భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్
భారతదేశంలో క్రికెట్ కోసం స్థాపించబడిన పాలకమండలి. From Wikipedia, the free encyclopedia
Remove ads
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) భారతదేశంలో క్రికెట్ కోసం స్థాపించబడిన పాలకమండలి.[14] 1928 డిసెంబరులో తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్టర్ చేయబడి ఈ సొసైటీ బోర్డు ఏర్పడింది. ఇది రాష్ట్ర క్రికెట్ సంఘాల కన్సార్టియం. రాష్ట్ర సంఘాలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి, వారు బిసిసిఐ చీఫ్‌ను ఎన్నుకుంటారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఉంది . గ్రాంట్ గోవన్ దాని మొదటి అధ్యక్షుడు, ఆంథోనీ డి మెల్లో దాని మొదటి కార్యదర్శి.[15]
Remove ads
ఈ కింది దేశీయ క్రికెట్ పోటీలను బిసిసిఐ నిర్వహిస్తుంది:
పురుషుల దేశీయ క్రికెట్
- కూచ్ బెహర్ ట్రోఫీ
- ఇరానీ కప్
- దేయోధర్ ట్రోఫీ
- దులీప్ ట్రోఫీ
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిల్)
- రంజీ ట్రోఫీ
- సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ
- విజయ్ హజారే ట్రోఫీ
- వినూ మన్కడ్ ట్రోఫీ
- బిసిసిఐ కార్పొరేట్ ట్రోఫీ
మహిళల దేశీయ క్రికెట్
- సీనియర్ మహిళల ఛాలెంజర్ ట్రోఫీ
- సీనియర్ మహిళల వన్ డే లీగ్
- సీనియర్ మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీ
- సీనియర్ మహిళల టీ20 లీగ్
- మహిళల టి 20 ఛాలెంజ్ (మహిళల ఐపిల్ )
Remove ads
2019-2020 ఆర్థిక సంవత్సరంలో, బిసిసిఐ మొత్తం వార్షిక ఆదాయం 3730 కోట్ల రూపాయలు (US $ 535 మిలియన్లు), ఇందులో ఐపిఎల్ నుండి 2500 కోట్ల రూపాయలు (US $ 345 మిలియన్లు) కాగ, ఇతర దేశాలతో ద్వైపాక్షిక క్రికెట్ నుండి 950 కోట్లు (US $ 139 మిలియన్లు), ఐసిసి ఆదాయం నుండి భారత దేశానికి 380 కోట్లు ( US $ 51 మిలియన్లు సంవత్సరానికి లేదా 8 సంవత్సరాలకు మొత్తం US $ 405 మిలియన్లు).[16]
ఐసిసి ఆదాయ వాటా
2020 లో, ప్రస్తుత ఎనిమిదేళ్ల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం (ఎఫ్‌టిపి) ప్రకారం, ఐసిసి నుండి మొత్తం 405 మిలియన్ డాలర్లు భారతదేశం అందుకుంటుంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, న్యూజిలాండ్ క్రికెట్, శ్రీలంక క్రికెట్, క్రికెట్ వెస్టిండీస్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతి ఒక్కరు US $ 128 మిలియన్లు అందుకుంటున్నాయి.[16]
మీడియా హక్కులు
2018 నుండి 2022 వరకు ఐపిఎల్ గ్లోబల్ మీడియా హక్కులను స్టార్ ఇండియాకు, 16,347.5 కోట్లకు (US $ 2.3 బిలియన్) ప్రదానం చేసారు.[17]
2010 లో, రాబోయే 5 సంవత్సరాలలో 25 తటస్థ వేదిక వన్డే మ్యాచ్‌లకు మీడియా హక్కులను జీ టెలిఫిలింస్‌కు 219.16 మిలియన్లకు ఇవ్వబడ్డాయి.[18]
స్పాన్సర్షిప్ హక్కులు
2016 నుండి 2020 వరకు, 5 సంవత్సరాల అధికారిక కిట్ స్పాన్సర్‌షిప్ హక్కులను నైక్ సంస్థకు 370 కోట్ల రూపాయల తో (US $ 52 మిలియన్లు) ప్రదానం చేశారు.[19] 2019 లో, బైజు 1,079 కోట్ల (US $ 150 మిలియన్) వ్యయంతో నాలుగు సంవత్సరాల కాలానికి అధికారిక భారత క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా మారింది.[20] బిసిసిఐ ఈ స్పాన్సర్‌షిప్ ఒప్పందం ప్రకారం ప్రతి హోమ్ మ్యాచ్‌కు 60 కోట్ల రూపాయల (US $ 8 మిలియన్ కంటే తక్కువ) ఆదాయం పొందుతుంది.[16]
ఆగస్టు 18న డ్రీమ్11 ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను 222 కోట్ల రూపాయలకు గెలుచుకుంది.[21]
Remove ads
ఇవి కూడా చూడండి
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads

