Remove ads
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
కోలారు జిల్లా: (Kolar district) (کولار ضلع ) (కన్నడ: ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ pronunciation (help·info)) : కర్నాటక రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇది కర్నాటక రాష్ట్రానికి ఆగ్నేయ దిశన ఉంది. ఈ జిల్లాకు సరిహద్దులు, పశ్చిమాన బెంగళూరు జిల్లా, ఉత్తరాన చిక్కబల్లాపూర్ జిల్లా, తూర్పున ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిత్తూరు జిల్లా, దక్షిణాన తమిళనాడుకు చెందిన క్రిష్ణగిరి జిల్లా, వేలూరు జిల్లాలు ఉన్నాయి.
Kolar district
ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | కర్ణాటక |
Division | Bangalore |
ప్రధాన కార్యాలయం | Kolar |
విస్తీర్ణం † | |
• Total | 4,012 కి.మీ2 (1,549 చ. మై) |
జనాభా (2011)† | |
• Total | 15,40,231 |
• జనసాంద్రత | 384/కి.మీ2 (990/చ. మై.) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-KA-KL |
Vehicle registration | KA-07, KA-08 |
లింగ నిష్పత్తి | 0.976 ♂/♀ |
అక్షరాస్యత | 74.33% |
లోక్ సభ నియోజకవర్గం | Kolar Lok Sabha constituency |
Precipitation | 724 మిల్లీమీటర్లు (28.5 అం.) |
† Kolar district at a glance |
సెప్టంబరు 10, 2007 న, కోలారు జిల్లాను విభజించి చిక్కబళ్ళాపూరు జిల్లా ఏర్పాటు చేశారు.[1] ఈ జిల్లాలో కోలారు బంగారు గనులు ఉన్నందున, దీనిని "గోల్డెన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా"గా అభివర్ణిస్తారు.
పూర్వం కోలార్ పట్టణాన్ని కోలాహల, కువలాల, కోలాల అని పిలువబడింది. కోలార్ మధ్యయుగంలో కొల్హాపురి అని పిలువబడింది. తరువాత కోలార్ అయింది. కొల్హాపుర అంటే కన్నడంలో " హింసాత్మక నగరం " అని అర్ధం. ఉత్తరంలోని చాళుఖ్యులకు దక్షిణంలోని చోళులకు ఇది యుద్ధభూమిగా ఉండేది. సా.శ. 4వ శతాబ్దం వరకు ఇది గంగా చక్రవర్తులకు ఇది రాజధానిగా ఉండేది. సా.శ. 1004 లో రాజధాని మైసూరులోని తలకాడుకు మారింది. అయినప్పటికీ సా.శ. 1116 వరకు చోళులు దీనిని అంటిపెట్టుకుని ఉన్నారు. విష్ణువర్ధన (సా.శ.1108-1142) లో గంగావాడి చోళుల నుండి విడివడిన తరువాత విజయాన్ని గుర్తుచేసుకుంటూ బేలూరులో విజయనారాయణా ఆలయం (చెన్నకేశవ ఆలయం) నిర్మించబడింది.
పట్టణంలోని ఆలయాలలో కొలరమ్మ ఆలయం, సోమేశ్వరాలయం ప్రధానమైనవి. శక్తి ప్రధానదైవంగా ఉన్న ఈ ఆలయం 2వ శతాబ్దంలో గంగాచక్రవర్తులు చోళసంప్రదాయం అనుసరించి విమానగోపురంతో నిర్మించారు. 10వ శతాబ్దంలో ఈ ఆలయం మొదటి రాజేంద్రచోళుని కాలంలో, 15వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తులు పునరుద్ధరించబడింది.[2][3] సోమేశ్వరాలయం 14వ శతాబ్ధపు విజయనగర సామ్రాజ్య నిర్మాణవైభవానికి చిహ్నంగా ఉంది.
