మహానగర పాలక సంస్థ From Wikipedia, the free encyclopedia
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జి.హెచ్.ఎం.సి.) హైదరాబాద్, సికింద్రాబాద్ లోని ప్రజల అవసరాలను తీర్చడంకోసం ఏర్పడిన సంస్థ. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉంది. దీనిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) నిర్వహిస్తుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 64 (ఎక్స్ అఫీషియల్) సభ్యులు, 5గురు లోక్‌సభ ఎంపీలు జిహెచ్ఎంసి అధికారక ఎన్నికలలో పాల్గొంటారు.[2][3] 1951 నుంచి 1954 వరకు హైదరాబాద్ కార్పోరేషన్‌కు (హైదరాబాద్ మేయర్) మాడపాటి హనుమంతరావు తొలి మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ గద్వాల విజయలక్ష్మీ
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | నగర పాలక సంస్థ |
చరిత్ర | |
స్థాపితం | 1869[1] |
నాయకత్వం | |
డిప్యూటి మేయర్ | మోతే శ్రీలత రెడ్డి (తెలంగాణ రాష్ట్ర సమితి) |
మున్సిపల్ కమీషనర్ | లోకేష్ కుమార్ |
నిర్మాణం | |
సీట్లు | 150 |
రాజకీయ వర్గాలు |
|
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
నినాదం | |
On Mission Tomorrow | |
సమావేశ స్థలం | |
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ భవనం | |
వెబ్సైటు | |
అధికారిక వెబ్ సైట్ |
నిజాం ప్రభుత్వం 1869లో మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్, ఛాదర్‌ఘాట్‌ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు.అప్పట్లో హైదరాబాద్‌లో నాలుగు, ఛాదర్‌ఘాట్‌లో ఐదు డివిజన్లు ఉండేవి.1886లో ఛాదర్‌ఘాట్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మార్పు చేశారు.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో 3.5లక్షల జనాభా మాత్రమే ఉండేవారు.1921లో హైదరాబాద్ 84చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా అధిక శాతం పెరిగింది.ఈ నేపథ్యంలో 1933లో ఛాదర్‌ఘాట్ కార్పొరేషన్‌ను హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు.1937లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్ని కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి,1942లో హైదరాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్‌కు కార్పొరేషన్ హోదా కల్పించడంతోపాటు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్ హోదా కల్పించారు.1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) ’గా మార్చారు.
2007, ఏప్రిల్ 16న రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలోని 12 మునిసిపాలిటీలు (ఎల్. బి. నగర్, గడ్డి అన్నారం, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కాప్రా, అల్వాల్, కుతుబుల్లాపూర్, కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్ చెరు) 8 గ్రామ పంచాయతీలు (శంషాబాద్, సతమరై, జల్లపల్లి, మమిడిపల్లి, మఖ్తల్, అల్మాస్ గూడా, సర్దానగర్, రావిరాల) హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్లో విలీనం చేయడం ద్వారా హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఏర్పడింది.
2005 జూలైలో ప్రభుత్వ ఉత్తర్వు (జి.ఓ) 261 జారీ చేయగా, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటుకు సంబంధించిన జి.ఓ. నెంబరు 261 ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007, ఏప్రిల్ 16న ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం 2019లో హైదరాబాదు మహానగరపాలక సంస్థను ఆరు మండలాలుగా (దక్షిణ, తూర్పు, ఉత్తర, ఈశాన్య, పశ్చిమ, మధ్య మండలాలు), 150 వార్డులుగా విభజించింది.[4][5]
మొత్తాన్ని 6 జోన్లుగా, 30 సర్కిళ్ళుగా, 150 వార్డులుగా విభజించారు. కమిషనరు, మహానగర పాలక మండలికి సర్వాధికారి. రాష్ట్ర ప్రభుత్వం, ఐఎఎస్ అధికారిని ఈ పదవిలో నియమిస్తుంది. ప్రతీ జోనుకూ ఒక జోనల్ కమిషనరు ఉంటారు. ప్రతి సర్కిలుకూ ఒక అదనపు కమిషనరు నేతృత్వం వహిస్తారు. ఇంజనీరింగు శాఖకు ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్, చీఫ్ ఇంజనీరు అధిపతులుగా ఉంటారు. ఈ శాఖ కింద ప్రతి జోనుకూ ఒక ఎస్.ఇ ఉంటారు. పట్టణ ప్రణాళికా విభాగానికి నేతలుగా అదనపు కమిషనరు (ప్రణాళిక), ఛీఫ్ సిటీ ప్లానరు ఉంటారు. ఈ శాఖ కింద ప్రతి జోనుకూ ఒక సిటీ ప్లానరు ఉంటారు.
