From Wikipedia, the free encyclopedia
ముస్లింలు క్రైస్తవుల్ని అహల్ అల్-కితాబ్ (దైవగ్రంథం గలిగిన ప్రజలు) గా పరిగణిస్తారు.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
|
యేసు (ఈసా) గురించి ఖురాన్లో ... :-
మర్యం పుత్రుడైన మసిహ్ (మెసయ్య) ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు పూర్వం కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి
సద్గుణ సంపన్నురాలు. వారు ఉభయులూ (ప్రతి రోజు) భోజనం చేసే వారు . (ఖురాన్ :Quran 5 :75 )
తను అల్లాహ్కు దాసుడుగా ఉండటాన్ని మసిహ్ (మెసయ్య) ఎన్నడూ అగౌరవంగా భావించలేదు. ( ఖుర్ ఆన్ Quran 4: 172)
మసిహ్ మర్యం కుమారుడైన ఈసా (ఏసు ) అల్లాహ్ పంపిన ఒక తరపు నుండి వచ్చి (మర్యం గర్భంలో రూపందాల్చి ) న ఆత్మ తప్ప మరేమీ కాదు . (ఖుర్ఆన్ Quran 4 : 171)
THE BIRHT OF JESUS (యేసు పుట్టాక గురించి )
దైవదుతాలు ఇలా అన్నారు : మర్యం ! అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన నీకు పంపుతున్నడు. అతని పేరు మర్యం కుమారుడైన ఈసా మసిహ్
(యేసు మెసయ్య ) అగును. అతడు ఇహపర లోకాలలో గౌరావనియుడైతాడు. అల్లాహ్ సామీప్యం పొందిన దాసులలోని వాడుగా పరిగణింపబడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుశుదవుతాడు. ఇది విన్న మర్యం ఇలా అన్నారు. ప్రభూ! నాకు శిశవు ఎలా జన్మిస్తునింది ? నన్ను ఏ పురుషుడు చేతితోనైనా తకలేదే!” సమాధానం లభించింది : ” అలానే జరుగు తుంది. అల్లాహ్ తానూ కోరిన దాన్ని సృష్టించాడు. ఆయన ఒక పనిని చెయ్యాలని నిర్ణయించినప్పాడు, కేవలం దానిని ‘అయిపో’ ఆంటాడు. అంతే, అది అయిపోతుంది . అల్లాహ్ అతనికి గ్రంతన్న్ని, దివ్య జ్ఞానాన్ని భోదిస్తాడు. తౌరాతు (తోరా), ఇంజిలు (సువార్త) గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు . ఇంకా అతనిని ఇస్రాయీలు సంతతి (ఇస్రాయేలియుల ) వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. (ఖుర్ఆన్ Quran 3 : 45 – 48) .
అల్లాహ్ దృష్టిలో ఈసా (యేసు) పుట్టుక ఆదం పుట్టుక వంటిదే . అల్లాహ్ అదమును మట్టితో చేసి ‘అయిపో ‘ అని అజ్ఞాపించాడు . అతడు అయ్యాడు. అసలు వాస్తవం ఇదే . ఇది మీ ప్రభువు తరపు నుండి మీకు తెలుపబడు తుంది. దిన్ని శాకిన్చేవారిలో నివు చేరిపోకు . (ఖురాన్ – (Quaran -3:59-60)
ఇతనే మర్యం కుమారుడు ఈసా, ఇదే అతనికి సంబంధించిన అసలు నిజం. దీనిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు. ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవటం అనేది అల్లాహ్ కు తగదు . ఆయన పరమ పవిత్రుడు. దేని గురించైనా ఆయన నిర్ణయం తీసుకుంటే ‘అయిపో’ అని ఆజ్ఞాపిస్తాడు . అంతే అది అయిపోతుంది. (ఖుర్ఆన్-Quaran-19:34-35)
మహిమలు, అద్భుతాలు:-
(ఇస్రాయీలు సంతతి వద్దకు ప్రవక్తా వచినప్పుడు యేసు ఇలా అన్నాడు) : ‘నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకు వచాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస ఊదుతాను . అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని , కుష్టరోగిని బాగుచేస్తాను. ఆయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమిమి నిలువ చేసి ఉంచుతారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించేవారే అయితే, వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచనా ఉంది.’ ఖుర్ ఆన్ (Quaran 3:49)
