ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయం From Wikipedia, the free encyclopedia
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విశ్వకళా పరిషత్,ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University)), భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో 1926లో ఏర్పడింది. ఏర్పడింది. 1925 నాటి మద్రాసు విశ్వవిద్యాలయం అనుసరించి ఆంధ్ర విశ్వవిద్యాలయ చట్టం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. రావు బహదూర్ సర్ అన్నెపు పరశురామ్ దాస్ పాత్రో ఈ విషయం లో కృషి చేశారు. గౌరవ సూచకంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం ప్రాంగణంలో పాత్రో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.[1] 1926 నుండి 1931 వరకు, మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ ఆదర్శ విశ్వవిద్యాలయం ఊహకు అనుగుణంగా తీర్చిదిద్దబడింది.
రకం | సార్వత్రిక |
---|---|
స్థాపితం | ఏప్రిల్ 26,1926 |
వైస్ ఛాన్సలర్ | జి. నాగేశ్వరరావు |
రెక్టర్ | డి.గాయత్రి |
డీన్ | కె.రామమోహన రావు |
స్థానం | విశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
అనుబంధాలు | యుజిసి |
జాలగూడు | http://www.andhrauniversity.edu.in |
1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయంగా అవతరించింది.
ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణం (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
విశ్వవిద్యాలయ పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాల కొరకు ఉమ్మడి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో ఎచ్చెర్ల, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయనగరంలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. విశ్వవిద్యాలయ నాణ్యతకు గుర్తింపు నాక్ (NAAC) సంస్థ ఇచ్చిన "ఎ" గ్రేడు.
కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది, విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.
ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ధా ఆధారంగా 2023వ సంవత్సరం లో మొత్తం భారతదేశం వ్యాప్తంగా 76వ ర్యాంకు పొందింది ,[5] మొత్తం విశ్వవిద్యాలయాలలో 43వ ర్యాంకు పొందింది [6], ఇంజనీరింగ్ ర్యాంకింగ్ లో 94 వ ర్యాంకు పొందింది [7].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.