మడగాస్కర్
From Wikipedia, the free encyclopedia
మడగాస్కర్ లేదా రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్ (ఆంగ్లం : Madagascar, లేదా Republic of Madagascar (పాతపేరు : మలగాసీ రిపబ్లిక్), హిందూ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం, ఆఫ్రికా ఖండపు ఆగ్నేయ తీరంలో గలదు. ప్రపంచంలో గల జంతుజాలాలలో 5% జంతుజాలాలు ఈ దేశంలోనే గలవు. ప్రాచీన హిందువులు తూర్పున మలే ద్వీపకల్పం మొదలుకొని జావా, సుమత్రా దీవుల నుంచి పశ్చిమంలో మడగాస్కర్ ద్వీపం వరకు తమ వ్యాపారవాణిజ్యాలు విస్తరించారు.[4] (ఫ్రెంచి: రిపబ్లిక్ దే మడగాస్కర్) తూర్పు ఆఫ్రికా తీరంలో సుమారు 400 కిలోమీటర్ల (250 మైళ్ళు) దూరంలో ఉన్న హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం. ఈ దేశం మడగాస్కర్ ద్వీపం (ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ద్వీపం) గా ఉంది. ఒక చిన్న ద్వీపసమూహాన్ని అంతర్భాగంగా ఉంది. గతంలో మలగసి రిపబ్లికు అని పిలువబడింది. మహాఖండం గోండ్వానా చరిత్రపూర్వ విచ్ఛిన్నత తరువాత మడగాస్కర్ సుమారు 88 మిలియన్ల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో నుండి విడిపోయింది. స్థానిక మొక్కలను, జంతువులను ఏంకాంతం కారణంగా అభివృద్ధి చేయడానికి వీలు కల్పించింది. పర్యవసానంగా మడగాస్కర్ ఒక జీవవైవిధ్యం హాట్స్పాటు; దాని వన్యప్రాణులలో 90% పైగా భూమిమీద మరెక్కడా కనిపించలేదు. ద్వీపంలోని విభిన్న జీవావరణవ్యవస్థలు, ప్రత్యేక వన్యప్రాణులు వేగంగా పెరుగుతున్న మానవ జనాభా, ఇతర పర్యావరణ ఆక్రమణతో బెదిరించబడుతున్నాయి.
రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్ రిపోబ్లికా'ని మడగాసికారా République de Madagascar |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం Tanindrazana, Fahafahana, Fandrosoana (Malagasy) Patrie, liberté, progrès (French) "Fatherland, Liberty, Progress" |
||||||
జాతీయగీతం en:Ry Tanindrazanay malala ô! Oh, Our Beloved Fatherland |
||||||
రాజధాని | Antananarivo 18°55′S 47°31′E | |||||
అతి పెద్ద నగరం | Antananarivo | |||||
అధికార భాషలు | Malagasy, French, ఆంగ్లభాష1 | |||||
ప్రజానామము | Malagasy[1] | |||||
ప్రభుత్వం | Unitary state government | |||||
- | President | Hery Rajaonarimampianina | ||||
- | Prime Minister | Jean Ravelonarivo | ||||
స్వాతంత్ర్యము | ఫ్రాన్స్ నుండి | |||||
- | Date | 26 జూన్ 1960 | ||||
- | జలాలు (%) | 0.13% | ||||
జనాభా | ||||||
- | జూలై 2008 అంచనా | 20,042,551[2] (55వది) | ||||
- | 1993 జన గణన | 12,238,914 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $19.279 billion[3] | ||||
- | తలసరి | $979[3] | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $7.711 billion[3] | ||||
- | తలసరి | $391[3] | ||||
జినీ? (2001) | 47.5 (high) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.533 (medium) (143వది) | |||||
కరెన్సీ | Malagasy ariary (MGA ) |
|||||
కాలాంశం | EAT (UTC+3) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mg | |||||
కాలింగ్ కోడ్ | +261 | |||||
1Official languages since 27 April 2007. |
మడగాస్కర్‌లో పురాతత్వ పరిశోధన సాక్ష్యాలు మొట్టమొదటి మానవ ఆవిర్భావం 10,000 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిందని తెలియజేస్తున్నాయి.[5]
మడగాస్కర్ మానవ నివాసాలు క్రీ.పూ 350, క్రీ.పూ 550 మధ్య ఆస్ట్రోనేషియన్ ప్రజలచే సంభవించాయి. బోర్నెయో నుండి వచ్చిన నౌకాదళ శిబిరాలకు చేరుకున్నారు. ఇవి క్రీ.పూ 9 వ శతాబ్దం కాలంలో బంటు వలసదారులు తూర్పు ఆఫ్రికా నుండి మొజాంబికు చానెల్‌ను ద్వారా ప్రయాణిస్తూ వీరిని కలిసారు. కాలక్రమంలో మడగాస్కర్‌లో ఇతర బృందాలు స్థిరపడ్డాయి. ప్రతి ఒక్కరూ మాలాగజీ సాంస్కృతిక జీవితానికి శాశ్వతమైన కృషిని చేశారు. మలగాసి జాతి సమూహం 18 లేదా అంతకంటే ఎక్కువ ఉపవిభాగాలుగా విభజించబడింది. వాటిలో అతి పెద్దది మద్య ఎగువప్రంతలో ఉన్న మెరీనా.
