![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/IN-DD_%25282020%2529.svg/langte-640px-IN-DD_%25282020%2529.svg.png&w=640&q=50)
దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ
భారతదేశంలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. / From Wikipedia, the free encyclopedia
దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ పశ్చిమ భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం.[4][5] గతకాలపు కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ విలీనం ద్వారా ఇది ఏర్పడినది. 2019 జూలైలో విలీన ప్రణాళిక ప్రకటించగా, చట్టానికి పార్లమెంట్ 2019 డిసెంబరులో ఆమోదం తెలిపింది. 2020 జనవరి 26న అమలులోకివచ్చింది.[6][7] ఈ ప్రాంతం భౌగోళికంగా వేరుగా వున్న నాలుగు ప్రాంతాలతో కూడివుంది. అవి దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ (ద్వీపం). 1779 నుండి 1954లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇవి పోర్చుగీస్ వలసరాజ్యాలుగా ఉన్నాయి. 1961లో ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు.
దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ | |
---|---|
![]() భారతదేశం పటంలో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ స్థానం | |
Coordinates: 20.42°N 72.83°E / 20.42; 72.83 | |
దేశం | ![]() |
స్థాపన | 26 January 2020[1] |
రాజధాని | డామన్[2] |
Government | |
• Body | యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యూ |
• లెఫ్టినెంట్ గవర్నర్ | ప్రఫుల్ ఖోడా పటేల్[3] |
• పార్లమెంటు సభ్యుడు | లోక్సభ (2) |
• ఉన్నత న్యాయస్థానం | ముంబాయి ఉన్నత న్యాయ స్థానం |
విస్తీర్ణం | |
• Total | 603 కి.మీ2 (233 చ. మై) |
• Rank | 33 వ ర్యాంకు (విస్తీర్ణం ప్రకారం) |
జనాభా (2011) | |
• Total | 5,85,764 |
• జనసాంద్రత | 970/కి.మీ2 (2,500/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
ISO 3166 code | IN-DH |
Vehicle registration | వాహనాల నమోదు కోడ్స్ |
జిల్లాల సంఖ్య | 3 |
దీని మొత్తం వైశాల్యం 603 చ. కి. మీ. నగర్-హవేలీ అనేది మహారాష్ట్ర గుజరాత్ సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కి.మీ. ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో దాద్రా అనే ప్రాంతముంది. డామన్ గంగా నది ముఖద్వారాన ఉంది. గుజరాత్ దక్షిణ ప్రాంత తీరంలో కథియవార్ దగ్గర ఉన్న ఒక ద్వీపం పేరు డయ్యూ.