ఉడిపి
కర్ణాటక రాష్ట్రం, ఉడిపి జిల్లాలోని నగరం. From Wikipedia, the free encyclopedia
కర్ణాటక రాష్ట్రం, ఉడిపి జిల్లాలోని నగరం. From Wikipedia, the free encyclopedia
ఉడిపి, (ఉడుపి) భారతదేశం,కర్ణాటక రాష్ట్రం, ఉడిపి జిల్లాలోని నగరం. దీనిని ఒడిపు అని కూడా పిలుస్తారు. ఉడిపి సుమారు మంగళూరు నగరానికి ఉత్తరాన దాదాపు 55 కి.మీ (34 మైళ్లు) దూరంలో, రాష్ట్ర రాజధాని బెంగుళూరుకు పశ్చిమాన రోడ్డుమార్గం ద్వారా 442 కి.మీ. (262 మైళ్లు) దూరంలో ఉంది. ఇది ఉడిపి జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. కర్ణాటకలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్ననగరాలలో ఇది ఒకటి. ఉడిపి కర్ణాటకలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ నగరంలో అనేక ప్రసిద్ధిచెందిన వివిధ విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ నగరంలో శ్రీ కృష్ణదేవాలయానికి ప్రసిద్ధి చెందింది. దీనిని టెంపుల్ సిటీ అని కూడాపిలుస్తారు. [3] ఇది ప్రసిద్ధ ఉడిపి వంటకాలకు దాని పేరును సూచిస్తుంది. దీనిని పరశురామ క్షేత్రంగా అని కూడా పిలుస్తారు. కనకన కిండికి ప్రసిద్ధి చెందింది. తీర్థయాత్ర కేంద్రంగా ఉడిపిని రజత పీఠం, శివల్లి (శివబెల్లె) అని పిలుస్తారు.
Udupi | |
---|---|
City | |
Coordinates: 13.3389°N 74.7451°E | |
Country | India |
State | Karnataka |
District | Udupi |
Member of the Parliament | Shobha Karandlaje |
Member of Legislative Assembly | K. Raghupati Bhat |
విస్తీర్ణం | |
• City | 68.23 కి.మీ2 (26.34 చ. మై) |
Elevation | 27 మీ (89 అ.) |
జనాభా | |
• City | 2,15,500 |
• జనసాంద్రత | 3,200/కి.మీ2 (8,200/చ. మై.) |
• Metro | 4,36,208 |
Languages | |
• Administrative | Kannada |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 576101 – 576108 |
Telephone code | 0820 |
Vehicle registration | KA-20 |
సా.శ. 13వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి మధ్వాచార్య శ్రీ కృష్ణ దేవాలయాన్ని స్థాపించాడు.[4] అతను ద్వైత వేదాంత తత్వాన్ని ప్రచారం చేయడానికి ఉడిపిలో ఎనిమిదిమఠాలు - అష్ట మఠాలను స్థాపించాడు. ఇది ప్రస్తుత ఉడిపి జిల్లాలో ఒక శక్తివంతమైన ఆలయ సంస్కృతిని వేళ్ళూనుకోవడానికి కారణమైంది.[4]ఈ ప్రాంతానికి తదనంతరం బ్రాహ్మణులు గణనీయమైన వలసలు జరిగాయి. వారు దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నప్రాంత జనాభాలో 10 శాతం మందిని కలిగి ఉన్నారు. [4]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఉడిపి నగరంలో 33,987 గృహాలు ఉన్నాయి. నగరంలో మొత్తం జనాభా 1,44,960 మంది ఉన్నారు,ఇందులో పురుషులు 71,614 మంది కాగా, స్త్రీలు 73,346 మంది ఉన్నారు. [5] షెడ్యూల్డ్ కులాల జనాభా 8,385 మంది కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 6,774 మంది ఉన్నారు. [5] 2001 నుండి జనాభాతో పోల్చగా, నగర జనాభా 14.03% వృద్ధి చెందింది.[5] ఉడిపి పట్టణంలో అత్యధికంగా మాట్లాడే భాష తుళు. ఉడిపి పట్టణంలో కన్నడ, కొంకణి కూడా మాట్లాడతారు.దఖినీ ఉర్దూ, బేరీ ఈ ప్రాంతంలోని ముస్లింలు మాట్లాడతారు.
ఉడిపి నగరం, చిక్కమగళూరు లోక్‌సభ శాసనసభ నియోజకవర్గం, ఉడిపి రాష్ట్ర శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పార్లమెంటు సభ్యురాలు శోభా కరంద్లాజే ,[7] [8] శాసనసభ సభ్యుడు యశ్‌పాల్ సువర్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. [9]
గతంలో పురపాలక సంఘంగా ఉన్న ఉడిపి పట్టణం, 1995లో ఉడిపి నగరపాలక సంస్థగామారింది. [10] ఉడిపి చుట్టుపక్కల ప్రాంతాలైన మణిపాల్, [11] పర్కాల, మల్పే, ఉద్యావర, సంతేకట్టే ప్రాంతాలు ఉడిపిమగరపాలక సంస్థలో విలీనం చేయబడ్డాయి. ఉడిపి నగరం, ఉడిపి నగర పాలక సంస్థచే పాలించబడుతుంది. నగరపాలక సంస్థ 75.92 చ.కి.మీ.(29.31 చ.మైళ్లు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[12][5] నగరపాలక సంస్థ పరిపాలనా నిర్వహణలో ఆరోగ్య, పట్టణ ప్రణాళిక, సాంకేతిక విభాగం, ఆదాయ, ఆర్ధిక విభాగాలు, జనణ, మరణాల నమోదు విభాగాలు ఉన్నాయి.[13]
వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది, సగటు వర్షపాతం 4.000 మి.మీ. (160 అంగుళాలు) కంటే ఎక్కువ భారీ గాలులతో ప్రతి సంవత్సరం ఉంటుంది. భూత కోల, ఆటి కళెంజా, కరంగోలు, నాగారాధనే ఉడిపి కొన్ని సంస్కృతీ సంప్రదాయాలు. నివాసితులు మకర సంక్రాంతి, నాగర పంచమి, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, నవరాత్రి, దీపావళి వంటి పండుగలను జరుపుకుంటారు.యక్షగానం వంటి జానపద కళలు కూడా ప్రాచుర్యం పొందాయి.కృష్ణ జన్మాష్టమి సమయంలో, పిలి యేసా, ఉడిపిలో ఉద్భవించిన సాంప్రదాయ జానపద నృత్యం వీధుల్లో ప్రదర్శించబడుతుంది.
జాతీయ రహదారులు 66, 169A ఉడిపి గుండా వెళతాయి. ఇతర ముఖ్యమైన రహదారులలో కర్కల, ధర్మస్థల, శృంగేరికి రాష్ట్ర రహదారులు ఉన్నాయి . జాతీయ రహదారి 66 మంగళూరు, కార్వార్‌లకు కుందాపూర్, జాతీయ రహదారి 169ఎ ద్వారా హెబ్రి, అగుంబే, తీర్థహళ్లి, శివమొగ్గలకు అనుసంధానం ఉంది. వ్యక్తుల సంస్థలకు చెందిన వాహనాలు, ప్రభుత్వ బస్సులు ఉడిపిని, కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు కలుపుతాయి. ఉడిపిలో కొంకణ్ రైల్వే విభాగానికి చెందిన రైల్వే స్టేషన్ ఉంది. ఉడిపికి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది సుమారుగా 58.5కి.మీ దూరంలో ఉంటుంది.
ఉడిపి, దాని శివారు ప్రాంతాలలో ప్రయాణానికి నగరం. శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. బస్సులు నగర బస్టాండ్ నుండి బయలుదేరుతాయి. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు అలాగే కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ ద్వారా సిటీ సర్వీస్ బస్సులు ఉన్నాయి.
ఉడిపికి సమీప నౌకాశ్రయం (ఓడరేవు) మాల్పే, ఇది 5 కిమీ దూరంలో, గంగోల్లి (బైందూరు), ఇది 36 కి.మీ దూరంలో ఉంది.న్యూ మంగళూరు ఓడరేవు ఉడిపి నుండి 50 కిమీ దూరంలో ఉంది.
ఉడిపి రైల్వే స్టేషన్‌ను కొంకణ్ రైల్వే విభాగం నిర్వహిస్తోంది. ఇది ఇంద్రాలిలో [14] సుమారు ఉడిపి సిటీ బస్టాండ్ నుండి 4 కిమీ, కన్యాకుమారి - ముంబై రైలు మార్గంలో ఉంది.బెంగళూరు,ముంబై,న్యూఢిల్లీ, అమృత్ సర్, చండీగఢ్, పూణే,అజ్మీర్,జైపూర్, రాజ్ కోట్,అహ్మదాబాద్, ఓఖాలకు నేరుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. మైసూర్,బెల్గాం,జోధ్‌పూర్,ఆగ్రా,తిరువనంతపురం, ఎర్నాకులం,కొల్లాం (క్విలాన్) మొదలైన నగరాలు కూడా ఉడిపికి అనుసంధానించబడి ఉన్నాయి.
భూత కోల, ఆటి కళెంజా, కరంగోలు, నాగారాధనే ఉడిపి నగరం లోని కొన్ని సంస్కృతీ సంప్రదాయాలు. నివాసితులు మకర సంక్రాంతి, నాగర పంచమి, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, నవరాత్రి, దీపావళి వంటి పండుగలను జరుపుకుంటారు. యక్షగానం వంటి జానపద కళలు కూడా ప్రాచుర్యం పొందాయి. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా పిలి యేస, ఉడిపిలో ఉద్భవించిన సాంప్రదాయ జానపద నృత్యం వీధుల్లో ప్రదర్శించబడుతుంది. "పిలి యేస" అంటే టైగర్ అని అనువదిస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.