అంగ్ లీ
తైవానీస్ సినిమా దర్శకుడు, నిర్మాత,రచయిత From Wikipedia, the free encyclopedia
తైవానీస్ సినిమా దర్శకుడు, నిర్మాత,రచయిత From Wikipedia, the free encyclopedia
అంగ్ లీ తైవానీస్ సినిమా దర్శకుడు, నిర్మాత,రచయిత.[1][2][3] తన సినీ జీవితంలో అంతర్జాతీయ విమర్శనాత్మక, ప్రజాదరణ పొందిన ప్రశంసలను అందుకున్నాడు.[4][5]
అంగ్ లీ 1954, అక్టోబరు 23న తైవాన్‌లోని దక్షిణ వ్యవసాయ కౌంటీ అయిన పింగ్టుంగ్, [6] చౌచౌలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్మ్డ్ ఫోర్సెస్‌లోని మిలిటరీ డిపెండెంట్స్ గ్రామంలో వైషెంగ్రెన్ కుటుంబంలో జన్మించాడు.[7]
లీ తొలినాళ్ళలో తీసిన పుషింగ్ హ్యాండ్స్ (1991), ది వెడ్డింగ్ బాంక్వెట్ (1993), ఈట్ డ్రింక్ మ్యాన్ వుమన్ (1994) సినిమాలకు దర్శకత్వం వహించాడు. మూడు సినిమాలను అనధికారికంగా "ఫాదర్ నోస్ బెస్ట్" త్రయం అని పిలుస్తారు.[8] ఈ సినిమాలు అతని స్వస్థలమైన తైవాన్‌లో, అంతర్జాతీయంగా విమర్శకుల విజయం సాధించాయి. 1995లో కాస్ట్యూమ్ డ్రామా సెన్స్ అండ్ సెన్సిబిలిటీ అనే మొదటి పూర్తి ఆంగ్ల భాషా సినిమాను తీశాడు. 1997లో ది ఐస్ స్టార్మ్, 1999లో రైడ్ విత్ ది డెవిల్, 2000లో క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్, 2003లో హల్క్, 2005లో బ్రోక్‌బ్యాక్ మౌంటైన్ (2005), 2007లోలస్ట్, కాషన్, 2012లో లైఫ్ ఆఫ్ పై మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.[9][10]
సంవత్సరం | పేరు | దర్శకుడు | నిర్మాత | రచయిత |
---|---|---|---|---|
1991 | పుషింగ్ హాండ్స్ | Yes | కాదు | Yes |
1993 | ది వెడ్డింగ్ బాంక్వెట్ | Yes | కాదు | Yes |
1994 | ఈట్ డ్రింక్ మ్యాన్ వుమన్ | Yes | కాదు | Yes |
1995 | సియావో యు | కాదు | Yes | Yes |
సెన్స్ అండ్ సెన్సిబిలిటీ | Yes | కాదు | కాదు | |
1997 | ది ఐస్ స్టార్మ్ | Yes | కాదు | కాదు |
1999 | రైడ్ విత్ దిడెవిల్ | Yes | కాదు | కాదు |
2000 | క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ | Yes | Yes | కాదు |
2003 | హల్క్ | Yes | కాదు | కాదు |
2005 | బ్రోక్ బాక్ మౌంటైన్ | Yes | కాదు | కాదు |
2007 | లస్ట్ ,కాషాన్ | Yes | Yes | కాదు |
2009 | టేకింగ్ వుడ్‌స్టాక్ | Yes | Yes | కాదు |
2012 | లైఫ్ ఆఫ్ ఫై | Yes | Yes | కాదు |
2016 | బిల్లీ లిన్స్ లాంగ్ హాఫ్ టైమ్ వాక్ | Yes | Yes | కాదు |
2019 | జెమిని మ్యాన్ | Yes | కాదు | కాదు |
లీ కమర్షియల్ ఛోసెన్ (2001)కి కూడా దర్శకత్వం వహించాడు.
