From Wikipedia, the free encyclopedia
మనలో ఒకడు 2016 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రం 2016 నవంబరు 4 న విడుదలైంది.[1]
మనలో ఒకడు | |
---|---|
దర్శకత్వం | ఆర్. పి. పట్నాయక్ |
రచన | ఆర్. పి. పట్నాయక్, తిరుమల్‌నాగ్ |
నిర్మాత | గురుజాల జగన్మోహన్ |
తారాగణం | ఆర్. పి. పట్నాయక్ అనిత (నటి) సాయి కుమార్ |
ఛాయాగ్రహణం | ఎస్.జె.సిద్ధార్థ్ |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
విడుదల తేదీ | నవంబరు 4, 2016 |
భాష | తెలుగు |
దేవరాయ కళాశాలలో భౌతికశాస్త్రాన్ని బోధించే ఓ సాధారణ అధ్యాపకుడు కృష్ణమూర్తి (ఆర్.పి.పట్నాయక్). విద్యార్థుల్ని సొంత పిల్లలుగా భావించే మంచి వ్యక్తి. ఆయన భార్య శ్రావణి (అనిత) పిల్లలకి సంగీత పాఠాలు నేర్పిస్తుంటుంది. ఇల్లు, కళాశాల.. తప్ప మరో ప్రపంచం తెలీదు కృష్ణమూర్తికి. అలాంటి అధ్యాపకుడిపై కళాశాలలో చదువుకొనే ఓ విద్యార్థిని తనని లైంగికంగా వేధించాడని మూడో కన్ను ఛానల్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తుంది. వెంటనే ఆ ఛానల్ ‘కీచకుడు’ అంటూ వార్తని ప్రసారం చేస్తుంది. దాంతో కృష్ణమూర్తి ఉద్యోగం పోతుంది. ఇంట్లో భార్యతో విభేదాలు తలెత్తుతాయి. బయట అంతా ఓ నేరస్తుడిలా చూస్తుంటారు. మరి నిజంగా కృష్ణమూర్తి ఆ తప్పు చేశాడా? మూడో కన్ను ఛానల్ ప్రసారం చేసిన ఆ వార్తలో నిజమెంత? కృష్ణమూర్తి ఉదంతంలో మూడోకన్ను ఛానల్ ఎండీ ప్రతాప్ (సాయికుమార్) పాత్ర ఏమిటి? తదితర విషయాల్ని తెలుపుతూ కథ సాగుతుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.