కటక్ జిల్లా
ఒడిశా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఒడిశా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో కటక్ జిల్లా ఒకటి. కటక్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జనసాధ్రత పరంగా ఈ జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గంజాం జిల్లా ఉంది.
?కటక్ కటక్ Orissa • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 20.27°N 85.52°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
195 కి.మీ² (75 sq mi) • 36 మీ (118 అడుగులు) |
జిల్లా (లు) | కటక్ జిల్లా జిల్లా |
జనాభా • జనసాంద్రత |
534,654 (2001 నాటికి) • 4,382.23/కి.మీ² (11,350/చ.మై) |
Mayor | సౌమేంధ్ర ఘోష్[1] |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 7530xx • +0671- • OR-05 |
Cuttack district | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
ప్రధాన కార్యాలయం | Cuttack |
విస్తీర్ణం | |
• Total | 3,932 కి.మీ2 (1,518 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 26,18,708 |
• Rank | 2nd |
• జనసాంద్రత | 666/కి.మీ2 (1,720/చ. మై.) |
భాషలు | |
• అధికార | ఒరియా |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 754 xxx |
టెలిఫోన్ కోడ్ | 0671 |
Vehicle registration | OD-05 |
సమీప పట్టణం | Bhubaneswar |
లింగ నిష్పత్తి | 955 ♂/♀ |
అక్షరాస్యత | 84.20% |
లోక్‌సభ నియోజకవర్గం | Cuttack |
Vidhan Sabha constituency | 10 |
శీతోష్ణస్థితి | Aw (Köppen) |
అవపాతం | 1,501.3 మిల్లీమీటర్లు (59.11 అం.) |
సగటు వేసవి ఉష్ణోగ్రత | 40 °C (104 °F) |
సగటు శీతాకాల ఉష్ణోగ్రత | 10 °C (50 °F) |
ఉత్కల మణి గోపబంధు దాస్ " ది సమాజ ", మహారాష్ట్ర గత గవర్నర్ , గత ఒడిషా ముఖ్యమంత్రి హరేకృష్ణ మహాతాబ్ స్థాపించిన " ప్రజాతంత్ర ", ఎం.డి. వాక్వర్వ్ యూసఫ్ స్థాపించిన " ఒడిషా ఈవెనింగ్ ఎడిషన్ " మొదలైన పత్రికలు అందుబాటులో ఉన్నాయి.[2]
జిల్లా వైశాల్యం 3932 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,341,984.
ఈ జిల్లా 15 తాలుకాలు 14 రెవెన్యూ బ్లాక్స్ ఉన్నాయి:-
కటక్ జిల్లాలో ఒకదానికి ఒకటి సమీపంలో పలు మతపరమైన భవనాలు ఉన్నాయి.
ధబలేశ్వరాలయం మహానది నదీ ద్వీపంలో ఉంది. ఇక్కడి నుండి ప్రధాన భూభాగం హాంగింగ్ వంతెన ద్వారా అనుసంధానితమై ఉంది. దేశంలోని స్తంభం లేని వంతెనలలో ఇది ఒకటి.
కటక్ నగరంలో పలు మతాలకు చెందిన పండుగలు , ఉత్సవాలు ఉత్సాహభరితంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి.
ఈ ప్రాంతం నుండి దక్షిణాసియా దేశాలతో వ్యాపరసంబంధాలు ఏర్పరచుకునే వారు. దక్షిణాసియా వ్యాపారులు తీసుకువచ్చిన వస్తువులను ఇచ్చి వ్యాపారుల నుండి ఓండ్రదేశ వస్తువులను బదులుగా తీసుకునే వారు. ఈ వస్తుమార్పిడి అప్పటి రాజధాని కటక్‌లో జరుగుతూ ఉండేది. ఆనాటి సంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగుతూ ఇప్పటికీ బలియాత్ర నిర్వహిస్తూనే ఉన్నారు. రాష్ట్రమంతటి నుండి ప్రజలు కటక్‌కు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ ఉత్సవం నవంబరు మాసంలో మహానది తీరంలో జరుగుతుంది. బలియాత్రను పురాతనకాలంలో బలిద్వీపంలో నిర్వహించే వారు. ఇక్కడ ప్రాంతీయ , విదేశీయ వస్తువులు అనేకం విక్రయించడానికి సిద్ధంగా ఉంచేవారు. ఒడిషా అంతటి నుండి ప్రజలు వసుతువులు అమ్మడానికి కొనడానికి ఇక్కడ చేరేవారు. అలాగే ఇక్కడ అధికంగా వస్తుమార్పిడి జరుగుతుంది.
