కె.వి. నరేందర్

From Wikipedia, the free encyclopedia

కె.వి. నరేందర్ ( 1967 జూన్ 7) తెలుగు కవి, కథ రచయిత.[1] 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[2]

త్వరిత వాస్తవాలు కె.వి. నరేందర్, జననం ...
కె.వి. నరేందర్
జననంకె.వి. నరేందర్
జూన్ 7, 1967
చిల్వాకోడూర్, జగిత్యాల జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంచిల్వాకోడూర్, జగిత్యాల జిల్లా, తెలంగాణ
వృత్తికవి, ఉపాధ్యాయుడు , కథ రచయిత
భార్య / భర్తశ్రీదేవి
పిల్లలుకె.వి.మన్ ప్రీతమ్, మాన్విత
తండ్రికె వెంకట్ రెడ్డి
తల్లిసుశీల
మూసివేయి

బాల్యం, విద్యాభ్యాసం

కె.వి. నరేందర్ 1967 జూన్ 7జగిత్యాల జిల్లాలోని చిల్వాకోడూర్ గ్రామంలో జన్మించాడు. బిఎస్ సి, బి.ఇడి. పూర్తి చేశాడు.

రచనలు

ఇతని రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, విపుల, ఉదయం, ఆంధ్రజ్యోతి, నవ్య, వార్త, ఈనాడు, ఆదివారం, రచన, పుస్తకప్రపంచం తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

జీవిత విశేషాలు

ఇతను వందకు పైగా కథలు రచించారు. కొన్ని కథలు తెలుగు, తమిళ, హింది భాషల్లోకి అనువదించారు. 'ఊరు' కథా సంకలనంలో 14 కథలు ఉన్నాయి. తెలంగాణ పల్లెలు శిథిలమవుతున్న తీరును, గ్రామాల్లో మారుతున్న మానవ సంబంధాలను, గ్రామీణ జీవితాల్లో వచ్చిన పరిణామాలను, సామాజిక సంబంధాలు తలకిందులవుతున్న వైనాలను, మారిన దోపిడీ రూపాలను ఈ కథల్లో నరేందర్‌ చిత్రించారు.

పురాస్కారాలు

కథ సంపుటాలు

ఇతను 1982 నుంచి కథలు రాస్తున్నారు.

  • మనోగీతం
  • అమ్మ
  • యుద్ధం
  • బురదలో జాబిల్లి
  • నాన్నా
  • నాతిచరామి
  • విభిన్న
  • పోరు
  • తెలంగాణ గడీలు
  • చీపురు
  • తెలంగాణా జోడి పదాలు

కథలు

  • మబ్బు పట్టిన రాత్రి
  • మరో 'మనో'గీతం
  • మా... తుఝే సలాం
  • మాజీ సోయి
  • మార్పు
  • ముత్యమంతా పలుకు
  • మూగవోయిన నైటింగేల్
  • మ్యాచ్ ఫిక్సింగ్
  • అమ్మరాసిన ఉత్తరం
  • అమ్మా అంటే ఏమిటి మమ్మీ?
  • అలసిపోయాను ప్రభూ
  • అవిశ్వాసం
  • అసంపూర్ణ చిత్రం
  • ఆకురాలిన వసంతం
  • ఆఖరి ముద్దు
  • ఆమె
  • ఈ కట్టెను కట్టెలు...
  • ఉఫ్ వెంట్రుక
  • ఉసుల్లు
  • ఎడారి దీపాలు
  • ఎడారి మృగం
  • ఎప్పుడూ ఎడారై
  • ఎబిసిడి
  • ఏడడుగుల కింద
  • ఓ మాధురి కథ పల్లకి
  • కటికోడు
  • కర్మభూమి
  • కాలుతున్న పూలతోట

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.