![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e7/Golaghat_Montage.png/640px-Golaghat_Montage.png&w=640&q=50)
గోలాఘాట్
అసోం రాష్ట్రంలోని గోలాఘాట్, జిల్లా ప్రధాన కార్యాలయం. / From Wikipedia, the free encyclopedia
గోలాఘాట్, అసోం రాష్ట్రంలోని గోలాఘాట్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. రాష్ట్రంలోని అతిపెద్ద ఉపవిభాగాలలో ఒకటైన ఈ పట్టణం 1987, అక్టోబరు 5న పూర్తిస్థాయి జిల్లా ప్రధాన కార్యాలయంగా[4] ఒక నగరంగా, [5] పురపాలక సంఘంగా, పరిపాలనా కార్యకలాపాల స్థానంగా 55 కి.మీ దూరంలో ఉన్న జోర్హాట్ పట్టణానికి జంట నగరంగా ఉంది.[6][7] అస్సాంలోని పురాతన పట్టణ ప్రాంతాలలో ఇది ఒక పట్టణం.[8][9] బ్రహ్మపుత్రా నది ఉపనదులలో ఒకటైన ధన్సిరి ఈ పట్టణం మీదుగా వెళుతోంది. ఇది పట్టణ వాసులకు ప్రధాన నీటి వనరుగా ఉపయోగపడుతోంది.[10]
గోలాఘాట్ | |
---|---|
పట్టణం | |
![]() పై నుండి సవ్యదిశలో: స్కైలైన్ ఆఫ్ గోలఘాట్ సెంట్రల్ (పడమర), వారసత్వ భవనాలు, సైట్లు:[1] బెజ్బరోవా మాధ్యమిక పాఠశాల, సర్క్యూట్ హౌస్, బ్రిటిష్ సిమెట్రీ, డాస్ & కో. స్టోర్, బాప్టిష్ చర్చి | |
Coordinates: 26.52°N 93.97°E / 26.52; 93.97 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అసోం |
ప్రాంతం | ఎగువ అసోం |
జిల్లా | గోలాఘాట్ |
సెటిల్ | 20వ శతాబ్దం |
ఏర్పాటు | 1839 జిల్లా |
ఏకీకృతం | 1987[2] |
Government | |
• Type | మున్సిపల్ కౌన్సిల్ |
• Body | గోలాఘాట్ పురపాలక సంస్థ |
• కమీషనర్ | ధిరేన్ హజరికా |
విస్తీర్ణం | |
• Total | 7.32 కి.మీ2 (2.83 చ. మై) |
Elevation | 95 మీ (312 అ.) |
జనాభా (2011) | |
• Total | 60,782 |
• జనసాంద్రత | 8,303.55/కి.మీ2 (21,506.1/చ. మై.) |
Demonym | గోలాఘాటియన్ |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్[3] | 5 ప్రాంతాలు
|
ప్రాంతపు కోడ్ | +91-3774 |
ISO 3166 code | IN-GG |
Vehicle registration | ఏఎస్ – 05 – XX – XXXX |
అసెంబ్లీ నియోజకవర్గం | పురపాలక సంస్థ |
వాతావరణం | సెమీ-అరిడ్ (కొప్పెన్) |
†India Post delivery offices. |
1839 నుండి 182–183 సంవత్సరాలకు పైగా పురాతన ఉపవిభాగానికి ప్రధాన కార్యాలయంగా ఉన్న అస్సాంలోని తొలి పట్టణ కేంద్రాలలో ఇది ఒకటి. 1920లో స్థానిక ప్రభుత్వ సంస్థ గోలాఘాట్ పురపాలక సంస్థ స్థాపించబడింది. 1876నాటికే గోలాఘాట్ పట్టణంలో పోస్టు/మెయిల్ సర్వీస్, టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. అస్సాం పురాతన సామాజిక - సాహిత్య సభకు చెందిన గోలాఘాట్ సాహిత్య సభ 1918లో ఇక్కడ ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రధాన నాటక సంస్థలలో ఒకటైన గోలఘాట్ అమెచ్యూర్ థియేటర్ సొసైటీ 1895లో స్థాపించబడింది. 1891లో స్థాపించబడిన గోలాఘాట్ బార్ అసోసియేషన్ (జిబిఎ), అస్సాంలోని పురాతన న్యాయ సంఘాలలో ఒకటి.