From Wikipedia, the free encyclopedia
అమోల్ పాలేకర్ (జ.24 నవంబర్ 1944) హిందీ సినిమా నటుడు, దర్శకుడు. హిందీ, మరాఠీ సినిమా నిర్మాత.[3]
పాలేకర్ ముంబాయిలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో లలిత కళలను అభ్యసించాడు. అతను చిత్రకారుడిగా తన కళాత్మక వృత్తిని ప్రారంభించాడు.[4] చిత్ర కళాకారునిగా ఏడు చిత్రకళా ప్రదర్శనలు, గ్రూపు ప్రదర్శనలు చేపట్టాడు. నాటక ప్రదర్శనలలో చురుకుగా పాల్గొనే పాలేకర్ మరాఠీ, హిందీలలో 1967 వరకూ అనేక ప్రదర్శనలను రూపొందించి నిర్మాతగా, దర్శకుడిగావ్యవహరించాడు. అనేక ప్రదర్శనలలో పాల్గొన్నాడు. దీని ద్వారా గుర్తింపు పొంది తద్వారా హిందీ చిత్రపరిశ్రమకు ఆహ్వానించబడ్డాడు. నటుడిగా 1970 దశకంలో హిందీ చిత్రరంగంలో గుర్తింపు పొందాడు. అతడి ద్వారా అనేక మంచి చిత్రాలు వచ్చాయి. హిందీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ తదితర భాషా సినిమా రంగాలలో ఆయన నటించాడు. సినీ జీవితంలో ఒక ఫిస్మ్పేర్ పురస్కారంతో పాటుగా ఆరు రాష్ట్ర పురస్కారాలను ఉత్తమ నటుడిగా అందుకొన్నాడు.
ఇక దర్శకుడిగా ఆయన అనేక సున్నిత కథాంశాలను తెరక్కెక్కించాడు. భారతీయ సాహిత్యం నుండి అనేక కథలను, మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలను అతను తెరకెక్కించాడు, మరాఠీ, హిందీ చిత్రాలతోపాటుగా బుల్లితెర (టెలివిజన్) దారావాహికలను కూడా అతను అందించాడు. అతనికి గుర్తింపు తెచ్చినవాటిలో కొన్ని కాచ్చిదూప్, మృగనయని, నఖాబ్, ఫూల్ ఖునా, కృష్ణ కాళి.
పాలేకర్ మొదట సత్యదేవ్ దూబే ఎక్స్పెరిమెంతల్ థియేటర్ ద్వారా మరాఠీ నాటకరంగంలో పనిచేసాడు. తరువాత అనికేత్ అనే సంస్థను 1972లో స్వంతంగా నిర్మించాడు.
అమోల్ బొంబాయిలో జన్మించారు. తల్లిదండ్రులు కమలాకర్, సుహాసిని మద్య దిగువ తరగతికి చెందినవారు. అమోల్‌కు నీలం, రేఖ, ఉన్నతి అనే ముగ్గురు అక్కచెళ్ళెళ్ళు. అతడి తండ్రి జనరల్ పోస్టాఫీస్‌లో పనిచేస్తుండేవాడు. తల్లి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేది.[7] అమోల్ సినిమాల్లో నటునిగా కావడానికి ముందు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుండేవాడు. అప్పడే కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాడు. అతడి భార్య రచయిత్రి సంధ్య గోఖలే. మొదటి భార్యతో విడాకుల అనంతరం ఈమెను వివాహం చేసుకొన్నాడు.[2][8][9]
సంవత్సరం | చిత్రం | పాత్ర | గమనికలు |
---|---|---|---|
1969 | బాజీరావ్ చా బేటా | మరాఠీ సినిమా | |
1971 | శంతత! కోర్ట్ చాలూ ఆహె | మరాఠీ సినిమా | |