18 వ శతాబ్దం చివర వరకు మడగాస్కర్ ద్వీపం సాంఘిక రాజకీయ సంకీర్ణాలు మార్చడం ద్వారా పరిపాలించబడుతుంది. 19 వ శతాబ్దం ఆరంభంలో ప్రారంభించి దీవిలో ఎక్కువ భాగం సమైక్యపరచబడి మెరీనా ప్రముఖులచే మడగాస్కర్ రాజ్యంగా పరిపాలించబడింది. 1897 లో ఈ ద్వీపం ఫ్రెంచి వలస సామ్రాజ్యంలోకి ప్రవేశించడంతో ఇది ముగిసింది. ఈ ద్వీపం 1960 లో స్వాతంత్ర్యం పొందింది. మడగాస్కర్ స్వతంత్ర రాజ్యం నాలుగు ప్రధాన రాజ్యాంగ కాలాలకు గురైంది. ఇది రిపబ్లికుగా పిలువబడింది. 1992 నుండి దేశం అధికారికంగా అంటనేనారివోలో రాజధాని నుండి రాజ్యాంగ ప్రజాస్వామ్యంగా పరిపాలించబడింది. అయితే 2009 లో ప్రముఖ తిరుగుబాటులో అధ్యక్షుడు మార్కు రావలోమన్ననా రాజీనామా చేసాడు. అధ్యక్ష అధికారం 2009 మార్చిలో ఆండ్రీ రాజోలీనాకు బదిలీ చేయబడింది. 2013 జనవరిలో హేరీ రాజాయోనరిమాంపియానినా అధ్యక్షుడిగా నియమించడం అంతర్జాతీయ సమాజం న్యాయమైన, పారదర్శకంగా పరిగణించబడిన తరువాత 2014 జనవరిలో రాజ్యాంగ పరిపాలన పునరుద్ధరించబడింది. మడగాస్కర్ యునైటెడు నేషన్సు, ఆఫ్రికా యూనియను (ఎ.యు), దక్షిణాఫ్రికా డెవలప్మెంటు కమ్యూనిటీ (ఎస్.ఎ.డి.సి), ఆర్గనైజేషను ఇంటర్నేషనలు డి లా ఫ్రాంకోఫోనీలో సభ్యదేసంగా ఉంది.
ఐక్యరాజ్యసమితి ప్రకారం మడగాస్కర్ కనీసం అభివృద్ధి చెందిన దేశంగా వర్గీకరించబడింది.[6] మడగాస్కర్‌లో మలగాసీ, ఫ్రెంచి అధికార భాషలుగా ఉన్నాయి. సాంప్రదాయ విశ్వాసాలు, క్రైస్తవత్వం రెండింటి సమ్మేళనలకు జనాభాలో ఎక్కువమంది కట్టుబడి ఉంటారు. పర్యావరణ పర్యాటకం, విద్య, ఆరోగ్యం, ప్రైవేటు సంస్థల ఎక్కువ పెట్టుబడులతో జతకాబడిన మడగాస్కర్ అభివృద్ధి వ్యూహంలో ముఖ్యమైన అంశాలుగా భావించబడుతున్నాయి. రావలోమనానా పాలనలో ఈ పెట్టుబడులు గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించాయి. కానీ ప్రయోజనాలు ప్రజలందరికీ సమానంగా అందజేయబడలేదు. పెరుగుతున్న జీవన వ్యయం, పేద - మధ్యతరగతిలోని కొన్ని విభాగాల జీవన ప్రమాణాల క్షీణతపై ఒత్తిడి తెచ్చాయి. 2017 నాటికి ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. 2009-2013 రాజకీయ సంక్షోభం అత్యధిక మలగసీ జీవన నాణ్యత తక్కువగా ఉంది.