నటించినవి
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1993 | ది వెడ్డింగ్ బాంక్వెట్ | వివాహ అతిథి | అతిధి పాత్ర |
1998 | ది క్యాండిడేట్ | హ్సు గియు జింగ్ చిన్ననాటి స్నేహితుడు | |
2007 | హాలీవుడ్ చైనీస్ | డాక్యుమెంటరీ |
దర్శకుడిగా తొమ్మిది అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన లీ, అందులో మూడు అవార్డులను గెలుచుకున్నాడు. ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలోక్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్, బ్రోక్‌బ్యాక్ మౌంటైన్, లైఫ్ ఆఫ్ పై సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డులు అందుకున్నాడు. బహుమతిని గెలుచుకున్న మొదటి శ్వేతజాతీయేతర దర్శకుడిగా నిలిచాడు. ది వెడ్డింగ్ బాంకెట్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ పినిమాలకు బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ బేర్‌ను గెలుచుకున్నాడు. బ్రోక్‌బ్యాక్ మౌంటైన్, లస్ట్ కాషన్ సినిమాలకు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ లయన్‌ని గెలుచుకున్నాడు. గోల్డెన్ లయన్‌ని రెండుసార్లు గెలుచుకున్న నలుగురు దర్శకులలో లీ ఒకడు. రెండుసార్లు గోల్డెన్ బేర్‌ను అందుకున్న ఏకైక చిత్ర దర్శకుడిగా నిలిచాడు. లీకి డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్స్,[11] బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ అవార్డులు కూడా లభించాయి. తైవాన్ ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ బ్రిలియంట్ స్టార్‌ని కూడా అందుకున్నారు.[12]
2003లో ది గార్డియన్స్ 40 మంది ఉత్తమ దర్శకులలో లీ 27వ స్థానంలో నిలిచాడు.[13] 2007 ఆగస్టులో టోటల్ ఫిల్మ్ మ్యాగజైన్ పోల్‌లో లీ ఆల్ టైమ్ 41వ గొప్ప దర్శకుడిగా ఎంపికయ్యాడు.[14] 2012లో ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి ఫ్రెంచ్ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ నైట్ ఆఫ్ ది అవార్డులను కూడా అందుకున్నాడు.[15] 2021లో నైట్ ఆఫ్ ది ఫ్రెంచ్ లెజియన్ ఆఫ్ హానర్[16][17] 2020లో అతను బ్రిటీష్ సినిమాకి అత్యుత్తమ విరాళాల కోసం బ్రిటీష్ ఫిల్మ్ ఫెలోషిప్‌ను అందుకున్నాడు.
2021 నవంబరు 30న లీ తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ నుండి ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో ప్రెసిడెన్షియల్ కల్చర్ అవార్డును అందుకున్నారు.[18]
సంవత్సరం | శీర్షిక | అకాడమీ అవార్డులు | బ్రిటీష్ ఫిల్మ్ అవార్డులు | గోల్డెన్ గ్లోబ్ అవార్డులు | |||
---|---|---|---|---|---|---|---|
నామినేషన్ | విజేత | నామినేషన్ | విజేత | నామినేషన్ | విజేత | ||
1993 | ది వెడ్డింగ్ బాంక్వెట్ | 1 | 1 | ||||
1994 | ఈట్ డ్రింక్ మ్యాన్ వుమన్ | 1 | 1 | 1 | |||
1995 | సెన్స్ అండ్ సెన్సిబిలిటీ | 7 | 1 | 12 | 3 | 6 | 2 |
1997 | ది ఐస్ స్టార్మ్ | 2 | 1 | 1 | |||
2000 | క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ | 10 | 4 | 14 | 4 | 3 | 2 |
2005 | బ్రోక్ బాక్ మౌంటైన్ | 8 | 3 | 9 | 4 | 7 | 4 |
2007 | లస్ట్ , కాషాన్ | 2 | 1 | ||||
2012 | లైఫ్ ఆఫ్ ఫై | 11 | 4 | 9 | 2 | 3 | 1 |
మొత్తం | 38 | 12 | 49 | 14 | 23 | 9 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.