భూమిక:ద రోల్
శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో 1977లో విడుదలైన హిందీ సినిమా / From Wikipedia, the free encyclopedia
భూమిక, 1977 నవంబరు 11న విడుదలైన హిందీ సినిమా. షెమరూ మూవీస్ బ్యానరులో లలిత్ ఎం. బిజ్లానీ, ఫ్రెని వారియావా నిర్మాణంలో శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్మితా పాటిల్, అమోల్ పాలేకర్, అనంత్ నాగ్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పురి తదితరులు నటించారు.[1]
త్వరిత వాస్తవాలు భూమిక, దర్శకత్వం ...
భూమిక | |
---|---|
![]() భూమిక సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | శ్యామ్ బెనగళ్ |
రచన | శ్యామ్ బెనగళ్ గిరీష్ కర్నాడ్ సత్యదేవ్ దూబే(మాటలు) |
కథ | హంస వాడ్కర్ |
దీనిపై ఆధారితం | హంస వాడ్కర్ రాసిన సాంగ్టీ ఐకా ఆధారంగా |
నిర్మాత | లలిత్ ఎం. బిజ్లానీ ఫ్రెని వారియావా |
తారాగణం | స్మితా పాటిల్ అమోల్ పాలేకర్ అనంత్ నాగ్ |
ఛాయాగ్రహణం | గోవింద్ నిహలానీ |
కూర్పు | భానుదాస్ దివాకర్ రామ్నిక్ పటేల్ |
సంగీతం | వనరాజ్ భాటియా మజ్రూహ్ సుల్తాన్ పురి వసంత్ దేవ్(సాహిత్యం) |
పంపిణీదార్లు | షెమరూ మూవీస్ |
విడుదల తేదీ | 1977, నవంబరు 11 |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మూసివేయి
ఈ సినిమా జాతీయ ఉత్తమ నటి (స్మితా పాటిల్), జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఉత్తమ చిత్రం విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా 1978 కార్తేజ్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. అక్కడ ఈ సినిమాకు గోల్డెన్ ఫలకం 1978 లభించింది. 1986లో అల్జీరియాలోని ఫెస్టివల్ ఆఫ్ ఇమేజెస్‌కు కూడా ఆహ్వానించబడింది.[2]