కోలార్ ఆరంభకాల చరిత్రను వాస్లేయన్ తమిళ మిషన్ పర్యవేక్షకుడు " రేవ్ ఫ్రెడ్ గుడ్ విల్ " గ్రంధస్థం చేసాడు. ఆయన కోలార్ బంగారుగనులు, బెంగుళూరు చరిత్రను గ్రంధస్థం చేసాడు. ఆయన అధ్యయనం, పరిశోధనలు " డాలీ మెమోరియల్ హాల్మిథిక్ సొసైటీ త్రైమాసిక జర్నల్స్, ఇతర అకాడమిక్ జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి.[4][5][6]
కోలార్ బెంగుళూరు కంటే పురాతనమైనది. ఇది సా.శ. 2వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. పశ్చిమ గంగా సామ్రాజ్యం (గంగాలు) కన్నడిగులు. వారు కోలారును రాజధానిని చేసుకుని మైసూరు, సేలం (తమిళనాడు), కోయంబత్తూరు (తమిళనాడు),త్రివేండ్రం లను పాలించారు. క్ర.శ 13వ శతాబ్దంలో భవనంది తన తమిళ గ్రంథం నన్నూలులో కోలార్ గురించి ప్రస్తావించాడు. ఆయన నన్నూలును కోలార్ లోని ఉలగమంది గుహలలో ఉండి వ్రాసాడు. అయాన గంగా పాలకుడు సీయా గంగన్ (కోలర్‌లో జన్మించాడు) ఆస్థానంలో సాహిత్య, కళాసేవలో ఉండేవాడు. అదనంగా సీయా గంగన్ శిలాశాసనాలు కోలార్ మీద తిరిగి చోళులు పట్టు సాధించిన వివరణలు లభించాయి.
చోళుల పాలనాకాలంలో రాజా ఉత్తమ చోళుడు (సా.శ. 970) రేణుకాదేవి ఆలయం నిర్మించాడు. తరువాత రేణుకా దేవి అలతారం కోలహలమ్మ కోలాహలమ్మ పేరుతో ఇక్కడ కొల్హాపురం నిర్మిచాడు. కోలహలమ్మ దేవత పూరుతో ఈ నగరం నిర్మించబడిందని ప్రాంతీయ కథనాలు వివరిస్తున్నాయి. చోళపాలకులు వీరరాజేంద్ర చోళుడు (వీరచోళుడు), విక్రమచోళుడు, రాజేంద్రచోళుడు (రాజరాజనరేంద్రచోళుడు) స్థాపించిన శిల్పాలలో మొదటి అవని కోలార్, ముల్బగల్, సిట్టి బెట్టా, ఇతర ప్రాంతాల కొన్ని శిలాక్షరరూప వివరాలు లభిస్తున్నాయి. ఈ శిలాక్షరాలు కోలార్‌ను " నికరిలి చోళమండలం, జయం కొండ చోళమండలం అని ప్రస్తావిస్తున్నాయి. మొదటి రాజేంద్రచోళుడు కూడా కొలరమ్మ ఆలయం సందర్శించాడు. చోళుల కాలంలో మారికుప్పం గ్రామంలో ఉన్న సోమేశ్వరాలయం, శ్రీ ఉద్దండేశ్వరాలయం, ఉరుగంపేట్‌లో ఈశ్వరాలయం, మదివాల గ్రామంలో శివాలయం మొదలైన పలు శివాలయాలు కూడా నిర్మించబడ్డాయి. కోలార్‌లో సా.శ. 1116 వరకు చోళులపాలన కొనసాగింది. దురదృష్టకరంగా కోలార్ లోని చోళుల శిలాశాసనాలు నిర్లక్ష్యానికి గురైయాయి. కొన్ని సాంస్కృతిక దౌర్జన్యానికి గురయ్యాయి.