కటక్ ఒడిషా రాష్ట్ర వ్యాపారకేంద్రంగా ఉంది. రాష్ట్రంలోని జిల్లాలలో అత్యధిక జి.డి.పి కలిగిన జిల్లాగా కటక్ గుర్తించబడుతుంది. జిల్లాలో బృహాత్తర వ్యాపార భవనాలు , విస్తృతంగా ఉన్న పరిశ్రమలు (ప్రముఖ అల్లాయ్, స్టీల్ , లాజిస్టిక్స్ టు అగ్రికల్చర్ , టెక్స్టైల్స్ , హస్థకళలు వంటి సంప్రదాయ పరిశ్రమలు) ఉన్నాయి. జాతీయంగా , అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పలు వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. పరదిప్ రేవు ఉంది. .
జిల్లాలో 11 బృహత్తర పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా చౌద్వర్ , అథగడ్లలో అధికంగా ఉన్నాయి. పరిశ్రమలలో ప్రధామైనవి స్టీల్, విద్యుత్తు, ఆటోమొబైల్, అల్లాయ్స్, ఫిర్క్లే మొదలైనవి. చౌదర్ (కటక్) వద్ద దేశంలో అధ్యధికంగా ఫెర్రో అల్లాయ్స్ తయారు చేస్తున్న " ఇండియన్ మెటల్ & ఫెర్రో అల్లాయ్స్ ఉంది. నగరం వెలుపల ఒక " మెగా ఆటో కాంప్లెక్స్ " నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
సంప్రదాయ పరిశ్రమలకు కటక్ ప్రసిద్ధి చెందింది. రాయపూర్ తరువాత తూర్పు ఇండియాలో రెండవ వస్త్రతయారీ కేంద్రంగా కటక్ గుర్తించబడుతుంది. నగర సంవత్సర టెక్స్టైల్ ఆదాయం బిలియన్ డాలర్ల కంటే అధికంగా ఉంటుంది. నగరం వెలుపల టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. సిల్వర్ ఫిలిగ్రీ హస్థకళకు కటక్ ప్రఖ్యాతి చెందింది. సాటిలేని పనితనం కలిగిన ఈ పరిశ్రమ ప్రాంతీయ ఆదాయాన్ని అధికరిస్తుంది.
ఒడిషాలోని మిగిలిన నగరాలకంటే అధికంగా మద్యతరహా , చిన్నతరహా పరిశ్రమలు కటక్‌ను కేంద్రంగా చేసుకుని ఉన్నాయి. కటక్ లోపల , వెలుపల 8 ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. వీటిలో అధికంగా ఒడిషాలోని పలు ఇతర పరిశ్రమలకు సహాయంగా ఉన్నాయి. జగత్పూర్ , ఖపురియా పరిశ్రమలు నగరంలోనే ఉన్నాయి. దేశంలో కటక్ గుర్తించతగిన నగరాలలో ఒకటిగా ఉంది. ఎగువన ఉన్న మినరల్ జిల్లాలను , రాష్ట్రాలను కొలకత్తా , చెన్నై కారిడార్‌తో అనుసంధానిస్తుంది. పరదీప్ రేవు సమీపంలో ఉండడం అభివృద్ధికి మరింత సహకరిస్తుంది. దేశీయఖ్యాతి చెందిన ఒ.ఎస్.ఎల్ గ్రూపు, ప్రధానకార్యాలయం కటక్‌లోనే ఉంది. కటక్ రాష్ట్రంలో ప్రధాన వ్యాపారకేంద్రగానూ , రవాణా కేంద్రంగానూ అభివృద్ధి చెందుతూ ఉంది. జిల్లాలోని మాల్గోడౌన్ , చత్రబజార్ లలో హోల్‌సేల్ కేటరింగ్‌కు కేంద్రంగా ఉంది.