వివిధ రకాలైన సమస్యలతో వార్డు కార్యాలయానికి వచ్చే పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు 2023, జూన్ 16న150 వార్డుస్థాయి కార్యాలయాల్లో వార్డు పరిపాలన ప్రారంభించబడింది. కాచిగూడలోని వార్డు కార్యాలయాన్ని పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[6] ఒక్కో కార్యాలయంలో ఇంజినీరింగ్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, శానిటేషన్, ఎంటమాలజీ, అర్బన్ బయోడైవర్సిటీ, వెటర్నరీ విభాగంతోపాటు టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు ఈ వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు. అన్ని వార్డు కార్యాలయాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయంతోపాటు ఫ్రింటర్లు, స్కానర్లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు.[7]
ప్రజల ద్వారా ఎన్నికయ్యే కార్పొరేటర్లతో పాలక మండలి ఏర్పడుతుంది. పాలక మండలి పదవీ కాలం ఐదేళ్ళు.
హైదరాబాదు మహానగర ప్రాంతం లోని 150 వార్డులలో ఒక్కొక్క వార్డు నుండి ఒక్కో సభ్యుని చొప్పున 150 మంది కార్పొరేటర్లు పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. వీరిని ప్రజలు ఎన్నుకుంటారు. వీరు కాక 64 మంది తమ ప్రజా ప్రాతినిధ్య పదవి (శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వగైరా) రీత్యా, పాలక మండలిలో ఎక్స్-అఫిషియో సభ్యులుగా చేరతారు. వీరంతా కలిసి మేయరును ఎన్నుకుంటారు.[8]
క్రమసంఖ్య | పార్టీపేరు | జండా | కూటమి | కార్పొరేటర్ల సంఖ్య | Change |
---|---|---|---|---|---|
01 | తెలంగాణ రాష్ట్ర సమితి | - | 99 | 99 (పెరుగుదల) | |
02 | ఎ.ఐ.ఎం.ఐ.ఎం | - | 44 | 1 (పెరుగుదల) | |
03 | భారతీయ జనతా పార్టీ | ఎన్.డి.ఎ. | 04 | 1 (పెరుగుదల) | |
04 | భారత జాతీయ కాంగ్రెస్ | యు.పి.ఎ. | 02 | 50 (తగ్గుదల) | |
05 | తెలుగుదేశం పార్టీ | ఎన్.డి.ఎ. | 01 | 44 (తగ్గుదల) |
2020 డిసెంబరు 1 న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీలు సాధించిన సీట్ల వివరాలివి.[9]
క్రమసంఖ్య | పార్టీపేరు | జండా | కార్పొరేటర్ల సంఖ్య | మార్పు |
---|---|---|---|---|
01 | తెలంగాణ రాష్ట్ర సమితి | 55 | 44 (తగ్గుదల) | |
02 | ఎ.ఐ.ఎం.ఐ.ఎం | 44 | 0 | |
03 | భారతీయ జనతా పార్టీ | 48 | 44 (పెరుగుదల) | |
04 | భారత జాతీయ కాంగ్రెస్ | 02 | 0 | |
05 | తెలుగుదేశం పార్టీ | 0 | 1 (తగ్గుదల) |
2022 ఏప్రిల్ 12న జరిగిన సర్వసభ్య సమావేశంలో వార్షిక బడ్జెట్‌పై విస్తృత స్థాయిచర్చ జరిగి 2022-23 ఆర్థిక సంవత్సరానికి 6,150 కోట్ల రూపాయల బడ్జెటును సభ్యులు ఆమోదించారు. ఈ బడ్జెటులో రెవెన్యూ ఆదాయం రూ. 3,434 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ. 2,800 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 634 కోట్లు, మూలధన ఆదాయం రూ. 3,350 కోట్లు, మూలధన వ్యయం రూ. 3,350 కోట్లుగా ఉంది.[10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.