From Wikipedia, the free encyclopedia
పరిణీతి చోప్రా (జననం 22 అక్టోబరు 1988)ప్రముఖ బాలీవుడ్ నటి. ఎన్నో జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నామినేషన్లు అందుకున్నారు. చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు పరిణీతి.
పరిణీతి చోప్రా | |
---|---|
జననం | అంబాలా, హర్యానా రాష్ట్రము, భారతదేశం | 1988 అక్టోబరు 22
విద్యాసంస్థ | మాంచెస్టర్ యూనివర్సిటీ |
వృత్తి | నటి, గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2011 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాఘవ్ చద్దా |
ముందు పెట్టుబడి బ్యాంకింగ్ లో కెరీర్ ఎంచుకోవాలని అనుకున్నారు చోప్రా. కానీ వ్యాపారం,ఫైనాన్స్, ఎకనామిక్స్ లో మంచెష్టర్ బిజినెస్ స్కూల్ నుంచి ట్రిపుల్ హానర్స్ డిగ్రీ చేసిన తరువాత, 2009 లో ఆర్థిక మాంద్యం తరువాత భారతదేశానికి తిరిగి వచ్చేశారు ఆమె. ఇక్కడకు వచ్చాకా యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఆ తరువాత అదే సంస్థకు నటిగా కొనసాగేందుకు ఒప్పందం చేసుకున్నారు పరిణీతి. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు ఆయన.
2012లో ఆమె నటించిన ఇష్క్ జాదే సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాక, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమాలో ఈమె నటనకు జాతీయ ఫిలిం అవార్డు-స్పెషల్ మెన్షన్, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్లు లభించాయి. ఆ తరువాత శుద్ధ్ దేశీ రోమాన్స్ (2013), హసీతో ఫసీ (2014)వంటి సినిమాల్లోని నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాల్లోని నటనతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది.[1]
22 అక్టోబరు 1988న హర్యానాలోని అంబాలాలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు పరిణీతి.[2][3][4] ఆమె తండ్రి పవన్ చోప్రా వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్ లో భారత సైన్యానికి సరఫరాదారుగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి రీనా చోప్రా. ఆమెకు ఇద్దరు సోదరులు శివాంగ్, సరజ్. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రా ఈమెకు కజిన్స్.[4][5][6][7][8] అంబాలా కంటోన్మెంట్ లోని కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు ఆమె.[9] ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిణీతి మాట్లాడుతూ తాను చిన్నప్పట్నుంచీ చాలా మంచి విద్యార్థిని అని, మంచి మార్కులు వస్తుండేవనీ, ఎప్పుడూ పెట్టుబడి బ్యాంకర్ కావాలని అనుకునేవారని వివరించారు. తన 17 ఏటన మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ లో చదువుకునేందుకు లండన్ వెళ్ళిపోయారు.[10] విశ్వవిద్యాలయంలో కొత్త విద్యార్థులకు ఓరియెంటేషన్ తరగతులు చెప్పేవారు ఆమె.[11] చదువుకునేటప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్ కు క్యాటరింగ్ శాఖకు టీం లీడర్ గా పార్ట్ టైం పని చేసేవారు.[12]
ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని కపుర్తాలా హౌస్‌లో పరిణీతి చోప్రా ఎంగేజ్మెంట్ (నిశ్చితార్ధం) ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో 2023 మే 13న జరిగింది.[13] వీరి వివాహం సెప్టెంబర్ 24న ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగింది. ఈ వివాహానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా హాజరైయ్యారు.[14][15]
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2011 | లేడీస్ vs రికీ బహ్ల్ | డింపుల్ చద్దా | [16] | |
2012 | ఇషాక్జాదే | జోయా "జోయా" ఖురేషి | [17] | |
2013 | శుద్ధ్ దేశీ రొమాన్స్ | గాయత్రి | [18] | |
2014 | హసీ తో ఫేసీ | డాక్టర్ మీటా సోలంకి | [19] | |
దావత్-ఎ-ఇష్క్ | గుల్రేజ్ "గుల్లు" ఖదీర్ | [20] | ||
కిల్ దిల్ | దిశా | [21] | ||
దోర్ | రియా | షార్ట్ ఫిల్మ్ | [22] | |
2016 | డిషూమ్ | ముస్కాన్ రజా ఖురేషీ | అతిధి పాత్ర | [23] |
2017 | మేరీ ప్యారీ బిందు | బిందు శంకర్ నారాయణన్ | [24] | |
గోల్మాల్ ఎగైన్ | ఖుషీ చౌహాన్ | [25] | ||
2018 | నమస్తే ఇంగ్లండ్ | జస్మీత్ కౌర్ రంధవా | [26] | |
2019 | కేసరి | జీవని కౌర్ | [27] | |
జబరియా జోడి | బబ్లీ యాదవ్ | [28] | ||
2021 | ది గర్ల్ ఆన్ ది ట్రైన్ | మీరా కపూర్ | [29] | |
సందీప్ ఔర్ పింకీ ఫరార్ | సందీప్ "శాండీ" కౌర్ వాలియా | [30] | ||
సైనా | సైనా నెహ్వాల్ | [31] | ||
2022 | కోడ్ నేమ్: తిరంగా | దుర్గా దేవి సింగ్ / ఇస్మత్ | [32][33] | |
ఉంఛై | శ్రద్ధా గుప్తా | [34][35] | ||
2023 | మిషన్ రాణిగంజ్ | నిర్దోష్ కౌర్ గిల్ | [36][37] | |
2024 | అమర్ సింగ్ చమ్కిలా | అమర్‌జోత్ కౌర్ | [38][39] |
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2013 | 3వ స్టార్‌డస్ట్ అవార్డులు | సహ-హోస్ట్ | ||
2014 | భారతదేశపు ఉత్తమ సినీనటులు కి ఖోజ్ | గురువు | ప్రత్యేక ప్రదర్శన | |
యే హై ఆషికీ | మీటా సోలంకి | |||
2015 | 11వ స్టార్ గిల్డ్ అవార్డులు | సహ-హోస్ట్ | ||
మనిషి ప్రపంచం | వైద్యుడు | వెబ్ సిరీస్; అతిధి పాత్ర | ||
2016 | 3వ టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ | సహ-హోస్ట్ | ||
2017 | లిప్ సింగ్ యుద్ధం | పోటీదారు | ||
2018 | 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | సహ-హోస్ట్ | ||
కసౌతి జిందగీ కే | బబ్లీ యాదవ్ | ప్రత్యేక ప్రదర్శన | ||
2022 | హునార్బాజ్: దేశ్ కీ షాన్ | న్యాయమూర్తి | ||
ఖత్రా ఖత్రా ఖత్రా | ఆమెనే | అతిథి |
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2015 | గర్ల్ రైజింగ్ ఇండియా - వో పధేగి, వో ఉడేగి | మరియమా | రిచర్డ్ ఇ. రాబిన్స్ సినిమా హిందీ వెర్షన్ . |
సంవత్సరం | సినిమా | పాట | స్వరకర్త | సహ గాయకుడు(లు) | మూ |
---|---|---|---|---|---|
2017 | మేరీ ప్యారీ బిందు | " మాన కే హమ్ యార్ నహిన్ " | సచిన్-జిగర్ | ||
"మాన కే హమ్ యార్ నహీ" (డ్యూయెట్) | సోనూ నిగమ్ | ||||
2019 | కేసరి | " తేరి మిట్టి " (ఆడ) | అర్కో | ||
2021 | రైలులో అమ్మాయి | "మత్లాబి యారియన్" (అన్ప్లగ్డ్) | విపిన్ పట్వా | ||
2023 | నాన్-ఆల్బమ్ సింగిల్ | "ఓ పియా" | గౌరవ్ దత్తా |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.