Remove ads
From Wikipedia, the free encyclopedia
పెన్నానది లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. పెన్నా నది (ఉత్తర పినాకిని) కర్ణాటక రాష్ట్రంలో కోలారు సమీపానగల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ప్రవహించి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.
పెన్నా లేదా పెన్నార్ ಪೆನ್ನಾರ್ పెన్నా (పెన్నార్) | |
పెన్నా, పెన్నేరు | |
River | |
Map showing the river. | |
దేశం | India |
---|---|
రాష్ర్టాలు | కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ |
Region | దక్షిణ భారత్ |
ఉపనదులు | |
- ఎడమ | Jayamangali, Kunderu, Sagileru |
- కుడి | Chitravati, Papagni, Cheyyeru |
City | నెల్లూరు |
Mouth | |
- location | Utukuru into Bay of Bengal, Nellore, Andhra Pradesh, India |
- ఎత్తు | 0 m (0 ft) |
పొడవు | 597 km (371 mi) |
పరివాహక ప్రాంతం | 55,213 km2 (21,318 sq mi) |
Discharge | for Nellore (1965–1979 average), max (1991) |
- సరాసరి | 200.4 m3/s (7,077 cu ft/s) [1] |
- max | 1,876 m3/s (66,250 cu ft/s) |
- min | 0 m3/s (0 cu ft/s) |
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: కుముదావతి, జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు, బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.
పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న ప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది. అక్కడి నుంచి ఈ నది కడప జిల్లాలో పోట్లదుర్తి, హనుమనగుత్తి, కోగటం, పుష్పగిరి, చెన్నూరు, లింగంపల్లె, జ్యోతి క్షేత్రం, సిద్ధవటం గ్రామాలను ఆనుకుని ప్రవహించి సోమశిల రిజర్వాయర్ ను చేరుతుంది. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరి క్షేత్రాన్ని పంచనదీక్షేత్రమంటారు.
గండికోట: ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నది వల్ల ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నది, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
సిద్ధవటం కోట: దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తలతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది. మట్లి అనంతరాజు సిద్ధవటం మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. మట్లి రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. అప్పట్నుంచి కడప నవాబులు సిద్ధవటం కోట నుంచే పాలించేవారు. పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడల్లా సిద్ధవటానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో పాలనాకేంద్రాన్ని కడపకు మార్చారు. ప్రస్తుతం కడప నగరానికి, పెన్నేటికి మధ్య దూరం దాదాపు 5 కిలోమీటర్లు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాడు.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.