Remove ads
From Wikipedia, the free encyclopedia
మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. పునర్వవస్థీకరణ ఫలితంగా ఇదివరకు షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న బాలానగర్, నవాబ్‌పేట మండలాలు ఈ నియోజకవర్గంలో కలవగా, ఇక్కడి నుంచి తిమ్మాజీపేట మండలం నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి తరలించబడింది. ఈ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. 1961లో ఏర్పడిన [1] ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది. ఇక్కడి నుండి 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినారు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచింది. 2008 ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించగా, 2009 శాసనసభ ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందినాడు.[2]
జడ్చర్ల | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు | మల్లు రవి |
జడ్చర్ల నియోజకవర్గానికి ఉత్తరాన షాద్‌నగర్ నియోజకవర్గం ఉండగా, తూర్పున కల్వకుర్తి నియోజకవర్గం ఉంది. దక్షిణాన నాగర్‌కర్నూల్ నియోజకవర్గం, కొంతభాగం దేవరకద్ర నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమాన మహబూబ్‌నగర్ నియోజకవర్గం, రంగారెడ్డిజిల్లాకు చెందిన పరిగి నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం మధ్య నుండి బాలానగర్, జడ్చర్ల మండలాల మీదుగా 7వ నెంబరు జాతీయ రహదారి వెళుతుంది.
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ |
---|---|---|---|---|
1962 | కొత్త కేశవులు[6] | స్వతంత్ర అభ్యర్థి | కె.జె.రెడ్డి | భారతీయ జాతీయ కాంగ్రెస్ |
1967 | లక్ష్మి నర్సింహారెడ్డి[6] | స్వతంత్ర అభ్యర్థి | ఎం.రాందేశారెడ్డి | భారతీయ జాతీయ కాంగ్రెస్ |
1972 | ఎన్.నర్సప్ప | కాంగ్రెస్ పార్టీ | జి.విశ్వనాథం | స్వతంత్ర అభ్యర్థి |
1978 | ఎన్.నరసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | రఘునందన్ రెడ్డి | జనతా పార్టీ |
1983 | కృష్ణారెడ్డి | ఇండిపెండెంట్ (స్వతంత్ర) | ఎన్.నరసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
1985 | ఎం.కృష్ణారెడ్డి | తెలుగుదేశం పార్టీ | ఎన్.నరసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | సుధాకర్‌రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | ఎం.కృష్ణారెడ్డి | తెలుగుదేశం పార్టీ |
1994 | ఎర్ర సత్యం (మరాఠి సత్యనారాయణ) | తెలుగుదేశం పార్టీ | పెద్ద నర్సప్ప | కాంగ్రెస్ పార్టీ |
1996[7] | ఎర్ర శేఖర్ | తెలుగుదేశం పార్టీ | జి.సుధాకర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
1999 | ఎర్ర శేఖర్ | తెలుగుదేశం పార్టీ | మహ్మద్ అల్లాజీ | కాంగ్రెస్ పార్టీ |
2004 | సి. లక్ష్మా రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి | ఎర్ర శేఖర్ | తెలుగుదేశం పార్టీ |
2008[8] | మల్లు రవి | కాంగ్రెస్ పార్టీ | ఎర్ర శేఖర్ | తెలుగుదేశం పార్టీ |
2009 | ఎర్ర శేఖర్ | తెలుగుదేశం పార్టీ | మల్లు రవి | కాంగ్రెస్ పార్టీ |
2014 | సి. లక్ష్మా రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి | మల్లు రవి | కాంగ్రెస్ పార్టీ |
2018 | సి. లక్ష్మా రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి | మల్లు రవి | కాంగ్రెస్ పార్టీ |
2023[9][10] | జె. అనిరుధ్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | సి. లక్ష్మా రెడ్డి | భారత్ రాష్ట్ర సమితి |
1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండేది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ మూడు పర్యాయాలు విజయం సాధించింది. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితికి వదిలి మద్దతు ఇచ్చింది. తెరాసకు చెందిన సి,లక్ష్మారెడ్డి సమీప తెలుగుదేశం ప్రత్యర్థి ఎం.చంద్రశేఖర్ పై 18381 ఓట్ల తేడాతో ఓడించాడు.[11] తెలంగాణా అంశంపై తెరాస శాసనసభ్యులు మూకుమ్మడి రాజీనామాల ఫలితంగా 2008లో మళ్ళీ ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. 2008 ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.చంద్రశేఖర్ పై 2,106 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. రాజీనామా చేసి పోటీకి నిలబడ్డ తెరాస అభ్యర్థి లక్ష్మారెడ్డి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2009 శాసనసభ ఎన్నికలలో మహాకూతమి తరఫున పోటీలోకి దిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్ర చంద్రశేఖర్ సిటింగ్ ఎమ్మేల్యే మల్లు రవిపై 6890 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం.చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మహ్మద్ అల్లాజీపై 24642 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. ఎం.చంద్రశేఖర్ 49450 ఓట్లు సాధించగా, అల్లాజీకి 24808 ఓట్లు లభించాయి.
