గోరా
భారతీయ కార్యకర్త సంఘసంస్కర్త నాస్తికుడు / From Wikipedia, the free encyclopedia
గోరా గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు (నవంబరు 15, 1902 - జూలై 26, 1975) సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. గోరా నవంబరు 15, 1902 న ఒడిషా లోని ఛత్రపురంలో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.