సా.శ. 1117 లో కోలార్ ప్రాంతాన్ని కన్నడ హొయశిల పాలకులు స్వాధీనం చేసుకున్నారు. 1254లో సామ్రాజ్యం మాహారాజా కుమారులైన వీరసోమేశ్వర, రామనాథాలకు పంచినప్పుడు. కోలార్, ఇతర తమిళ ప్రాంతాలు రామనాథ పాలనలోకి మారాయి. విజయమగర కన్నడిగులు హొయశిల పాలకులను ఓడించారు. కోలార్ ప్రాంతాన్ని విజయనగర పాలనలో 1336-1664 వరకు కొనసాగింది. వారి పాలనలో కోలార్‌లో సోమేశ్వరాలయం నిర్మించబడింది.
17వ శతాబ్దంలో కోలార్ ప్రాంతాన్ని మరాఠీ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. మరాఠీలు ఈ ప్రాంతాన్ని వారి జాగీరుగా చేసుకుని 50 సంవత్సరాల కాలం పాలించారు. తరువాత ఈ ప్రాంతం మీద ముస్లిములు 70 సంవత్సరాల కాలం ఆధిక్యత సాధించారు. 1720లో కోలార్ సిరా సుభాహ్‌లో భాగం అయింది. హైదర్ అలి తండ్రి ఫతేహ్ ముహమ్మద్ ఫౌజీదార్‌గా నియమించబడ్డాడు. తరువాత కోలార్ మారాఠా సామ్రాజ్యం, కడప నవాబు, హైదరాబాదు నిజాం, హైదర్ అలి పాలనలో భాగం అయింది. 1778లో లార్డ్ చార్లెస్ క్రాన్‌విల్స్ కోలార్‌ను ఆక్రమించాడు. తరువాత 1792లో జరిగిన ఒప్పందం తరువాత మైసూర్ రాజాస్థానంలో చేర్చబడింది. అప్పటి నుండి కోలార్ మైసూర్ రాజాస్థానంలో భాగంగా ఉంది.
కోలార్ ప్రాంతం చుట్టూ మహావాలిలు (బాణాలు), పల్లవులు, వైదుంబాలు మొదలైన వైవిధ్యమైన కాలాలకు సంబంధించిన రాజుల శిలాశాసనాలు అనేకం లభిస్తున్నాయి. [4][5][6][7]
జిల్లా కర్ణాటక లోని " సెమీ అరిడ్ డౌట్ రీజియన్"లో ఉంది. 77° 21' నుండ్జి 78° 35'డిగ్రీల తూర్పు రేఖాంశం, 20° 46' నుండి 130° 58 డిగ్రీల ఉత్తర రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 8,225 చ.కి.మీ. కోలార్ జిల్లా రాష్ట్రానికి దక్షిణ భూభాగంలో ఉంది.
జిల్లా ఉత్తర దక్షిణాలుగా 135 కి.మీ పొడవు ఉంది. తూర్పు పడమతల మద్య కూడా అంతేదూరం ఉండడం ప్రత్యేకత. ఇది మైసూర్ పీఠభూమిలో ఉంది. పీఠభూమి పర్వతాలు, కొండల చేత విభజించబడి ఉంది. వీటిలో నంది దుర్గ్ పర్వతావళి ప్రధానమైనది. నంది దుర్గ్ పర్వతావళి నంది నుండి పెనుగొండ, ధర్మవరం వైపు సాగుతూ ఉంది.
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
పశ్చిమ సరిహద్దు | బెంగుళూరు గ్రామీణ |
ఉత్తర సరిహద్దు | చిక్కబళ్ళాపూర్ |
తూర్పు సరిహద్దు | చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
దక్షిణ సరిహద్దు | క్రిష్ణగిరి జిల్లా తమిళనాడు |
కోలార్ జిల్లాలో " అంతతంగంగె కోలార నగర సారిగె "ను ఉప ముఖ్యమంత్రి మైరియు హోం మంత్రి అశోక్ చేత 2002 జూలైలో ప్రారంభించబడింది.
