కులపతి

From Wikipedia, the free encyclopedia

కులపతి

కులపతిని ఆంగ్లంలో ఛాన్సలర్ అంటారు. ఉప కులపతిని ఆంగ్లంలో వైస్ ఛాన్సలర్ అంటారు. విశ్వవిద్యాలయంనకు నాయకుడు కులపతి. సాధారణంగా విశ్వవిద్యాలయమునకు లేదా విశ్వవిద్యాలయ ప్రాంగణమునకు కార్యనిర్వాహకునిగా లేదా లాంఛనప్రాయంగా ఎన్నుకొనబడిన అధిపతిగా ఛాన్సలర్ వ్యవహరిస్తాడు. అనేక దేశాలలో విశ్వవిద్యాలయము యొక్క విద్యా పరిపాలకాధ్యక్షుడిని ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్ లేదా రెక్టార్ అంటారు. సాధారణంగా యునైటెడ్ స్టేట్స్ లో విశ్వవిద్యాలయం యొక్క హెడ్‍ను యూనివర్సీటీ ప్రెసిడెంట్ (విశ్వవిద్యాలయం అధ్యక్షుడు) అంటారు. యు.ఎస్. యూనివర్సీటీ వ్యవస్థలో ఒకటి కంటే ఎక్కువ అనుబంధ విశ్వవిద్యాలయాలు లేదా ఒక ఆవరణలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటికి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తిని ఛాన్సలర్ లేదా వైస్ వెర్సా (Chancellor and report to the overall system's President, or vice versa) అంటారు.

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కులపతి 2009

భారతదేశం

భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటికి కులపతిగా ఆ రాష్ట్రానికి చెందిన గవర్నర్ వ్యవహరిస్తాడు. కులపతి విశ్వవిద్యాలయానికి అధిపతిగా ఉపకులపతిని నియమిస్తాడు. విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవహారాలన్నింటిని దాదాపుగా ఉప కులపతే నిర్వహిస్తాడు.

ఇవి కూడా చూడండి

విద్యాలయాలు - అధ్యాపకులు

బయటి లింకులు


es:Rector fa:رئیس دانشگاه nl:Rector magnificus

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.