Q.మరొక సంఘటనను కూడా జ్ఞాపకం తెచ్చుకో. వారు (శిష్యులు ) ‘మర్యం కుమారడవైన ఈసా! ని ప్రభువు మా కొరకు ఆహారపదార్థాలతో నిండిన ఒక పళ్లన్నీ ఆకాశం నుండి దింపగలడా? ‘ అని అడిగినప్పుడు, ఈసా, ‘మీరు విశ్వసులే అయితే అల్లాహ్ కు భయపడండి అని అన్నాడు. వారు ఇలా అన్నారు, ‘ఆ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని భుజించాలని, మా హృదయాలకు తృప్తి కలగాలని, నివు మాకు చెప్పినదంతా నిజమనే విషయం మాకు తెలియాలని, ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలని మాత్రమే మేము కోరుతున్నాము.’ దాని పై మర్యమ్ కుమారుడైన ఈసా ఇలా ప్రార్థించాడు: ‘అల్లాహ్ ! మా ప్రభూ! ఆకాశం నుండి మాపై ఆహారంతో నిండిన పళ్ళాన్ని ఒక దానిని అవతరింపజెయ్యి . అది మాకు, మా పుర్వికులకు, మా తరువాతి వారికి ఒక పండుగ సమయంగా నిర్ణయింపబడాలి. ని తరపు నుండి ఒక సూచనా కాగలగాలి. మాకు ఆహారం ప్రసాదించు. నివు ఉత్తమ ఆహార ప్రదాతవు.’ అల్లాహ్ ఇలా జవాబు పలికాడు, ‘నేను దానిని మీపై అవతరింపజేస్తాను. కాని దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, వారికి నేను ఇంతవరకూ ఎవరికీ విదించని శిక్ష విదిస్తాను.’ (ఖుర్ఆన్ – Quaran:5:112-115)
ఏసు భోధ :-
(ఇస్రాయీలు సంతతి వద్దకు ప్రవక్తగా వచినప్పుడు ఆటను ఇలా అన్నాడు) ‘నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తిసుకువచాను… ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంతోప దేశాలను దృవపరచటానికి నేను వచ్చాను . ఇంకా, పూర్వం మీకు నిషేదింపబడిన కొన్ని (హరామ్) వస్తువులను ధర్మసమ్మతం (హలాల్ ) చెయ్యటానికి కూడా వచాను .చుడండి! నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను . కనుక అల్లాహ్ కు భయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకు ప్రభువే మీకు ప్రభువే . కనుక మీరు ఆయన దాసాయన్నే చెయ్యండి. . ఇదే రుజుమార్గం.’ (ఖుర్ఆన్ -Quaran: 3:50-51) Q.మర్యం కుమారుడైన మసిహ్ (మెస్సయ్యా) ఏ అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పల్పడినట్లే. వాస్తవానికి మసిహ్ (మెస్సయ్యా) ఇలా అన్నాడు: (ఇస్రాయేలియులార) ఇస్రాయీలు వంశియులారా! అల్లాహ్ కు దాస్యం చెయ్యండి. ఆయన నాకు ప్రభువే. మీకు ప్రభువే. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్దం చేశాడు. వారి నివాసం నరకం . అటువంటి దుర్మార్గులకు సహాయం అందించే వాడేవాడు లేడు. (ఖుర్ఆన్ – Quaran:5:72)
ఈసా ఇలా ప్రకటించారు: నాకు, మీకు ప్రభువు అల్లాహ్ యే, కనుక మీరు ఆయనకే దాస్యం చేయండి. (ఖురాన్ -Quaran-19:36)
ఇదే బోధ బైబిల్లో ఇలా ఉంది:-
యేసు ఆమెతో…మా సహోదరుల ఎడదకు వెళ్ళి- నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వానియేద్దకు ఇక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనేను! .! (యేహను-yehanu 20:17) (ఏసే దేవుడైతే ఈ వచనం ప్రకారం ఆయన ఎవరి వద్దకు వెళ్ళుతూవున్నట్టు? )
