From Wikipedia, the free encyclopedia
పూసపాటి కృష్ణంరాజు (ఆగష్టు 20, 1928 - నవంబరు 18, 1994) తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత.
కృష్ణంరాజుగారు 1928, ఆగష్టు 20 న విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో జన్మించారు. 1948లో ఎస్టేట్ అబాలిషన్ ఆక్ట్ (జమీందారీ రద్దు చట్టం) వల్ల ఆస్తులు పోయినా, ఆభిజాత్యాలు పోని కుటుంబాలను దగ్గరనుంచి చూశారు. ఉన్నతవిద్య లేకపోయినా, విశాఖ కాల్టెక్స్ రిఫైనరీ, మద్రాస్ రిఫైనరీస్లలో పైప్లైన్ నిర్మాణాలలో ముఖ్యపాత్ర వహించేరు. నటుడు, నాటక రచయిత, నాటక ప్రయోక్త కూడా[1].
పూసపాటి కృష్ణంరాజు కొన్ని కథలే[2] వ్రాసినా అన్ని కథలూ పాఠకాభిమానాన్నిచూరగొన్నాయి.
కృష్ణంరాజుగారు అరవై ఆరేళ్ళుదాటాక 1994, నవంబరు 18 న మరణించారు[1].
Seamless Wikipedia browsing. On steroids.