1974 | రజనీగంథ | సంజయ్ | |
1974 | జీవనజ్యోతి (1975 సినిమా) | సంజయ్ | తెలుగు సినిమా |
1975 | చోటీసీబాత్ | అరుణ్ ప్రదీప్ | |
1976 | చిట్చోర్ | వినోద్ | |
1976 | గరోండా | సుదీప్ | |
1977 | భూమిక | కేశవ్ దాల్వి | |
1977 | అగర్ ఇఫ్ | అనిల్ అగర్వాల్ | |
1977 | టాక్షీ టాక్షీ | దేవ్ | |
1977 | టచ్ మేరే రాణీ | మరాఠీ సినిమా | |
1977 | కన్నేశ్వర్ రామ | కన్నడ | |
1978 | దామాద్ | ||
1978 | సఫేద్ జూట్ | అమోల్ రాము పాలేకర్ | |
1979 | బాతే బాతే మే | టోనీ బర్గాంజా | |
1979 | గోల్ మాల్ | రాం ప్రసాద్, లక్ష్మణ్ ప్రసాద్ |
ఫిలింపేర్ అవార్డ్ |
1979 | దో లడ్కే దోనే కడ్కే | హరి | |
1979 | మేరే బీవీకి షాదీ | భగవంత్ కుమార్ | |
1979 | సోల్వా సావన్ | ||
1979 | బిన్ బాప్ కా బేటా | ||
1979 | మదర్ 1979 సినిమా | మరాఠీ | |
1979 | జీనా యహాః | దినేష్ | |
1980 | ఆంచల్ | కిషన్ లాల్ | |
1980 | అప్నే పరాయా | చంద్రనాథ్ | |
1981 | నరం గరం | రామేశ్వర్ ప్రసాద్ | |
1981 | సమీరా | ||
1981 | అక్రిత్ | ముక్తారావ్ | బంగాలీ సినిమా |
1981 | కళంకిణి | బంగాలీ సినిమా | |
1981 | అగ్నిపరీక్ష | అలోక్ చౌదరి | |
1981 | చెహరా పె చెహారా | పీటర్ | |
1981 | ప్లాట్ నెంబర్ 5 | ||
1982 | జీవన్ ధార | ఆనంద్ | |
1982 | ఒలంగల్ | రవి | మలయాళం |
1982 | రాం నగరి | ||
1982 | స్పందన్ | ||
1982 | శ్రీమాన్ శ్రీమతి | మదు గుప్తా | |
1983 | రంగ్ బిరంగి | అజయ్ శర్మ | |
1983 | ఆశ్రయ్ | ||
1983 | ప్యాసి ఆంకేన్ | ||
1983 | చెనా అచేనా | బంగాలీ సినిమా | |
1984 | తరంగ్ | రాహుల్ | |
1984 | ఆద్మీ ఔర్ ఔరత్ | తపన్ | TV సినిమా |
1984 | ప్రార్థన | ||
1984 | శృంగార మాస | కన్నడ సినిమా | |
1985 | ఖామోష్ | అమోల్ పాలేకర్ | |
1985 | జూతి | కమల్ నాథ్ | |
1985 | అంకాహీ | దేవికానందన్ | |
1985 | అబాషేషే | బంగాలీ సినిమా | |
1986 | బాత్ బన్ జాయే | యశ్వంత్ రావ్ | |
1987 | మిస్టర్ ఎక్స్ | అమర్ | ఇతర కళాకారులచే డబ్బింగ్ |
1994 | తీస్రా కౌన్? | సి.కె.కదన్ | |
2001 | అక్స్ | మినిష్టర్ | |
2009 | సమంతర్ | కేశవ్ | మరాఠీ సినిమా |
అవార్డ్ | సినిమా | పాత్ర | సంవత్సరం | స్థితి |
---|---|---|---|---|
| ||||
ఉత్తమనటుడుగా ఫిలింఫేర్ అవార్డ్ | చోటీసీ బాత్ | అరుణ్ ప్రదీప్ | 1977 | ప్రతిపాదించబడింది |
గోల్మాల్ | రాం ప్రసాద్ దశరథ్ ప్రసాద్ శర్మ | 1980 | గెలుపు | |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.