నరసాపురా ఇండస్ట్రియల్ ప్రాంతం ఇంఫ్రాస్ట్రక్చర్, హోండా, మహీంద్రా ఎయిరోస్పేస్, వొల్వొ, ఇతర మోటర్ వాహన తయారీ సంస్థలకు ప్రసిద్ధి చెంది ఉంది. నరసాపురా ఇండస్ట్రియల్ ప్రాంతం కోలార్ నుండి 20 కి.మీ దూరంలో ఉంది. జాతీయరహదారి 4 ద్వారా బెంగుళూరుతో అనుసంధానించబడి ఉంది.
కోలార్ జిల్లాలో టెలిఫోన్ ఆపరేటర్లకు అద్భుతమైన అవకాశంఉంది. అలాగే టెలిఫోన్ ఆపరేటర్లకు గ్రామీణ, అటవీ ప్రాంతాలలో అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ముళబాగిలు తాలూకా జిల్లాలోని వెనుకబడిన తాలూకాలలో ఒకటి. తాలూకలో వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల వసతులు లేనప్పటికీ ప్రజలు అధికంగా వ్యవసయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.
కోలార్ జిల్లాలోని తాలూకాలలో శ్రీనివాసపురా ఒకటి. జిల్లాలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో శాశ్వత జలవనరులు లేవు.
కోలార్ జిల్లాలో ఒక రెవెన్యూ విభాగం ఉంది.
జిల్లాలలో అధికంగా వ్యవసాయం, పాల ఉత్పత్తులు, సెరికల్చర్, ఫ్లోరి కల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. కోలార్ " లాండ్ ఆఫ్ సిల్క్, మిల్క్, గోల్డ్ "గా వర్ణించబడుతుంది. కోలార్ ప్రజలు నీటిపారుదల, త్రాగునీటికి గొట్టం బావుల మీద ఆధారపడుతున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో బంగారు గనులు 2003 నుండి మూసివేయబడ్డాయి. ఇక్కడ బంగారు నిల్వలు క్షీణించడం, ఉత్పత్తి ఖర్చులు అధికరించడం అందుకు కారణం.
కోలార్ జిల్లాలో 2 బృహత్తర, 1 మీడియం, 1 మైనర్ ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి.
మాన్యుఫ్యాక్చర్ యూనిట్ తవరెకెరె సమీపంలోని యలచహళ్ళి వద్ద ఏర్పాటు చేయబడింది.
సంఖ్య క్ర | కోలార్ జిల్లా | నేషనల్ హైవే | రాష్ట్ర రహదారి | మేజర్ Dist రోడ్ | మొత్తం పొడవు |
---|---|---|---|---|---|
01 | కోలార్ జిల్లా | 137 NH-4 | 308 | 1083 | 1528 |
02 | ముల్బగల్ | 68 | 0 | 354 | 422 |
03 | మాలూర్ | 8 | 68 | 94 | 170 |
04 | బంగారుపేట | 0 | 77 | 201 | 278 |
05 | శ్రీనివాసపురా | 30 | 72 | 217 | 319 |
బెంగుళూరు నుండి ముల్బగల్కు చేరడానికి నాలుగు వరుసల జాతీయరహదారి 4 ద్వారా 90 నిముషాలు పడుతుంది. మోటర్ ప్రయాణీకులు 6 వరుసల రహదారి మార్గం ద్వారా కె.ఆర్ పురం నుండి హోస్కోటె చేరుకుని అక్కడి నుండి ముల్బగల్ చేరుకోవచ్చు. తూర్పు బెంగుళూరు వాసులు ఈ మార్గం ద్వారా దేవనహళ్ళి విమానాశ్రయం చేరుకుంటారు.[12]
కోలార్ రైల్వే " సౌత్ వెస్టర్న్ రైల్వే "లో భాగంగా ఉంది. కోలార్ జిల్లాలో పలు రైలు స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో బంగారు పేట వద్ద పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. ఈ స్టేషన్లు అన్నీ చెన్నై సెంట్రల్ - బెంగుళూరు సిటీ లైన్ - చెన్నై బెంగుళూరు మెయిన్ లైన్ రైలు మార్గంలో, దాని బ్రాంచి మార్గంలో ఉన్నాయి. సమీపంలోని రైల్వే స్టేషన్లు తకల్, బంగారు పేట వద్ద ఉన్నాయి. ప్రధాన రైల్వే స్టేషను బెంగుళూరు రైల్వే స్టేషను. సమీపంలోని విమానాశ్రయం " బెంగుళూరు విమానాశ్రయం ".
