నంద్యాల
ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా పట్టణం, జిల్లా కేంద్రం / From Wikipedia, the free encyclopedia
నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలానికి ఇది కేంద్రం.[3] పిన్ కోడ్: 518501. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక పెద్ద వాణిజ్య కేంద్రం.2011 జనాభా లెక్కల ప్రకారం నంద్యాల నగరం 211,424 జనాభా కలిగి ఉంది.2022 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో నంద్యాల కూడా ఒకటి.మునుపటి కర్నూలు జిల్లా నుండి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.నంద్యాల రాయలసీమలోలో ఐదవ అతిపెద్ద నగరం.ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి శ్రీశైలం డ్యామ్ నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి.పి.వి.నరసింహారావు నంద్యాల నియోజకవర్గం నుండి లోక్సభకు అత్యంత భారీ మెజారిటీ వోట్లతో ఎన్నికై ప్రపంచ రికార్డు సృష్టించాడు. నంద్యాల దగ్గరలో మహానంది అనే ప్రముఖ పుణ్యక్షేత్రం, యాత్రా స్థలం ఉంది.
త్వరిత వాస్తవాలు నంద్యాల, దేశం ...
నంద్యాల | |
---|---|
నగరం | |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానం | |
Coordinates: 15.48°N 78.48°E / 15.48; 78.48 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
Government | |
• Type | పురపాలకసంఘం |
విస్తీర్ణం | |
• Total | 19.00 కి.మీ2 (7.34 చ. మై) |
Elevation | 203 మీ (666 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 2,11,424 |
• జనసాంద్రత | 11,000/కి.మీ2 (29,000/చ. మై.) |
అక్షరాస్యత వివరాలు | |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 518501,518502 |
Vehicle registration | AP–21 |
మూసివేయి