From Wikipedia, the free encyclopedia
కొత్త కేశవులు 1904లో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జన్మించాడు. 1947-48లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. హైదరాబాదు, నిజామాబాదు జైళ్ళలో శిక్షను కూడా అనుభవించాడు.[1] 1954 నుండి 1962 వరకు జడ్చర్ల పురపాలక సంఘ చైర్మెన్‌గా పనిచేశాడు. 1962 జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[2] 1973 ఆగస్టు 15న భారత ప్రభుత్వంచే స్వాతంత్ర్యసమరయోధులకిచ్చే తామ్రపత్రాన్ని పొందినాడు. ఇటీవల జడ్చర్లలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.