కోలార్, బంగారుపేట రైల్వే స్టేషన్లు :- [13]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,540,231,[14] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[15] |
అమెరికాలోని. | హవాయ్ నగర జనసంఖ్యకు సమం..[16] |
640 భారతదేశ జిల్లాలలో. | 324 వ స్థానంలో ఉంది.[14] |
1చ.కి.మీ జనసాంద్రత. | 384 [14] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.04%.[14] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 976:1000 [14] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 74.33%.[14] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జనసంఖ్య అభివృద్ | కర్ణాటక |
---|---|
1901 | 392651 |
1911 | 429193 |
1921 | 436066 |
1931 | 469811 |
1941 | 555545 |
1951 | 650807 |
1961 | 721822 |
1971 | 826563 |
1981 | 1044394 |
1991 | 1211858 |
2001 | 1387062 |
అంచనా | 1571700 |
అంచనా సంవత్సరం | 2010 |
మూలాలు | కోలార్ జిల్లా అధికారిక వెబ్సైట్ [17] |
జిల్లా మూడు రాష్ట్రాల కూడలిప్రాంతంలో ఉంది. అందువలన ఇక్కడ పలు సంప్రదాయాలకు చెందిన ప్రజలతో మినీ ఇండియాను తలపింపజేస్తుంది. జిల్లాలో ప్రధానంగా కన్నడ భాష వాడుకలో ఉంది. విస్త్రుతంగా వాడుకలో ఉన్న ఇతరభాషలలో ఉర్ధూ ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాలో తెలుగు, తమిళం మాట్లాడే ప్రజలు గుర్తించతగినంతగా ఉన్నారు.
కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (కె.జి.ఎఫ్) కోలార్ జిల్లాలోని ఒక పట్టణం. ఒకప్పుడు ఇది భారతదేశంలోని ప్రధాన బంగారుగనిగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ ప్రభుత్వం చేత స్థాపించబడిన ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ తమిళ, తెలుగు, ఆంగ్లో ఇండియన్ ప్రజలు అధికంగా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం బంగారు గనులలో పనిచేయడానికి తమిళ ప్రజలను తీసుకు వచ్చారు.
కరగ ఉత్సవం జిల్లాకు మకుటాయమానం అని చెప్పవచ్చు. ఇది మాలూర్ పట్టణంలో నిర్వహించబడుతుంది. ఇది బెంగుళూరు - చెన్నై రహదారి మార్గంలో బెంగుళూరుకు 30 కి.మీ దూరంలో ఉంది. తిగ్లా వంశస్థులు ద్రౌపది ఆరాధనలో భాగంగా కరగ ఉత్సవం జరుపుకుంటారు. మలూర్ లోని కరగ పండుగ 13 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఇది సాధారణంగా ఉగాది తరువాత వచ్చే మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది.
కోలార్ జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. బెంగుళూర్ నుండి km. 68 కి.మీ ప్రయాణించి కోలార్‌ను చేరుకోవచ్చు.
కోలార్ జిల్లాలో ఉన్న పర్యాటక ఆకర్షణల జాబితా:-
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.