ఐఎస్ఒ 3166-2:ఐఎన్
ISO 3166-2 లో భారతదేశానికి ప్రవేశం / From Wikipedia, the free encyclopedia
ఐఎస్ఒ 3166 2:ఐఎన్ (ISO 3166-2:IN), అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) ప్రచురించిన ISO 3166 ప్రమాణంలో ఒక భాగమైన ఐఎస్ఒ 3166-2 లో భారతదేశానికి ప్రవేశాన్ని సూచిస్తుంది.ఇది ISO 3166-1 లో కోడ్ చేయబడిన అన్ని దేశాల ప్రధాన ఉపవిభాగాల (ఉదా: ప్రావిన్స్ లేదా రాష్ట్రాలు) పేర్లకు సంకేతాలను నిర్వచిస్తుంది.అలాగే ఐఎస్ఒ 3166-1 దేశాల జాబితాలో కోడ్ చేయబడిన అన్ని దేశాల పేర్లకు సంకేతాలను నిర్వచిస్తుంది.
భారతదేశంలో 2020 డిసెంబరు 31 నాటికి ఉన్న, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు ISO 3166-2:IN లో సంకేతాలు నిర్వచించబడ్డాయి.ప్రతి కోడ్ లో రెండు భాగాలు ఉంటాయి.వీటిని అడ్డగీటు (హైఫన్లు)తో వేరు చేస్తారు.
- మొదటి భాగం IN, భారతదేశానికి ISO 3166-1 ఆల్ఫా -2 కోడ్.
- రెండవ భాగం రెండు అక్షరాలు. (ప్రస్తుతం కొన్ని మినహాయింపులతో వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో ఉపయోగించబడింది.