ఫటాఫట్ జయలక్ష్మి
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
ఫటాఫట్ జయలక్ష్మిగా పిలువబడే జయలక్ష్మీరెడ్డి (1958-1980) దక్షిణ భారతీయ సినిమా నటిగా ప్రసిద్ధురాలు. ఈమె మలయాళ సినిమాలలో "సుప్రియ" అనే పేరుతో పిలువబడుతున్నది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 66 చిత్రాలలో నటించింది.
ఈమె నటిగా తన వృత్తిని 1972లో మలయాళం సినిమా తీర్థయాత్రతో సుప్రియ అనే పేరుతో ప్రారంభించింది. 1974లో కె.బాలచందర్ దర్శకత్వంలో "అవల్ ఒరు తొదర్ కథై" సినిమాలో జయలక్ష్మి అనే పేరుతో నటించింది. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ధరించింది. ఆ పాత్ర ఊతపదం "ఫటాఫట్" ప్రేక్షకులలో బాగా పేలడంతో ఫటాఫట్ ఆమె ఇంటిపేరుగా మారిపోయి ఫటాఫట్ జయలక్ష్మిగా స్థిరపడిపోయింది. ఈ సినిమా తెలుగులో అంతులేని కథ పేరుతో 1976లో రీమేక్ చేయబడింది. ఈమె కమల్ హాసన్, రజనీకాంత్, ఎన్.టి.రామారావు, చిరంజీవి మొదలైన అగ్రనటుల సరసన నటించింది.
ఈమె ఎం.జి.రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కొడుకు సుకుమార్‌ను ప్రేమించింది. అయితే అది పెళ్ళిగా మారలేదు. దానితో తన 22 యేళ్ల పిన్న వయసులోనే 1980లో, నటిగా ఉన్నత స్థాయిలో ఉన్నదశలోనే ఈమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది[1],,[2] [3].
ఫటాఫట్ జయలక్ష్మి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.