త్రిత్వం గురించి ఖురాన్ – Trinity in the Quran:- గ్రంథ ప్రజలారా (యుద +క్రైస్తవులారా) ! మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. అల్లాహ్ కు సత్యం తప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసిహ్, మర్యం కుమారుడైన ఈసా (యేసు మెస్సయ్యా ) అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త, అల్లాహ్ మర్యమ్ వైపునకు పంపిన ఒక అజ్ఞ, అల్లాహ్ తరపు నుండి వచ్చిన (మర్యం గర్బంలో రుపందాలిచిన ) ఒక ఆత్మా తప్ప మరేమీ కాదు. కనుక అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించంది. ‘ముగ్గురు’ అనకండి. ఇలా అనటం మానివేయ్యండి . ఇది మికే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నదనే విషయానికి ఆయన అతీతుడు. బుమ్యకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. దాని పోషణకు, దాని రక్షణకు ఆయనే చాలు. (ఖుర్ ఆన్ -Quran:4171) అల్లాహ్ ముగ్గురిలో ఒకడు, అని అన్నవారు నిశాయంగా అవిశ్వాసానికి పాల్పాడినారు. వాస్తవం ఏమిటంటే, దేవుడు ఒక్కడే. ( ఆ ఏకైక దేవుడు అల్లాహ్ తప్ప ) మరొక దేవుడు లేడు. వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో అవిశ్వాసాని ఒడిగట్టిన వారికి వదాభారితమైన శిక్ష పడుతుంది. (ఖుర్ఆన్ -Quran-5:73)
Good News – శుభవార్త :- మర్యం కుమారుడైన ఈసా అనిన మాటలు జ్ఞాపకం తెచ్చుకో: ఓ ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీ వద్దకు అల్లాహ్ చే పంపబడిన సందేశాహరున్ని, నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధ్రువపరుస్తున్నాను, నా తరువాత అహ్మద్ (ఆదరణకర్త ) అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను. (ఖుర్ఆన్ – Quran-61:6) .
ఇస్రాయీలు సంతతివారు (ఈసాకు వ్యతిరేకంగా) రహస్యపుటేత్తులు పన్నసాగారు. వారి ఎత్తులకు పైఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వేయ్యటంలో అల్లాహ్ మేటి. (అది అల్లాహ్ రహస్య తంత్రమే) . అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: ఈసా! నేను నిన్ను తిరిగి నా దగ్గరకు ర్ప్పించుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిరస్కరించినవారిపై ప్రలయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను. (ఖుర్ఆన్ -Quran-3:54-55) అనగా దుర్మార్గులకు, దుష్టులకు విదింపబడే శాపగ్రస్త శిలువ మరణం నుండి యేసును కాపాడి, అపార్థాలు, అపోహలు , వివాదాల నుండి ఆయన్ని పరిశుద్ధపరుస్తాను అని అల్లాహ్ వాగ్దానం చేసాడు. ఆ తరువాత ఆరోహణ ద్వారా కాపాడాడు కుడా. ఆరోహణ :- మేము మసిహ్, మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము’ అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనులేదు , శిలువపైకి ఎక్కించనూ లేదు.అయితే ఈ విషయం గురించి అభిప్రాయభేదం వ్యక్తం చేసినవారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమి తెలియదు. వారు కేవలం ఉహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు. కాని అల్లాహ్ ఆఉఅమమి తమ వైపునకు లేపుకున్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు . (ఖుర్ఆన్ -Quran-4:157-158) అనగా యేసు శిలువపైకి ఎక్కించబడే ముందే లేపుకోబడ్డారు. ‘క్రీస్తు మాకోరకు శిలువపై మరణించాడు’ అనే క్రేస్తావుల ఊహ, ‘మేము మేస్సేయ్యను శిలువపై చంపాము, అనే యూదుల అభిప్రాయం కేవలం అపోహలు మాత్రమే. యూదులు ఆయనను శిలువపైకి ఎక్కించక మునుపే అల్లాహ్ తన వాగ్దానం ప్రకారం ఆరోహణ ద్వారా ఆయనను కాపాడాడు.
