From Wikipedia, the free encyclopedia
ఊరుకిచ్చిన మాట 1981 జూన్ 24న విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిలింస్ పతాకంపై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు మన్నవ బాలయ్య దర్శకత్వం వహించారు. చిరంజీవి, సుధాకర్, కవిత, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించారు.[1][2][3]
ఊరుకిచ్చిన మాట (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాలయ్య |
---|---|
తారాగణం | చిరంజీవి, బేతా సుధాకర్, మాధవి |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | అమృతా ఫిలింస్ |
భాష | తెలుగు |
1981 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది
చిరంజీవి, సుధాకర్ లు అన్నదమ్ములు. వారుండే పల్లెటూరికి వైద్య సదుపాయం లేదు. తమ్ముడు డాక్టరు చదువుకు చిరంజీవి తన వూరి జనం వద్ద సహాయం తీసుకుంటాడు. తన తమ్ముడు చదువు పూర్తైనాక వారికి వైద్యసేవలు చేస్తాడని మాటిస్తాడు. పట్నం మోజులో, పల్లెటూరికి తిరిగి రావడానికి తమ్ముడు మొదట నిరాకరించినప్పుడు, నిరాశకి లోనైనా, తమ్ముడిలో పరివర్తన తీసుకురావడం స్థూలంగా కథా విషయం.
1: ఆడింది ఊరు , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండిరారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2: చూపుల్లో చుట్టేసి , రచన: సీ.నారాయణ రెడ్డి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పీ.సుశీల
3: హూరుగాలిలో , రచన: సి.నారాయణ రెడ్డి
4: కోడికూసే పొద్దు పొద్దు , రచన: సి నారాయణ రెడ్డి
5: పైరగాలి పైట లాగుతుంటే , రచన: జాలాది రాజారావు,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6: వచ్చిపోరా రంగా , రచన: సి నారాయణ రెడ్డి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.