From Wikipedia, the free encyclopedia
కృతి సనన్ (జననం1990 జులై 27) భారతీయ నటి, మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించిన కృతి తెలుగులో మహేష్ బాబు సరసన 1 - నేనొక్కడినే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఆది పురుష్ హిందీ చిత్రంలో కృతి సనన్ నటించింది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కృతి సనన్ | |
---|---|
జననం | కృతి సనన్ 1990 జూలై 27 ఢిల్లీ, భారతదేశం |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2010 – ఇప్పటివరకూ |
బంధువులు | నుపూర్ సనన్ (సోదరి) |
2021లో వచ్చిన మిమీ సినిమాలో తన నటనకు అనేక అవార్డులను అందుకుంది, అందులో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు గంగూబాయి కతియావాడి చిత్రానికి అలియా భట్‌తో కలసి గెలుచుకుంది.[1][2]
2019 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆమె పేరు దక్కించుకుంది.
హిందీలో ఎన్నో కమర్షియల్సులో నటించిన కృతి సనన్ మహేష్ బాబు నటించిన 1 - నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలుత ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కథానాయికగా ఎన్నుకోబడ్డా డేట్స్ ఖాళీ లేక, ఉన్నవి సద్దుబాటు చెయ్యలేకపోయింది.[3] ఈ సినిమాలో నటించడానికి మొగ్గుచూపినా ఎలాంటి గొడవ లేకుండా సినిమా నుంచి తప్పుకుంది. ఆ సమయంలో దర్శకుడు సుకుమార్ ఈమెని కథానాయికగా ఎంచుకున్నారు.[4] ఈ సినిమాలో కృతి ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించింది. సంక్రాంతి కానుకగా 2014లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టినా కృతి మాత్రం సానుకూల స్పందనను రాబట్టగలిగింది. సాక్షి దినపత్రిక తమ సమీక్షలో "కృతి సనన్ జర్నలిస్ట్‌గా, గౌతమ్ ప్రేయసి సమీరగా పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో కొంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కృతి సనన్‌కు దక్కింది. కొత్త నటి అనే ఫీలింగ్‌ను కలిగించకుండా కృతి బాగానే జాగ్రత్త పడింది" అని వ్యాఖ్యానించారు.[5]
ఆపై హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ తొలి చిత్రమైన హీరోపంతి సినిమా ద్వారా హిందీలో కథానాయికగా అడుగుపెట్టింది. ఈ సినిమా జాకీ ష్రోఫ్ నటించిన హీరో సినిమా రీమేక్ అయినప్పటికీ అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమా ఛాయలు కూడా ఇందులో కనపడటం ఆశ్చర్యం ఎందరికో కలిగించింది.[6][7] ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఇంతలోనే అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రం దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సమంతతో పాటు నటిస్తున్న మరో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా కృతి ఎన్నుకోబడింది.[8]
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విశేషాలు | మూలాలు |
---|---|---|---|---|
2014 | 1: నేనొక్కడినే | సమీర | తెలుగు సినిమా | |
హీరోపంతి | డింపీ చౌదరి | |||
2015 | దోచేయ్ | మీరా | తెలుగు సినిమా | |
దిల్వాలే | ఇషితా మాలిక్ | |||
2017 | రాబ్తా | సైరా సింగ్ / సైబా ఖాజీ | ||
బరేలీ కి బర్ఫీ | బిత్తి మిశ్రా | |||
2018 | స్త్రీ | పేరులేనిది | "ఆవో కభీ హవేలీ పే" పాటలో ప్రత్యేక పాత్ర | [9] |
2019 | లుకా చుప్పి | రష్మీ త్రివేది | ||
కలంక్ | పేరులేనిది | "ఐరా గైరా" పాటలో ప్రత్యేక పాత్ర | [10] | |
అర్జున్ పాటియాలా | రీతు రాంధవా | |||
హౌస్‌ఫుల్ 4 | రాజకుమారి మధు / కృతి థక్రాల్ | |||
పానిపట్ | పార్వతి బాయి | |||
పతి పత్నీ ఔర్ వో | నేహా ఖన్నా | అతిధి పాత్రలో | [11] | |
2021 | మిమీ | మిమీ రాథోడ్ | [12] | |
హమ్ దో హమారే దో | అన్య మెహ్రా | [13] [14] | ||
2022 | బచ్చన్ పాండే | మైరా దేవేకర్ | [15] | |
హీరోపంతి 2 | పేరులేనిది | "విజిల్ బాజా 2.0" పాటలో | [16] | |
భేదియా | డాక్టర్ అనికా | [17] | ||
2023 | షెహజాదా | సమర | [18] | |
ఆదిపురుష్ | జానకి | తెలుగు / హిందీ | [19] [20][21][22] | |
గణపథ్ | జాస్సీ | [23] | ||
TBA | తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా | పోస్ట్ ప్రొడక్షన్ | [24] | |
క్రూ | పోస్ట్ ప్రొడక్షన్ | [25] | ||
చిత్రీకరణ / నిర్మాత కూడా | ||||
2022 ఫిబ్రవరి 20న ముంబైలో నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022 లో మిమీ సినిమాలో నటించిన కృతి సనన్‌కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.