిధి పాత్ర | [15] |
2020 | ఒరేయ్ బుజ్జిగా | కృష్ణవేణి | తెలుగు | [16] | |
2022 | థ్యాంక్యూ | పార్వతి "పారు" | తెలుగు | [17] | |
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి | అనుపమ కస్తూరి | తెలుగు | పోస్ట్ ప్రొడక్షన్ | [18] | |
2023 | అన్నీ మంచి శకునములే | తెలుగు | చిత్రీకరణ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.