ముస్లింల అభిప్రాయం ప్రకారం క్రైస్తవులు ఇబ్రాహీం (అబ్రహాం), మూసా (మోషే), ఈసా (యేసు క్రీస్తు) వంటి ప్రవక్తల కథలని వక్రీకరించి తమకి అనుకూలంగా వ్రాసుకున్నారు. ముస్లింలు యేసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు కానీ దేవునిగా అంగీకరించరు. క్రీస్తు తరువాత వచ్చిన ముహమ్మదును చివరి ప్రవక్త అంటారు. బైబిల్ అనేక మార్పులు చేర్పులకు గురై కల్తీ చేయబడింది గనుక దేవుడు ఖురాన్ ద్వారా జరిగిన తప్పుల్ని సరిచేశాడని అంటారు.బైబిల్ తరువాత వచ్చిన అంతిమ దైవగ్రంధం ఖురాన్ అంటారు్ యేసు తరువాత వచ్చిన ఆదరణకర్త సత్యస్వరూపి చివరి ప్రవక్త ముహమ్మదు అంటారు.end of the day it’s known fact is that abrahamic religions are share same information
ముస్లింలు ఖురాన్ లోకి బైబిల్ కథలనే తీసుకున్నారని క్రైస్తవులు అంటారు.బైబిల్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని కథనాలు కూడా ఖురాన్ లో ఉటంకించబడ్డాయి. అవి యాకోబు సువార్త, తోమా సువార్త, , బర్నబా సువార్త .ఖురాన్ దైవ గ్రంథమని, ఖురాన్ లో చివరికి ప్రవక్త సొంతమాటలు కూడా చేర్చలేదని ముస్లిముల వాదన. బైబిలే అంతిమ దైవగ్రంధం అంటారు. యేసే చివరి ప్రవక్త అంటారు.
క్రైస్తవుల ముహమ్మద్ ని ప్రవక్తగా పరిగణించరు. క్రైస్తవుల దృష్ఠిలో యేసు క్రీస్తే చివరి ప్రవక్త అనుకుంటారు కానీ యేసుక్రీస్తు తరువాత పౌలు కాలంలో అంతియొకయ సంఘంలో బర్నబా, సుమెయోను, లూకియ, మనయేను, సౌలు అనే ప్రవక్తలు ఉన్నారు ( అపొస్తలుల కార్యములు 13:1) . ఆదినములలో ప్రవక్తలు యెరూష్లేము నుండి అంతియొకైయకు వచ్చారు. వారిలో అగబు రాబోయే కరువు గురించి ఆత్మ ద్వారా ప్రవచించాడు ( అపొస్తలుల కార్యములు 11:27, 28) . ఈ అగబు పౌలును యూదులు బంధించి అప్పగిస్తారని ప్రవచిస్తాడు (అపొస్తలుల కార్యములు 21:10) .క్రీస్తు తరువాత వచ్చిన ఇలాంటి చాలా మంది చిన్న ప్రవక్తలను అంగీకరించే క్రైస్తవులు ముహమ్మదును మాత్రం అంగీకరించటం లేదు.ముస్లిములు మాత్రం యోహాను సువార్త 1:22 లో ప్రస్తావించబడిన "ఆ ప్రవక్త", క్రీస్తు తరువాత వచ్చే "ఆదరణకర్త", (యోహాను16:7) ముహమ్మదేనని వాదిస్తున్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.