గత నాలుగు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒకేసారి విజయం సాధించడంతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని తెలంగాణా రాష్ట్ర సమితికి వదిలివేసింది. తెరాస తరఫున లక్ష్మారెడ్డి పోటీచేసి 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి ఎం.చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించాడు. లక్ష్మారెడ్డి 63,480 ఓట్లను పొందగా, ఎంచంద్రశేఖర్ 45,099 ఓట్లు సాధించాడు.
2004 ఎన్నికల గణాంకాలు | ||||
---|---|---|---|---|
ఓట్లు | ||||
పోలైన ఓట్లు | 122158 | |||
సి.లక్ష్మారెడ్డి | 51.96% | |||
ఎంచంద్రశేఖర్ | 36.92% | |||
ఇతరులు | 11.12% | |||
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు |
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు |
---|---|---|---|
1 | సి. లక్ష్మా రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి | 63480 |
2 | ఎం.చంద్రశేఖర్ | తెలుగుదేశం పార్టీ | 45099 |
3 | బి.రఘునందన్ | పిపిఓఐ | 5493 |
4 | కె.నర్సింగ్ రావచ్ | ఇండిపెండెంట్ | 3610 |
5 | జి.శ్రీనివాసులు | బహుజన్ సమాజ్ పార్టీ | 2636 |
6 | పి.స్వాతి | ఇండిపెండెంట్ | 1810 |
2004లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన తెరాస నుంచి గెలుపొందిన సి.లక్ష్మారెడ్డి రాజానామాతో మళ్ళీ ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. పోలెపల్లి సెజ్‌లకు వ్యతిరేకంగా అనేకులు ఎన్నికల బరిలో నిలబడటంతో మొత్తం 25 అభ్యర్థులు పోటీపడ్డారు. తెరాస తరఫున మళ్ళీ సి.లక్ష్మారెడ్డి అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున మాజీ శాసనసభ్యుడు ఎం.చంద్రశేఖర్, కాంగ్రెస్ తరఫున మల్లు రవి పోటీచేశారు. తెలుగుదేశం అభ్యర్థి ఎం.చంద్రశేఖర్‌కు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి ఇద్దరికీ సోదరుల వారసత్వం ఉంది.[12] కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు రవి 2008 ఉప ఎన్నికలలో సమీప ప్రత్యర్థి ఎం.చంద్రశేఖర్‌పై విజయం సాధించాడు.
అభ్యర్థి | పార్టీ | పొందిన ఓట్లు |
---|---|---|
మల్లు రవి | కాంగ్రెస్ పార్టీ | 45,175 |
ఎం.చంద్రశేఖర్ | తెలుగుదేశం పార్టీ | 43,069 |
లక్ష్మారెడ్డి | తెలంగాణా రాష్ట్ర సమితి | 20,744 |
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎం.చంద్రశేఖర్ పోటీ చేయగా,[14] భారతీయ జనతా పార్టీ తరఫున గొల్లమూరి శౌరి[15] ప్రజారాజ్యం పార్టీ నుండి వి.రాంరెడ్డి [16], లోక్‌సత్తా పార్టీ నుండి వడ్ల శ్రీను [17] పోటీచేశారు. ప్రధానపోటీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యరుల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యరి ఎర్ర చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సిటింగ్ ఎమ్మేల్యే మల్లు రవిపై 6890 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[18]
అభ్యర్థి | పార్టీ | సాధించిన ఓట్లు |
ఎర్ర చంద్రశేఖర్ | తెలుగుదేశం పార్టీ | 66537 |
మల్లు రవి | కాంగ్రెస్ పార్టీ | |
వంకాయల రాంరెడ్డి | ప్రజారాజ్యం పార్టీ | 8940 |
గొల్లమారి శౌరి | భాఅతీయ జనతా పార్టీ | 2071 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.