సినీ నటుడు From Wikipedia, the free encyclopedia
మన్నవ బాలయ్య (1930 ఏప్రిల్ 9 - 2022 ఏప్రిల్ 9) తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఎక్కువ సహాయ పాత్రలు పోషించాడు. కొన్ని సినిమాలకు కథ, పాటలు కూడా అందించాడు.
మన్నవ బాలయ్య | |
---|---|
జననం | చావపాడు గ్రామం, గుంటూరు జిల్లా | ఏప్రిల్ 9, 1930
మరణం | 2022 ఏప్రిల్ 9 (92 years) హైదరాబాదు |
విద్య | బి. ఇ, మెకానికల్ ఇంజనీరింగ్ (1952) |
వృత్తి | అధ్యాపకుడు, నటుడు, నిర్మాత, రచయిత |
తల్లిదండ్రులు |
|
గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించాడు[1].[2] బాలయ్య మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశాడు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశాడు.
మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించాడు. మిత్రుల ప్రోద్బలముతో చిత్రాల్లో నటించాలనే కోరిక గలిగి తాపీ చాణక్య సహకారముతో చిత్రసీమలో అడుగు పెట్టాడు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో నాయక పాత్ర వేశాడు. తరువాత భాగ్యదేవత, కుంకుమరేఖ చిత్రాల్లో నటించాడు. భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో శివునిగా నటించే అవకాశం వచ్చింది. అటు తరువాత చెంచులక్ష్మి, పార్వతీకల్యాణం నుండి నేటి వరకు 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో (1977) లాంటి మంచి చిత్రాలు నిర్మించాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రముగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారము బహూకరించింది. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు (1994), ఊరికిచ్చిన మాట (1981) నిర్మించాడు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చాడు. చిత్రాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు. 2000 సంవత్సరములో తీసిన "పల్లెవాసం-పట్నవాసం"కు ప్రభుత్వ ఉత్తమ సీరియల్ అవార్డ్ లభించింది. అంకురం చిత్రంలో నటనకు వంశీ-బర్కిలీ వారి ఉత్తమ క్యారెక్టర్ అవార్డ్ లభించింది. ఈనాటి బంధం ఏనాటిదో సినిమాకు కథ, చిత్రానువాదం, పాటలు అందించాడు.[3]
ఇతడు నటించిన సినిమాల పాక్షిక జాబితా
92 ఏళ్ల బాలయ్య అనారోగ్యంతో 2022 ఏప్రిల్ 9న హైదరాబాదులో కన్నుమూశారు. ఇదే రోజు ఆయన పుట్టినరోజు కూడా.[6][7][8]
Seamless Wikipedia browsing. On steroids.