కటక్ ఆర్ధికరంగానికి వ్యవసాయం ప్రధానంగా దోహదం చేస్తుంది. సమీపంలో ఉన్న గ్రామాలలో నాణ్యమైన పంటలు, కూరగాయలు , పండ్లు విస్తారంగా పండుతున్నాయి. ఇవి చత్రబజార్లో ఉన్న అతిపెద్ద మండిలో విక్రయించబడుతున్నాయి. ఇక్కడ ఉన్న " సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ " ఆసియాలో అతిపెద్ద మండిగా గుర్తించబడుతుంది. ఇది కటక్ దేశీయవ్యవసాయ రంగంలో అతి ముఖ్య స్థానం అందిస్తుంది. రాష్ట్రానికి మునుపటి రాజధానిగా , వ్యాపార కేంద్రంగా గుర్తించబడుతున్న కటక్‌లో ప్రభుత్వ , వ్యాపార కార్యాలయాలు అధికంగా ఉన్నాయి. సమీపప్రాంతాలలో ఉన్న ప్రజలు వారి ఉపాధి కొరకు కటక్ మీద ఆధారపడుతున్నారు. ప్రజలు అధికంగా సేవారంగం మీద ఆధారపడుతున్నారు. అందువలన నగరంలో ప్రజల సంఖ్య దిదినాభివృద్ధి చెందుతున్నారు. ఒడిషా హైకోర్ట్ , ఎస్.సి.బి మెడికల్ కాలేజ్ (రాస్ట్రంలో అతి పెద్ద మెడికల్ కాలేజ్) కటక్‌లోనే ఉన్నాయి. అధిక సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, కాలేజీలు , పాఠశాలలు , కోచింగ్ సెంటర్లతో కటక్ విద్యాకేంద్రంగా గుర్తించబడుతుంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,618,708,[2] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నెవాడా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 166వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 666 .[2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.86%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 955:1000,[2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 84.2%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.
The following is the 9 Vidhan sabha constituencies[6][7] of Cuttack district and the elected members[8] of that area
క్ర.సం | నియోజకవర్గం | రిజర్వేషను | పరిధి | 14 వ శాసనసభ సభ్యులు | పార్టీ |
---|---|---|---|---|---|
87 | బరంబ | లేదు | బరంబ, బరంబ నరసింఘపూర్ | దేబిప్రసాద్ మిష్రా | బి.జె.డి |
88 | బంకి | లేదు | బంకి (ఎన్.ఎ.సి), బంకి-దంపర, బరంగ (భాగం) | ప్రవత కుమార్ త్రిపాతి | బి.జె.డి |
89 | అథ్ఘర్ | లేదు | అథ్గర్ (ఎన్.ఎ.సి), అత్ఘర్,,తిగిరియా, తిగిరియా, తిరి-చౌదర్ (భాగం) | రాణేంద్ర ప్రతాప్ స్వైన్ | బి.జె.డి |
90 | బరబతి- కటక్ | లేదు | కటక్ (ఎం.సి) (భాగం ) | దేభాషిష్ సమంతరే | బి.జె.డి |
91 | చౌదర్-కటక్ | లేదు | చౌదర్ (ఎం), చౌదర్ (ఒ.గి), చర్బతియా (సి.టి) కటక్ (ఎం.సి) (భాగం) ,తంగి-చౌద్వర్ (భాగం) | ప్రవత్ రంజన్ బిస్వాల్ | బి.జె.డి |
92 | నియాలి | షెడ్యూల్డ్ కులాలు | నియాలి, కంతపద, బరంగ (భాగం) | ప్రమొద్ కుమార్ మల్లిక్ | బి.జె.డి |
93 | కటక్ సాదర్ | షెడ్యూల్డ్ కులాలు | కటక్ సాదర్, కటక్ (ఎం.సి) (భాగం),నిశ్చింతకొయిలి (భాగం) | చంద్ర సరథి బెహర | బి.జె.డి |
87 | సలిపూర్ | లేదు | సలిపూర్, తంగి-చౌద్వర్ (భాగం) | ప్రకాష్ సి.హెచ్. బెహర | ఐ.ఎన్.సి |
95 | మహంగ | లేదు | మహంగ, నిశ్చింతకౌయొలి (భాగం) | Pratap Jena | బి.జె.డి |
కటక్ ఒడిషా రాష్ట్రంలోని అతి పెద్ద నగరం , జిల్లా.ఇక్కడ పలు జాతీయ పరిశోధనా కేంద్రములు ఉన్నాయి. ఈ నగరం పూర్వపు కళింగ దేశానికి రాజధాని. కటకం అంటే కవచం లేదా గోడ అని అర్థం. పూర్వం రాజులు కోటల చుట్టు ఎత్తైన గోడలు కట్టేవాళ్ళు. అందుకే ఈ నగరానికి కటక అని పేరొచ్చింది.
విమానాశ్రయము : సమీపములోనిది బిజూ పట్నాయక్ విమానాశ్రయము, భువనేశ్వర్, దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. కటక్ నగరం ఒడిషాలోని ప్రముఖ రైలు కూడలి. తాల్చేర్ , పరదీప్ వెళ్ళు రైలు మార్గాలు కటక్ కూడలి వద్ద హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గాన్ని కలుస్తాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.