From Wikipedia, the free encyclopedia
సూపర్ హీరోస్ 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.[1] మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా.
సూపర్ హీరోస్ | |
---|---|
దర్శకత్వం | ఎ.వి.ఎస్ |
రచన | దివాకర బాబు (మాటలు), ఎ. వి. ఎస్ (కథ/చిత్రానువాదం) |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | ఎ.వి.ఎస్, బ్రహ్మానందం, సంఘవి |
ఛాయాగ్రహణం | శ్యాం కె. నాయుడు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
ఈ చిత్ర నిర్మాణం 1997 జనవరి 19న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.[1]
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో ఎ. వి. ఎస్. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే అనే పాట రాశాడు. గీత రచయితగా ఇది ఆయనకు తొలి ప్రయత్నం. ఈ పాటను బాలు పాడగా ఎ. వి. ఎస్సే నృత్య దర్శకత్వం చేశాడు.[1] ఇతర గీతాలు సిరివెన్నెల, జొన్నవిత్తుల, భువనచంద్ర, చంద్రబోస్ రాశారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.